10, మే 2021, సోమవారం

మానవత్వం...(సీరియల్/నవల)...PART-13

 

                                                                                      మానవత్వం                                                                                                                                                                          (సీరియల్/నవల)

                                                                                         PART-13

          ఆమ్లం లాగా కురుస్తున్న మాటల వర్షమును కూడా అభిమానమనే పువ్వు మామూలు

 వర్షంలాగా తీసుకుంటుంది. 

ఒక నెలరోజులు ఇంటి దగ్గర ఉండి రెస్టు తీసుకోవాలనుకున్న జయకు అమ్మమ్మ పోరుతో రెస్టు దూరమయ్యింది. నిలబడితే...నడిస్తే...కూర్చుంటే....వంట చేస్తున్నా...తింటున్నా అంటూ ఒక్కొక్క విషయంలోనూ వెయ్యి తప్పులు కనిబెట్టిన సరోజని చూస్తే...డేగను చూసిన కోడిపిల్లలా తల్లి వీపు వెనుక దాక్కునేది జయ. యామిని ఉద్యోగానికి వెళ్ళిన తరువాత తన గదికే అంకితమైపోతుంది జయ. దానికి కూడా ఆవేశంగా అరుస్తుంది సరోజ.

"నేనేమో ఇంటికి పనిమనిషిలాగాను, ఇది యజమనురాలు లాగానూ హక్కు తో రూములోకి వెళ్ళి కూర్చుంటోంది? ఇక్కడ ఒంటరిగా ఉండి అవస్తపడుతున్నానే?"--అంటూ తన కోపాన్ని వంట గిన్నెల మీద చూపిస్తుంది.

రామారావు భార్య మీద అరుస్తాడు. "ఏందుకే పిల్లను కనబడనివ్వకుండా చేస్తున్నావు? దానిది కూడా ఆపరేషన్ చేసుకున్న వొళ్ళు. అదికూడా ఎక్కవ పనులు చేయకూడదు. కానీ, నీ దగ్గర చిక్కుకుని అవస్తపడుతోంది"

"ఎందుకు మాట్లాడరూ? టైముకు ఠా అంటూ మంచం దగ్గరకే తినడానికి తెస్తున్నాగా! ఏదైనా మాట్లాడతారు"

"సరోజా...దేనిని మరిచిపోయినా క్షమాపణ ఉంటుంది. కానీ, చేసిన త్యాగాన్ని మరిచిపోతే క్షమాపణే ఉండదు. పిల్ల చేసిన త్యాగాన్ని మరిచిపోకు"

"ఆపండి...నాకు పాఠాలు చెప్పడం ఆపి నిద్రపొండి. ఇప్పటికి అన్నీ అనుభవిస్తున్నది మీరు మాత్రమే" మాటకు మాట అగ్ని కణాలను వెదజల్లుతున్న భార్యతో మాటలు పొడిగించటం ఇష్టంలేక కళ్ళు మూసుకుని పడుకున్నారు.

గదిలోపలే బంధీగా ఉండటం కుదరక, బయట తిరగనూ లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న జయ రాత్రి తల్లితో మాటలు మొదలుపెట్టింది.

"అమ్మా..."

"ఏమిట్రా?"

"నేను రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్ళనా?"

"ఎందుకే అంత తొందర? ఆపరేషన్ అయ్యి ఒక నెల కూడా అవలేదు..."

"చిన్న ఆపరేషనే కదమ్మా! ఎటువంటి నొప్పీ లేదు. ఇంట్లోనే ఒక్కత్తిగా బంధీగా ఉండలేకపోతున్నాను"--అంటున్న కూతురు మొహంలోకి లోతుగా చూసింది యామిని.

"అమ్మమ్మ ఏమైనా అన్నదా?"

"ఛఛ...అదేమీ లేదమ్మా?" ---వెంటనే కాదన్న కూతుర్ని తన చేతులతో బంధించి తన ఒడిలోకి లాక్కుని పడుకోబెట్టుకుంది యామిని.

"బంగారం...నాకు నీ గురించీ తెలుసు. అమ్మమ్మ గురించీ తెలుసు. పుట్టుకతో వచ్చిన అమ్మమ్మ గుణాన్ని మార్చగలం అని అనిపించటంలేదు. కానీ తాతయ్య పాపం. ఆయనకోసం మనం కొంచం సర్దుకు పోవలసిందే. ఇప్పటికే మామయ్యలు వదిలేశారు

మీ పెద్దమ్మ పెద్ద కుటుబంలో కలిసి జీవిస్తున్నది. ఆమె దగ్గరకు వెళ్ళి ఈమె జీవించలేదు. మనమే ఈవిడ్ని చూసుకోవాలి. అందుకని...."

ఎందుకమ్మా బాధపడతావు? కన్నవారిని మనతో ఉంచుకుని చూసుకోవడం బాధ్యత మాత్రమే కాదమ్మా, అది ఒక భాగ్యం. పెద్ద పుణ్యం. అది అందరికీ దొరకదు. అమ్మమ్మా, తాతయ్య మనతో ఉండటంలో నీకంటే నాకే ఎక్కువ సంతోషం"

"జయా..."

"అవునమ్మా! నా వల్లే కదా మీరు వాళ్ళ దగ్గర నుండి వేరుగా వచ్చారు…..మీలాగానే వాళ్ళు కూడా వేదన పడుంటారు కదా...?"

" కథ అంతా ఇపుడెందుకే?"

మిగిలున్న వాళ్ళ జీవిత కాలాన్నివాళ్ళు మీతో కలిసి ప్రశాంతంగా-సంతోషంగా జీవించాలమ్మా. కానీ, అమ్మమ్మకు నన్ను చూస్తేనే గిట్టట్లేదు. కోపంతో అరుస్తున్నారు. తాతయ్య చాలా బాధపడుతున్నారు. అందుకే...నేను ఉద్యోగానికి వెడితే, అమ్మమ్మకు టెన్షన్ కొంచమైనా తగ్గుతుంది కదా?"

తాతయ్య ప్రశాంతంగా రెస్టు తీసుకుంటున్నారు. నాకూ పనీ లేకుండా కూర్చోవటం కష్టంగా ఉంది. పిల్లల ఆలొచనలే వస్తున్నాయి. ఇన్నిరోజులు లీవు తీసుకున్నదే ఎక్కువ. నేను రేపటి నుంచి ఉద్యోగానికి వెడతానమ్మా...ప్లీజ్"--అన్న కూతురి మాటలలోని నొప్పిని గ్రహించగలిగింది యామిని.

తన తల్లి గురించి బాగా తెలిసున్నందువలన, కచ్చితంగా ఇంట్లో జయకు ప్రశాంతత దొరకదు అనే నిర్ణయానికి వచ్చిన యామిని తల ఊపింది.

"సరే...ఉద్యోగానికి వెళ్ళు! కానీ బస్సులో వెళ్ళకూడదు"

"ఎందుకమ్మా?"

"ఆపరేషన్ చేయించుకున్న మనిషివి. బస్సులో ఎలాగైనా తోసుకుంటారు. అందుకని రేపటి నుండి ఇద్దరం ఆటోలో వెల్దాం. నిన్ను డ్రాప్ చేసి నేను ఆఫీసుకు వెడతాను. సరేనా...?"

"సరేనమ్మా" మనస్పూర్తిగా చెప్పిన జయ చాలా రోజుల తరువాత రోజే ప్రశాంతంగా నిద్రపోయింది. తెల్లవారేలోపే ఇద్దరూ లేచి ప్రొద్దున-మధ్యాహ్నానాన్నికి వంట చేసి ముగించి స్నానాలు పూర్తిచేసుకుని ఉద్యోగానికి బయలుదేరుటకు సిద్దమవుతున్నప్పుడు పక్కమీద నుండి లేచొచ్చింది సరోజ.

మధ్యాహ్నం భొజనాన్ని టిఫ్ఫిన్ బాక్స్ లో నింపుతున్న యామిని దగ్గరకు వచ్చింది సరోజ.

"వంటా అది చేశాశావా యామినీ? నేనే చాలాసేపు నిద్ర పోయినట్టున్నాను"

"పరవాలేదమ్మా....హాట్ బాక్స్ లో ఇడ్లీలు, చట్నీ ఉంది. నాన్నకు ఇచ్చేసి...మీరూ తినండి. మధ్యాహ్నాన్నికి అన్నం, కూర, చారు చేశాను. పాలు కాచాను. కాఫీ ఇవ్వనా"

"నేను పళ్ళు తోముకుని వచ్చేస్తాను. అవును...నువ్వేంటి రెండు టిఫిన్ బాక్సుల్లో భోజనం పెట్టుకున్నావు....ప్రొద్దున కూడా ఆఫీసులోనే తింటున్నావా?"

లేదమ్మా...ఒకటి నాకు, ఇంకొకటి జయకు. అది కూడా ఈరోజు నుండి ఆఫీసుకు వెడుతోంది"

"ఓహో... అది కూడా వెళ్ళిపోతే మిగితా పనులను ఎవరు చూసుకుంటారు?"

"అన్ని పనులూ అయిపోయినై అమ్మా?"

"వంట సామాన్లు తోమడం, బటలు ఉతకడం...?"

"అవన్నీ మేము వచ్చిన తరువాత చూసుకుంటాము. మీరు మొదట బ్రష్ చేసుకు రండి. లోపు నేను మీకూ,నాన్నకూ కాఫీ కలిపి ఉంచుతాను" అని చెప్పి యామిని పనిలోకి దిగటంతో, మొహం చిట్లించు కుంటూ అక్కడ్నుండి బయలుదేరిన సరోజకి జయ ఎదురు పడ్డది.

"అమ్మా...నేను రెడీ?" అంటూ ఉత్సాహంగా వచ్చిన జయకు వంటగది వాకిట్లోనే నిలబడి తననే చూస్తున్న సరోజ కనబడింది. ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయింది జయ. ఎందుకంటే సరోజ కళ్ళలో విపరీతమైన క్రొధం తెలిసింది.

మామూలుగానే జయకు పసుపు రంగు చీర అందంగా ఉంటుంది. అందులోనూ రోజు లేత పసుపు రంగు చీరతో, సాధారణ అలంకారంతో వచ్చి నిలబడటంతో సరోజకి కళ్ళు కుట్టినై.

'వీధిలో పడున్న అనాధకు ఎక్కడ్నుంచి వచ్చింది ఇంత ఆందం? ఏమి రంగు...ఎంత ఆకర్షణ? అంతా నాకూతురి కష్టార్జితం. నెయ్యి, పాలూ పోసి పోసి పెంచినట్టుంది. అందుకే ఇంత అందం వచ్చింది. నేను కూడా నీడలో కూర్చుని దీనిలాగా తిని ఉంటే నేనూ దీనిలాగా ఉండేదాన్ని

"అమ్మా...ఇంకా బ్రష్ చేసుకోలేదా?--అంటూనే వెనక్కి తిరిగిన యామిని, గది బయట నిలబడున్న కూతుర్ను చూసి నవ్వింది.

" జయా....రెడియా?"

"రెడియేనమ్మా"

"అయితే రా...రెండు ఇడ్లీలు తిను. ఎనిమిదింటికల్లా ఆటో వచ్చేస్తుంది. రా...రా..." కూతురుకీ, తనకీ టిఫిన్ పెట్టుకుని తినడం మొదలుపెట్టగానే, సరోజ నుదురు చిట్లించింది.

"ఆటోనా...దేనికి యామిని? ఇంకెక్కడికైనా వెడుతున్నారా?"

"లేదమ్మా...పనికే వెడుతున్నాం"

"దానికెందుకు ఆటో? ఇన్నిరోజులూ బస్సులోనే కదా వెళ్ళేదానివి?"

"అవునమ్మా...కానీ, జయకు ఆపరేషన్ చేశారు కదా? బస్సులో జనం ఉంటారు. కుట్లు వేసిన చోట ఎవరూ తోయకూడదు కదా.....అందుకే ఆటో బుక్ చేశాను"

"ఎందుకని...ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళెవరూ బస్సుల్లో వెళ్ళటం లేదా? ఇదేమన్నా కుబేరుడి ఇంట్లో పుట్టిందా?" సరోజ ఆత్రంగా అడగగానే... జయకు తింటున్న ఇడ్లీ ముక్క గొంతులోకి దిగటానికి మొరాయించింది.

యామినికి కొపం తలకెక్కింది.

"అమ్మా...ఇప్పుడెందుకు ప్రొద్దున్నే గొడవ మొదలుపెట్టావు?"

"నేను గొడవ చేస్తున్నానా? ఆటోలో పక్క వీధికి వెళ్ళటానికే వంద రూపాయలు అవుతాయి. మీరు రోజూ వెడితే ఎంత ఖర్చు అవుతుంది?"

"అవనీ! కొని సార్లు ఖర్చు గురించి ఆలొచించగలమా?"

"ఇలా చూడు యామిని...దీనికి నువ్వు ఎక్కువ అలుసు ఇస్తున్నావు...ఎక్కడ ఉండాల్సిన వాటిని అక్కడే ఉంచాలి"

"అమ్మా ప్లీజ్...ప్రొద్దున్నే మూడ్-అవుట్ చెయ్యద్దు"

"........................"

" జయాటైము ఎనిమిదయ్యింది. ఆటో వచ్చిందా చూడు. నేను ఇప్పుడు వచ్చేస్తాను"

"సరేనమ్మా"--అని చెప్పిన జయా, చేతులు కడుక్కుని,టేబుల్ మీదున్న ఫైలు తీసుకుని గుమ్మం దాటి బయటకు అడుగు పెట్టిన వెంటనే తల్లి దగ్గరకు కోపంగా వెళ్ళింది యామిని.

"అమ్మా...మీకు ఇదే చివరిసారిగా చెబుతున్నా. దయచేసి నా కూతురును గదమాయించి మాట్లాడకు. అదేమీ ఏమీ తెలియని పిల్ల కాదు. దాని మనసు ఎంత బాధ పడుతుందో ఒక్కరోజైనా ఆలొచించావా?"

"నువ్వు ఆలొచించావా?"

"ఏమిటీ?"

నిన్ను కని, ప్రేమతో పెంచి, ఎన్నో ఆశలతో పెద్ద దాన్ని చేశామే...నిన్ను ఇలా ఒంటరి దానిగా చూడటానికా? పెళ్ళి చేసుకోకుండా ఒక పిల్లను తీసుకు వచ్చి దాని చేత అమ్మా అని పిలిపించుకుంటున్నావే... తల్లి మనసు ఎంత తరుక్కుపోతోందో ఎప్పుడైనా ఆలొచించావా?"

"అయ్యో...అయ్యో...ఇప్పుడు నాకేమైంది? నేను బాగానే ఉన్నానుగా?"

"దొంగ జీవితం జీవిస్తున్నావు యామిని. ఎవత్తో కన్నదానికి అరువు తల్లిగా మారి---నీ సొంతవాళ్ళను విడిచిపెట్టి...నీ సుఖాలను వదులుకుని సన్యాసిని లాగా జీవిస్తున్నావు. నీ కష్టార్జితాన్ని ఒకత్తిగా పీక్కు తిని, రోజు తలతల మెరిసిపోతూ నిలబడున్న దాన్ని చుస్తే నాకు వొళ్ళు మండుకోస్తోంది"

నా కూతురిని ఇలా ఒంటరిదాన్ని చేసిందే! నని నా రక్తం ఉడికిపోతోంది. నీ పరిస్థితికి అదే కారణమని దాని మీద నాకు విపరీతమైన కోపమూ, కచ్చె వస్తోందే కానీ...దానిమీద నాకు దయ, జాలి, ప్రేమ కొంచం కూడా కలగటం లేదు. సంతోషంగా చేసిన త్యాగం కూడా నాకు పెద్దగా కనిపించటం లేదు. నువ్వు చేసిన త్యాగానికి ముందు అది చేసిన త్యాగం ధూలితో సమానం.

దాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగలేనునావరకు నాకు అది నా కుతురు కాళ్ళకు చుట్టుకున్న బురదపాము! అంతే"-- చెవిలో పడిన పిడుగు వలన, కాళ్ళకు చెప్పులు వేసుకుంటున్న జయ మనసు గాజు ముక్కలలా చెదిరిపోయింది.

                                                                                                                    Continued...PART-14

************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి