3, మే 2020, ఆదివారం

కరోనా వైరస్ కు కారణం వుహాన్ వైరాలజీ ల్యాబే: నమ్మడానికి కారణాలు...(ఆసక్తి)

          కరోనా వైరస్ కు కారణం వుహాన్ వైరాలజీ ల్యాబే: నమ్మడానికి కారణాలు
                                                               (ఆసక్తి)


"మేము వైరస్‌తో పోరాడటమే కాదు, కుట్ర సిద్ధాంతాలతో కూడా పోరాటం చేస్తున్నాం. కుట్ర సిద్ధాంతాలు భయం, పుకార్లు మరియు పక్షపాతాన్ని సృష్టించడం తప్ప ఇంకేమీ చేయవు" అని వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఆ ప్రతినిధి కరోనావైరస్-19 వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి వుహాన్ నడిబొడ్డున ఉన్నఅతని వైరాలజీ ల్యాబే దీనికి కారణం కావచ్చు అని పెరుగుతూ వస్తున్న జనాదరణను అణిచివేయటానికి ప్రయత్నిస్తున్నాడు.

ఒక విధంగా, అతను సరైనపనే చేస్తున్నాడు. సంక్షోభ సమయంలో, ఎవరైనా చేయాకూడదనుకునే చివరి విషయం భయాన్ని వ్యాప్తి చేయడం - ముఖ్యంగా నిరాధారమైన పుకార్లను.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35,00,000 మందికి సోకి, దాదాపు 2,45,000 మందిని బలితీసుకున్నా, ఇంకా దాహం తీరనట్లు ప్రపంచ ప్రజలనూ, ఆరోగ్య శాఖ నిపుణులనూ భయపెడుతునే ఉన్న ఈ అంటువ్యాధి వుహాన్ వైరాలజీ ల్యాబ్‌లో ప్రారంభమైందనే వాదనలను మనం చూడటం ప్రారంభించినప్పుడు, ఇది కుట్ర సిద్ధాంతంలా అనిపించడం లేదు. దీన్ని కుట్ర సిద్ధాంతంగా కాకుండా వివరణతో చూడటం మొదలుపెడితే - అలాగే దానిని పరిశీలించడానికి సమయం తీసుకుంటే, ఇలాంటివి మళ్లీ జరగకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.

ఆ వీధిలో ఉన్న వైరాలజీ ల్యాబ్ నుండే వ్యాప్తి ప్రారంభమైంది.

అధికారిక కథ ఏమిటంటే, కరోనా వైరస్-19, వుహాన్ లోని ఒక సీఫుడ్ మార్కెట్లో ప్రారంభమైంది. అక్కడ విక్రయించిన అపరిశుభ్రమైన జంతువులు ఆ వైరస్ ను మోస్తున్నాయని, చైనా శాస్త్రవేత్తలు సూచించారు. ఫలితంగా, ఆ మార్కెట్టులో ఉన్న కొంతమంది దురదృష్టకరమైన దుకాణదారులు కరోనా వైరస్-19 ప్రపంచ సంక్షోభానికి 'జిరో'(మొదటి) రోగులుగా మారారు.

మీరు ఇంతకు ముందే ఈ వివరణను విని ఉంటారు. దానిని వాస్తవంగా కూడా అంగీకరించే అవకాశం ఉంది - కాని ఈ వివరణతో కొన్ని స్పష్టమైన సమస్యలు ఉన్నాయి. ఒక విషయం ఏమిటంటే, కరోనా వైరస్-19 (+ పాజిటివ్) ఉన్న మొదటి రోగులకు ఆ మార్కెట్‌తో ఎటువంటి సంబంధం లేదు. ఆ 'జీరో' (మొదటి) రోగులు మార్కెట్టుకు సమీపంలో నివసిస్తున్నారు. వీళ్ళు మార్కెట్టుకు వెళ్ళే వాళ్ళకు ఈ వ్యాధిని వ్యాప్తి చేసినట్లు కనిపిస్తోంది. కానీ నిజమైన ఆ 'జీరో' (మొదటి) రోగులు ఆ మార్కెట్టు లోపలికి అడుగు పెట్టలేదట.

అలాగే, కరోనా వైరస్-19 గబ్బిలాలలో ఉద్భవించిందని నమ్ముతున్నారు - మరియు ఆ వైరస్, సీఫుడ్ మార్కెట్ లో నుండి వచ్చిందని చెబుతున్నారు. నిజానికి ఈ మార్కెట్ లోపల ఎవరూ గబ్బిలాలు అమ్మటంలేదట. వుహాన్ లోని ప్రజలు గబ్బిలాలు తినరట.

చైనా శాస్త్రవేత్తలు కూడా ఈ సిద్ధాంతానికి దూరంగా ఉండటం ప్రారంభించారు. ఎందుకంటే “వైరస్ వ్యాప్తి చెందడానికి సీఫుడ్ మార్కెట్ మాత్రమే కారణం కాదు అని స్పష్టంగా అనిపిస్తోంది ... నిజం చెప్పాలంటే, వైరస్ ఎక్కడ నుండి వచ్చిందో మాకు ఇంకా తెలియదు" అని అని చెబుతున్నారట.

చాలా మంది సీఫుడ్ మార్కెట్ కు కేవలం 30 నిమిషాల డ్రైవ్ దూరంలో ఉన్న ‘వుహాన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ వైరాలజీ’ వైపు చెయ్యి చూపుతున్నారట. “ఇది మీకు సరిపోకపోతే, గబ్బిలాలలో కరోనా వైరస్లను పరిశోధించే మరో ప్రయోగశాల ‘వుహాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్’ ఉంది. ఇది సీఫుడ్ మార్కెట్ కు మరింత దగ్గరగా అదే వీధిలో మరో వైపు ఉంది” అంటూ దాని వైపు చెయ్యి చూపుతున్నారట.

వుహాన్ వైరాలజీ ల్యాబ్ లోనే గబ్బిలాలలోని కరోనావైరస్ లను స్టడీ చేస్తున్నారు.

వుహాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ & ప్రివెన్షన్ కేవలం పరిపాలనా కార్యాలయం కాదు. ఆ భవనం లోపల శాస్త్రవేత్తలు చురుకుగా చాలా పరిశోధనలు చేస్తున్నారు - గబ్బిలాలలో కరోనావైరస్లపై అధ్యయనాలతో సహా.

వుహాన్‌లో చాలా మంది శాస్త్రవేత్త పరిశోధకులు ఉన్నారు. ఇది నగరానికి ఒక పెద్ద ప్రాజెక్ట్, మరియు వుహాన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ వైరాలజీ చాలా గర్వపడే ప్రాజెక్ట్. SARS వైరస్ యొక్క కారణాలను పరిశోధించడంలో వారు ముందంజలో ఉన్నారు, మరియు చివరి SARS వైరస్ వ్యాప్తి గబ్బిలాలలో ఉద్భవించిందని అక్కడి పరిశోధకులే ప్రపంచానికి నిరూపించారు.

వాళ్ళు పరిశోధనలు చేయడానికి కరోనావైరస్ సోకి చాలా అనారోగ్యంతో ఉన్న గబ్బిలాలను చూడవలసి వచ్చింది. కరోనావైరస్ సోకిన గబ్బిలాలను అక్కడి పరిశోధకులు కనీసం 2012 నుండి సేకరిస్తున్నారు మరియు వారు వాటి అనారోగ్యాన్ని మానవులకు వ్యాప్తి చేయగల వాటిపై దృష్టి సారించారు.

కరోనా వైరస్-2019 వ్యాప్తి ప్రారంభమైనప్పుడు వుహాన్ ల్యాబ్‌లలో వందలాది గబ్బిలాలు ఉన్నాయి. అక్కడి పరిశోధకులు వాటిలో కనీసం 11 కొత్త SARS- సంబంధిత వైరస్లను అధ్యయనం చేస్తున్నారు. అవును కరోనా వైరస్-2019- వ్యాప్తి ప్రారంభమైన ప్రదేశం నుండే వారు పరిశోధనలు చేస్తున్నారు.

కరొనా వైరస్-2019 అనేది వుహాన్ వైరాలజీ ల్యాబ్‌లోని గబ్బిలాల వైరస్ తో 96 శాతం మ్యాచ్ అవుతోందట.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనావైరస్ “నావల్” అని పిలువబడుతోంది. ఎందుకంటే ఇది ప్రత్యేకమైనది. ఇది SARS వైరస్ వంటి గత వ్యాధుల నుండి సుమారు 30 శాతం భిన్నంగా ఉంటుందట.

ఇది మన ఊహల నుండి తీసిన సంఖ్య కాదు. శాస్త్రవేత్తలు SARS యొక్క జన్యు క్రమాన్ని కరోనా వైరస్-2019 తో పోల్చి చూసినప్పుడు, రెండూ 70% పోలికలు కలిగి ఉన్నాయని వారు కనుగొన్నారు.

ఇది ఉజ్జాయింపు సంఖ్య - అసలది కొంచెం ఎక్కువగా కూడా ఉండవచ్చు. వాస్తవ సంఖ్య బహుశా 96 శాతం అయ్యుండచ్చు - ఇది ఇప్పుడు వ్యాపించిన కరోనా వైరస్-2019 కీ, వుహాన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ వైరాలజీ లోపలకు తీసుకువెళ్ళే గబ్బిలాలలో ఉన్న కరోనావైరస్ మధ్య శాస్త్రవేత్తలు కనుగొన్న శాతం. కరోనావైరస్ యొక్క స్వరూపం.

“అయితే ఒక్క నిమిషం ఆగండి” అని మీరు అంటున్నారు. "ఆ గబ్బిలాలు వైరస్ కలిగి ఉంటే, వుహాన్ చుట్టూ గబ్బిలాలు ఉండవచ్చు - కరెక్టే కదా?"

భయం అవసరం లేదు. ఇప్పుడు వ్యాపించిన కరోనా వైరస్-2019, సాధారణ గబ్బిలాలలో ఉండే కరోనావైరస్లతో సమానంగా ఉండదు - ఇది వుహాన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ వైరాలజీలోని ప్రత్యేకమైన గబ్బిలాల జాతికి సమానంగా ఉంటుంది. ప్రతి గబ్బిలం కరోనావైరస్కు 96 శాతం మ్యాచ్ అవదు - వాస్తవానికి, మరొక ప్రయోగశాల కరోనా వైరస్-2019 ని తమ సొంత గబ్బిలాలతో పోల్చినప్పుడు, వారు కనుగొన్న దగ్గరి మ్యాచ్ 88 శాతం.

గబ్బిలాలు స్థానికంగా లేవు. మీరు వుహాన్లో నివసిస్తుంటే మరియు మీరు నిజంగా ఆ గబ్బిలాలలో ఒకదాన్ని కనుగొనాలనుకుంటే, ఒకటి మీరు వైరాలజీ ల్యాబ్‌కు వెళ్లాలి లేదా ఆ గబ్బిలాలు ఉండే ప్రదేశానికి వెళ్లాలి: అంటే యునాన్ మరియు జెజియాంగ్ నగరాలకు.

ఆ రెండు నగరాలూ వుహాన్ నగరానికి 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

వ్యాప్తి చెందడానికి కొద్దిసేపటి క్రితం ఒక పరిశోధకుడిపై కరోనా వైరస్-2019 సోకిన ఒక గబ్బిలం నుండి రక్తం పడ్డదిట.

సరే, ఒక వ్యాధి పడ్డ ప్రయోగశాల, వ్యాధులపై పరిశోధన చేస్తోంది. అయితే ఏంటి? అది ల్యాబ్ నుండి బయటకు వచ్చిందని రుజువు లేదు - సరేనా ?

వుహాన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ వైరాలజీ ఉద్దేశపూర్వకంగా తన సొంత ప్రజలను భాదపెడుతుందా? కానీ ఎవరైనా దానిని ప్రమాదవశాత్తు అంటించుకోవడం నిజంగా కష్టమేమి కాదు.

ఒక గబ్బిలం ఒక పరిశోధకుడిపై దాడి చేసి, గందరగోళంలో, దాని రక్తాన్ని అతని బేర్ చర్మంపై చిందించినట్లయితే. లేదా అతను కొంచెం దగ్గరగా ఉండి, అతని శరీరంపై గబ్బిలం యూరిన్ పడుంటే. లేదా కరోనా వైరస్-2019 వ్యాప్తి ప్రారంభించటానికి ముందు ఆ రెండు విషయాలు ఒకేసారి ఒకే వ్యక్తికి జరిగిందని ఊహించుకోండి.

అదే జరిగింది. చైనా పరిశోధకులు బొటావో మరియు లీ జియావోల నివేదిక ప్రకారం, జున్హువా టియాన్ అనే పరిశోధకుడు ఈ ఖచ్చితమైన అనుభవాలను చాంగ్‌జియాంగ్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్ వ్యూలో వివరించాడట.

జున్హువా టియాన్ ఈ వ్యాధిని వ్యాప్తి చేయకుండా ఉండటానికి తనని తాను వేరుపరచుకుని నిర్బంధించుకున్నానని పేర్కొన్నాడు - కాని అతను మరియు అతని సహచరులు సాధ్యమయ్యే ప్రతి ముందు జాగ్రత్తలు ఉపయోగించినప్పటికీ, వైరస్ ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది.

వ్యాప్తి చెందినప్పటి నుండి మేము నేర్చుకున్న ఒక విషయం ఏమిటంటే, ప్రజలు ఎటువంటి లక్షణాలను చూపించలేకపోయినా, అప్పటికీ వ్యాధి బారిన పడుంటారు. మరియు, జపాన్ నుండి ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, కోలుకున్న వ్యక్తులు కూడా వైరస్ను మోస్తున్నారు.

SARS వైరస్ రెండుసార్లు బీజింగ్ ల్యాబ్ నుండి తప్పించుకుంది.

వాస్తవానికి, వుహాన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ వైరాలజీలోని సిబ్బంది, సాధ్యపడే ఏ ముందు జాగ్రత్తలను సరిగ్గా వాడలేదు.

చైనీస్ వైరాలజీ ల్యాబ్ నుండి ఘోరమైన అంటువ్యాధి అనారోగ్యంతో ఒకరు బయటకు వెళ్ళడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా జరిగింది - వాస్తవానికి, అలా ఒకే నెలలో రెండుసార్లు జరిగింది.

ఏప్రిల్ 4, 2004 న, బీజింగ్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో పనిచేస్తున్న పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థినికి SARS వైరస్ నిర్ధారణ జరిగింది. వైరస్ గురించి పరిశోధన చేస్తున్నప్పుడు ఆమె వ్యాధి బారిన పడింది, మరియు ఆమె అనారోగ్యంతో ఉందని తెలియక, ప్రజలలోకి వెళ్ళిపోయింది. అది దాదాపు రెండవ వ్యాప్తికి కారణమైంది.

ఇది చాలా చెడ్డపని - కాని చాలా భయానకమైనది ఏమిటంటే, రెండు వారాల తరువాత, అదే ప్రయోగశాలలో పనిచేస్తున్న మరొక పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ఖచ్చితంగా అదే పని చేసాడు.

అది నిర్లక్ష్యం మాత్రమే కాదు. శాస్త్రవేత్త ఆంటోయిన్ డాన్చిన్ ప్రకారం, ఇది సాంకేతికంగా అసాధ్యం కూడా.

"సాధారణంగా, భద్రతా నియమాలను పాటిస్తే, రెండవ స్థాయి నిర్బంధంలో ఉన్నవారిని కూడా కలుషితం చేయడం సాధ్యం కాదు" అని ఆ సంఘటన తర్వాత ఆయన అన్నారు. "ఏదో తప్పుగా నిర్వహించబడిందని ఇది సూచిస్తోంది."

"ల్యాబ్‌లో అన్ని సరైన నియమాలు ఉండవచ్చు, కాని అక్కడ పనిచేస్తున్నవారు దీనిని పాటించి ఉండకపోయుండచ్చు"

వుహాన్ వైరాలజీ ల్యాబ్ కరోనా వైరస్-2019 కి సరిపోయే వైరస్ను పరీక్షిస్తోంది.

ఏదైనా సందేహం ఉంటే ఇది తెలుసుకోండి, వుహాన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ లో ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు సిబ్బందిగా ఉన్నారట.

దానిని ధృవీకరించగలము అని చెబుతున్నారు. ఎలాగంటే, నవంబర్ 18, 2019 న, బ్రేక్ అవుట్ కు కొద్దిసేపటి ముందు, ఇన్స్ టి ట్యూట్ అధికారులు ఒక జాబ్ పోస్టింగ్ పెట్టారు. మానవులలోనూ మరియు గబ్బిలాలలోనూ కరోనావైరస్ అధ్యయనం చేయటానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను సహాయం చేయమని కోరుతూ పెట్టిన జాబ్ పోస్టింగ్ అది.

ఇది సాధారణమైన ఉద్యోగ ప్రకటన కాదు - ఎందుకంటే ఉద్యోగ పోస్టింగ్‌లోని వివరణ కొద్దిగా కలవరపెడుతుంది. కరోనావైరస్ లక్షణాలు లేకుండా ఎక్కువ కాలం నిద్రాణమై ఉండటానికి వీలు కల్పించే పరమాణు యంత్రాంగాలపై వారు ప్రత్యేకించి ఆసక్తి కనబరిచాలని అది పేర్కొంది.

అర్ధమైందా? ఇది కరోనా వైరస్-2019 యొక్క ప్రత్యేక లక్షణాలలో ఒకటి - ప్రజలు స్పష్టమైన లక్షణాలు లేకుండా చుట్టూ తిరగవచ్చు మరియు దానిని ఇంకా వ్యాప్తి చేయవచ్చు.

డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లోని 322 మందిని పరీక్షించారు. వారిలో ఎవరికీ కరొనా వైరస్-2019 సోకిన లక్షణాలే కనిపించలేదు. కానీ, వారిని సానుకూలంగా పరీక్షించారు. వారందరికీ కరోనా వైరస్-2019 ఉన్నదని పరీక్షలలో తెలిసింది. కానీ వాళ్ళకు లక్షణాలే లేవు. లక్షణాలే లేని షిప్ లోని వ్యక్తులు ఈ వ్యాధిని వ్యాప్తి చేయగలరని రుజువు ఉంది. వాస్తవానికి, ఒక మహిళ వైరస్ లక్షణాలను చూపించకుండా (Asymptomatic) కనీసం ఐదుగురు వ్యక్తులకు కరోనా వైరస్-2019 ని వ్యాప్తి చేసినట్లు నిర్ధారించబడింది.

ల్యాబ్‌లోని పరిశోధకులు ఇటీవల ఒక కొత్త కరోనావైరస్ను సృష్టించారు.

వుహాన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ వైరాలజీలోని సిబ్బంది కేవలం నివారణపై మాత్రమే పని చేయలేదు. వారు తాము సొంతంగా అభివృద్ధి చేస్తున్న కొత్త, సూపర్ వైరస్ల పై కూడా సమయం గడిపారు.

2015 లో, ఇన్స్ టి ట్యూట్ లో ఇద్దరు పరిశోధకులు అమెరికన్ శాస్త్రవేత్త రాల్ఫ్ బారిక్ నేతృత్వంలోని అంతర్జాతీయ ప్రయోగంలో పాల్గొన్నారు. లక్ష్యం? మానవులకు సోకే సామర్థ్యంతో కొత్త కరోనావైరస్ సృష్టించడం.

అది మీకు విచిత్రమైన లక్ష్యం అనిపిస్తే, మీరు ఒంటరిగా లేరు. ఈ ప్రయోగానికి శాస్త్రీయ సమాజంలో గణనీయమైన భాగం ఆగ్రహం వ్యక్తం చేసింది.

"ఈ పని యొక్క ఏకైక ప్రభావం ప్రయోగశాలలో, కొత్తగా ఉత్పత్తిచేసే, సహజేతర ప్రమాదం సృష్టించడం" అని జీవశాస్త్రవేత్త రిచర్డ్ ఎబ్రైట్ తన నిరసన వ్యక్తం చేశారు.

ఫ్రెంచ్ వైరాలజిస్ట్ సైమన్ వైన్-హాబ్సన్ అంగీకరించారు. "వైరస్ తప్పించుకుంటే, దాని వలన ఏర్పడే ప్రమాదం ఎవరూ ఊహించలేరు" అని హెచ్చరించారు.

కరోనా వైరస్-2019 కి HIVకి విరుద్ధ పోలికలు ఉన్నాయి.

భారతదేశం వెలుపల వివాదాస్పద అధ్యయనం ప్రకారం, కరోనా వైరస్-2019 యొక్క కొన్ని అంశాలు HIV కీ “అసాధారణమైన సారూప్యతలు” కలిగి ఉన్నాయి.

పూర్తి బహిర్గతం - ఈ అధ్యయనం న్యాయమైన పరిశీలనను పొందింది. కొంతమంది శాస్త్రవేత్తలు ఇది గణాంకపరంగా ప్రాముఖ్యతనిచ్చేంత డేటాను ఉపయోగించారా అని ప్రశ్నించారు, మరియు వారు దానిని వస్తువుల ద్వారా వ్యాపిస్తుందా అని అడిగారు. ఈ సమయంలో, అధ్యయనం యొక్క శాస్త్రవేత్తలు వారి పనిని ఉపసంహరించుకున్నారు.

వారి పరిశోధన నిరూపించ బడనప్పటికీ, అది తప్పుగా చేసేరని అర్ధం కాదు - దానికి తగిన ఆధారం లేదు. HIV మందులు చికిత్సలో చాలా ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు అవుతున్నాయి మరియు చాలా మంది రోగులులో తక్కువ తెల్ల రక్త కణాల సంఖ్యను చూపిస్తున్నాయి - ఇది ఏ ఇతర రకాల కరోనావైరస్లతో జరగటంలేదు.

ఇది గగుర్పాటు కలిగిస్తోంది - ఎందుకంటే వుహాన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ వైరాలజీ లోని పరిశోధకులు SARS వైరస్ - కరోనా వైరస్ - HIV వైరస్ కలిపి గబ్బిలాలలోనూ మరియు మానవులలోనూ అధ్యయనాలు నిర్వహించారు.

కరోనా వైరస్-2019 అనేది మానవ నిర్మిత వైరస్ అని చెప్పటానికి కఠినమైన రుజువు లేదు - కాని శాస్త్రవేత్తలు ఎప్పుడైనా దానికి రుజువు కనుగొంటే, ఆందోళన చెందడానికి చాలా కారణాలు ఉన్నాయి.

కమ్యూనిస్ట్ చైనా ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండాలని ఆదేశించింది

అంటు వ్యాధి నిపుణుడు డేనియల్ లూసీకి కరోనా వైరస్-2019 విస్ఫోటనం అయినప్పుడు చైనా వద్ద ఉన్న పత్రాలు మరియు డేటాను సమీక్షించే అవకాశం లభించింది. అతను గందరగోళంతో బయటకు వచ్చాడు. చైనా దేశం చేసిన అధికారిక కథ, అర్ధం లేనిది అని ఆయన అన్నారు.

"వుహాన్ సీఫుడ్ మార్కెట్లో అంటువ్యాధి ఉద్భవించలేదని చైనా గ్రహించి ఉండాలి" అని లూసీ ప్రెస్‌తో అన్నారు.

బహుశా అతను చెప్పింది నిజమే. చైనా దేశం తన కథను మొదట ప్రకటించినప్పుడు కూడా ఆ కథ జోడించబడినదని వుహాన్‌లో ఎవరో తెలుసుకున్నారు. ఆ విషయాన్ని బయటపెట్టకూడదని కఠినమైన ఆదేశాలు జారీచేశారు.

జనవరి 2, 2020 న - వుహాన్ సీఫుడ్ మార్కెట్ ఈ వ్యాధికి కారణమని ఆరోపించిన మరుసటి రోజు - వుహాన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ వైరాలజీ కరోనా వైరస్-2019 గురించిన సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని నిషేదించినట్లు అదేశాలు పంపింది.

అయినా కానీ కొంతమంది శాస్త్రవేత్తలు ధైర్యంగా మాట్లాడారు. ఈ వ్యాసంలో ఎక్కువ భాగం, ఉదాహరణకు, నేషనల్ నేచురల్ సైన్స్ ఫౌండేషన్ ఆఫ్ చైనా “కరోనావైరస్-2019 యొక్క మూలాలు” అని పిలువబడే అధ్యయనంలోనివి.

ఆ అధ్యయనం ఇంటర్నెట్ లో విడుదలైన కొద్దికాలానికే, కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇంటర్నెట్ లో అధ్యయనంలో “చైనీస్ వైరస్” లేదా “వుహాన్ ఫ్లూ” గా వర్ణించడాన్ని కష్టపడి తొలగించి దాన్ని కరోనా వైరస్-2019(2019-nCoV)గా మార్చబడింది.

చైనా ప్రభుత్వం బయోలాబ్ భద్రతను కఠినతరం చేస్తోంది.

వీరందరిలో అతిపెద్ద తుపాకీ గుండు అధ్యక్షుడు జి జిన్‌పింగ్ నోటి నుండి నేరుగా వచ్చింది.

ఫిబ్రవరి 14, 2020 న, అధ్యక్షుడు జి.జిన్‌పింగ్ కరోన వైరస్-2019 గురించి మాట్లాడుతూ వైరస్ ను అదుపులో ఉంచుకోవలసిన అవసరం గురించి ప్రసంగించారు. చైనీయులు, "మన పాఠాలు మనమే నేర్చుకోవాలి... కాబట్టి బలహీనంగా ఉన్న ప్రాంతాలను బలోపేతం చేయాలి మరియు అంటువ్యాధి ద్వారా బహిర్గతమయ్యే లొసుగులను మూసివేయాలి.

ఆ లొసుగులను ఎలా మూసివేయాలనే దాని గురించి జి ఎప్పుడూ పూర్తిగా స్పష్టంగా చెప్పనప్పటికీ, "జాతీయ భద్రతకు హాని కలిగించే" జీవసంబంధ ఏజెంట్ల వాడకాన్ని లక్ష్యంగా చేసుకుని "ప్రయోగశాలలలో బయోసెక్యూరిటీ" కోసం కొత్త చట్టం ప్రవేశపెట్టే తన ప్రణాళికను ప్రకటించాడు.

మరుసటి రోజు, చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జి యొక్క ప్రసంగాన్ని కొత్త ఆదేశంతో అనుసరించింది: “నావల్ కరోనావైరస్ వంటి అధునాతన వైరస్లను నిర్వహించే మైక్రోబయాలజీ ల్యాబ్‌లలో బయోసెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌ను బలోపేతం చేయడానికి సూచనలు....

కొత్త రకం కరోనావైరస్ వంటి అధునాతన వైరస్లను నిర్వహించేది, చైనాలో ఒకే ఒక మైక్రోబయాలజీ ల్యాబ్ ఉంది.

అదే వుహాన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ వైరాలజీ.

Image Credit: To those who took the original photos. ****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి