7, ఫిబ్రవరి 2020, శుక్రవారం

ఆలయం(సీరియల్)...PART-15




                                                    ఆలయం(సీరియల్)
                                                            (PART-15)


“ఒకరికి ఎలాంటి గుణాలుంటే ఎలా నడుచుకుంటారో అనే మీ వివరణ ఒక పక్క ఉండనివ్వండి. ఈ మనిషి వలన నాన్నగారు విపరీతమైన మనో వేధనకు గురి అవుతున్నారు. ఆయన ఈ సమస్య లో నుండి బయట పడటానికి దారి చూపండి"---వెంకట్ ప్రసాద్ కొడుకు శంకరయ్య అడ్వకేట్ గోపీనాధ్ ను అడిగాడు.

"ఇదంతా తలరాత శంకరయ్యా! తల్లి, తండ్రి, గురువు...వీళ్ళ తరువాత యజమాని. ఆయన మంచివారు అయ్యుండటం వీళ్ళ అదృష్టం. వీళ్ళు ఆ యజమాని ప్రతినిధులు. దగ్గర దగ్గర వీళ్ళు కూడా యజమానుల లాగానే. వీళ్ళను అనుసరించి వెళ్ళాల్సిందే. వేరే దారి లేదు"

"ఏమిటి మామయ్యా...ఒక వకీలు అయ్యుండి ఇలా సమాధానం చెబుతున్నారు?" అన్నాడు ప్రసాద్.

“చట్ట ప్రకారం వీళ్ళను ఏమీ చెయ్యలేము ప్రసాద్. ఎందుకంటే ఆధారం పెట్టుకుని వీళ్ళెవరూ తప్పు చెయ్యరు. వీళ్ళ గుణగణాలను వివరించి కోర్టులో దండన ఇప్పించలేము. కానీ, వీళ్ళు మనసు పెడితే ఎవరినైనా దండిస్తారు. ఎందుకంటే...వీళ్ళ చేతిలో అధికారం ఉంది"

"తప్పు చెయ్యకుండా ఎలా దండన ఇవ్వగలరు?" ప్రసాద్ కొడుకు శంకరయ్య అడిగాడు.

"నువ్వు చిన్న పిల్లాడివి...నీకు అనుభవం చాలాదు. వీళ్ళు మనచేత తప్పు చేయించి దండన ఇప్పించగలరు"

"ఇదే ఆయుధాన్ని వాళ్ళ మీద మనం వేస్తే..."

"ఎలా...ఎలా?"

"అధికారులను తప్పు చేయనిచ్చి మనం దండన ఇప్పించలేమా?"

"ఎందుకు వేరుగా తప్పు చేయనివ్వటం! ఇప్పుడూ తప్పే చేస్తున్నారు కదా . కానీ, ఏమీ చేయలేకపోతున్నామే..."

"అరె...అవును కదా!"

"అందుకే కదా మొదటే చెప్పాను...నీకు అనుభవం చాలదని!"

"అయితే దీనికి ముగింపు..."

“మంచి మనుష్యులు అధికారులుగా రావాలి. మానవత్వంతో నడుచుకవాలి. ఇంతకంటే వేరే దారే లేదు"

అడ్వకేట్ మామయ్య సమాధానం వెంకట్ ప్రసాద్ కి కోపం తెప్పించింది.

"తప్పుగా చెబుతున్నారు మామయ్యా! మా ఆఫీసులో మంచి అధికారులు ఎంతోమంది ఉన్నారు. ఒకళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి అధికారులు అందరూ తప్పైన వాళ్ళని చెప్పద్దు"

"చూసావా శంకరయ్యా.....మీ నాన్నకు ఎంత కోపం వస్తోందో. మీ నాన్న విచిత్రమైన వ్యక్తి. మామూలుగా ఏ కంపనీలోనైనా రెండు రకాల మనుష్యులు ఉంటారు. ఒకళ్ళు అధికార యంత్రాగాన్ని ధైర్యంగా ఎదిరించేవారు. ఇంకొకళ్ళు అధికార యంత్రాగాన్ని మోసం చేస్తూ వారిని ఆదరిస్తునట్లు నటిస్తూ ఎదిరించేవారు. కానీ మీ నాన్న అధికార యంత్రాగాన్ని ఆదరించే మూడో కోవకు చెందిన వాడు. అందుకే ఇలా కోపగించుకుంటున్నాడు"

"కరెక్టుగా చెప్పారు...! కానీ, నాన్న చూపించే విశ్వాసం మీద మర్యాదే లేదే! యజమాని మీద విశ్వాసంగా ఉండటాన్ని సహ ఉద్యోగులే తప్పుగా మాట్లాడుతున్నారు...అధికారులు కూడా తప్పుగానే చూస్తున్నారు"

"అలాగే చూస్తారు! ఇరవై సంవత్సరాల వరకు మూర్ఖుడు గా ఉన్నా పరవాలేదు...దాన్నే విశ్వాసంగా తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు కాలం మారిపోయింది. ఇది 'హైటెక్' యుగం. విశ్వాసం కంటే తెలివితేటలకే మొదటి స్థానం"

"కొంచం అర్ధం అయ్యేటట్టు చెప్పండి..."

"అర్ధం అయ్యే లాగానా? సరే చెప్తా విను...ప్రతిభ గల ఉద్యోగిగా ఉండు. నిజాయతీ ఉద్యోగిగా ఉండు. అదే సమయం లోకజ్ఞానం తో తెలివిగలవాడివిగా ఉండు. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకటం...ఆ ఉద్యోగంలో లో చేరి కష్టపడటం పెద్ద విషయం కాదు. అందులో నిజాయతీ నిప్పు ఉండాలి. తప్పుగా ఎవరన్నా నడుచుకోవటానికి ప్రయత్నిస్తే...వాళ్ళను కాల్చే శక్తిగా మనం ఉండాలి. 'అధికారం లేదే...చాలా చిన్న పదవిలో ఉన్నామే' నన్న ఆత్మన్యూనతాభావం సహాయ పడదు. ఒక పరిశ్రమ యజమాని అయినా సరే... అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి అయినా సరే...వేరు వేరుగా వాళ్ళ విధులను చేస్తారు. ఉద్యోగంలోనే బేధాలు కానీ ఇంక దేంట్లోనూ బేధాలు ఉండవు. ఈ స్పష్టత తెలిసుండాల్సింది ముఖ్యం"

----మామయ్య చెబుతూ వెలుతున్నారు. వెంకట్ ప్రసాద్ కి అందులో చాలా విషయాలు అర్ధం కాలేదు. కానీ, ప్రసాద్ కొడుకు శంకరయ్య కి అర్ధమయ్యింది.

"ఇక నేను చూసుకుంటాను. నాన్న గారి విశ్వాసానికీ, నిజాయితీకీ ఆయనకు న్యాయంగా దక్కాల్సిన గౌరవ మర్యాదలు ఆయనకు దక్కేటట్టు చేస్తాను. ఇది నిశ్చయం" అన్నాడు శంకరయ్య.

కానీ, దాన్ని ఎలా సాధించబోతాడో అనేది మాత్రం పెద్ద క్వస్చన్ మార్కే!

ఆ మరుసటి రోజు వెంకట్ ప్రసాద్ ఆఫీసుకు వెళ్ళినప్పుడు అతనికి అక్కడొక ఆశ్చర్యం కాచుకోనుంది. ‘డిపార్ట్ మెంటు’లోకి వెళ్ళిన వెంటనే అతని టేబుల్ పైన 'ప్రమోషన్ ఆర్డర్’. అందులో 'ఆ రోజు నుండి అతనే మేనేజర్’ అనే 'ఆర్డర్’ ఉంది. జీతంలో సుమారు పన్నెండు వేలు ఎక్కువ రాసుంది.

మొదట్లో వెంకట్ ప్రసాద్ దాన్ని నమ్మలేదు. కానీ, 'కంపనీ' లెటర్ హెడ్ లో టైపు చేయబడ్డ లెటర్ లోని లైన్లు అతన్ని ఆశ్చర్యపరిచింది. అ లెటర్ తో పాటూ మరో లెటర్. అతను దేవుడు గా కొలిచే అతని 'చైర్మాన్’ శంకరయ్య గారు రాసిన లెటర్.

                                                                      ఇంకా ఉంది.....Continued in PART-16 ****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి