ఆలయం(సీరియల్) (PART-21) "ధైర్యవంతుడివే...! నా తప్పును నువ్వు నిరూపించగలవా?"
"ఖచ్చితంగా నిరూపించగలను...ఒక పరిశ్రమను మొదలు పెట్టటం పెద్ద విషయం కాదు సార్! అది ఎలా జరుగుతున్నది అని చూస్తూ ఉండాలి. కానీ మీరు అలా చేయటమే లేదని తెలుస్తోంది?"
"తమ్ముడూ... నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?"
"బాగా తెలుసుకునే వచ్చాను. మీకు కొన్ని ఆశ్చర్యమైన విషయాలను మొదట్లో చెబుతాను. మా నాన్నను కాపాడటానికి నేను ఇక్కడికి రాలేదు. ఆయన ఇక పనిచేయటానికి, ఆయనతో పనిచేయించుకోవటానికి....మీ 'కంపెనీ' కే అర్హత లేదు. కనుక ఎలాంటి సంధర్భంలోనూ ఆయన ఇక అక్కడ పనిచేయరు. దానికి నేనూ అంగీకరించను. ఎందుకంటే, నేనూ చదువు పూర్తిచేశాను. మొదట్లో మీ 'కంపెనీ' లో చేరి పెద్ద అధికారిగా రావాలని ఆశపడ్డాను"
"కానీ, సాధించాలని అనుకునే వారికి మీ 'కంపెనీ' లో చోటు లేదని తెలిసి పోయింది.'కమీషన్’ కొట్టటం...అవినీతి చేయటం తెలిసుండాలి. ఎప్పుడూ 'కంపెనీ' ఏదో ఒక సమస్యలో ఉండాలనేదే మీరు ఎక్కువగా నమ్ముతున్న మీ అసిస్టంట్ల,మెనేజర్ల ఆలోచన! వాళ్ళు మిమ్మల్ని సులభంగా సమాధాన పరచ గలుగుతున్నారు. కారణం...మీ స్వభావం! మీ ప్రారంభం ఎలాంటిదో నాకు తెలియదు....కానీ, ఇప్పుడు మీకూ, కార్మీకులకూ మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది. కార్మీకులకూ, మీకు మధ్య ఉన్న దూరం మీ అసిస్టంట్లు వలన ఎక్కువ అవుతూ వెడుతోంది. అది మీకు తెలియటంలేదు.
మా నాన్న వంద శాతం విశ్వాసపాత్రుడు! భాద్యత గల మనిషి. చిన్న తప్పుకు కూడా చోటివ్వరు. అదే ఆయనకు శత్రువుగా మారింది. జరిగినదంతా ఒక కుట్ర! దీన్ని నేను నిరూపించగలను. అక్కడ జరుగుతున్న కుట్రలను, అవినీతి పనులను మీరే మీ కళ్ళతో చూడచ్చు. కానీ నేను చెప్పేటట్టు మీరు నడుచుకోవాలే? దానికి మీ మనసు అంగీకరించాలే?"
"సరే...! దానికి నేను ఏం చేయాలి?"
“నేను చెప్పేది మనస్పూర్తిగా వింటారా?"
"వింటాను"
"నిజంగానా?!"
"తమ్ముడూ...నీ మాటల్లో ఆవేశం కనబడుతోంది! ఎప్పుడూ నిజం ఉన్న చోటే ఆవేశం...నిప్పులాగా ఎగిసి పడుతుంది. ఒకడు ఆవేశంగా మాట్లాడటానికీ, ఆవేశంగా నటించడానికీ నాకు తేడా బాగా తెలుసు. నేను ఏం చేయాలో మాత్రం చెప్పు"
“మొదటి పనిగా మా నాన్న 'డిస్మిస్’ ఆర్డర్ను 'ఓ.కే' చెయ్యండి. అలాగే, హడావిడి గా 'యాక్షన్’ తీసుకున్నందుకు ఆ కొత్త 'పి.ఆర్.ఓ.' కి 'క్యాష్ అవార్డ్' ఇవ్వండి. ఒకసారి ఫోన్ చేసి, 'నేను అమెరికా వెల్తున్నాను, రావటానికి ఆరు నెలలు అవుతుంది. మిమ్మల్ని నమ్ముకునే వెడుతున్నాను అని చాలా నమ్మకంగా చెప్పండి....చెప్పేసి అందరూ చూస్తుండగానే అమెరికాకు విమానం ఎక్కండి. విమానాశ్రయానికి హైదరాబాద్ ఫ్యాక్టరీ లో టాప్ లెవల్ లో ఉండే అందరినీ రానివ్వండి. ఆ విమానం 'డిల్లీ' మీదగా వెలుతుంది. అక్కడ నేను మిమ్మల్ని కలుసుకుంటాను. నా తరువాత 'ప్లాను గురించి చెబుతను"
"అది కూడా ఇక్కడే చెప్పొచ్చుగా?"
"సార్...నేను ఒక 'అసైన్మెంటు’ను తీసుకున్నాను. ఒక మంచి యజమాని యొక్క పని ఏమిటంటే నా ‘అసైన్ మెంటు’కు సహకరించటమే"
"'ఓ.కే...డన్!"--ఎం.డి శంకరయ్య, వెంకట్ ప్రసాద్ కొడుకు శంకరయ్య చేతులు గట్టిగా పుచ్చుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అతను కూడా అంతే గట్టిగా యజమాని చేతులు పుచ్చుకున్నాడు. ఆ షేక్ హ్యాండుతో 'ఈ చాన్స్ ను అంత సులభంగా విడిచిపెట్టను’ అని కార్మీక కొడుకు శంకరయ్య పట్టుదలగా ఉన్నాడని అనిపించింది 'ఏం.డి.'కి.
ఫ్యాక్టరీ అంతా హడావిడి అయిపోయింది! వెంకట్ ప్రసాద్ ను పనిలో నుండి తీసేయమని చెప్పి 'ఏం.డి.' శంకరయ్య తన సొంత హ్యాండ్ రైటింగ్ తో ఒక లేక గూడా రాసారు. ఆ లేఖలో 'క్రమశిక్షణ లేకుండా నడుచుకునే వాళ్ళు ఎంత విశ్వాస పాత్రుడిగా ఉన్నా...వాళ్ళను ఉద్యోగం నుండి తీసేయటం సరైన శిక్ష. నా మీదున్న విశ్వాసాన్ని చెప్పి వాళ్ళు తప్పించుకోలేరు!' అని రాసి అండర్ లైన్ చేయబడ్డ లేఖ యొక్క కాపీని ఫ్యాక్టరీ నోటీస్ బోర్డులో అతికించారు.
ఫ్యాక్టరీ లో అందరూ మౌనంగా ఉన్నారు. ఆ లేఖతో పాటూ ఇంకొక హెచ్చరిక లేఖను ఆ 'పి.ఆర్.ఓ.' నోటీస్ బోర్దులో అతికించాడు. ఆ లేఖలో, ఫ్యాక్టరీలో ఎవరైనా ఎవరితోనైనా అనవసరంగా మాట్లాడితే వాళ్ళను కూడా సస్పెండ్ చేస్తాను అని హెచ్చరించబడి ఉంది. దానికి ప్రతిధ్వనిగా...దీనికి మధ్యలో, 'ఎం.డి.' శంకరయ్య చికిత్స కోసం ఆరు నెలలు ఆమెరికాకు వెడుతున్నారు అనేది ఏక కాలంలో పాకిపోయింది. కొందరు ఇంకో మెట్టెక్కి ఆయనకు శ్వాసకోస క్యాన్సర్ అనే వార్తను గుస గుసల రూపంలో వ్యాపింపజేశారు.
ఇంకా ఉంది.....Continued in PART-22****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి