గాలితో ఒక యుద్దం (సీరియల్) (PART-12) గాలిదేవుడి గుడి!
బామ్మ వచ్చిన కారు వచ్చి ఆగింది...ఆమె కిందకు దిగింది.
భరణి తోడుగా ఉన్నాడు.
గుడి దగ్గర పూజారి ఉన్నాడు.
"రండి బామ్మా గారూ...బాగున్నారా?" అంటూ కుశల ప్రశ్న వేశాడు పూజారి.
"బాగుండాలనే కదలలేని ఈ వయసులో కూడా గాలిదేవుడ్ని చూడటానికి బయలుదేరి వచ్చాను. ఆ రోజుల్లో పిల్లలు, కన్నవారికి పేరు తెచ్చిపెట్టేవారు. కానీ, ఇప్పుడు...కన్నవాల్ల పేరును పాడు చేసేలాగా ఉన్నారు..." పూజారి అడిగిన ప్రశ్నకు బాగున్నాను అనే ఒకే ఒక సమాధానం చెప్పకుండా బామ్మ గొణుగుడు...అతనికి గందరగోళంగా ఉంది.
బామ్మ చేతిలో డాక్యూమెంట్స్ చూడంగానే పూజారికి అర్ధమవటం మొదలయ్యింది.
"అదేమిటి బామ్మా...చేతిలో ఇంటి దస్తావేజులా?"
"అవును! ఆ గాలిదేవుడికి చేరాల్సినవి. మా ఆయన ఇవి ఇవ్వకుండా ఉత్త నోటి మాటతో...'మా ఇల్లు...గాలిదేవుడి ఆస్తి’ అని చెప్పడం తప్పైపోయింది. అందుకే నా కొడుకూ, మనవుడూ బుద్ది గడ్డి తిని, 'ఆ ఇల్లు అమ్మబోతాం' అంటూ బయలుదేరారు.
"అయ్యయ్యో...అదిపెద్ద తప్పు కదా?"
"ఆ తప్పుకే మనవుడ్ని పాము కరిచింది. కొడుకునూ, కోడల్నీ కారు యాక్సిడెంటులో తోసింది..."
"గాలిదేవుడా...నువ్వు కోపం తెచ్చుకున్నావా?"
"కోపం తెచ్చుకున్నాడా అని నిదానంగా అడుగుతున్నావేమిటి...తలకిందలు చేశాడు! చాలు పూజారీ...కర్పూరం చూపించండి. ఇదిగో ఇంటి దస్తావేజులు! ఇక్కడ ఈయన కాళ్ళ దగ్గర పెట్టేసాను. ఇక నా కుటుంబీకులకు ఏమీ జరగ కూడదు. వాళ్ళెవరి మీదా చిన్న గీత కూడా పడకూడదు. అలా పడితే అతను నిజమైన దేవుడు కాదు..."
"ఇప్పుడు మీ మనవుడు ఈ ఊరికి వచ్చి వెళ్ళింది దీని కోసమేనా?"
"అవును! అలా వచ్చినప్పుడే పాము కాటుకు గురి అయ్యాడు...అది విన్న వెంటనే నా ఊపిరే ఆగిపోయింది తెలుసా?"
"ఉండదా బామ్మా...ఒక్కడే మనవుడు?"
"సరి...సరి...కర్పూరం చూపించండి.'ఇంటి పత్రం' తీసి అతని ఆభరణాల పెట్టాలో పెట్టండి. 'ఇంటి పత్రం' లేకుండా వీళ్ళు ఎలా ఇల్లు అమ్మగలరో చూస్తాను"
బామ్మ దగ్గర వైరాగ్యం కనబడింది.
దస్తావేజులను ఎక్కడుంచాలో అనేది బామ్మ చెప్పినప్పుడు పూజారి ఆశ్చర్యపడ్డాడు.
ముద్ద కర్పూరం తీసి వెలిగించాడు.
తరువాత చేతి నిండా విభూతి తీసి ఆమె అరిచేతిలో ఉంచి బామ్మ నుదురు మీద కూడా పూసాడు.
చేతులెత్తి నమస్కరించింది బామ్మ. పరవసంలో కళ్ళల్లో నీళ్ళు పొంగినై. "గాలిదేవుడా...నా ఇంటి ఇలవేలుపే! మా ఆయన చేసిన వాగ్దానాన్ని నేను నెరవేర్చాను. మా కుటుంబంలో నా కొడుకూ, మనవుడూ తప్పు చేసుంటే... వాళ్ళను క్షమించు. ఇంకోసారి చేయరు. దానికి నేను బాధ్యత. నా మనవరాలు పెళ్ళికి డబ్బులు లేవనే కారణం వలన వాళ్ళకు ఈ ఆలొచన వచ్చింది.
డబ్బులు లేకపోతే...డబ్బును నీ దగ్గర అడగాలి. అలా చేయకుండా నీకు ఇచ్చిన దానిని దొంగతనంగా తీసుకోవాలని చూస్తే ఎలా? వాళ్ళందరికీ...నిజంగా నువ్వు ఉన్నావా, లేవా అనే అనుమానమే. ఈ గ్రామంలో ఉన్నంత వరకు రాని అనుమానం...నగరానికి వెళ్ళంగానే వచ్చింది. అదే నగరం! అది తాను నమ్మదు! ఎవరినీ నమ్మించదు. నమ్మాలి...దేనినైనా ఖచ్చితంగా, గట్టిగా నమ్మాలి. నేను నమ్ముతున్నాను. నువ్వు ఉన్నావు...నువ్వే దండన ఇచ్చి హెచ్చరిక చేసావు! ఎక్కువగా కోపం తెచ్చుకోనుంటే...ప్రాణం తీసేవాడివి. కానీ, నా భర్త భక్తి కొసం, నా భక్తి కొసం చిన్నగా దండిచి వదిలేసావు.
నువ్వు గాలివి...అన్ని చోట్లా నిండి పోయుంటావు. ఇప్పుడు నేను మాట్లాడింది నీ చెవిలో పడుంటుంది. నిన్నే నమ్ముకున్న నన్ను మోసం చేయకు...! నా మనవరాలి పెళ్ళి బాగా జరగాలి. నగలు కొంటానికే డబ్బుల్లేక...నా కొడుకు కష్టపడుతున్నాడు.
అందుకోసమే ఆ ఇల్లు అమ్మితే ఏమవుతుంది అని వాడు అనుకున్నాడు. ఇంతే విషయం. అంతా నీ దగ్గర ఒలకబోసాను. నేను బయలుదేరతాను. ఇక నువ్వు చూసుకో..." బామ్మ ప్రార్ధన చేస్తున్నాననే పేరుతో తన ఆవేదనంతా ఒలకబోసి వెనుతిరిగింది.
ఎదురుగా కార్తిక్, వీరబద్రం నిలబడున్నారు. కార్తిక్ కళ్ళు తడిసున్నాయి.
"ఇప్పుడు వచ్చింది...! ఇక మెము నువ్వు ఇష్టపడినట్లే నడుచుకుంటాం"
"పడితేనే బుద్ది వస్తోంది...కదా?"
"అవును బామ్మా! సరే...నువ్వు బయలుదేరు. ఈ వయసులో ఇంత అనారొగంతో నువ్వు వచ్చిందే తప్పు... భరణి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి"
"అయ్యో...అదంతా అవసరం లేదు అంకుల్?"
"ఇద్దరూ కలిసి నిలబడండి ఒక ఫోటో తీసుకుంటాను" అన్నతను...బామ్మా- భరణి ఇద్దర్నీ ఒకటిగా నిలబెట్టి తన మొబైల్ కెమేరాతో ఫోటో తీసాడు కార్తిక్.
అప్పుడే వీరబద్రానికి తన మొబైల్ ఫోన్ గుర్తుకు వచ్చింది. దానికొసం జేబులో చెయ్యి పెట్టాడు...గుండె గుభేలు మన్నది. సెల్ ఫోన్ కనబడలేదు.
"ఏమిటి బద్రం?"
"నా మొబైల్ కనబడటం లేదు...!"
"ఎక్కడ్రా పారేసావు?"
"అది పోయినట్టు ఇప్పుడే కదురా తెలిసింది! ఎక్కడ పారేసేనూ అని అడిగితే ఏలా చెప్పను. నన్ను కొంచం ఆలొచించుకోని?" సమాధానం చెబుతూ తీవ్రంగా ఆలొచించాడు వీరబద్రం.
"అవునూ...అదేంటి మీ ఫ్రెండు పేరు వీరబద్రమా?......మనవాళ్ళు కాదా? అంటూ మధ్యలో పూజారి ప్రశ్నించాడు.
"అదా పూజారీ?.... అతని తండ్రి జ్యోతిష్య పండితుడు. ఆయన వీరబ్రహ్మేంద్రస్వామి భక్తులు. అందువలన వాళ్ళ ఇంటికి 'వీరబ్రహ్మేంద్ర ఇల్లు’ అని పేరొచ్చింది. అందుకని వీళ్ళ నాన్న వీడికి వీరబద్రం అని పేరు పెట్టాడు….”
అలా పేరుకు కారణం తెలిసొచ్చే క్షణం... వీరబద్రం కూడా 'ఎక్కడ సెల్’ పారేసుకున్నాము? అనేది గుర్తుకు వచ్చినట్టు ముఖంలో కాంతి.
"ఏమిట్రా...గుర్తుకు వచ్చిందా?"
"ఊ...ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. అది ఇప్పుడు గాలిదేవుడి ఇంట్లోనే ఉన్నది"
"ఏమిటీ...మా ఇంట్లోనా?"...కార్తిక్ అధిరిపడ్డాడు.
"మీ ఇల్లా...అదే దస్తావేజులుతో సహా ఇచ్చేశారే...ఎక్కడ్నుంచి వచ్చింది మీ ఇల్లు? అది ఇక గాలిదేవుడి ఇల్లు!"
"సరేరా...అక్కడే పారేసుకున్నట్టు ఖచ్చితంగా గుర్తుందా?"
"అవును...అక్కడే. పాము కరిచిన తరువాత, వంగి నిన్ను ఎత్తేను. పడుంటే అక్కడే పడుండాలి"
"ఏం...ఇంకెక్కడైనా...?"
"ఇంకెక్కడా నేను వంగి లేవలేదు...అది గుర్తుకు వచ్చే చెబుతున్నాను"
"సరే! అది అప్పుడే నీకు తెలియలేదా?"
"తెలియలేదురా...! మొబైల్ అవసరం వచ్చినప్పుడే కదా వెతుకుతాం? అందులోనూ నిన్ను పాము కరిచి నువ్వు స్ప్రుహ కోల్పోయావు. ఆ గందరగోళంలో ఉన్నాను. మధ్యలో ఫోన్ ఏదైనా వచ్చుంటే తెలిసుండేది. కానీ, చేతిలో మొబైల్ లేకపోవటంతో అది కూడా తెలియలేదు"
"సరే...ఇప్పుడు ఏం చేయబోతావు?"
"ఆ ఇంటికి వెళ్ళి, తీసుకుని మనం వెళ్ళిపోదాం!"
"ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళబోతామా?"
"ఏం వెడితే ఏమిటి? కారణంగానే కదా వెలుతున్నాం?"
వాళ్ళ మాటలను వింటూ ఉన్న బామ్మ......
"కార్తిక్! నువ్వు తోడువెళ్ళు...పారేసుకున్న ఫోనును వెతికి తీసుకుని మీ ఇద్దరూ రండి. వచ్చేటప్పుడు ఆ ఇంట్లోని చుక్క మట్టి కూడా నీకు అంటకూడదు. అది గాలిదేవుడి ఆస్తి" అన్నది.
"అవును బామ్మా...ఇక గాలిదేవుడే వచ్చి ఇల్లు 'క్లీన్’ చేసి, రంగులు వేసీ ఇంటిని ఇల్లుగా ఉంచుకోబోతాడు..." అన్నాడు వీరబద్రం.
బామ్మకు అతని వేళాకోళం అర్ధమయ్యింది.
"అది దేవుడి ఇష్టం. పరిశుభ్ర పరచటం నీకు, నాకూ ఒక విధమైతే...ఆయనకు వేరే విధం. హేళన చేయకుండా వెళ్ళి 'ఫోన్’ తీసుకుని వచ్చే పని చూడు. నేను ముందు బయలుదేరతాను" -- అంటూ తిరిగి మరోసారి గాలిదేవుడికి నమస్కరించి భరణితో కలిసి తాను వచ్చిన 'టాక్సీ' లో ఎక్కింది బామ్మ.
కార్తిక్, వీరబద్రం కారులో ఆ గాలిదేవుడి ఇంటివైపుకు మళ్ళీ వెళ్ళారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి