14, మే 2021, శుక్రవారం

మానవత్వం...(సీరియల్/నవల)...PART-15

 

                                                                                             మానవత్వం                                                                                                                                                                           (సీరియల్/నవల)

                                                                                                PART-15

            ఇతరులకోసం జీవించటమే నిజమైన జీవితమన్నావు....నా జీవితాంతం నీకొసమూ

                                                               ఊరికోసమూ జీవిస్తానమ్మా!

లంచ్ టైము. పిల్లలందరూ వరుసగా కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు...వాళ్ళను ఒకసారి పర్యవేక్షించి, నీరసంగా తన క్లాసులోని కూర్చీలో కూర్చుంది జయ. ఆకలనే భావమే లేకుండా... కడుపు, మనసు మొద్దుబారి పోయున్నాయి.

రోజుతో నాలుగు రోజులు అయ్యింది! అమ్మనూ...అమ్మతో పాటు జీవించిన ఇళ్ళు వదిలి. శాశ్వతంగా వదిలి వచ్చి. దేముడిచ్చిన గొడుగులాంటి అద్భుతమైన బందుత్వంతో చివరివరకు ఉండలేకపోయేనన్న బాధతో గుండె నొప్పి పుడుతోంది. అందులోనూ ఒకే మాటతో, 'పో...'అన్న అమ్మ తాను వస్తువులతో ఇంటి నుంచి బయటకు వెళ్ళేంతవరకు తన గది నుండి బయటకు రాకుండా ఉండటమే....హృదయాన్ని పిండుతున్నట్టు ఉన్నది.

'నా మీద అమ్మ కోపం తెచ్చుకుందే...' అని తటపటాయిస్తున్నప్పుడు సరోజ బలవంతంగా జయను బయటకు గెంటేయటానికి తహతహలాడింది.

"చిలక్కు చెప్పినట్టు చెప్పానే...దాన్ని పెంచద్దు...అదిపెద్దదైతె నీకు గంజి పొస్తుంది అనుకోకు, పోయదు! విన్నావా! వినలేదే? ఇదిగో ఇప్పుడు రెక్కలు వచ్చిన తరువాత ఎగిరిపోతోంది....పోనీ. రోజుతో నిన్ను పట్టుకున్న శని వదిలిందని అనుకో. మొదట స్నానం చెయ్యి. అది వెళ్ళిన తరువాత...ఇళ్ళు కడిగేస్తాను" అన్నప్పుడు బాధకు కంటే నవ్వు వచ్చింది జయకు.

అమ్మమ్మ గుణం ఆమెకు తెలియందా? ముందుకు వెడితే కరుస్తుంది. వెనకకు వస్తే తంతుంది. ఇంట్లో ఉంటే...'కాళ్ళకు చుట్టుకునే బురద పాముఅంటుంది. వెళ్ళిపోతానూ అంటే దాంట్లోనూ నేరం వెతుకుతుంది.

ఇది ఆమె పుట్టుక గుణం. ఇక దేని గురించి బాధపడకూడదూ అనే వేగంతో రాత్రికి రాత్రి బయలుదేరి వచ్చి ఇక్కడ ఆశ్రయం తీసుకున్నాను.

అయినాకాని తల్లి మొహం చూడకుండా హృదయం తాపత్రయపడుతోంది. నిద్ర, ఆహారం మీద ఆశక్తి లేక తల్లిప్రేమ కోసం మనసు పరితపిస్తోంది. అదే సమయం మనసులో ఒక అలొచన ముళ్ళులాగా గుచ్చుకుంటోంది.

వెళ్ళిపోతాను అన్న వెంటనేపోఅని చెప్పిందే! వద్దని ఒక మాట కూడా అనలేదే. ఆడ్డుకోలేదంటే అమ్మకు నా మీద విరక్తి ఏర్పడిందా?

ఇదే కన్న కూతురైతే పంపించి ఉంటుందా? అనే ఆలొచనే ఆమెను ఎక్కువగా వేధిస్తున్నది.

"జయమ్మగారూ...." --బయట సెక్యూరిటీ పిలుపుతో తిరిగి చూసింది.

"ఏమిటి రాఘవ్?"

"మీరు ఇక్కడే ఉన్నారా? మీకొసం మీ రూములో, డైనింగ్ హాలులో అన్నిట్లో వెతికి వస్తున్నానమ్మా..."

"ఏమిటి విషయం?"

"మిమ్మల్ని వెతుక్కుని ఒక అమ్మ వచ్చిందమ్మా..."

"ఏమిటీ?" గబుక్కున లేచింది. ‘అమ్మ అయ్యుంటుందో

"ఎవరు...ఎక్కడున్నారు"

"ఎవరని తెలియటం లేదమ్మా...కానీ పెట్టా-బేడా పుచ్చుకుని వచ్చారమ్మా"

"ఏమిటీ"

"మన వార్డన్ అమ్మగారితో మాట్లాడారు....ఇప్పుడే మీ రూములో సామాన్లన్నీ పెట్టొచ్చాను"

రాఘవ్ చెప్పి ముగించే లోపే గాలిలా ఎగురుకుంటూ తనకని కేటాయించిన గది వైపుకు వెళ్ళింది జయ.

ఆయసపడుతూ వచ్చి నిలబడ్డ కూతురును, తాను తీసుకు వచ్చిన వస్తువులను గదిలొని అలమరాలో పెడుతున్న యామిని నిదానంగా తిరిగి చూసింది. జయ వొళ్లంతా జలదరించింది. పరిగెత్తుకొచ్చి తల్లిని వాటేసుకుంది.

"అమ్మా...నువ్వేనా? వచ్చాశావా? నన్ను వెతుక్కుని వచ్చాశావా...ఇది కల కాదు కదా...?"

"వదులు...నన్ను వదులు. నాకు చాలా పనుంది"

"అమ్మా..."

"వచ్చి నాలుగు రోజులైనా ఒక వస్తువునైనా సర్ధి పెట్టావా? అన్నీ చిందరవందరగా పడున్నాయి"

"అయ్యో అమ్మా...మొదట నువ్విలా వచ్చి కూర్చో. నాకు ఏం చేయాలో తోచటంటం లేదు. ఎలాగమ్మా...ఎలాగమ్మా వచ్చావు! అందులోనూ ఇన్ని సామాన్లతో వచ్చేవేమిటీ?"- అంటూ యామినిని తీసుకు వచ్చి మంచం మీద కూర్చోబెట్టి తల్లి కాళ్ళ దగ్గర కూర్చుంది.

ఉత్సాహమూ, ఆనందమూ, అదుర్దాతో వికసించిన కూతురు మొహాన్ని చూసి నవ్వింది యామిని.

"నన్ను చూడకుండా....నేను లేకుండా నువ్వు ఉండగలవా?"

"అయ్యో... పిచ్చే పట్టుంటుంది. రెండు సార్లు ఫోన్ చేశాను. అమ్మమ్మ ఎత్తింది. అందుకే కట్ చేశాను. ఎలాగైనా రోజు మీ ఆఫీసుకు రావాలని మేడం దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. సాయంత్రం రావాలని అనుకున్నాను"

"మంచికాలం రాలేదు. నేను ఉద్యోగం వదిలేశాను"

"అమ్మా..."

"అవును...ఉద్యోగం వదిలేశాను. ఆఫీసులొ ఇచ్చిన సెటిల్ మెంట్ డబ్బుతో ఇంటి లోన్ తీర్చేశాను. ఇంటి బాధ్యతను అమ్మమ్మ దగ్గర విడిచిపెట్టాను. ఇక మనకి బయటి ఖర్చులు ఏమీ లేవు. నువ్వు చెప్పినట్లే ఇక్కడున్న వారిని చూసుకుంటూ మనమూ ఇక్కడే ఉండిపోదాం"--అన్న తల్లిని నమ్మలేనట్లు చూసింది జయ.

"ఏంటమ్మా చెబుతున్నావు? ఏమ్మా ఆన్నిటిని వదులుకుని వచ్చావా?"

"ఇరవైఐదు ఏళ్ళ వయసున్నప్పుడే నీకొసం అందరినీ వదిలించుకుని వచ్చిన దానిని నేను. ఇప్పుడు యాభై ఏళ్ళప్పుడు రాలేనా?"

"అమ్మా..."

"నువ్వు నా బిడ్డవురా...నిన్ను ఒంటరిగా కలత పెట్టి నేను అక్కడెలా ఉండగలను...చెప్పు?" యామిని ప్రేమగా అడగటంతో కూతురుకి కళ్ళు చెమర్చినై.

"అమ్మమ్మ నిన్ను ఎలా వదిలింది?"

"ఆవిడకు నా కంటే మన ఇళ్లు, నేను సంపాదించే సొమ్ము మాత్రమే ముఖ్యం. ఇప్పుడు కావలసింది...ఉండటానికి ఒక ఇళ్లు- కడుపుకు తిండి. అవి దొరికిన తరువాత నేను రావటం గురించి పెద్దగా బాధపడలేదు

తాతయ్య మాత్రం బాధ పడ్డారు. ఆరోగ్యం బాగుపడ్డాక సమయం దొరికినప్పుడు మనల్ని చూసి వెళ్ళమన్నాను. వాళ్ళ కాలం వరకు కూర్చుని తినేలాగా డబ్బును బ్యాంకులో వేశాను. ఉన్నంతవరకు మన ఇంట్లో ఉండనీ. ఒక కూతురుగా...కన్నివారికి చేయవలసిన బాధ్యతలను చేశాశాను. ఇక మీదట ఒక తల్లి లాగా నీతో ఉండం వరకే నా బాధ్యత. అందుకనే వచ్చాశాను" అని చెప్పి నిట్టూర్పు విడిచిన తల్లి వొడిలో తల పెట్టుకుని ఏడ్చింది జయ.

వెక్కి వెక్కి ఏడ్చింది.

సంతోషంతో కూతుర్ను చూసింది.

"ఎందుకురా ఇప్పుడు ఏడుస్తున్నావ్?"

"లేదమ్మా...నాకోసం మళ్ళీ అందర్నీ వదిలి వచ్చేశావే! మిమ్మల్ని నేను అనాధను చేశానే?"

"ఛఛ....అలా మాట్లాడ కూడదు. ఎవరూ అనాధలు కాదు. నాకు నువ్వు...నీకు నేనూ....మనకి జివితం చాలురా".....

"ఇకమీదట అయినా మీ అమ్మా-నాన్నలతో సంతోషంగా ఉంటావని కదా నిన్ను వదిలేసి వచ్చాను. కానీ..."

"సంతోషమనేది బందువులతో ఉండదమ్మా. మంచి మనసులో--మంచి నడవడికలో ఉంటుంది. నా కూతురుతో ఉండటమే నాకు నిజమైన సంతోషం"

"అయ్యో...ఇన్ని సంవత్సరాలు నీతొ ఉండి కూడా నిన్ను పూర్తిగా అర్ధం చేసుకోలేకపోయానే...నేను పాపాత్మురాలిని...పాపాత్మురాలిని!" --అంటూ నెత్తి బాదు కుంటూ ఏడుస్తున్న జయను అడ్డుకుంది యామిని.

"ఏరా...’పోఅని నేను చెప్పటంతో బాధపడ్డావా? అమ్మ నిన్ను అసహ్యించు కుందనుకున్నావా?"

"అవునమ్మా"

"పిచ్చిదానా....నేను నిన్ను అసహ్య హించు కుంటానా చెప్పు? అమ్మమ్మను మనింటికి తీసుకు వస్తున్నప్పుడే నాకు తెలుసు...మన ప్రశాంతత బయటకు వెళ్ళిపోతుందని. కానీ, కన్నవారిని వదిలేశామనే అపవాదు మనమీద పడకూడదనే వాళ్ళను తీసుకు వచ్చాను. తరువాత ప్రతి రోజూ నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలియదనుకున్నావా?"

"అమ్మా..."

"అమ్మమ్మ గుణం మారదు. కానీ ఆవిడకు కోపం ఎక్కువవటమే నాకు ఆశ్చర్యం కలిగించింది"

"అమ్మమ్మకు ఎందుకమ్మా అంత కచ్చె, కోపం? నేను ఒక రోజు కూడా ఆమెను అమర్యాదగా చూడలేదు"

కుట్టటం తేలు యొక్క గుణం. గడ్డి తిన్నా పాలు ఇవ్వటం ఆవు యొక్క గుణం. రెండు తమ తమ స్వభావాన్ని మార్చుకోవు. మనమే మంచిది ఎన్నుకుని, చెడును దూరంగా ఉంచాలి. అమ్మమ్మ చేసింది తప్పు మాత్రమే కాదు...పెద్ద పాపం. ఒక పసిపిల్ల మనసును మాటలతో గుచ్చి, కెలికి గాయపరచటం దేముడికే చేసిన నేరం. పాపం చేసిన అందరికీ దేముడి శభలో శిక్చ ఉంది. అమ్మమ్మకూ అది కచ్చితంగా ఉన్నది"

"వద్దమ్మా....నీ నోటితో అలా చెప్పకమ్మా?"

" జయా "

ఇప్పుడు మీరిచ్చిందే పెద్ద శిక్చ. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్క రోజూ...ఒక ముద్ద అన్నం తినేటప్పుడూ అయ్యో...ఇది మన పిల్ల యొక్క కష్టార్జితమే! దాన్ని అనాధగా విడిచిపెట్టి మనం ఇక్కడ కూర్చుని ఉన్నమే? అని ఆమె మనసు ఆమెను ప్రశ్నిస్తుంది. వెయ్యి ప్రశ్నలు వేస్తుంది. మనశ్శాక్షి ఇచ్హే శిక్చ నుండి ఒక్కరు కూడా తప్పించుకోలేరు"

"అది నిజమే! ఇప్పుడు మాట్లాడటానికో, వాదించటానికో మనుషులు లేకపోవటంతో ఆమెకు మన విలువ తెలుస్తుంది. నిన్ను ఎన్నొ రోజులు ఎన్నెన్ని మాటలు అనుంటుంది?"

"అమ్మా...అవన్నీ నీకెలా...?"

"ఏం...నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా? నిన్ను ఎలాగైనా నా ఇంట్లో నుండి పంపించేయాలనే బలవంతంగా నాతో మన ఇంటికి వచ్చిందని నాకు, తాతయ్యకూ తెలుసు. పిల్లలు వాళ్ళు పడుతున్న బాధను ప్రత్యేకంగా తల్లికి చెప్పక్కరలేదురా.....నీ మొహం చూసే తెలుసుకున్నాను"

అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే దీనికి ఒక ముగింపు పెట్టలి అని. రోజు నువ్వే ముగింపును చెప్పటంతో...అదే సరైన ముగింపు అని నాకూ మనసులో అనిపించింది. నిన్ను అడ్డుకోలేదు. నువ్వు ప్రతి రోజూ, ప్రతి పూట అమ్మమ్మ వలన అవమాన పడటాన్ని నేను తట్టుకోలేకపోయాను. అందుకే...’పోఅని చెప్పాను. కానీ నువ్వు వెళ్ళిపోతున్నది చూడటానికి నాకు శక్తి లేదు. గదిలోకి వెళ్ళిపోయాను. నా కూతురు జాగ్రత్తగా వెళ్ళి చేరాలని....మనం ఎప్పుడూ వెళ్ళే ఆటో అతనికి ఫోన్ చేసి గేటు బయట ఉండమని చెప్పాను. నిన్ను దింపేసి అతను నాకు ఫోను చేసిన తరువాతే నేను ప్రశాంతంగా ఉండగలిగాను

నిమిషం నుండే ఇక్కడికి రావటానికి నేను చేయవలసిన అన్ని పనులనూ మొదలుపెట్టాను. ఇదిగో వచ్చాశాను" అంటున్న తల్లిని ఆశ్చర్యంతో చూసింది జయ.

కళ్ళల్లో నుండి కారుతున్న నీరు ఆగిపోయింది. ఆమె మనసంతా యామిని చోటుచేసుకుంది.

"ఏం మనిషి ఈవిడ? ఉరు, పేరూ తెలియని--ఎవత్తో ఒకతి కని పారేసిన నాకోసం...నా ప్రాణం కాపాడటం కొసం తన సంసార జీవితాన్ని వదులుకుంది. నన్ను అనాధగా వదిలిపెట్ట కూడదని తన తల్లి-తండ్రులను, కుటుంబీకులను, బంధుత్వాలను అని...అన్నింటినీ వదులుకుంది.

మనసులో ఉండే మానవత్వాన్ని బయట పెట్టింది. తన భవిష్యత్తు గురించి కూడా ఆలొచించకుండా నన్ను తన కూతురుగా ఎన్నుకుని పెళ్ళికాని కన్యా తల్లిగానే జీవించిందే. ఇప్పుడు కూడా...నాకొసం....నేను ఒంటిరితనంలోకి వెళ్ళి కష్టపడకూడదనే భావనతో ఇదిగో...మళ్ళీ చేరిన బంధుత్వాలను వదులుకుని మళ్ళీ నాకోసం, నన్ను వెతుక్కుంటూ వచ్చేసింది.

అమ్మా...నువ్వు మామూలు మనిషివి కాదు.జీవించే దైవానివి! నాకూ తల్లీ, తండ్రీ, స్నేహితురాలు, ప్రాణం, హృదయం, భవిస్యూత్తు అంటూ అన్నీ నీవే అయ్యావు. వొంట్లో ప్రాణం ఉన్నంతవరకు నీకొసమే బ్రతుకుతాను. ఇది నీమీద ప్రతిజ్ఞ.

"ఇలాగే చూస్తూ కూర్చుంటే ఎలా? లంచ్ బ్రేక్ అయిపోయి క్లాసులు మొదలు పెట్టారు. నువ్వు క్లాసుకు వెళ్ళొద్దా?"

"వెళ్ళాలి...కానీ, నువ్వు...ఒంటరిగా ఉంటావే? నేను కావాలంటే లీవు చెప్పేయనా?"

"వద్దు...మొదట నువ్వు పనికి వెళ్ళు. నేను అలాగే ఇక్కడున్న వృద్దులను చూసుకుంటూ నా పనిని మొదెలడతాను. మేడం దగ్గర అన్నీ మాట్లాడేశాను. ఇక పనులు వెంటనే ప్రారంభించాలి"--అంటూ నవ్వుతూ చెబుతున్న తల్లిని తృప్తిగా చూసి మురిసిపోయింది జయ.

"సరేమ్మా...నేను బయలుదేరుతాను"

"వెళ్ళి రా"---నవ్వుతూ వీడ్కోలు చెప్పిన యామిని, గది తలుపులు మూసి తాళం వేసి, తన కొత్త ఉద్యోగాన్ని మొదలుపెట్టటానికి బయలుదేరింది.

ఇక వీరి ప్రపంచం ప్రశాంతంగానూ...ఆనందంగానూ ఉంటుంది.

************************************************సమాప్తం*****************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి