21, మే 2020, గురువారం

గాలితో ఒక యుద్దం (సీరియల్)..PART-7




                                         గాలితో ఒక యుద్దం (సీరియల్)   
                                                             (PART-7)

ఆ పరిశోధనకు తరువాత మనిషి యొక్క ఆలొచనా తరంగాలు అయిస్కాంత ఆలొచనలలాగా ఒక విధమైన ఆలొచనలుగా మారటానికి ఆల్ఫా, బీటా, గామా, డీటా అని పేర్లు కనుగొన్నారు. అందులో ఆల్ఫా అనేది లోతు మనసులో మనం ఆలొచించేవి. బయట ప్రపంచంలో నుండి వినబడుతున్న ఏ శబ్ధాన్నీ చెవితో వింటున్నా, ఆలొచనలోకి తీసుకోకుండా, మామూలు ఆలొచనల పరుగుకు మధ్య లోతు మనసుకు వెళ్ళి అక్కడ మనం...మనకు బాగా ఇష్టమైన వారి యొక్క బాగోగులు గురించో...లేక; వాళ్ళల్లో కొన్ని మార్పులు ఇష్టపడో...మనం ధ్యానంలో శ్రద్ద పెట్టినప్పుడు, సంబంధించిన వారి లోతైన మనసులో మన ఆలొచనల తాకిడి తగిలి వాళ్ళల్లో మనం ఇష్టపడే మార్పులు ఏర్పడుతాయి.

ఉదాహరణకు ఒక తల్లి తన కూతురు పెద్ద గాన కోకిలగా అవ్వాలని ఆశపడ్డది. కారణం, ఆమె కూతురి గొంతు అంత తియ్యగా ఉంటుంది. కానీ, ఆ అమ్మాయికి సంగీతం నేర్చుకుని గాన కోకిల అవ్వాలనే కోరిక కొంచం కూడా లేదు. ఎంత చెప్పినా కూతురు వినే మూడ్ లో లేదు.

ఈ పరిస్థితుల్లో తన లోతైన మనసులో కూతుర్ను తలచుకుంటూ తీవ్రంగా తన ఆశను బయటపెడుతూ ధ్యానం చేసింది. కొన్ని రోజులలోనే ఆమె కూతురిలో మార్పు. 'అమ్మా...నాకు ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలనే ఆశ ఏర్పడుతోంది. నేను వెడుతున్నాను' అని చెప్పి సంగీతం నేర్చుకోవటానికి వెళ్ళింది. ఇదే లోతైన మనసు యొక్క శక్తి. ఇది అర్ధం చేసుకుని, ఆ లోతైన మనసును ఉపయోగించుకునే దాంట్లోనే చాతుర్యం ఉన్నది.

వెనుక గుమ్మం నుండి వీరబద్రం, కార్తిక్ ఇద్దరూ లోపలకు వెళ్ళేరు. మొదట వంట గదే వాళ్ళ కళ్ళకు కనబడింది. ఆ రోజుల్లో కట్టెల పొయ్యి. పొయ్యి పక్కనే ఉన్న గోడలో మసి అంటుకోనుంది.

పొయ్యికి పక్కనే రుబ్బురోలు, ఆ రుబ్బురోలు గుంటలో పై నుండి కారిన వర్షం నీరు...ఆ నీటిలో ఒక కప్ప కూడా కనబడింది.

ఇటు పక్క రాట్నం బావి.

రాట్నం కనబడలేదు.

బావి గోడల చుట్టూ పిచ్చి మొక్కలు చుట్టుకోనున్నాయి.

వీరబద్రం బావి దగ్గరకు వెళ్ళి తొంగి చూశాడు. బావిలో నీళ్ళున్నాయి—అందులో అతని ముఖం కనబడింది.

"బద్రం ఈ బావిలో నీళ్ళు ఎండి పోవు. నీళ్ళు కూడా తియ్యగా, అద్భుతంగా ఉంటాయి" అన్నాడు కార్తిక్.

"పోరా...ఇది ఎంత వసతిగల ఇల్లో. ఈ ఇంటిని ఎలారా ఎటువంటి బాధ్యత లేకుండా విడిచిపెట్టారు?"---- వీరబద్రం విసుకున్నాడు.

దాన్ని ఆమొదిస్తున్నట్టు బావి పక్కనున్న బట్టలు ఉతికే బండపైన ఒక తొండ. తన కళ్లతో వీళ్ళను ఒక చూపు చూసింది.

అక్కడ్నుంచి వంట గది. తరువాత, స్టోర్ రూము, హాలు, వాకిలి, వరాండా, చూటూ ఉన్న ఆరు గదులనూ చూశాడు. ఒక గదిలో పై నుండి కారిన వర్షం నీరు నిలబడింది. అలా చూసుకుంటూ వచ్చినప్పుడు వరాండా చివర ఒక చోట నాప రాళ్ళు పరచబడి ఉన్నాయి. వాటిని సులభంగా తీసేటట్టు ఉంచబడి ఉన్నాయి. ఆ నాపరాళ్ళను ఆశ్చర్యంగా చూశాడు వీరబద్రం.

"నువ్వెందుకురా నీ ఇంటినే కొత్తగా చూస్తున్నట్టు చూస్తున్నావు?"

"ఇక్కడ ఈ నాపరాళ్ళు ఉన్నట్టు నాకు జ్ఞాపకంలేదు...అందుకే!"

"అలా అయితే...?"

"ఇక్కడ సిమెంట్ తో పూసిన గచ్చే ఉండేది"

"అప్పుడు ఈ నాప రాళ్ళు?"

"అదే నాకూ అర్ధం కావటంలేదు..."

"అర్ధం కాదు...ఇలా ఇంటిని వదిలేస్తే ఏదైనా మారుతుంది....ఎలాగైనా మారుతుంది"

"నూవ్వేంట్రా చెబుతున్నావు?"

"ఇక్కడికి ఎవరో వచ్చి వెడుతున్నారనుకుంటా"

"ఎలా అంత ఖచ్చితంగా చెబుతున్నావు?"

"లేకపోతే ఈ చోటు మాత్రం ఎందుకు శుభ్రంగా ఉంటుంది?"

"ఓ నువ్వు అలా చెబుతున్నావా?"

"పోతే పోనీ...ఎవరూ లేని ఇంట్లో ఇలాగే ఉంటుంది! పరవాలేదు...తలుపులు, కిటికీలు, ఇవన్నీ దొంగతనం చేయలేదు. అలాగే ఉంచారు...అందుకు సంతోషించు..."

“దొంగతనమా...పోరా! గాలిదేవుడి ఆస్తి అది. దొంగతనం చేయటానికి ఎవరికి ధైర్యం వస్తుంది"

“మళ్ళీ గాలిదేవుడి ఆస్తి అని చెబుతూ నీ భయాన్ని చూపకు! ఇది మీ తాతయ్య ఆస్తి. చట్ట ప్రకారం మనవుడివైన నీకు ఇప్పుడది సొంతం. దీన్ని 'రైట్ రాయల్’ గా అమ్మే హక్కు నీకు ఉంది. నువ్వు అమ్మబోతావు; సులేమాన్ గారు కొనబోతారు. అంతే విషయం. ఏ కారణం చేతా నువ్వు గాలిదేవుడ్ని గుర్తు చేసుకోకూడదు...సరేనా?”

"సరే!....ఇంతపెద్ద ఇంటిని మనిద్దరి వల్ల శుభ్రం చేయటం కుదరదు. బయటకు వెళ్ళి ఎవరినైనా పిలుచుకు వద్దామా?"

"ఖచ్చితంగా...! ఇప్పుడు మనం చేయవలసింది అదే"

వీరబద్రం, కార్తిక్ వాకిలి గుమ్మం దగ్గరున్న దుమ్మూ, ధూళిని శుభ్రం చేసుకుంటూ వస్తున్నప్పుడు ఏక్కడ్నుంచో ఒక నాగుపాము ఒకటి వచ్చి పూలమాలలా కార్తిక్ మెడలో పడింది.

అతను ఒక్క క్షణం విలవిల లాడిపోయాడు.

అది ఆరడుగుల పొడవు ఉంటుంది.

శివుడి మెడలో ఉన్నట్టు అతని మెడలో ఆ పాము ఉండగా... కార్తిక్ బిక్క చచ్చిపోయాడు. ‘బద్రం’ అని అరవాలనుకున్నాడు. అరవలేకపోయాడు. కళ్ళు బైర్లు కమ్మాయి కిందకు ఒరిగిపోయాడు.

ఒరిగిపోతున్న కార్తిక్ మీద ఆ పాము కూడా పడింది. ఓర్పు నసించి ఆ పాము కార్తిక్ ను ఒక కాటు వేసింది.

అది కాటు వేసిన చోటు...మోకాలు క్రింది భాగం.

వీరబద్రం ఆశ్చర్యపోయాడు.

నాటు వైద్యుడు...చెవులలోనూ, ముక్కులలోనూ ఏదో మూలిక రసం పోసి, తొడపైన బిగువుగా కట్టు వేశాడు. కట్టబడ్డ చోట కత్తితో గీరి, రక్తాన్ని పీలిచి ఉమ్మేశాడు.

ఉమ్మేశిన రక్తంలో నీలి రంగు మచ్చలు ఉన్నాయి.

దగ్గరుండి గమనిస్తున్న వీరబద్రానికి వైద్యుడు ఏం చెప్పబోతాడో నన్న ఆందోళన కలిగింది. ఎంత ప్రోగ్రస్సివ్ గా ఆలొచించినా, మాట్లాడినా కూడా...కొన్ని సమస్యలను కళ్లెదురుగూ చూస్తున్నప్పుడు మనో బలం తగ్గటమే కదా జరుగుతుంది?

అందులోనూ ఇది ప్రాణంతో పోరాటం! వైద్యుడు చేసిన వైద్యం కొంతమేరకు రిజల్ట్స్ ఇచ్చింది. కార్తిక్ తల ఆడించటం, మూలగటం బయటపడింది. అది వీరబద్రానికి కొంచం బలాన్ని ఇచ్చింది.

వైద్యుడు కూడా అతన్ని చూసి మాట్లాడటం మొదలుపెట్టాడు.

"మంచికాలం...నేను ఊర్లోనే ఉన్నాను. ఇతని అదృష్టం పాము కాటుకి విరుగుడు మూలిక నా కళ్ళకు వెంటనే కనబడింది. లేకపోతే...ఈ లోపు అంతరిక్షాన్ని చూడటానికి వెళ్ళేవాడు" అన్నప్పుడు కూడలి రోడ్డులో వీరబద్రంతో పాటూ కొబ్బరి బోండాం నీళ్ళు తాగిన 'మోటార్ సైకిల్’ మనిషి విషయం తెలుసుకుని అక్కడికి వచ్చాడు.

వచ్చినతను వీరబద్రంతో, "గాలిదేవుడి విషయంలో మీరు ఎగతాలిగా మాట్లాడేటప్పుడే అనుకున్నా..." అన్నాడు.

"మిస్టర్ మోటార్ బైక్...మీరు దీనిని గాలిదేవుడితో ముడివేయకండి. పాడుబడిపోయిన ఇళ్ళల్లో పాములూ, తేళ్ళూ, పురుగులూ ఉండటం సహజం. మేమే కొంచం నిర్లక్ష్యంగా ఉండిపోయాము. అందుకే కాటేసింది"

“ఇప్పుడు కూడా మీసాలకు మట్టి తగలకుండా మాట్లాడుతున్నారే"

"మీకు అలా అనిపిస్తే, అలాగే ఉంచుకోండి"

"వద్దు తమ్ముడూ...గాలిదేవుడు హెచ్చరిక చేశాడు. మీరితే...ప్రాణాలు విడువక తప్పదు!"

"ఎవరి ప్రాణం?"

"సరే...ఇక పూర్తిగా దెబ్బతింటేనే మీకు బుద్ది వస్తుంది"

-----అతను తప్పుకున్నాడు. కానీ, వీరబద్రం దగ్గర వైద్యుడు ఏమీ అడగలేదు. ఆ ఊరి మనిషిగా ఉంటూ, వైద్యుడు ఏమీ మాట్లాడ కుండా ఉండటం వీరబద్రాన్ని ఆశ్చర్యపరిచింది.

అందుకే వీరబద్రమే వైద్యుడ్ని అడిగాడు.

                                                                                                        (ఇంకా ఉంది) ****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి