1, ఫిబ్రవరి 2020, శనివారం

ఆలయం(సీరియల్)...PART-12



                                                     ఆలయం(సీరియల్)
                                                               (PART-12)


"పిచ్చి పిచ్చి గా మాట్లాడకు మాలతీ... మా ‘చైర్మన్’ గురించి నీకు ఏం తెలుసు? ఎంత పెద్ద కోటీశ్వరుడో తెలుసా?,దానికీ మించి గొప్ప మానవత్వం ఉన్న మనిషి అనేది నీకు తెలుసా?

ఇప్పుడు కూడా 'కంపనీ' కి వస్తే క్యాంటిన్లో వర్కర్లతో పాటూ తాను కూడా క్యూలో నిలబడి మేము తినేదే ఆయన తింటారు. నేలను క్లీన్ చేసే సాధారణ వర్కర్తో సహజంగా భుజం మీద చెయ్యివేసి మాట్లాడతారు. అన్నిట్లోనూ 'నెంబర్ ఓన్’ గా ఉండాలనేది ఆయన లక్ష్యం. దాని కొసం రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. ఆయన అలా కష్టపడినందు వలనే మొదట్లో మూడు వందల రూపాయలు జీతం తీసుకునే నేను, ఈ రోజు ముప్పైవేలు సంపాదించేందుకు కారణమయ్యింది. ఒకే ఒక కంపనీ గా ఉన్న మా కంపనీ తొమ్మిది కంపనీలుగా ఎదిగింది. అలా ఎదిగి ఉండకపోతే ఇంత జీతం,ఇన్ని వసతులు ఇవ్వలేము అనేది ఆయన అభిప్రాయము. అదే నిజం కూడా....

నేను ఈ కంపనీలో చేరినప్పుడే నా స్నేహితుడు బాలూ ఒక రైసు మిల్లులో ఉద్యోగంలో చేరాడు. ఈ రోజు వాడు పదిహేను వేలు జీతం కూడా తీసుకోవటం లేదు. కానీ, నేను ఈ రోజు చేతుల నిండా సంపాదించటానికి నా యజమాని యొక్క దీర్ఘ దర్శనమే కారణం”

"అన్నీ సరే నండి...ఇంత దూరం ఒక కంపనీని తొమ్మిది కంపనీలుగా పెంచిన ఆయనకు మీ 'కంపెనీ' లో జరుగుతున్నాయని మీరు చెబుతున్న తప్పుల గురించి తెలియదా?"

"అదే ఇప్పుడు నా ప్రశ్న...నా కన్ ఫ్యూజన్..."

"సరే...ఆయనకు తెలియదనే పెట్టుకుందాం. ఆయన్ను చూసి నప్పుడు మీరు చెప్పేయండి"

"అలాగంతా చెప్పలేము మాలతీ. ఒక దేశ రాష్ట్రపతి ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతున్న సమస్య గురించి ఆలొచిస్తున్నప్పుడు ఒంటరిగా ఒకతను ఆయన దగ్గరకు పోయి 'మా ఇంటి కుళాయిలో నీళ్ళు రావటం లేదు’ అని చెప్పినట్లే ఉంటుంది...నేను గనుక ఈ సమస్య గురించి మాట్లాడితే..."

"మీ సమాధానం నాకు నవ్వు తెప్పిస్తోంది. ఆయన ఉన్న అంతస్తుకు ఇవేమీ పెద్ద సమస్యలు కావని అర్ధమవుతోంది. ఇంకా ఎందుకు మీరు బాధ పడుతున్నారు?"

"మాలతీ...ఒక మంచి సామెత ఏం చెబుతోందో తెలుసా?"

"ఏం చెబుతోంది?"

"చిన్న చిన్న సమస్యల్లో తీవ్రంగా దృష్టి పెడితే, పెద్ద పెద్ద సమస్యలు వాటికవే సర్దుకుపోతాయి అని ఆ సామెత చెబుతోంది"

"చివరగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు...?"

"దీనిని ‘చైర్మాన్’ దగ్గరకు తీసుకు వెళ్ళకూడదు. అదే సమయం ఇక్కడున్న వాళ్ళు భయపడాలి. ‘చైర్మాన్’ దృష్టికి తీసుకువెళ్ళకుండానే దీనిని సరి చేయటానికి ఏమిటి దారి అని ఆలొచిస్తున్నాను"

“సరే నాన్నా...బాగా ఆలొచించండి. ఏదో ఒకటి చెయ్యండి...అలాగే నాకూ ఒక దారి చూడండి"

"చూస్తాను ‘చైర్మాన్'!....కానీ, తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకే చోట పనిచేయటం అంత మంచిది కాదు. అందుకని ఎందుకైనా మంచిది నువ్వు వేరే కంపనీలో కూడా ప్రయత్నించు"

"సరే...ఇకనైనా కంపనీ సమస్యలు మూట కట్టి పెట్టేసి భోజనానికి వస్తారా?" పిలిచింది భార్య మాలతి.

అంత వివరంగా మాట్లాడినందువలన వెంకట్ ప్రసాద్ మనసు కూడా తేలిక పడింది. డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. మాలతీ 'హాట్ ప్యాక్' లో నుండి వేడి వేడి చపాతీలు తీసి ప్లేటులో పెట్టింది.

ఆ సమయంలో అది అమ్రుతంలా ఉన్నది!

మరుసటి రోజు ప్రొద్దున'యూనీ ఫారం' వేసుకుని 'నేమ్ బ్యాడ్జ్' పెట్టుకుని ఉద్యోగానికి బయలుదేరిన వెంకట్ ప్రసాద్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చిన మాలతీ భర్తను అడ్డుకుని ఆయన్ని ఒకసారి పైకీ కిందకీ చూసింది.

"ఏమిటి మాలతీ...?”

"ఏమీ లేదు...అన్నీ సరిగ్గా ఉన్నాయా అని చూశాను"

"నేను ఎప్పుడు సరిగ్గా లేకుండా వెళ్ళనే?"

"మంచి ప్రశ్నే...!కానీ తప్పు చేసేవాళ్ళు ఎక్కువగా ఉండే చోట నిజాయితీగా ఒక్కరున్నా అది తప్పేనండి!"

"అయ్యో...ఇప్పుడే నువ్వు మొదలుపెట్టేశావా?"

"సరే సరే...జాగ్రత్తగా వెళ్ళి రండి. ఎవరో ఏదో చేస్తే మనకెందుకు? మీరు మీ పని చూసుకుని వచ్చేయండి. రాత్రి నేను చెప్పింది జ్ఞాపకం ఉంచుకోండి" మాలతీ మంత్రించి పంపించింది.

ఒక చిన్న నవ్వుతో 'బైకు’ పై కూర్చుని దాన్ని కిక్ స్టార్ట్ చేసాడు. అది వీధిలోకి వేగంగా వెళ్ళింది. అతని మనసులోనూ 'ఎవరు ఎలా పోతే మనకేంటి. మనం మన పనిని నిజాయితీగా చేద్దాం...' అనే మంత్రమే పరిగెత్తింది.

కానీ, ఎప్పుడూ 'విధి' అనేది వినోధమైనదే కదా! అది తన దారిలోకే అందరినీ లాక్కుని వెడుతుంది. వెంకట్ ప్రసాద్ మాత్రం దానికి మినహాయింపా ఏమిటి...?

                                                                     ఇంకా ఉంది.....Continued in PART-13 ************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి