19, మే 2020, మంగళవారం

గాలితో ఒక యుద్దం (సీరియల్)..PART-6




                                             గాలితో ఒక యుద్దం (సీరియల్)
                                                               (PART-6)


కొన్ని విషయాలు నమ్మటానికి కష్టంగానే ఉంటాయి. అందులో ఒకటి...మనం ఒకరి గురించి తీవ్రంగా ఆలొచించి ముగించిన కొద్ది క్షణాలలోనో లేక కొన్ని నిమిషాలలోనో వారు మన ఎదురుకుండా రావటం! అందరికీ ఈ అనుభవం ఏర్పడే అవకాశం ఉన్నది. కొంతమందికి ఎప్పుడో ఒకసారి జరిగే ఈ విషయం, కొంతమందికి అప్పుడప్పుడు జరుగుతుంది.

ఇది అనుకోకుండా జరిగింది అనాలా...లేక దీని వెనుక మనం పరిశోధించాల్సింది ఏమైనా ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. దీన్ని మనస్తత్వ రీతిగా పరిశోధించారు. దానికి ముందు ఒక్కొక్కరి మనసు నిర్మాణం గురించి...మనసంటే ఏమిటీ అనేదాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎందుకంటే, దాన్ని తెలుసుకోకుండా... దాన్ని అర్ధం చేసుకోలేము. మనందరికీ మనసు అనేది మూడు విధాలుగా అమర్చబడి ఉంటుంది. పై మనసు, మధ్య మనసు, లోతైన మనసు అనేవే అవి. 'పై మనసు’ అనే దాంట్లో ఉండేవి మనం ఎప్పటికప్పుడు చేసే కార్యాలు. ఇందులో 'మధ్య’ మనసు అనేది కొన్ని ముఖ్య కార్యాలను జ్ఞాపకముంచుకుని...దానికోసం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఉదాహరణ...ఈ తారీఖున కరెంటు బిల్లు కట్టాలి. ఈ రోజు స్నేహితుడి పెళ్ళికి వెళ్ళాలి లాంటి విషయాలు. లోతైన మనసులో...జీవితంలో ఏర్పడ్డ మరిచిపోలేని చేదు అనుభవాలతో మొదలై; నెరవేరని ఆశల వరకు పలు విషయాలు దాగుంటాయి.

ఈ మూడు మనోస్థితులలో...కొన్ని సమయాలలో లోతైన మనసు మేల్కొని, పై మనసుతో కలుసుకుని పనిచేస్తుంది. అప్పుడే మనం ఇలా ఆలొచించటం...నడుచుకోవటం ఒకటిగా ఉంటుంది.

ఇది పెట్టుకునే మనొతత్వ నిపుణులు ఆలొచనా శక్తి వలన మనం ఎవరినైనా కాంటాక్ట్ చేసి...వారి లోతైన మనసుతో మాట్లాడి, వాళ్ళకు తాకిడి ఏర్పర్చగలం అనుకుంటున్నారు. దీన్ని పరిశోధనలతో కూడా కనిపెట్టారు. దీనికొసం పదిమందిని ఎన్నుకున్నారు. వాళ్ళ అతి క్లోజ్ స్నేహితులు -- ఇరవై సంవత్సరాలుగా స్నేహంగా కలిసి మెలిసి ఉంటున్నారు.

వీళ్ళను వేరు చేసి విడి విడిగా ఉంచి...తరువాత వాళ్ళ దగ్గర, 'మీరు మొదట ఎవర్ని కలవాలనుకుంటున్నారో...వాళ్ళ పేరును ఒక కాగితం మీద రాసివ్వండి అని చెప్పేసి...వాళ్ళని తీవ్రంగా ఆలొచించమని చెప్పారు. అంటే, మనసులో పేరు రాసిన వారు...ఆ పేరు కలిగిన వారిని అత్యంత ఇష్టంతో పిలవాలి...ఇలా వాళ్ళు చెప్పింది ఐదు మందితో...మిగిలిన ఐదుగురు వీళ్ళను కలవాలి.

అంటే ఏ,బి,సి,డి,ఇ అనే ఐదుగురు ఎఫ్,జి,హెచ్,ఐ,జె అనే ఐదుగురుని. ఏ అనే అతను 'జి' ని, బి అనే అతను 'జే' ను. సి అనే అతను 'హెచ్' ను, డి అనే అతను 'ఎఫ్' ను, ఇ అనే అతను 'ఐ' ను తీవ్రంగా అనుకోనున్నారు. ఆశ్చర్యకరంగా జవాబుగా వాళ్ళూ వాళ్ళని తీవ్రంగా ఆలొచించిన వారై వాళ్ళను కలిసారు.

ఈ పరిశోధన వంద శాతం విజయవంత మయ్యింది!

అది గాలిపేట అగ్రహారం!

ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు.

గుమ్మడి తీగలూ, మల్లె తీగలూ దట్టంగా పెరిగిన పెంకుటిళ్ళు...పెరట్లో పసువులు, వాకిట్లో బచ్చలి చెట్లు! అందులో కట్టబడున్న పశువులు, దూడలూ అంటూ ఒక కాలంలో బ్రహ్మాండంగా ఉన్న ఆ ప్రదేశం.

ఈ రోజు, ఆ రోజుల ఆనవాలే లేనట్టు కొన్ని ఇళ్ళు జనంతో ఉన్నట్టు ఉన్నది...కొన్ని ఇళ్ళు పూర్తిగా మారిపోయి, అక్కడ చిన్న చిన్న పరిశ్రమలు కనబడుతున్నాయి. ఒక ఇల్లు 'మందుల' కంపెనీగా మారింది. ఇంకో ఇల్లు 'ఐస్ ఫ్యాక్టరీ'గా మారింది...! ఇంకో ఇల్లు 'మినరల్ వాటర్ గొడౌన్'.

గాలిపేట చుట్టూ ఒక పక్క నందిగామ, ఇంకో పక్క జగ్గయ్య పేట, మరో పక్క మదిర, మైలవరం అనే ఊర్లు. ఇక్కడుండి వ్యాపారం చేయడం ఒక విధం. దూరంగా ఉండి వ్యాపారం చేయటం...వాహనాలతో సరకులు తీసుకు వెళ్లటం మరో విధం.

ఆ వీధిలోకి వీరబద్రం కారు వెళ్ళినప్పుడు... కార్తీక్ కు వొళ్ళు జలదరించింది.

“బద్రం! ఇది నేను ఆడుకున్న వీధిరా...వీధి మధ్యలో ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. పక్కగా ఒక చింత చెట్టు ఉండేది. దాని మీద రాళ్ళు వేసి, కాయలు కొట్టుకుని తినేవాళ్ళం. ఇప్పుడు ఆ చెట్లూ లేవు, ఆడుకునే పిల్లలూ లేరు...చూశావా?”--అన్నాడు కార్తీక్.

“ఇప్పుడు, చీదర పుట్టించే మార్పుతో మనదేశం ఉంది కార్తీక్. టీ.వీ చూడటం, సెల్ ఫోన్ వాడుకోవటం ఈ రోజు మనుషుల ముఖ్యమైన పని! ముఖ్యంగా...స్కూలుకు వెళ్ళే పిల్లలు వీధులలోకి వచ్చే ఆడుకోవటమే లేదు.

ఇంట్లోకి దూరిన వెంటనే 'సోఫా' లో పడిపోతారు. ఇంతకు ముందు టీ.వీ ఆన్ చేయటానికైనా లేచే వాళ్ళూ. ఇప్పుడు రిమోట్ ఉన్నదే! ఆ రిమోట్ పిల్లల చేతిలో అవస్తపడుతోంది.

మన టైములో ఎన్ని ఆటలు. దొంగ-పోలీస్! అంటూ...ఈ కాలం పిల్లలకు అందులో ఒకటైనా తెలుసా? సెల్ ఫోన్ని చేతికి ఇస్తే...అందులో వీడియో గేమ్ ఆడటం తెలుసు.

నువ్వు కావాలంటే చూడు...ఇంకో ముప్పై సంవత్సరాల తరువాత, కళ్ళజోడు లేకుండా ఒకరూ ఉండరు. అదే సమయం అరవై సంవత్సరాలలో చనిపోయేవారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది. ఈ అగ్రహారం నాలో ఇలాంటి ఆలొచననే తెప్పిస్తోంది" అన్నాడు వీరబద్రం.

“వాస్తవమేరా...కడుపు మండిపోతోంది”

“ఈ వీధిలో మీ ఇల్లు ఎక్కడుంది?”

“చివర్లో ఉంది. ఇంకా వెళ్ళు...”

కారు వేగం పెరిగింది. చివరిదాకా వెళ్ళి పెద్ద సిమెంటు బెంచి, పెద్ద చెక్క దూలాలు ఉన్న ఇంటి ముందు ఆగింది.

ఇంటికి ఉన్న ముందు గోడ. పాచి పట్టి పచ్చ రంగులో ఉన్నది. ఆ గోడ మీద చెట్ల తీగలు పాకుతున్నాయి...గోడ తెలియనంత దట్టంగా అల్లుకోనున్నాయి. మైన్ గేటు తుప్పు పట్టి ఉంది. ఒక తన్ను తంతే ముక్కలు అయిపోయేటట్టు ఉన్నది.

వాకిట్లోనే నిలబడి ఒకసారి చూశాడు కార్తీక్. 'ఎలా ఉండే ఇల్లు...ఇలా అయిపోయింది’ ....మనసులోనే అనుకున్నాడు.

వీరబద్రం కూడా గమనించాడు. ఈ లోపు చుట్టు పక్కలున్న వాళ్ళంతా వచ్చి చేరారు.

“అరెరే...పంతులుగారబ్బాయా?”

“అవును గోవింద రావ్ గారు. బాగున్నారా?”

“ఏదో ఉన్నా తమ్ముడూ! ఏమిటి...ఇంటిని చూసుకోవటానికి వచ్చారా?”

“అవును”

“ఈ ఇంటిని ఎప్పుడు గాలిదేవుడికి మీ తాతయ్య ఇచ్చాసారో...అప్పుడే ఈ ఇల్లు 'గాలి దేవుడి ఇల్లు’ అయిపోయింది. లోపల కూడా చెట్లు, చేమలతో దట్టమైన అడవిలాగా అయిపోయింది. అప్పుడప్పుడు గాలి వీస్తున్నట్టు ఆ ఇంట్లోని చెట్లూ, చేమలూ అటూ ఇటూ ఊగుతాయి."

ఆ గోవింద రావ్ గాలిదేవుడ్ని గుర్తు చేయటంతో వీరబద్రం మనసు గీరుకుంది.

“అయ్యా...ఇది పంతులుగారి ఇల్లే. గాలిదేవుడి ఇల్లు కాదు. ఈ ఇంటిని శుభ్రపరచి, ఇదివరకులాగా ఇందులో ఉందామనే వచ్చాము. ఇది బాగా తెలుసుకోండి...” అన్నాడు వీరబద్రం.

“అలాగా...! అవును...మీరెవరు?”

“కార్తీక్ స్నేహితుడ్ని”

“పట్నం వాసివా?”

"అవును...దానికేదైనా చెప్పబోతారా?"

"ఏం చెప్పమంటారు...మీకు దేవుడూ, దయ్యం అంటే నమ్మకం ఉండదు...!"

"అవును...కరెక్టే! అదంతా పనీ పాటూ లేకుండా అరుగుల మీద కూర్చుని అరుగును అరిగించే వాళ్ళకు...మాకు లేదు. మీరు బయలుదేరండి" వీరబద్రం గట్టిగా చెప్పాడు.

దాన్ని కార్తీక్ కూడా అడ్డుకోలేదు...ఇంటిలోపలకు వెళ్ళటానికి ప్రయత్నించాడు.

ఇనుప గేటు తోసాడు. అది కీచ్ మన్నది.

"తమ్ముడూ..."--ఆ గోవింద రావ్ వాళ్ళను ఆపుతున్నట్టు పిలిచాడు.

"ఏమిటీ...?"

"ఈ తమ్ముడు మాట్లాడిందంతా నిజమా?"

"అవును...! తప్పుగా ఉండుంటే నేను మధ్యలోనే ఆపేవాడిని"

"అలాగైతే ఇన్నిరోజులు 'గాలి దేవుడి ఇల్లు’ అని ఉంచేసిందంతా?"

“మేము ఉంచలేదు. ‘గాలిదేవుడి ఇల్లు’ అని మేము పేరు పెట్టలేదు. అది ఈ ఊర్లోని మీలాంటి కొంతమంది చేసిన పని. క్లుప్తంగా చెప్తాను...ఇది మా సొంత ఇల్లు. నలభై గజాల స్థలంలో వెనుకవైపు మామిడి చెట్టు, చింత చెట్టు ఉన్న మా ఆస్తి. దీన్ని మేము అమ్మబోతాం.

ఎందుకంటే...మాకు డబ్బులు కావాలి. డబ్బులొస్తేనే నా చెల్లెలు పల్లవికి పెళ్ళిచేయగలం. మా కష్టం ఆ గాలిదేవుడికి తెలుసు. అందువల్ల ఆయన మాకు సహాయమే చేస్తారు. ఖచ్చితంగా కష్టాలు పెట్టరు. మీరెల్లి మీ పనులు చూసుకోండి"

కార్తీక్ కూడా బాగా మాట్లాడాడు.

ఆ గోవింద రావ్ మొహం వాడిపోయింది.

తడబాటుతో అక్కడే నిలబడ్డాడు.

"వెళ్ళన్నా...వెళ్ళి నీ పని చూసుకో".

"లేదు తమ్ముడూ...రాత్రి పూట ఇంట్లోంచి గుర్రం నడుస్తున్న శబ్ధం వినబడుతుంది. దేవుడు ఇక్కడ తిరుగుతున్నాడు. ఇది నేనుగా చెప్పటంలేదు. ఊర్లో అందరినీ అడిగి చూడండి. అందరూ చెబుతారు. పూజారి తప్ప ఇంకెవరైనా ఈ ఇంట్లోకి వెడితే జ్వరం వచ్చి మంచాన పడుతున్నారు. ఇవన్నీ తెలుసుకోకుండా మీరోచ్చి...'ఇది మా ఇల్లు, అమ్మబోతాం' అని చెబుతున్నారు. సరే...ఇక గాలిదేవుడూ, మీరూ తేల్చుకోవలసిన విషయం ఇది” అని చెప్పి తిరిగి వెళ్ళిపోయారు.

ఆయన గట్టిగా చెప్పిన ఆ విషయంతో, కార్తీక్ కొంచం భయపడ్డాడు. దానికి తగినట్లు ఆ ఇంట్లో నుండి గుర్రం నడుస్తున్న శబ్ధం వినబడింది. ఒక్క క్షణం... కార్తిక్ శరీరమంతటా ఉన్న రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అదేలాగా డప్పుల శబ్ధం కూడా వినబడింది.

"బద్రం..."

"ఏమిటీ...భయపడ్డావా? లోపల నుండి ఎవరో గుర్రంలో వెనుక గుమ్మం నుంచి వెళ్ళారు. రా...ఎవరనేది చూద్దాం"

వీరబద్రం వేగంగా నడిచాడు. ఇంటి గోడకూ, కాంపుండ్ వాల్ గోడకూ మధ్య చాలా చోటు ఉంది. కానీ అదంతా దట్టంగా ఏవో పిచ్చి మొక్కల పొదలతో నిండిపోయుంది. వాటి మధ్య దూరి ధైర్యంగా పరిగెత్తాడు. ఒకే చోట పాము పుట్ట. భుజాల ఎత్తుకు పెరిగి ఎన్నో అడ్డంకులతో అతన్ని బెదిరించింది.

ఇంటి వెనక నుండి ఎవరూ వెళ్ళిన ఆనవాలు లేవు. గుర్రం అనేది ఒకటుంటే, అది కట్ట బడ్డ చోటు...దాని తిండి, వస్తువులూ, ఆనవాలుగా ఉండేవి.

అలా ఏదీ కనిపించలేదు!

కార్తిక్, వీరబద్రం వెనుకే వెళ్ళాడు.

"కార్తిక్...ఇక్కడ మనుష్యులు వచ్చి వెళ్ళిన సంకేతాలే లేవు"

"మరి శబ్ధం వినబడిందే?"

"పక్కింట్లో టీవీ ఉన్నదా చూడు"

"టీవీలో వచ్చిన దృశ్యం అయ్యుంటుందని అనుకుంటున్నావా?"

"వేరే ఎలా అనుకోగలం...? నువ్వే చూడు!"

"పక్కిళ్ళు కూడా తాళం వేసున్నది. అక్కడ ఎవరూ లేరు"

"అయితే...సమ్ తింగ్ రాంగ్...!"

"ఏం చెబుతున్నావు...ఒకవేల గోవింద రావ్ చెప్పింది నిజమేనేమో...?"

"నాతో ఉంటూ అలా మాట్లాడకు!'గాలిదేవుడి దగ్గరే చెప్పేశాను. ఆయన మాకు సహాయం చేస్తారు...కష్ట పెట్టరు’ అంటూ ఇందాక చెప్పి ఇప్పుడెందుకు భయపడతావు?"

"అది కాదు...అదొచ్చి..."

"చాలు ఆపు...! ఇప్పుడు మనం ఈ ఇల్లంతా శుభ్రం చేస్తున్నాము. మేస్త్రీనీ, కూలీలనూ తీసుకు వచ్చి అడ్డంకులు తొలగించి క్లీన్ చేద్దాం"

"బద్రం..."

"ఏమిటి బిడియం?"

"నాకోసం నువ్వు రిస్కు తీసుకోకు"

"ఆపు నీ భాగోతం...నీ భయాన్ని నాలో ఏదో విధంగా దూరుద్దామని చూస్తున్నావా? అవును...ఈ ఇంటి తాళం చెవులు ఎక్కడ? లోపలకు వెళ్ళి చూద్దామా?"

"తాళమూ--చెవులూ లేదు. తెరిచే ఉంది"

"అయితే రా...లోపలకు వెళ్ళి చూద్దాం"

వెళ్ళారు.

"అబ్బో...ఎంత పెద్ద ఇల్లో? ఇలాటి ఒక ఇల్లు మన విజయవాడలో ఉంటే మనమేరా అక్కడ కోటీశ్వరులం. ఈ రోజుల్లో అపార్ట్ మెంట్ పేరుతో ఒకే మెట్ట్లు...ఒకే గుమ్మం ను నాలుగు కుటుంబాలు ఉపయోగిస్తూ జీవిస్తున్నాం. ఎప్పుడు చూడూ...తలుపులు వేసుకునే ఉంటున్నాము. ఆ జీవితాన్ని ఎక్కువగా మెచ్చుకుని, ఇష్టపడుతున్నాం---ఇక్కడ చూడు..."

ఆశ్చర్యపోతూనే వెనుక గుమ్మం నుండి ఇంట్లోకి వెళ్ళారు.

                                                                                                     (ఇంకా ఉంది) ************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి