9, ఫిబ్రవరి 2020, ఆదివారం

ఆలయం(సీరియల్)...PART-16




                                                    ఆలయం(సీరియల్)
                                                             (PART-16)


“ప్రియమైన వెంకట్ ప్రసాద్....

శుభాకాంక్షలు! నీ లాంటి విశ్వాశం గల ఉద్యోగులను ఉత్సాహపరచాలని, శభాష్ అని భుజాలను తట్టి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. దాన్ని అమలుపరచటానికే నీకు ఈ ప్రమోషన్. నువ్వు ఇలాగే విశ్వాశంగా పూర్తి శ్రద్దతో, నిజాయితీతో పనిచేసి ఈ కంపనీ మరింత పెద్దది అవటానికి సహాయపడతావని నమ్ముతున్నాను… ఆల్ ద బెస్ట్” అని రాసి సంతకం పెట్టుంది.

ఆ లెటర్ను మళ్ళీ మళ్ళీ చదివి ఉప్పొంగి పొయాడు వెంకట్ ప్రసాద్. నిన్నటి వరకు 'కంపనీ' పై ఉన్న ఆందోళన, బాధ ఆ లెటర్ తో మాయమైంది. మళ్ళీ మళ్ళీ చదివాడు. ఇంతలో అతని స్నేహితులందరూ అతన్ని చుట్టుముట్టారు. వాళ్ళు కూడా 'ప్రమోషన్ లెటర్’ ను చూసి వెంకట్ ప్రసాద్ కి షేక్ హ్యాండ్ ఇచ్చారు.

ఒకడు మాత్రం తెలివిగా ఒక ప్రశ్న అడిగాడు.

“ప్రసాద్....ఈ 'ఆర్డర్ని’ నీకు ఇచ్చింది ఎవరు? మన జెనెరల్ మేనేజరా? పర్సనల్ మేనేజరా?”

"మన ‘పర్సనల్ మేనేజర్’ మూడు నెలల సెలవు మీద అమెరికా వెళ్ళారు కదా? ఇప్పుడు 'పర్సనల్’ , 'జెనెరల్ మేనేజర్’ అన్నీ మన కొత్త 'పి.ఆర్.ఓ.' విఠల్ రావ్ గారే...." ఇంకొకడు చెప్పాడు.

"ఆ మనిషి నిన్న నిన్ను పిలిచి ఇష్టం వచ్చినట్లు వాగాడని విన్నామే? ఈ రోజు ఏమిటి హఠాత్తుగా 'ప్రమోషన్’ ?" అనుమానం వెలిబుచ్చాడు మొదటతను

"అరే ఎవడ్రా వీడు... 'ప్రమోషన్’ ఇచ్చింది మన 'చైర్మన్’. అన్నాడు ఇంకొకడు

మన 'చైర్మన్’ నిన్ను బాగానే ఉత్సాహపరిచారు ప్రసాద్. మేమందరం కూడా సంతోష పడుతున్నాము. ఈ 'కంపనీ'లో కష్టపడి పనిచేయటంలో అర్ధం లేదు అనుకుంటున్నాము. కానీ, నీకు దొరికిన 'ప్రమోషన్’ మమ్మల్ని కొంచం ఆలొచింప చేస్తోంది"

స్నేహితులందరూ కలిసి వెంకట్ ప్రసాద్ ని అభినందించారు.

"'మేనేజర్’ అయిపోయావు...పార్టీ ఏమీ లేదా?" అని ఒకతను అడిగాడు.

“మన వెంకట్ ప్రసాద్ 'పార్టీ' ఇస్తే బాటిల్ తెరవలేము. అది కచ్చితమైన వెజిటేరియన్ 'పార్టీ' గానే ఉంటుంది"

"పార్టీ సంగతి తరువాత! ప్రసాద్ ...శుభముహూర్త టైములో వెళ్ళి 'సీటు’ లో కూర్చో. మేము కూడా కళ్ళార చూసి ఆనందిస్తాం”

“ఖాలీగా ఉన్న సీటులో ఎవర్ని వేస్తారో నని ఎదురు చూస్తూ ఉన్నాము. నిజం చెబుతున్నా...మనలో ఒకర్ని 'ప్రమోట్' చెయ్యరని తెలుసు. మనలో 'యూనివర్సిటీ ఫస్ట్’ వచ్చిన వాళ్ళున్నా, మనమంతా కార్మికవర్గం కదా? మనకి పనిచేసే ప్రతిభ లేదు, చేయించుకునే ప్రతిభ లేదు. చెప్పిచ్చినా రాదు. అనేదే మన మేనేజ్ మెంట్ ఉద్దేశం. కాబట్టి, సోడా బాటిల్ కళ్ళద్దాలు వేసుకున్న ఎవడో ఒకడు రాబోతాడని అనుకుంటే...'కంపనీ' ఈసారి మనకి షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారు"

ఇలా అందరూ మాట్లాడుతుంటే, వెంకట్ ప్రసాద్ వెళ్ళి ఖాలీగా ఉన్న మేనేజర్ కుర్చీలో కూర్చున్నాడు.

"న్యాయంగా చూస్తే మన జి.ఎం., పి.ఆర్.ఓ. ఇద్దరూ వచ్చి నిన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టాలి. కానీ, మన ‘చైర్మాన్’ వెంకట్ ప్రసాద్ కి ప్రమోషన్ ఇవ్వటం వాళ్ళకు ఇప్పుడు మెరపకాయ తిన్నట్టు ఉంటుంది. అందుకే 'ఆర్డర్’ ను ఇక్కడ పెట్టి వెళ్ళారు"

వెంకట్ ప్రసాద్ కూర్చున్న వెంటనే ఒక కార్మీకుడు చెప్పి బాధ పడ్డాడు.

తరువాత అందరూ వరుసగా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. కొందరు నిట్టూర్పు విడిచారు.

"మనమందరం ఈ 'కంపనీ' లో అభివృద్ధి చెందలేము అనే అపనమ్మకంతో సరిగ్గా పనిచేయకుండా, చేస్తున్నట్టు నటించడం తప్పని ఇప్పుడు అనిపిస్తోందిరా"--అని గట్టిగానే గొణిగాడు ఒకడు.

కానీ, ఇదంతా 'పి.ఆర్.ఓ.' విఠల్ రావ్ ఆడుతున్న నాటకంలో ముఖ్యమైన భాగం అనేది ప్రసాద్ కు, కార్మీకులకు తెలిసే అవకాశమే లేదు.

ఖచ్చితంగా అదే సమయంలో ఆ 'డిపార్ట్ మెంటు’ వైపు కొత్త 'పి.ఆర్.ఓ.' విఠల్ రావ్, 'అకౌంట్స్ మేనేజర్’ తో కలిసి నడిచి వస్తున్నారు. వాళ్ళ తలలు కనిపించగానే...వేటగాడిని చూసిన కాకుల గుంపులాగా అందరూ చెదిరి వెళ్ళి పోయారు.

వెంకట్ ప్రసాద్ మాత్రం 'మేనేజర్ సీటు’లో....

అతనికి కూడా ఏం చాయాలి...ఎలా చెప్పాలి అనే విషయంలో గందరగోళంగా ఉన్నది. ఆలొచిస్తూ తల పైకెత్తినప్పుడు చిటపటలాడే మొహంతో పి.ఆర్.ఓ., 'అకౌంట్స్ మేనేజర్’ అతని ముందు నిలబడున్నారు. ప్రసాద్ వాళ్ళను చూసి 'గుడ్ మార్నింగ్' అన్నాడు.

"ఉండనీ...ఇక్కడ ఈ సీటులో కూర్చుని ఏం చేస్తున్నావు?" అడిగాడు 'పి.ఆర్.ఓ.' విఠల్ రావ్,

"సార్..."

"ఏమిటయ్యా సారు, గీరూ...'ఇది మేనేజర్ సీటు’! నువ్వు సాధారణ కార్మీకుడివి. ఈ సీటు లో నువ్వెలా కూర్చున్నావు?"

"సార్...ఇదిగో చూడండి...’ప్రమోషన్ ఆర్డర్’ మరియూ చైర్మాన్ గారి లెటర్..."

ప్రసాద్ వెంటనే 'ఆర్డర్’ ను చూపించాడు...ఇద్దరూ దాన్ని తీసుకుని చూశారు. లెటర్ను ఒక చూపు, వెంకట్ ప్రసాద్ ను ఒక చూపు చూసి మొదట వెకిలిగా నవ్వి, ఆ తరువాత పగలబడి నవ్వటం మొదలుపెట్టారు. మేనేజర్లను చూసి ప్రసాద్ ని విష్ చెయటానికి వచ్చుంటారని అక్కడక్కడ దాక్కున్న ప్రసాద్ సహ ఉద్యోగులు మేనెజర్ల నవ్వును ఆశ్చర్యంతోనూ, ఆందోళనతోనూ గమనించడం మొదలుపెట్టారు.

"ఏమిటయ్యా... ఇలా 'టేబుల్’ మీద పేరు లేకుండా ఒక కవరు ఉంటే అది 'కంపనీ ఆర్డరా'? ఇది నకిలీ--మొసపుచ్చే 'ఆర్డర్’ అనేది నీకు అర్ధంకాలేదా?"---'పి.ఆర్.ఓ.' మొదటి బాంబు పేల్చాడు.

                                                                           ఇంకా ఉంది.....Continued in PART-17 *****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి