నాసా యొక్క సూర్యుని మిషన్ గురించి నక్షత్ర వాస్తవాలు-1...(తెలుసుకోండి)....24/11/23న ప్రచురణ అవుతుంది

ఇప్పుడు సైంటిస్టులు మీ కంటిలోని ప్రతిబింబాన్ని పునర్నిర్మించగలరు...(ఆసక్తి)....25/11/23న ప్రచురణ అవుతుంది

పవిత్ర కేశాలంకరణ-1...(ఆసక్తి)...26/11/23న ప్రచురణ అవుతుంది

15, ఫిబ్రవరి 2020, శనివారం

ఆలయం(సీరియల్)...PART-18                                                  ఆలయం(సీరియల్)
                                                            (PART-18)


అద్దం ముందు నిలబడి గడ్డం గీసుకుంటున్నాడు వెంకట్ ప్రసాద్ కొడుకు శంకరయ్య. టెలిఫోన్ మోగింది. వెళ్ళి ఎత్తాడు. చెవిలో వినబడ్డ వార్తతో భయబ్రాంతికి గురి అయ్యాడు. గడ్డానికి ఉన్న సోపు నురుగుతో అలాగే కూర్చుని పోయాడు. కూరగాయల సంచితో మార్కెట్టు నుండి తిరిగి వచ్చి లోపలకు వచ్చిన మాలతీ కొడుకు స్థంభించి పోయుండడం గమనించింది.

"రేయ్...ఏమిట్రా ఇది? సరిగ్గా షేవ్ చేసుకోకుండా అలా కూర్చుండిపోయావు...?"

"నాన్నకు ఆఫీసులో హఠాత్తుగా 'హార్ట్ ఆటాక్' వచ్చిందట. హాస్పిటల్ కు తీసుకువెళ్ళారట. ఏదో జరగ కూడనిది జరిగింది"

"అయ్యయ్యో..." మాలతీ చేతిలోని కూరల సంచీని వదిలేసి అరిచింది!

పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కు వచ్చిన ఇద్దర్నీ స్నేహితులు అడ్డుకున్నారు. రాజేష్ కుమార్ శంకరయ్యను వేరుగా తీసుకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు.

"ఏమిటంకుల్...ఒక మనిషి నిజాయతీగా పనిచేయడం కూడా ఒక తప్పా? పై అధికారులు చిన్న ఉద్యోగులతో ఇలా కూడా ఆడుకుంటారా?"

"ఏమిటయ్యా ఈ ప్రశ్న...ఆడుకుని ఆటను పూర్తి చేశారే. ఒక విధంగా ఇలా జరిగినందుకు సంతోషించు. లేదంటే ఆ 'పి.ఆర్.ఓ' పోలీసులకు ఫిర్యాదు చేసి మీ నాన్నను జైల్లో పెట్టాలనుకున్నాడు. మా యూనియన్ కూడా ఆ కొత్తగా వచ్చిన 'పి.ఆర్.ఓ.' ను వదిలిపెట్ట కూడదని నిర్ణయించుకుంది. ఇది తెలుసుకున్న ఆ 'పి.ఆర్.ఓ.' ఇప్పుడు ధర్మ సంకటంలో ఉన్నాడు"

"నాకు తెలియక అడుగుతున్నాను అంకుల్. మా నాన్నను ఇంత హింస పెట్టటానికి ఆ 'పి.ఆర్.ఓ.'కి మా నాన్న ఏం అపకారం చేశారు?"

“ఐదొందలు, ఆరొందల మంది పనిచేస్తున్న ఒక ఫ్యాక్టరీలో 'లేబర్’ అనేవాడు ఒక బానిస లాంటి వాడు. పై అధికారులకు తాళం వేసుకుంటూ...వాళ్ళు తప్పుగా నడుచుకున్నా 'సరే...సరే' అంటూ వెళ్ళాలి. మీ నాన్న ఆ రకం మనిషి కాదని నీకే తెలుసు. తరువాత ఆయన కంపనీ మీద పెట్టుకున్న విశ్వాశం"

"విశ్వాశంగా ఉంటే 'కంపెనీ' సంతోష పడాలి కదా?"

"హు...'కంపెనీ' అని నువ్వు ఎవర్ని చెబుతున్నావు?"

"అందర్నీనూ...."

"నీకు 'కంపెనీ' అంటే ఏమిటో తెలియదు! నిజంగా విశ్వాశంగా ఉన్న ఒక కార్మీకుడ్ని చూసి సంతోష పడాల్సింది ఆ 'కంపెనీ' యజమానే. అంటే 'ఎం.డి.'! దురదృష్టకరంగా ఆయన ఇప్పుడు ఈ ఊర్లోనే ఉండటం లేదు. నెలలో సగం రోజులు ముంబైలోనూ, కలకత్తాలోనూ తన కొడుకుల ఇళ్ళలో ఉంటారు. 'కంపెనీ' ని ఇప్పుడు నడుపుతున్నది 'జెనెరల్ మేనేజర్’. మా యజమాని అయన్ని బాగా నమ్ముతాడు. కానీ, ఆయనే మా యజమాని నమ్మకానికి తగినట్లు నడుచుకోవటం లేదు. కంపెనీలో ఏటుచూసినా అవినీతి...కమీషన్. అందులో పలువురికి భాగం ఉన్నదని మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంత దూరం నిజమనేది తెలియదు. కానీ, తప్పు జరుగుతోంది. ఆ తప్పును ఎలా ఆపాలో తెలియటంలేదు"

"అందరూ వెళ్ళి 'ఎం.డి.'ని కలిసి చెప్పొచ్చుగా?"

"మేము చెప్పేది ఆయన నమ్మాలే...!"

"ఎందుకు నమ్మరు!?"

"వాళ్ళ తప్పులను నిరూపించాలే?"

నిరూపించండి!

"ఎలా నిరూపించగలం? ఈ రోజుల్లో ఎవరైనా సాక్ష్యం పెట్టుకుని తప్పు చేస్తారా? అందులోనూ మా 'కంపెనీ' లో ఉండే కొందరు ఆఫీసర్లు కొండలను మింగే కొండచిలువలు! ఏదో పథకం తోనే అన్ని పనులూ చేస్తున్నారు"

"నెల తప్పకుండా లాభాలు చూపించడం వలన వీళ్ళను అనుమానించరు. కానీ, పలు కోట్లు లాభాలు వచ్చే అవకాసమున్న చోట కొన్ని కోట్లే లాభం వస్తోందని ఆయన తెలుసుకోవటం లేదు"

"ఇలా మాట్లాడటం వచ్చిన మీకు...అవినీతి చేస్తున్న వారిని పట్టుకోవటం మీకు చేతకాదా?"

"మాకంతా ఆంత శక్తి లేదు. ఇప్పుడు కూడా చెబుతున్నాను...ఆ 'పి.ఆర్.ఓ.', ఆ తరువాత ఆ మేనేజర్...వీళ్ళను కలిసి, 'నేను ఇకమీదట మీ వైపు, ఇకమీదట మీరు చేసే పనులను చూసినా చూడనట్లు ఉండిపోతాను అని మీ నాన్న చెబితే చాలు. మీ నాన్నకు ఇక్కడ హాస్పిటల్ 'ట్రీట్మెంట్' నుండి అంతా రాజ భోగంగా మారిపోతుంది"

"అంటే వాళ్ళతో కలిసిపొమ్మంటున్నారు"

"లేదు తమ్ముడూ! లోకంతో కలిసి వెళ్ళమంటున్నాను"

"ఇలాంటి నీచమైన పనికి లోకాన్నే కారణం చేస్తున్నారే 'అంకుల్ ....?"

----- శంకరయ్య దగ్గర కోపం కనబడింది. రాజేష్ కుమార్ అదంతా పట్టించుకోలేదు.

"తమ్ముడూ...నీకు సమాజం గురించి సరిగ్గా తెలియదు. మన ప్రజల్లో చాలా మంది వినొదమైన మనుష్యులు! ప్రతి రోజూ మనందర్నీ ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఉదాహరణకు ఒక విషయం చెబుతాను...నేను నివసిస్తున్న వీధిలో తారు రోడ్డు వేసి 15 సంవత్సరాలు అయ్యింది. డ్రైనేజ్ వసతి కూడా లేదు. మంచి నీళ్ళు...నెలలో ఏప్పుడో ఒక రోజున వస్తుంది. రోడ్డు మొత్తం ఒకటే చెత్త. వేరుగా ఒక చెత్త కుండీ కూడా లేదు. అదేలాగా మా రేషన్ షాపులో ఒక కిలోకి వందో, రెండువందల గ్రాములొ తక్కువగానే పంచదార తీసుకుంటున్నాను. అవన్నీ రోజూ నిమిషానికి ఒకసారి...నేనూ, మా వీధిలోని వాళ్ళూ ఎదుర్కుంటున్న సమస్య.

ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు?

పూర్తిగా విను...విన్న తరువాత నీకే అర్ధమవుతుంది

                                                                        ఇంకా ఉంది.....Continued in PART-19 ****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి