ఆలయం(సీరియల్) (PART-22) విఠల్ రావ్ మరియు అకౌంట్స్ మేనేజరూ… ఇక కాలం వాళ్ళదే అన్న ఊహల్లో తేలియాడుతున్నారు.
"సార్...'చైర్మాన్’ ఎందుకు వెంకట్ ప్రసాద్ 'డిస్ మిస్సల్ ఆర్డర్’ లో సంతకం పెట్టారో ఇప్పుడు అర్ధమవుతోంది"--అని అకౌంట్స్ మేనేజర్,'పి.ఆర్.ఓ.' విఠల్ రావ్ తో రహస్యంగా తనకు తెలుసు అనేటట్టు మొదలుపెట్టాడు.
"దేనివల్ల?"
"ఆయనకు త్రోట్ క్యాన్సర్! ఇక మీదట చాలా వరకు 'బెడ్ రెస్ట్' లో ఉండాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఆయనకు మనం తప్ప ఇంకేవరూ గతిలేరు?"
"ఓ...మీరు అలా వస్తున్నారా?"
"ఇంకెలా రాను...? బాగా ఆలొచించి చూడండి. సమీప కాలంలో ఆయన ఎవరి దగ్గరా క్లోస్ గా రాలేదే...! ఇప్పుడు కదా దానికి కారణం ఏమిటో అర్ధమయ్యింది"
"అంటే ఇప్పుడు మనం కొంచం దైర్యంగా ఆడుకోవచ్చు అని చెప్పండి"
"మరి...పంట కాలువలో నిండుగా నీరు పోతుంటే చెరో కొంచం తాగితే తప్పేమిటి?"
"మీరు ఇలా చూస్తున్నారు! నా చూపే వేరు...డబ్బు పెట్టుబడి పెట్టటం వలన ఆయన యజమాని. కానీ, అది పెట్టుకుని ఫ్యాక్టరీని నడుపుతూ ఆ డబ్బును కాపాడటంతో పాటూ ఆ డబ్బుతో లాభం సంపాదించి పెట్టేది మనమే కదా. అందువలన వచ్చే లాభంలో సరి సగం మనకు ఇవ్వాలి. కానీ, ఏ యజమాని మనసు కరిగి అలా ఇచ్చాడు?"
--అకౌంట్స్ మేనేజర్, 'పి.ఆర్.ఓ.' విఠల్ రావ్ కు కోరస్ పాడగా....ఉత్సాహం వచ్చిన విఠల్ రావ్ టేబుల్ తెరిచి అందులో దాచుకున్న మందు బాటిల్ తీసుకుని గబుక్కున కొంచం గొంతులో పోసుకున్నాడు. అప్పుడు ఆ 'పి.ఆర్.ఓ.' సెల్ ఫోనుకు పిలుపు ఒకటి వచ్చింది.
సెల్ ఫోన్ తీసి చూశాడు. అధిరిపడ్డాడు! స్క్రీన్ లో 'ఎం.డి.' పేరు.
"ఉష్...'ఎం.డి.' కాల్"
"అరె...అదృష్టవంతులంటే మీరే! ఆయన ఎప్పుడూ డైరెక్టుగా ఎవర్నీ పిలవరు. ఏమిటో అడగండి"
విఠల్ రావ్ సెల్ ఫోన్ స్విచ్ ఆన్ చేసి భవ్యంగా, "నమస్తే సార్" అన్నాడు"
"మిస్టర్ విఠల్ రావ్...చార్జ్ తీసుకున్న రోజు నుంచే చాలా ఉత్సాహంగా పనిచేస్తునట్టున్నారు లాగుందే?"
"అవును సార్...అది నా భాద్యత!"
"గుడ్..! అలాగే ఉండాలి. నేను అమెరికా వెల్తున్నట్టు మీకు తెలుసుకదా?”
"విన్నాను సార్...మీ ప్రయాణం బాగా జరగాలని ఆ దేవున్ని ప్రార్ధిస్తున్నాను"
"ఓ...చాలా ధ్యాంక్స్. తరువాత, మిమ్మల్ని అందరిని నమ్ముకునే నేను వెడుతున్నాను. పనులను జాగ్రత్తగా చూసుకోండి"
"బాధపడకండి సార్...'టర్న్ ఓవర్లో' ఒక నయాపైసా తగ్గదు"
"నాకు ఆ నమ్మకం ఉంది. మీకు నేను పూర్తి అధికారం ఇస్తున్నాను. ధైర్యంగా పనిచేయండి. 'కంపెనీకి’ విరుద్ధంగా ఎవరు నడుచుకున్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి...నేనూ అప్పుడప్పుడు మాట్లాడుతాను"
"ఇది చాలు సార్...మీ ఈ ఒక్కమాట చాలు సార్!"
"మంచిది. రేపు నాకు ఫ్లైట్. మిమ్మల్నందర్నీ ఏర్పొర్టులో చూడటానికి ఇస్టపడుతున్నాను. వచ్చేయండి"
"ఏమిటి సార్ అలా మాట్లాడుతున్నారు .....రేపు పూలమాలతో మొదటి వ్యక్తిగా నేను అక్కడుంటాను"
"ఓ...కే...బై"
---అవతల సైడు ఫోను పెట్టాశారు. ఇటి సైడు ప్రపంచమంతా నాదే అన్నట్టు ఒక సంతోషం. మధ్యం బాటిల్ తీసుకుని అలాగే నోట్లో పోసుకున్నాడు. 'పి.ఆర్.ఓ.' అలా చేయటం కొంచం ఎక్కువే అనిపించింది అకౌంట్స్ మేనేజర్ కి. అతనితో మాట్లాడకుండా...'పి.ఆర్.ఓ.' తో మాత్రం మాట్లాడేసి పెట్టేసిన ఎం.డి ప్రవర్తన అతనికి కాస్త బాధ అనిపించింది.
"ఏంటయ్యా...ఆలా చూస్తున్నావు? నేను రేపు ఏర్పోర్టుకు వెళ్ళాలి. నన్ను చూడ కుండా విమానం ఎక్కనని చెప్పారు 'చైర్మాన్’. పూర్తి అధికారం ఇస్తానని చెప్పారు"
--అకౌంట్స్ మేనేజర్ను 'ఏంటయ్యా' అని సంబోధించడం అకౌంట్స్ మేనేజర్ను మరింత బాధకు గురిచేసింది. కానీ, సహించుకున్నాడు.
"యోగం సార్ మీకు..." అంటూ ఆడపిల్లలా కొంచం సిగ్గుపడ్డాడు.
"సరే...సరే... వెళ్ళి పని చూడు. రేపు విమానాశ్రయానికి వెళ్ళాలి. మర్చిపోకు..."
---అకౌంట్స్ మేనేజర్ తల ఊపుకుంటూ బయలుదేరాడు.
విమానాశ్రయానికి వెళ్ళి 'ఎం.డి.' కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి పడవలాంటి 'ఏ.సీ' కారులో 'కంపెనీ' కి తిరిగి వచ్చాడు. అప్పుడు అతని తల మీద నిజంగానే కొమ్ములు మొలిచినట్లే అతనికి అనిపించింది. ఏర్ పోర్టులో పుష్పగుచ్ఛం ఇచ్చేటప్పుడు, 'ఎం.డి.' కైలాసం అతన్ని గుండెలకు హత్తుకున్నది అతనికి పెద్ద 'కిక్'ను ఇచ్చింది.
ఇంకా ఉంది.....Continued in PART-23****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి