30 సంవత్సరాలుగా పనిలో ఉంటున్న 'మార్కెటింగ్ మేనేజర్’ ఒకాయన విఠల్ రావ్ ను వెతుక్కుంటూ వచ్చి, "మీకు ఏమైనా వశీకరణ విద్య వచ్చా...'చైర్మాన్’ గారిని ఓకే ఒక్క గాలము వేసి పట్టాశారే?”--అని అడిగినప్పుడు అతను నవ్విన నవ్వులో విషం కలిసి అందరు రాక్షసులు వరుసగా కనబడ్డారు.
ఆ నవ్వు చెదరలేదు! అంతే కాదు ఫ్యాక్టరీ మొత్తం తిరిగి రావడానికి బయలుదేరాడు 'పి.ఆర్.ఓ' విఠల్ రావ్. చూసేవాళ్ళందరూ అతివేగంగా 'గుడ్ మార్నింగ్' చెప్పారు.
ఫ్యాక్టరీలలోని వ్యాధులలో 'గుడ్ మార్నింగ్' కు ఒక చోటు ఉంది. ఎటువంటి ప్రతిభ లేకపోయినా కార్మీకుడే అధికార వర్గానికి 'గుడ్ మార్నింగ్' చెప్పాలి. అందులోనూ ఈ 'పి.ఆర్.ఓ.' విఠల్ రావ్ లాంటి వాళ్ళకు ఎవరైనా 'గుడ్ మార్నింగ్' చెప్పటం మర్చిపోయినా, వదిలేసినా ఆ రోజు వాళ్ళకు మంచి నీళ్ళు కూడా దొరకదు. సంబంధించిన వాళ్ళను వెతికి పట్టుకుని 'గుడ్ మార్నింగ్' చెప్పేంతవరకూ వదిలిపెట్టరు.
నిజానికి ఒక ఫ్యాక్టరీలో 'గుడ్ మార్నింగ్' పెట్టటానికి అసలైన అర్ధం...'నేను నీకు అనిగి మనిగి ఉండేవాడిని’ అనేదే అర్ధం. విఠల్ రావ్ వరకు సగం మంది భయంతొ చెప్పారు. 'అకౌంట్స్ మేనేజర్’ ఆయనతోనే, ఆయన వెనుకే ఉంటూ ఫ్యాక్టరీ అంతా చుట్టి వచ్చాడు.
ఫ్యాక్టరీని చుట్టిన తరువాత క్యాంటీన్ లోకి వెళ్ళారు. అక్కడ వీళ్ళకు వెరే 'మెనూ'! సువాసనతో నెయ్యి మినపట్టు, ఉల్లి ఊతప్పం, స్పేషల్ గారె, దానికి మూడు రకాల చట్నీ అంటూ వరుసగా వచ్చింది. తాగటానికి 'మినరల్ వాటర్’.
"సార్... వెంకట్ ప్రసాద్ చోటుకు ఇంకొకర్ని వెంటనే అపాయింట్ చేయాలి"--అంటూ మినపట్టును తింటున్నప్పుడు 'అకౌంట్స్’ గుర్తు చేశాడు... విఠల్ రావ్ ఒక చిన్న నవ్వు తో సమాధానం చెప్పాడు.
"ఏమిటి సార్ నవ్వుతున్నారు?"
"నిన్ను చూస్తుంటే నవ్వకుండా ఎలా ఉండగలను...? వెళ్ళేటప్పుడు 'డిపార్ట్ మెంట్' పక్కకి వెళ్ళి చూడు. వెంకట్ ప్రసాద్ చోట మన మనిషి ఒకతను పనిచేస్తూ ఉంటాడు"
"అయ్యో... నాకు తెలియకుండానే మనిషిని అపాయింట్ చేసేశారా?"
"ఏమిటయ్యా...నాకు తెలియ కుండానే అంటే? దీనికి అర్ధం ఏమిటి? దీనికే ఇంత ఆశ్చర్య పడుతున్నావే ఈ 'కంపెనీ జి.ఏమ్'ను కూడా నేనే కదా సెలక్ట్ చెయ్యబోతాను. దానికి ఏం చెప్పబోతావు...?"
"నేను ఏం చెప్పదలచు కున్నానంటే..."
"ఏమీ చెప్పద్దు...! నేను పంపే బిల్లులను పాస్ చేస్తూ వెళ్లు. ఆరు నెలలలో ఈ 'కంపెనీ' ని ఎలా మార్చి చూపిస్తానో చూడు"
"మీ ధైర్యం ఎవరికీ రాదు సార్"
"అందుకే 'చైర్మాన్’ నాకు బాధ్యత అప్పగించి వెళ్ళారు"
"అది నాకు తెలుస్తోంది! పై అధికారులలో కొంత మంది పెద్ద తలలు మీ వేగాన్ని తట్టుకోలేక...దేనినీ అంటించకుండా ఉండాలి"
"అంటిస్తే అంటించినవారే తగలబడి పోతారు...'చైర్మాన్’ వరకు నెల నెలా లాభం పెరుగుతూనే వెడుతుంది. ఆయనకు కావలసింది అదే. అదే సమయం 'కంపెనీ' లో ప్రతి చోటునూ మన మనుష్యులతో నింపేయాలి"
"అంటే... ఉన్న వాళ్ళందరినీ వెంకట్ ప్రసాద్ లాగా తీసేయాలి అంటున్నారు"
"అవును...'కంపెనీ'లో పూర్తిగా మన మనుష్యులే ఉండాలి. అప్పుడే మనం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండగలం. ఇక్కడ నేను పెట్టిందే చట్టం అన్నట్టు ఉండాలి"
"ఇప్పుడే అలాగే కదా జరుగుతోంది! ఎలాంటి వశీకరణ మంత్రం వేసారో...'కంపెనీ'నే మీ చేతుల్లో పెట్టారు 'చైర్మాన్’!"
"అబ్బబ్బా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు"
"క్షమించండి...ఒక ముఖ్యమైన విషయం"
"ఏంటయ్యా?"
"పంజాబ్ లూదియానా నుండి ఇద్దరి సర్దార్జీలు రేపు మన 'కంపెనీ'కి 'విసిట్' చేస్తున్నారు"
"ఎప్పుడూ లాగానే 'కస్టమర్ విసిట్' టే కదా! 'ప్రొడక్షన్ మేనేజర్’ ను చూసుకోమని చెప్పు. దీన్ని ఎందుకు నా దగ్గర చెబుతున్నావు?"
"లేదు సార్...ఇది చాలా పెద్ద 'పార్టీ'! నెలకు రెండు కోట్లు 'ఆర్డర్’ ఇవ్వబోతారు. 'అందులో సగం 'బ్లాక్' లో చెయ్యగలమా?' అని అడుగుతున్నారు"
"ఎందుకని...'బిల్లు’ వేస్తే టాక్స్ సమస్య వస్తుంది కాబోలు?"
"అవును...డెబ్బై ఐదు లక్షలకు పదకొండు శాతం. దగ్గర దగ్గర ఏడెనిమిది లక్షల రూపాయలు..."
"మనం 'ఓ.కే' చేస్తే...మనకి ఎంత దొరుకుతుంది?"
"నెలకు రెండు లక్షలు మీ 'అకౌంట్' లో వేస్తారు"
"ఇక్కడ 'డిపాసిట్' లో ఎవరు 'సూపర్ వైజర్’?"
"అదంతా నేను చూసుకుంటాను. మీరు సరే నని చెబితే చాలు"
"మీకు ఇందులో ఎంత?"
"తక్కువే. యాబై వేలు!"
"నిజమా?"
"ప్రామిస్ గా...!"
"తరువాత ప్రాబ్లం రాదుగా..."
"నేను ఉండంగా మీకు భయం ఎందుకు? రెండో డిస్పాచ్ లో అక్కడున్న వారినందరినీ గమనిస్తే పోతుంది"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి