19, ఫిబ్రవరి 2020, బుధవారం

ఆలయం(సీరియల్)...PART-20



                                               ఆలయం(సీరియల్)
                                                         (PART-20)


అబద్దమో, నిజమో ఆయనవరకు కంపెనీలోని అధికారులు ఏం చెబితే అదే నిజం. స్వయం అనుభవాలు ఆ మనిషిలో చోటే పొందలేక పోయేయి. దాన్నే సంధర్భంగా తీసుకుని అధికార వర్గంలోని వాళ్ళు సులభంగా ఆయన్ని మోసం చేయగలుగుతున్నారు. కానీ, అధికార వర్గంలో లేనివాళ్ళు, పాపం...విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది అని వదిలేస్తున్నారు.

ఆశపడినట్లే 'ఎం.డి.' బంగళా ముందు వెళ్ళి నిలబడ్డాడు. జీన్స్ ప్యాంటు, టీ-షర్టు, తలమీద టోపి అంటూ 'జేమ్స్ బాండ్' వేషం. మనసులో అగ్ని. ఒకవిధమైన నిజాల వైరాగ్యం. ప్రతి ఒక్కరూ అంటించిన భయాలను బలూన్లో దాచబడ్డ గాలిలా కట్టి పడేసాడు. 'ఎం.డి.' ఇంటి ముందున్న గూర్ఖా శంకరయ్యను ఎగాదిగా చూశాడు. అతని దగ్గర 'పోలీస్ డిపార్ట్ మెంటు’ నుండి వస్తున్నట్టు చెప్పాడు శంకరయ్య.

"ఎందుకు...?"

"అది నీ దగ్గర చెప్పాల్సిన అవసరంలేదు"

"అయితే మా 'ఎం.డి.' అసిస్టంట్ వస్తారు...ఆయన దగ్గరైనా చెప్పండి"

గూర్ఖా, 'ఎం.డి.' అసిస్టంట్ కు ఫోన్ చేసి పిలిపించాడు. కళ్ళజోడు పెట్టుకున్న వయసైన ఒకాయన 'స్వట్టర్’ వేసుకుని, తలకు ఒక మంకీ టోపి వేసుకోనున్నారు.

"ఎస్. మిస్టర్ పోలీస్ ఆఫీసర్..."

"'ఐ యామ్ సారీ మిస్టర్ పి.ఎ.'! నేను మీ 'ఏం.డి.' తోనే మాట్లాడాలి. ఇది చాలా పర్సనల్ విషయం..."

"అలాగంతా ఆయన్ని చూసి మాట్లాడలేరు సార్. ఏ విషయమైనా సరే నా దగ్గర చెప్పండి"

"ఆయన చేసిన తప్పు గురించి మీ దగ్గర ఎలా చెప్పగలను?"

"ఆయన తప్పు చేశారా...ఏం చెబుతున్నారు మీరు?"

"ఆయన కారులో వస్తున్నప్పుడు ఒకతనికి దెబ్బతగలింది. కానీ, మీ డ్రైవర్ అది గమనించకుండా వచ్చాశాడు"

"ఉండదు...ఖచ్చితంగా ఉండనే ఉండదు! ఎవరో తప్పుగా చెప్పుంటారు"

"కారు నెంబర్ను పెట్టుకుని 'ఆర్.టి.ఓ.' దగ్గరకు వెళ్ళి అడ్రెస్సు తెలుసుకుని వచ్చాను"

"ఉండండి...సార్ దగ్గర అడిగి వచ్చి చెప్తాను"

"అది నేను అడుగుతాను...మర్యాదగా ఆయన్ని స్వయంగా రమ్మని చెప్పండి"

"ఆయన గురించి తెలియక మాట్లాడుతున్నారు మీరు... సారు ఈ భారత దేశంలోనే మొదటి పది గొప్ప ఆస్తి పరులలో ఒకరు. ఇంగ్లాండ్ ప్రధాన మంత్రితో 'డిన్నర్’, అమెరికా ప్రెసిడెంటు తో 'బ్రేక్ ఫాస్ట్' తినేటంత అంతస్తు గలవారు..."

"కానీ, భారతదేశ చట్టం అందరినీ మనుష్యులేనని చెబుతోంది. మీ 'ఎం.డి.' మరణించినా ఆయన శరీరాన్ని కూడా 'బాడీ' అనే అంటారు. అర్ధమయ్యిందా?”

---శంకరయ్య మాట్లాడిన తీరు...వెంటనే పనిచేసింది. ఆ పి.ఏ. శంకరయ్యను కోపంగా చూసేసి లోపలకు వెళ్ళాడు.

ఐదు నిమిషాల తరువాత తిరిగి వచ్చి శంకరయ్యను తీసుకుని విడిగా ఉన్న గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆ గది ఖాలీగా ఉన్నది. లోపల చల్లటి 'ఏ.సీ.' గాలి. అక్కడ చిన్న 'కెమేరా' పనిచేస్తున్నది గమనించాడు. ఇంకో గదిలో నుండి తనని 'ఎం.డి.' గమనిస్తున్నారని అనుమానించాడు.

'ఎలాగో శిఖరం ఎక్కాము...ఇక దైవ దర్శనమే బాకీ!....దైవం దగ్గర వరం దొరుకుతుందా...లేక, ఉన్నది పోతుందా?'

ఆ గదిలో ఇంకెవరూ లేరు.

చిన్న కెమేరా తిరుగుతూ తిరుగుతూ వీడియో తీస్తున్నది.

"'ఎక్స్ క్యూస్ మి సార్...కెమేరా'ను కొంచం ఆపగలరా?" --అతని ఇష్టాన్ని మరోమారు ఆశ్చర్యంతో గమనించిన ఆయన సమాధానం చెప్పకుండా విసుగ్గా చూసారు.

"నా వల్ల మీకు ఎటువంటి ఆపదా రాదు సార్! మీ చుట్టూతా ఉన్న ఆపదలు కావాలంటే తోలిగిపోతాయి. నన్ను నమ్మండి"

"దానికీ, 'కెమెరా'కు సంబంధం ఏమిటి?"

“నాకేమీ లేదు సార్...నేను చెప్పి ముగించిన తరువాత మీరే బాధ పడతారు"

అతని మాటలతో ఎం.డి. కి కొంచం నమ్మకం కలిగింది, 'రిమోట్' ను వెతికి తీసుకుని ఒక బటన్ను నొక్కటంతో ఆ 'కెమేరా' కు వెడుతున్న కరెంటు ఆగిపోవటంతో... ఆ 'కెమేరా' పనిచేయటం మానేసింది.

"ఇప్పుడు చెప్పు...ఎవరు నువ్వు? ఖచ్చితంగా పోలీసువు కావు!"

"నిజమే సార్! నేను మీ విశ్వాస పాత్రుడైన కార్మీకుడు వెంకట్ ప్రసాద్ కొడుకు శంకరయ్యను. అదే నండి నా పేరు కూడా మీ పేరే"

"ఏ వెంకట్ ప్రసాద్?"

“నిజంగానే జ్ఞాపకంలేదా...మీ విజయవాడ ఫ్యాక్టరీలో 'స్టోర్ కీపర్’ గానూ, 'స్టాక్ టేకర్’ గానూ ఉన్నారే"

"ఆ ఆ...ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది! మీ నాన్నను ఉద్యోగం నుండి తీసేయబోతున్నామని తెలుసుకుని నా కాళ్ల మీద పడి క్షమించమని బ్రతిమిలాడటానికి వచ్చావా ఏమిటి?"

"లేదు సార్... ఆయన్నిఉద్యోగం నుండి తీసేసే పాపంలొ మీరు భాగం పంచుకోకండి అని చెప్పటానికి వచ్చాను"

"నన్ను కలవటానికి నువ్వు ఎంచుకున్న విధం తప్పుగా ఉన్నదనుకుంటుంటే...నా దగ్గర మాట్లాడే విధం కూడా తప్పుగా ఉన్నదే!"

"క్షమించండి సార్...మీదగ్గర చెడు అంతా మంచిగాను, మంచి అంతా చెడుగానూ, చెప్పబడుతోంది"

"ఇది ఎప్పుడూ ఉండే వాదమే. ఎవరూ వ్యత్యాసంగా మాట్లాడరా?"

"మీ అప్రోచ్ కూడా ఎప్పుడూలాగా ఒకటిగానే ఉన్నది! మీరే ఒక మార్పు కోసం, నాలాగ కొందరు చెప్పే విషయాల్లో నిజం ఉన్నదా...లేదా అని 'చెక్' చేసి చూడండి"

"ఇప్పుడు తప్పు ఎవరి పక్క?"

"మొదటి తప్పు మీ దగ్గరే సార్!"

                                                                    ఇంకా ఉంది.....Continued in PART-21 ***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి