13, ఫిబ్రవరి 2020, గురువారం

ఆలయం(సీరియల్)...PART-17




                                                  ఆలయం(సీరియల్)
                                                            (PART-17)


"ఈ రోజు ఏప్రిల్ ఒకటో తారీఖు! ఎవరో ఇతన్ని బాగా ఏమార్చి ఇలా చేసారు. 'కంపనీ లెటర్ ప్యాడ్' లో ఒక పేజీని దొంగలించి 'టైపు’ చేసి నకిలీగా సంతకం పెట్టి...ఓ....ఇది అతి పెద్ద తప్పు" అన్నాడు అకౌంట్స్ మేనేజర్.

'అకౌంట్స్ మేనేజర్’ తన వంతుకు ఒక వంతు పాడాడు. ప్రసాద్ కు అప్పుడు తెలిసింది ఆ రోజు ఏప్రిల్ 1-తారీఖని.

"వాట్ ఐ తింక్ ఈజ్...ఇతనే కూడా ఇలా చేసేసి మనలోని లోతును కొలిచి చూస్తున్నాడు అనుకుంటా"---'పి.ఆర్.ఓ.' యొక్క ఇంకో బాంబు వెంకట్ ప్రసాద్ గుండెల్లో గుచ్చుకున్నట్లు అయిపోయింది.

"సార్...నిజంగా లేదు సార్! ఈ రోజు ఏప్రిల్-1వ తేదీ అనేది జ్ఞాపకం లేదు" అంటూ కొంచం బెదురు చూపులతో చూశాడు ప్రసాద్.

"నో...నో...నువ్వు ఏమీ సరిలేవు. నీకు... ఈ 'కంపనీ' లోనే 'నువ్వొకడివే' బాగా పనిచేస్తున్నాను అనే పొగరు. అందుకే నువ్వుగా ఇలా ఒక 'ఆర్డర్న’ టైపు చేసి పెట్టుకున్నావు. నీకు నువ్వే మేనేజర్ ప్రమోషన్ ఇచ్చుకున్నావు! ఇది నిర్వాహానికి తెలిస్తే ఎక్కడికి పోయి ఆగుతుందో తెలుసా?"

"సార్...నిజంగా చెబుతున్నా సార్. నాకేమీ తెలియదు సార్. నేను, నా పని అని మాత్రమే అని ఉంటాను"

"ఇలాగంతా మాట్లాడితే సరిపోతుందా...నువ్వు చెప్పేది ఒకటి...చేసేది ఒకటి. దానికి ఈ నకిలీ 'ఆర్డరే' సాక్ష్యం."

"సార్...మళ్ళీ చెబుతున్నా! నాకూ, ఈ 'ఆర్డరుకూ' ఏ సంబంధమూ లేదు. నేను 'డిపార్టు మెంటు’ లోకి వచ్చినప్పుడు ఇది నా టేబుల్ మీద ఉన్నది" కొంచం గట్టిగా మాట్లాడాడు ప్రసాద్.

"ఏంటయ్యా వాయిస్ పెంచుతున్నావు... 'ప్రమోషన్ ఆర్డర్’ అనేది పిలిచి అభినందించి ఇవ్వవలసిన పెద్ద విషయం కదా...ఇలా టెబుల్ పైన ఉంటుందా?"

"నాకూ ఆ సందేహం వచ్చింది సార్. కానీ...?"

"ఏమిటి కానీ, గీనీ...? నువ్వు బాగా కథ చెబుతున్నావు. అందరినీ వెధవల్ని చేయాలని చూస్తున్నావు!"

"సార్...నేను ఎవర్నీ వెధవల్ని చెయ్యలేదు. నన్నే ఎవరో వెధవని చేసారు"

"ఇది ఇంకెవరి దగ్గరన్నా చెప్పు. బాధ్యతో నడుచుకోవలసిన నువ్వు...నకిలీగా ఒక 'ఆర్డర్’ తయారు చేసింది మొదటి నేరం. తరువాత, అందరినీ పిలిచి నీకు 'ప్రమొషన్’ వచ్చిందని నమ్మించడం రెండో తప్పు. మూడోది, మేనేజర్ సీటులో కూర్చున్నది. నాలుగోది, మమ్మల్ని ఎదిరించి మా దగ్గరే నేరాన్ని ఒప్పుకోకుండా మాట్లాడుతూనే ఉన్నది. దీనికంతా చేర్చి పెట్టి ఈ నిమిషమే నిన్ను 'సస్ పెండ్' చేస్తున్నాను. రేపు విచారణ పెట్టి నేరాలను నిరూపించి నిన్ను ఇంటికి పంపించే నేను మరో పని చేస్తాను. ఇప్పుడు నువ్వు బయలుదేరవచ్చు"

--'పి.ఆర్.ఓ.' న్యాయస్థానంలో మాట్లాడినట్టు మాట్లాడి ఆ నకిలీ 'ఆర్డర్’ ను చేతిలోకి తీసుకున్నాడు. వెంకట్ ప్రసాద్ కు అంతవరకు అనిచి పెట్టుకున్న కోపం అలాగే పెట్రోల్ పోసిన గుడ్డలో తగలబడిన నిప్పులా ఎగిసి పడటం మొదలుపెట్టింది.

"వద్దు సార్... నేను ఈ 'కంపనీ'ని ఒక ఆలయంలా భావిస్తున్నాను. మన 'చైర్మాన్’ నా వరకు దైవం. నన్ను అభినందించకపోయినా పరవాలేదు. ఇలా నామీద అపవాదు వేయకండి. ఎవరో నన్ను ఏప్రిల్ ఫూల్ చేశారు"

“నో ...నువ్వు ఒక మాట కూడా మాట్లాడకూడదు. మొదట చోటు ఖాలీ చేసి బయటకు పో. లేకపోతే...'సెక్యూరిటీ' ని పిలిచి పంపించ వలసి వస్తుంది"

ఆ బెదిరింపు మాటల తరువత ప్రసాద్ కు అక్కడ నిలబడటం ఇష్టం లేకపోయింది. ఆవేశాన్ని అనుచుకుని 'డిపార్ట్ మెంట్' నుండి బయలుదేరిన అతన్ని అక్కడున్న మొత్త కార్మీక గుంపు వెడుక చూసింది. అందరిలోనూ మేకు కొట్టినంత నొప్పి పుట్టింది. ఆ ఇద్దరి తోటి ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు ఎలా కావాలంటే అలా సమాధానం చెబుతారు అనే ఒక షాక్ తో ఉన్నారు.

వాళ్ళల్లో ఇప్పుడొక గుసగుసలు..."రేయ్ మామా! వెంకట్ ప్రసాద్ ని ఏప్రిల్ 'ఫూల్’ చేసి ఈ ఆఫీసర్ తెలివిగలవాడైయ్యాడే...ఈ 'కంపనీ' బాగుపడుతుందంటావా?"

"ఈ 'కంపెనీ' బాగుపడితే మనకేంటి...పడకపోతే మనకేంటిరా? ఇక మనం వేరే 'కంపెనీ' చూసుకోవలసిందే"

"ఎవడ్రా వీడు...? మనల్ని ఎవర్రా పనిలోకి రమ్మని పిలిచేది...? నువ్వేమన్నా బి.టెక్., ఎం.టెక్., చదివాను అనుకుంటున్నావా"

"అదే కదా...+2 పాస్ అవని వాళ్ళే లక్షల్లో ఉన్నారు. కానీ 'సర్వీస్’ అయిన బి.ఈ., ఎం.ఈ. వాళ్ళంతా బంగారంలాగా దొరుకుతున్నారు"

"చదువుకో వలసిన వయసులో చదువుకోకుండా పోయిన మనం....ఎంతో అనుభవంతో తెలివిగా ఉన్నా...బానిసల్లాగా అర్ధం లేకుండా దొరుకుతున్నామే మామా?" వాళ్ళ గొణుగుళ్ళను ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న యంత్రాల శబ్ధాలు అనిచివేశాయి.

ఫ్యాక్టరీ లోపల గూడు కట్టుకున్న పావురాలు అక్కడ జరుగుతున్న విషయాలను ఆనందంగా వేడుక చూస్తున్నాయి.

మనిషి జన్మ ఎత్తకుండా స్వతంత్రంగా ఉండే పావురాలుగా పుట్టిన సంతోషం కనబడుతోంది వాటి దగ్గర...

                                                               ఇంకా ఉంది.....Continued in PART-18 *************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి