27, ఫిబ్రవరి 2020, గురువారం

ఆలయం(సీరియల్)...PART-24 (చివరి భాగం)
                                                      ఆలయం(సీరియల్)
                                                              (PART-24)      
                                                           (చివరి భాగం)


"వాళ్ళు మిమ్మల్ని చూడాలంటున్నారు"

"వద్దు...ఇలాంటి 'బిజినస్ డీల్’ అన్నిటినీ నువ్వే చూసుకో. 'కంపెనీ' లోపల ఇంకా చాలామంది వెంకట్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఉన్నారు! ఇది చెడ్డ కాలం. ఒక 'సెల్ ఫోన్ కెమేరా' చాలు. వీడియో తీసి పంపించటానికి..."

"అవన్నీ నాకూ తెలుసు! 'ప్రొడక్షన్ మిషెన్’ నుండి 'డిస్పాచ్' లారీ డ్రైవర్ వరకు అందరూ మన మనుషులే. అందరికీ జీతానికి పైన కమీషన్. ఇలా ఉండంగా ఎలా సమస్య వస్తుంది?"

"మంచిది! అదే సమయం 'కంపెనీ టర్న్ ఓవర్ తగ్గినట్లు ఎవరూ అనుకోకూడదు. ఆ మిగతా కోటి రూపాయల 'ఆర్డర్ను’ పక్కాగా 'బిల్లు’ వేసి కరెక్టుగా పంపించండి"

"నాయకా...మీరు సరే నని మాత్రం చెప్పండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను"

---'క్యాంటీన్ లో టిఫిన్ తిని ముగించేలోపు కోటి రూపాయల 'బిజినస్’ ను మాట్లాడి ముగించారు. 'క్యాంటీన్ సూపర్ వైజర్’ చెవిలో వీళ్ళు మాట్లాడుకున్నది చూచాయిగా వినబడింది. కానీ, వెంకట్ ప్రసాద్ కు పట్టిన గతి జ్ఞాపకమొచ్చింది. తన చెవులను వేరే వైపుకు తిప్పుకున్నాడు అతను.

మరుసటి రోజు!

విఠల్ రావ్ రూము లోని 'ఇంటర్ కాం' మోగింది.

"సార్...నేను 'అకౌంట్స్ మేనేజర్’ మాట్లాడుతున్నాను"

"ఏంటయ్యా...?"

“ఇద్దరు సర్దార్జీలూ 'ఓ.కే.' చెప్పేశారు. అదే సమయం వాళ్ళ నా మాటల్ను మాత్రం నమ్మి బిజినస్ చేయటానికి రెడిగా లేరట. 'జి.ఎం.' అని ఇప్పుడు ఎవరూ లేరు. ప్రస్తుతం అంతా మీరే! నని చెప్పాను. 'అయితే ఆయన్ను మేము చూసే తీరాలి' అని మొండికేస్తున్నారు"

"అలాగైతె, 'ఈ రోజు సాయంత్రం ఏదైనా హోటల్లో కలుసుకుందాం' అని చెప్పండి. ఇక్కడొద్దు"

"సాయంత్రం 'ఫ్లైట్' లో వాళ్ళు ఢిల్లీ వెళ్ళాలట. టైము లేదు అంటున్నారు".

"ఏమిటయ్యా...వదలనంటున్నావు! 'ప్రొడక్షన్ మేనేజర్’ ను పెట్టుకుని మేనేజ్ చెయ్యి"

“ఆ తరువాత ఆ మనిషి కూడా 'కమీషన్’ అడుగుతాడు. ఇదికాక వెంకట్ ప్రసాద్ ను మనం అన్యాయంగా తీశేసేమని నలుగురైదుగురి దగ్గర గొణిగున్నాడు అతను"

"సరే...నువ్వు అక్కడే ఉండు. నేనొస్తాను"

సగం మనసుతో తన కుర్చీలో నుండి లేచిన విఠల్ రావ్, ‘అకౌంట్స్ మేనేజర్’ గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న సర్ధార్ జీలు బలమైన ‘గుడ్ మార్నింగ్’ తో లేచి నిలబడ్డారు. కూలింగ్ గ్లాస్, టర్బన్, బుగ్గలమీద మొటిమ అని భయం పుట్టించే రూపం.

"సర్దార్ జీ...సారే 'మిస్టర్’ విఠల్ రావ్. కొత్త 'పి.ఆర్.ఓ.'! చాలా ధైర్యవంతుడు. మా 'చైర్మాన్’ ఈయన దగ్గరే ఫ్యాక్టరీ, బిజినస్ పూర్తి భాధ్యత అప్పగించారు"

"ఒక 'పి.ఆర్.ఓ.'కు అంత బాధ్యత ఇచ్చారంటే నమ్మలేకపోతున్నాం...?"….ఒక సర్ధార్ జీ చిన్నగా తన అనుమానం వెలిబుచ్చాడు.

"వాస్తవమే! ఈ 'ఫ్యాక్టరీ' వర్కర్స్ అందరూ ఒక 'టైప్'. ఇక్కడ 'లేబర్’ అంతా కొంచం మొరటోళ్ళు. వాళ్ళను ఎదుర్కునే ధైర్యం ఈయనకు మాత్రమే ఉంది. 'పి.ఆర్.ఓ.' పోస్టింగ్ ఒక పేరుకే. అదిపోతే దగ్గర దగ్గర ఒక మేనేజింగ్ డైరక్టర్"

"ఓ...వెరీ గుడ్! రేపు మాకు సరకు పంపించటంలో సమస్య ఏదీ రాదుగా?"

"అందంతా రాదు.

అయితే డీల్ ఓ.కే...పార్టీ చేసుకుందాం. మీకు ఆక్షేపణ లేకపోతే ఇప్పుడు కొంచం 'డ్రింక్స్ తీసుకుందామా?"

"ఇక్కడేనా...సారీ! మా ఫ్యాక్టరీలో అంత సంప్రదాయం లేదు"

"ఏమిటి సార్ మీరు! మా బ్యాగులో ఒక ఫారిన్ బాటిల్ ఉంది. 'జస్ట్ ఒక పెగ్గు..."

---మాట్లాడుతూనే ఒక సర్ధార్ జీ బ్యాగు తెరిచి బాటిల్, దాంతో పాటు గాజు గ్లాసులు బయటకు తీశాడు...వాటిని చూసిన మరు క్షణం విఠల్ రావ్ కళ్ళు రెండూ వెయ్యి వాట్స్ బల్బులాగా ప్రకాశవంతమైనై.

'బ్లక్...బ్లక్...'

"ఆ ద్రవం బాటిల్ ను వదిలి గ్లాసుల్లోకి దిగినప్పుడు, ఆ తరువాత విఠల్ రావ్ గొంతులోకి దిగినప్పుడు, ఆ తరువాత హెచ్చరిక, క్రమశిక్షణ...ఇవన్నీ మెల్ల మెల్లగా ఆయన్ని విడిచిపెట్టగా...ఆయనలో ఉన్న మృగం బయటకు రావటం మొదలుపెట్టింది.

మధ్యం తాగుతున్నట్టు ఇద్దరు సర్ధార్ జీలూ మౌనంగా చూస్తున్నారు. కొంత సమయం గడిచిన తరువాత విఠల్ రావ్, అకౌంట్స్ మేనేజరూ అలాగే టేబుల్ మీద మత్తుతో పడిపోయారు. అప్పుడు...కూలింగ్ గ్లాసు వేసుకున్న సర్ధార్ జీ తన టర్బన్ ను తీశేసి, గడ్డం తీశేసి, బుగ్గ మీద ఉన్న మొటిమను తీసేసి 'ఎం.డి.' శంకరయ్య గా తల ఎత్తగా, పక్కనున్న సర్ధార్ జీ కూడా తన వేషాన్ని తీశేశాడు. అది వెంకట్ ప్రసాద్ కొడుకు శంకరయ్య!

'ఎం.డి.' శంకరయ్య ఆ మేధావి శంకరయ్యను కన్నీటితో చూశాడు. ఆ తరువాత ఒక విధమైన పరవసంతో అతన్ని కౌగలించుకున్నాడు.

అలాగే, "తమ్ముడూ...నువ్వు అనుకున్నది సాధించావు! నా 'కంపెనీ' ని కూడా కాపాడావు..." అంటూ అతని చేతులు పుచ్చుకుని వూపారు.

"ఇది చాలా పాత యుక్తి సార్. దీనికి మీరు ఒప్పుకున్నందు వలనే మీరు నిజాన్ని నేరుగా తెలుసుకో గలిగారు. ఇక మీదట మీరు 'రెగులర్’ గా 'కంపెనీ' కి వస్తూ ఉంటే ఇలా సర్ధార్ జీ గా మారాల్సిన అవసరం రాదు సార్. మా నాన్న కూడా ఏప్రిల్ ఫూల్ అయ్యుండరు" అన్నాడు అతను కూడా.

"నువ్వు చెప్పింది కరెక్టే! ఈ ద్రోహులకు శిక్చ...ఒక చెత్త తీసుకువెళ్ళే బండిని రమ్మని దాంట్లో వీళ్ళను పడేసి బయట పడేద్దాం...ఆ తరువాత మీ నాన్నను వెళ్ళి చూద్దం. రా...!

"సార్... వీళ్ళను మాత్రమే కాదు; చాలా పాత సంప్రదాయాలూ, కళ్ళు మూసుకుని చేసే కొన్ని పనులను కూడా చెత్త బండీలో ఎక్కించాలి. ఒక 'సాధారణ’ మెకానిక్ తన అర్హతను పెంచుకుంటే మేనేజర్ వరకు ఎదగవచ్చు అనే కొత్త రూల్ ను మీరు తీసుకురావాలి. కఠిన శ్రమకు మాత్రమే ఇక్కడ మర్యాద ఉంటుంది. మోసపూరిత 'గుడ్ మార్నింగ్' లకు ఇక్కడ చోటు లేదు అనేది తీసుకురావాలి సార్"

---- శంకరయ్య లోని యువ రక్తంలో కొత్త ఆలొచనలు ఉత్సాహంగా బయటపడ్డాయి.

"నువ్వే ఇక కొత్త 'పి.ఆర్.ఓ.'! ఏ ఆలొచనా నా దగ్గర చెప్పకు...చేసి చూపించు. నా అనుభవం, ఆశీర్వాదం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది"-అన్న 'ఎం.డి.' శంకరయ్య ఆ గదిలోనుంచి బయటకు వచ్చారు. ఆయనతో ప్రసాద్ కొడుకు శంకరయ్య.

ఇద్దర్నీ హఠాత్తుగా అక్కడ చూసిన అందరూ నోరు వెళ్ళబెట్టారు. వాళ్ళకు తెలియదు... జరిగిందేమిటో; జరగబోయేదేమిటో!

                                                             సమాప్తం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి