17, ఫిబ్రవరి 2020, సోమవారం

ఆలయం(సీరియల్)...PART-19



                                                 ఆలయం(సీరియల్)
                                                           (PART-19)


ఇది మాత్రమే కాదు...నా కళ్ళెదుట ఎంతో మంది 'ట్రాఫిక్' పోలీసులు, 'లైసెన్స్ లేదు...అది లేదు...ఇది లేదు... అంటూ యాభై-వంద లాక్కుంటున్నారు. యాతన పెడతున్నారు. కరెంటు అప్పుడప్పుడు పోవటం, రావటం. వీటన్నింటినీ మేము, ఎందుకు నువ్వు కూడా క్షణ క్షణానికీ అనుభవిస్తున్న సమస్యలు.

వీటన్నిటి గురించి ఎవరూ ఏమీ పట్టించుకోరు. కానీ చూడు...మా ఇంటి దగ్గరలో ఒక కులానికి చెందిన నాయకుడి విగ్రహం ఉంది. దాని పక్కన ఎవడో ఉచ్చ పోసాడు. దాని కోసం మా ఏరియానే కలవర భూమిగా మారింది...ఎంతో నష్టం జరిగింది, తెలుసా?

విగ్రహాన్ని -- వాళ్ళ భాషలో చెప్పాలంటే ప్రాణం లేని ఆ రాయి పక్కన ఎవరో ఉచ్చ పోసారని అంత గొడవ చేశారు. అంత పెద్ద గొడవలో కనీసం 10 శాతం నేను చెప్పిన సమస్యల గురించి చేసుంటే...మన ఊరు ఎప్పుడో సింగపూర్, మలేషియా లాగ మారుంటుంది.

"ఇక్కడ ధరల పెరుగుదల గురించి ధర్నా చేయడం, మంచినీళ్ళు దొరకలేదంటే రోడ్డు రోకోలు చేయడం, అక్కడక్కడ జరుగుతున్నాయి...అంతే! ఇలాంటి ఒక సమాజంలో, ఒకటి డబ్బు, లేదంటే...అధికారం ఉండాలి. రెండూ లేకపోతే...నువ్వు రౌడిగా ఉండాలి. ఈ మూడు వర్గాలలోనూ చేరని వారైతే ప్రశాంతంగా నోరులేని జీవిగా ఉండటమే మంచిది. లేకపోతే మనకంటే బుద్ది లేని పిచ్చివాడు 'స్కోర్’ చేసుకుని వెళ్ళిపోతాడు. అందుకనే లోకంతో కలిసి వెళ్ళటం మంచిది అని చెబుతున్నా...అది తప్పా?"

రాజేష్ కుమార్ అలా అడిగిన తరువాత శంకరయ్య దగ్గర నుండి దానికి సరైన జవాబు లేదు. ఒకటి మాత్రం బాగా అర్ధమైయ్యింది. ఒక చెడు అందంగా ఇంకొక చెడుతో కలిసిపోతోంది. ఈరోజు తప్పు చేయటానికి ఎన్నో న్యాయాలు ఉన్నాయి. కానీ, మంచి చెయ్యటానికే చిన్న ప్రోత్సాహము కూడా లేదు అనేది శంకరయ్య కి అర్ధమైనప్పుడు అతనికి భవిష్యత్తే ఒకవిధమైన చీకటిగానే కనిపించింది.

లోపల మాలతీ కళ్ళు నలుపుకుంటూ కూర్చోనుంది. శంకరయ్య ఆ విల్లన్ 'పి.ఆర్.ఓ.'ని ఓడించటానికి రెడీ అయ్యాడు.

బెంగళూరు!

చల్లటి 'క్లైమేట్'...కానీ, అప్పుడే బస్సు దిగిన శంకరయ్యకి మాత్రం మనసు నిప్పులాగా వేడిగా ఉన్నది. ఎలాగో శ్రమపడి 'ఎం.డి’ శంకరయ్య అడ్రెస్సు తెలుసుకోగలిగాడు. ఆయన్ని కలిసి మాట్లాడాలి. జరిగిందంతా చెప్పి న్యాయం అడగాలనే తపన అతనిలో బుస కొడుతున్న పాములా వేచి ఉన్నది.

ఎంత దూరం అది విజయవంతమవుతుందో అనే దాంట్లో సందేహం,అనుమానం. అడ్రెస్సు కూడా కంపెనీకి చెందిన ఒక పై అధికారే ఇచ్చాడు.

"తమ్ముడూ...నేనే నీకు అడ్రెస్సు ఇచ్చేనని ఎవరికీ తెలియకూడదు. జాగ్రత్త!" -- అంటూ భయపడుతూనే ఇచ్చాడు. అదే శంకరయ్యను సగం కట్టేసింది. అయినాకానీ అతని యువ రక్తంలో నమ్మకం ఎక్కువగా ఉంది.

నాన్న ఒక ఏప్రిల్ మూర్ఖుడిగా ఉంటే, నేనూ అలాగే ఉండాలా ఏమిటి? ఒక లాడ్జిలో రూము తీసుకుని స్నానం చేసి, చిన్న 'ప్యాకెట్ రెకార్డర్’ తో 'ఏం.డి.' ని చూడటానికి బయలుదేరాడు.

"జాగ్రత్త బాబూ...! 'ప్రీయర్ అపాయింట్ మెంట్' లేకుండా ఆయన ఎవర్నీ చూడరు. ఒక వేల చూసినా 'కంపెనీ' గురించి 'ఫిర్యాదు అని చెబితేనే...' వెళ్ళి జి.ఎం. దగ్గర చెప్పు. దానికొసమే ఆయనకు జీతం ఇస్తున్నాము’ అని చెబుతారు.

'ఆయన దగ్గర చెప్పినందువలన ఎటువంటి ప్రయోజనమూ లేదు అని చెబితే...'అది నిరూపంచటానికి నీ వల్ల అవుతుందా?' అని అడుగుతారు. దగ్గర దగ్గర, 'దేవుడు ఉన్నాడు’ అని చెప్పేవాళ్ళు తమ వాదనను నిరూపించటానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. అది మాత్రమే కాదు...ఫిర్యాదు చేసిన ఐదో నిమిషం ఎవరి మీద ఫిర్యాదు చేశావో వాళ్లకు ఆ వార్త చేరిపోతుంది.

ఇలాగే ఈ రోజు వరకు జరుగుతోంది. అదే మా 'ఎం.డి. స్టైల్’. ఆయన తన సహచరులను అంటే టాప్ మేనేజ్ మెంటును అంత గొప్పగానూ, గుడ్డిగానూ నమ్ముతారు. అంతే కాదు...కార్మీకుడంటేనే తన కష్టం చెప్పుకునేవాడు, తృప్తి పడనివాడు, శ్రద్దగా పనిచేయకుండా మోసం చేసేవాడు అని ఆయన దగ్గర గట్టిగా చెప్పబడింది. కాబట్టి ఆయన దగ్గర ఈ నిజాలను అర్ధం అయ్యేటట్టు చెప్పడం అంత సులభం కాదు"

-----ఇలాగంతా ఆ అధికారే చెప్పాడు. ఆయనలో శంకరయ్యను తలచుకుంటే పాపం అనిపించింది.

ఒక మనిషి నిర్ణయించిన ఎత్తుకంటే ఎక్కువగా ఎదిగిపోతే, ఆ తరువాత అతని ఎత్తే అతనికి పగ అవుతుంది.

                                                              ఇంకా ఉంది.....Continued in PART-20 ****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి