1, మే 2020, శుక్రవారం

స్వర్గం-నరకం...(కథ)




                                                        స్వర్గం-నరకం
                                                                 (కథ)

సింధుజాకి పట్టు శాలువా వేసి సత్కరించి, అవార్డు ఇచ్చిన వెంటనే ఆ శభలో ఉత్సాహంతో చప్పట్లు మారుమోగినై. మొదటి వరుసలో కూర్చోనున్న లక్ష్మీప్రసాద్ మొహంలో మాత్రం ఎటువంటి సంతోషమూ లేదు.అందరూ చప్పట్లు కొడుతున్నారు కాబట్టి ఇష్టంలేకపోయినా శబ్ధం రాకుండా అతనూ చప్పట్లు కొట్టాడు.

"సింధుజా ఈ సంవత్సరం జాతీయ ఉత్తమ నటిగా ఎన్నుకోబడి, అవార్డు తీసుకున్నట్లే, రాబోవు సంవత్సరాలలో కూడా సాధించి, తన కళా సేవను దేశానికి అంకితం చేయాలని ఆమెను దీవిస్తున్నాను" అంటూ కత్తిలాగా మాట్లాడి తప్పుకున్నాడు మంత్రి.

తరువాత దర్శకుడు చక్రవర్తి మాట్లాడటానికి లేచాడు.

శభలోని ముందు వరుసలో కుర్చోనున్న లక్ష్మీప్రసాద్ తన సీటు నుండి మెల్లగా లేచి, బయటకు నడిచాడు. వేదికపై కూర్చున్న సింధుజా అది గమనించింది. అప్పుడు ఆమె మనసులో ఏర్పడిన భారం ఆమె మొహంలో తేడా తెప్పించింది.

"సింధుజాని సినిమా ఇండస్ట్రీకి మొట్ట మొదట పరిచయం చేసిన నేను, ఆమెకు జాతీయ బహుమతి తెచ్చిపెట్టిన ఇరవై ఐదో చిత్రాన్ని కూడా నేనే నిర్మించి, దర్శకత్వం వహించానని అనుకుంటున్నప్పుడు నా మనసులో ఒక మంచి నటిని పరిశ్రమకు పరిచయం చేసేననే గర్వం కలుగుతోంది..." --- దర్శకుడు చక్రవర్తి మాట్లాడుతున్న మాటలు చెవులలో మెల్లమెల్లగా సన్నగిల్లి చెవులకు తగలటం తగ్గుతుండగా......

లక్ష్మీప్రసాద్ వాహనాలు పార్క్ చేయబడ్డ ఆ మైదానంలో అత్యంత ఖరీదైన తన కారులో ఎక్కి, గాజు డోర్ దింపుకుని, సిగిరెట్టు వెలిగించి బయటకు పొగ వదిలాడు. అతని మనసు అతన్ని పాత జ్ఞాపకాలలోకి తీసుకు వెళ్ళింది.

పెళ్ళై పది రోజులే అయిన ఒక రోజు రాత్రి. వేరు కాపురం. వైష్ణవి ఇంటి పనులు ముగించుకుని భర్త దగ్గరకు వచ్చి ఆనుకుని కూర్చుంది. అతని భుజాల మీద తల పెట్టుకుని "ఏ...మండీ..." బ్రతిమిలాడుతున్నట్టు పిలిచింది.

"ఏమిటి?"--- చేతితో ఆమె మొహాన్ని పైకెత్తి చూశాడు.

"నాకొక ఆశ! నెరవేరుస్తారా...?"

"............"

"పుట్టింట్లో నెరవేరలేదు. మీరైనా నన్ను అర్ధం చేసుకుని నెరవేర్చండి"

"మొదట నీ ఆశ ఏమీటో చెప్పు?"

“విన్న తరువాత తిట్టకూడదు. అదే సమయం పిచ్చి ఆశ అని తోసేయకూడదు"

"నువ్వు విషయం చెప్పు?"

"అదొచ్చి...అదొచ్చి...నాకు సినిమాలో నటించాలని ఆశ"

ఎదురుచూడని కోరిక. లక్ష్మీప్రసాద్ ఉలిక్కిపడ్డాడు.

"ఏం...అది తప్పా?"--- వైష్ణవి అమాయకంగా అడిగి పక్కకు జరిగింది.

"లేదే...!" అని చెప్పిన లక్ష్మీప్రసాద్, అందమైన దేవతలాంటి భార్య ముఖంలోకి చూశాడు.

"నేను స్కూల్లో, కాలేజీలో చాలా నాటకాలలో నటించాను. ఇదిగో చూడండీ..."--దిండు క్రింద రెడీగా ఉంచుకున్న ఫోటోలను తీసి చూపించింది.

వాటిని తీసుకున్న లక్ష్మీప్రసాద్ ఒక్కొక్క ఫోటోను చూస్తూ వెళ్ళాడు. పది ఫోటోలకు పైనే ఉంటాయి. వైష్ణవి నాటకాలలో చాలా వేషాలు వేసున్నది. అన్నిట్లోనూ అద్భుత ముఖ భావాలూ. ఏ వేషంలోనైనా జిగేలు మనిపించే ముఖ కవళిక, అద్భుతమైన బాడీ లాంగ్వేజ్.

కొందరు రాయడం, గీయడం, డాన్స్, భరత నాట్యం అని మనసుపెట్టి ప్రకాశించినట్టు, వైష్ణవికి నటించడంలో ఇంటరెస్టు. అతనికే అర్ధమైయ్యింది. కానీ అర్ధం చేసుకుని ఏం చేయాలి? సులభంగా చేరి చదువుకునేటట్టు --- సినిమా ఏమీ ప్రభుత్వ పాఠశాల కాదు. అది వచ్చిన వాళ్ళందరినీ స్వాగతించి దీవించి జీవింపచేసే ఇండస్ట్రీ కాదు.

"సినిమా రంగంలో నా బాబాయ్ కొడుకు ఒకడు 'స్టిల్ ఫోటో గ్రాఫర్’ గా ఉంటున్నాడు. అతనొకసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఈ ఫోటోలన్నీ చూపి నా ఆశ తెలిపాను. 'రా అక్కా...నేను చేర్పిస్తాను’ అని చెప్పాడు. నేను మా నాన్న దగ్గర 'కేశవ్ ఇలా చెప్పి వెళ్ళాడు’ అని చెప్పానో లేదో...."చెప్పుతో కొడతా! సినిమాలలోకి వెళ్ళి నాశనమైపోవాలా? వద్దు...అనవసరమైన ఆశ. మనసును పాడు చేశే ఆ వెధవ మన ఇంటి వైపుకు వచ్చేడంటే చంపేస్తాను" అని అరిచారు. దాంతో నేను ఇక ఆ ఆశ విషయం గురించి మాట్లాడలేదు"...చెప్పటం ఆపింది.

"ఇప్పుడు ఆ ఆశను నా దగ్గర బయట పెడుతున్నావు...అంతే కదా?"-- లక్ష్మీప్రసాద్ భార్యను చూసి తిరిగి అడిగాడు.

"అవునండీ! అతను ఈ ఇండస్ట్రీలో చాలా రోజులుగా ఉంటున్నాడు. వాడికి దర్శకులు, నిర్మాతలు, సినిమా కంపెనీలు తెలుసు. పరిచయం ఉంది. ఖచ్చితంగా చేరుస్తాడు. దీనికోసమే నేను హైదరాబాద్ వరుడు తప్ప ఇంకే వరుడూ వద్దని తోసిపారేశాను. నాకేమో ఆ సినిమా రంగంలోకి వెడితే పెద్ద నటిగా వస్తానని మనసులో గట్టిగా అనిపిస్తోంది. ఒక వేల ట్రై చేసి ఆ రంగంలో పైకి రాలేకపోయినా మనసుకు తృప్తిగానే ఉంటుంది. ప్రయత్నమే చేయకుండా ఉండిపోతే జీవితమంతా ఏదో ఒక అసంతృప్తి" --ఆమె మనసులో ఉన్నదంతా ఒక్కటి వదలకుండా భర్త దగ్గర ఒలకబోసింది.

విన్న లక్ష్మీప్రసాద్ కి ఆశ్చర్యంగా ఉన్నది. 'ఈమె ప్రయత్నాన్ని వాళ్ళ కుటుంబం వమ్ము చేసినా, ఆమె తన ఆశను విడిచిపెట్టకుండా ఎంతో జాగ్రత్తగా నెరవేర్చుకోవటానికి ప్రయత్నిస్తోంది’--తలచుకుంటుంటే అతనికి ఆశ్చర్యం ఎక్కువ అవుతోంది.

సినిమా ఇండస్ట్రీ అనేది పెద్ద కలల ప్యాలస్. సినిమా వరకు...స్క్రీనుకు ముందు ప్రకాశవంతమైన కాంతి, స్క్రీనుకు వెనుక చీకటీ నిండుకోనుంటుంది. ఇతనే ఆశపడి నటించటానికి పరిగెత్తినప్పుడు...చాలా చేదు అనుభవాలు. 'రేపు తెల్లారుతుంది...ఎల్లుండి తెల్లారుతుంది’ అని నమ్మి ఎలాగెలాగో జీవించి, యుక్తవయసును పారేసుకున్న యువకుల గుంపు. వీరితో పాటూ యువతుల నాశనం.

ఇదంతా చూసి మనసు విరిగిపోయి తిరిగి వచ్చిన వాడే...తరువాత దాని గురించి ఆలొచించనే లేదు. తిరిగి చూడనే లేదు. ఇప్పుడు భార్య మూలంగా ఒక మరు పరిశీలన! లక్ష్మీప్రసాద్ తాను చూసిన, అనుభవించిన, విన్నవి అన్నీ చెప్పాడు.

ఓర్పు పోగొట్టుకున్న వైష్ణవి, "మీరు చెప్పేదంతా కరెక్టే. కాదని చెప్పను! దారి చూపే మనిషి ఉన్నాడు కాబట్టి ఎక్కడా అడ్డంకులు లేకుండా వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తోంది" అన్నది.

'ఇది బాగా ముదిరిపోయిన ఆశ. తనలాగా అనుభవపడితేనే తెలుస్తుంది. అంతవరకు ఎవరు...ఏం చెప్పినా అర్ధం కాదు!'---అతనికి బాగా అర్ధమయ్యింది.

"సరే! అతన్ని రమ్మను...మాట్లాడదాం" అన్నాడు లక్ష్మీప్రసాద్. అది విన్న వైష్ణవి మొహంలో వెయ్యి వోల్ట్స్ కాంతి.

మరుసటి రోజు ప్రొద్దున ఫోనులో కాంటాక్ట్ చేసి రమ్మని చెప్పింది. కేశవ్ రెండు రోజుల తరువాత వచ్చాడు.

"ఏంటబ్బాయ్...ఎలా?" అని లక్ష్మీప్రసాద్ విచారించాడు. మనం మన వల్ల అయినంతవరకు ప్రయత్నం చేద్దాం. ఆపద వస్తోందనిపిస్తే వదిలేద్దం. భయం వద్దు" అని సమాధానం చెప్పాడు.

"సరే"... లక్ష్మీప్రసాద్ తల ఊపాడు.

మరుసటి రోజు నుండి వేట...లక్ష్మీప్రసాద్ తన వ్యాపారం చూసుకోగా... కేశవ్ వైష్ణవిని తీసుకుని సినిమా కంపెనీల చుట్టూ తిరిగాడు.

తిరుగుడు, కాచుకోవటం, మనో బాధ, ముఖం ముడుచుకోవటం, పక్కకు తొసేయటం. పది రోజులలోనే వైష్ణవి రంగు మారి కొంచం నల్ల బడింది...మొహం వాడిపోయింది.

"ఏమైంది?"-- లక్ష్మీప్రసాద్ భార్యను అడిగాడు.

"ఈరోజు ఒక పెద్ద నిర్మాత కం డైరెక్టర్ ను కలిశాము. ఆయన తీసే ప్రతి సినిమా హిట్టే. అదే ఆయన అదృష్టం. చెప్పిన మాట కాపాడే మనిషి. ఖచ్చితంగా తన సినిమాలో పరిచయం చేస్తానని మాటిచ్చాడు. కానీ, ఆయనకూ నీచమైన ఆశ ఉన్నది"---గొంతు బొంగురు పోయింది.

"హూ...ఇది తెలిసిన విషయమే కదా?"

"మనసుకు కష్టంగా ఉంది"

"సరి...వదిలిపారేయ్. అటు పక్కకు వెళ్ళకు! దూరంగా వచ్చాయి"

"అలాగే అనుకున్నా. కానీ కుదరటం లేదు..."---ఏడ్చింది.

"అర్ధం కాలేదు...?"

"ఎవర్ని కలిసినా, అన్నీ మాట్లాడి చివరికి అక్కడికే వస్తున్నారు. ఎలా పోరాడి చూసినా, ఆడవాళ్ళ వరకు ఆ కోటను పట్టుకోవాలంటే అదే తాళం చెవి. వేరే 'దారే లేదు" అని గట్టిగా చెప్పిన ఆమె "తప్పో-రైటో...నా మనసులో ఒకటనిపిస్తోంది! చెప్పనా...?" అన్నది.

అతను మౌనంగా ఆమెను చూశాడు.

"నేను న్యాయమని చెప్పటం లేదు. మనసు ఇష్టపడి చెప్పటం లేదు. అయినా చెబుతున్నాను. చేపలు పట్టాలంటే ఎర వెయ్యాల్సిందే. వ్యాపారం చేయాలంటే మొదట పెట్టుబడి పెట్టాలి. ఎలా చూసినా ఒకటి పొందాలంటే, ఒకటి వదులుకోవాలనేది విధి. అలా ఆలొచించినప్పుడు వాళ్ళు ఎదురు చూసే విషయం తప్పుకాదని నాకు అనిపిస్తోంది. మీరు ఏమనుకుంటున్నారు?"--అడిగింది.

ఆమె మాట్లాడిన మాటల్లోని అర్ధం లక్ష్మీప్రసాద్ కి అర్ధమయ్యింది. అతను విరిగిపోయాడు. కానీ, దానిని బయటకు తెలియనివ్వకుండా తన కళ్ళతోనే పరిశోధించాడు. వైష్ణవి మళ్ళీ మొదలుపెట్టింది.

"దేన్నైనా పెద్దగా అనుకుంటే. అది పెద్దదే. చిన్నదిగా అనుకుంటే చిన్నదే. ఆ పరిశ్రమలో నేను గొప్పగా సాధించగలను అని మనసు సూచిస్తోంది. ధైర్యం చేసి దిగమని చెబుతోంది. కానీ...దానికి మీరు మనసు పెట్టాలనేదే విషయం. అదే సమయం మీ మాటను ఎదిరించి నేను ఏదీ చేయను. చేసి జీవితాన్ని నాశనం చేసుకోననేది సత్యం...నిర్ణయం మీది!"

నిర్ణయాన్ని భర్తకు వదిలేసి పడుకుంది.

భర్తకు రాత్రంతా అలలు అలలుగా ఆలొచనలు. భార్య మాట్లాడిన ప్రతి మాటనూ క్రిందా మీదా పడేసి అన్వేషించాడు.

'ఒక ఆడది తనని తాను కానుకగా ఇచ్చుకుని...తను అనుకున్నది సాధించ దలచుకుంది అంటే...దాని మీద ఆమెకు ఎంత అభిరుచి, ప్రేమ, సాధిస్తామనే పట్టుదల. మనసు తలుచుకుంటే కొండనైనా జరపవచ్చు. ఏదైనా సాధించవచ్చు. దానిని చెదరగొడితే...చివరి వరకు వేదనతో జీవించవలసి వస్తుంది. అలా చెదరగోట్టి జీవించి ఎవరికి లాభం? 'దేనినైనా పెద్దదిగా చూస్తే పెద్దది. చిన్నదిగా చూస్తే చిన్నది. సత్య పూర్వకమైన మాట. తాలి కట్టి ఒకరి ప్రతిభను అడ్డుకోవటం ఏమి ధర్మం!' ---- లక్ష్మీప్రసాద్ చాలాసేపు ఆలొచించి ఒక నిర్ణయానికి వచ్చాడు.

ప్రొద్దున్నే భార్యను పిలిచాడు.

"వైషూ!"

"ఊ...చెప్పండి..."

ఆశగా దగ్గరకు వచ్చింది.

"నీ నిర్ణయం, నాకు సమ్మతం"

"చాలా సంతోషమండి!"

ఆమె ముఖం వికసించింది.

"కానీ ఒక కండిషన్!"

"ఏ.మి.టి"---అదే క్షణం ఆమెలో ఏదో తెలియని అలజడి.

"ఈ రోజు నుండి మన మంచాలు వేరు వేరు. దాంపత్యం తప్పించు దంపతులు!"

"అయ్యో!"---అని అరిచింది.

"ఆందోళన చెందకుండా నేను చెప్పేది విను. తాలి కట్టినందువలన ఒకరి ప్రతిభను చంపటం, అది మహా పాపంతో సమానం. అందువలన నీ ఇష్టానికి విరుద్దంగా నేను నిలబడ దలుచుకోలేదు. తరువాత...నేను సాధారణ, సరాసరి మనిషిని. నాకు సొంతమైన వస్తువును ఇంకొకరు ముట్టుకునేటప్పుడు ఏర్పడే న్యాచురల్ వికారం నాలోనూ ఉన్నది కనుక ఈ నిర్ణయం"

"జీవితమే సమస్య అనుకుని ఒప్పుకుంటే, నీ ఆశ, పట్టుదల లేనిది. అర్ధ నగ్నం, మోహం అనేది ఖచ్చితం. నేను నిన్ను ఎలా అర్ధం చేసుకున్నానో...అదేలాగా నువ్వు నన్ను అర్ధం చేసుకుని యుద్ద భూమిలో దిగు. ఆల్ ద బెస్ట్..." అన్నాడు.

ఏమీ మాట్లాడకుండా విన్న వైష్ణవి ముఖాన ఒక రోజంతా ఇరకాటం. మరుసటి రోజు కొంచం తేరుకుని "చాలా థ్యాంక్స్ అండి..." అన్నది. వెంటనే తను అనుకున్న ప్రయత్నంలోకి దిగింది.

ఆమె పేరు సింధుజాగా మారి, షూటింగ్ మొదలయ్యి మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్ కొట్టింది! తరువాత సినిమాలు కూడా అంతే హిట్టు కొట్టినై. ఇంకేముంది...నెంబర్ ఒన్ నటి అయ్యింది. నాలుగు రాష్ట్రాలలోనూ ఉత్తమ కథా నాయకిగా ఎన్నుకోబడి కోలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ అని అన్ని భాషలలోనూ నటించి నటిగా అగ్రస్థానం దక్కించుకుంది...ఇదిగో జాతీయ ఉత్తమ నటి అవార్డు.

ఎవరో తలుపు తెరవగా...ఫంక్షన్ హాలులో నుండి చప్పట్ల శబ్ధం. జనం బయటకు వస్తున్నారు. ఉత్తమ జాతీయ నటి సింధుజా కూడా బయటకు వచ్చింది. కొంచం సేపట్లో ఆమె చుట్టూ జనం గుమికూడారు. కెమేరా లైట్లు ఫ్లాష్ అవుతూనే ఉన్నాయి. ఆటొగ్రాఫులలో సంతకాలు...అన్నీ ముగించుకుని సింధుజా తన కారు దగ్గరకు వచ్చి "వెల్దామా?" అని అడిగి భర్త పక్కన కూర్చుంది.

లక్ష్మీప్రసాద్ మౌనంగా కారు తీశాడు. ఇళ్ళు వచ్చేంతవరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు. కారును షెడ్లో పెట్టి, రిలాక్స్ అవటానికి మంచం దగ్గరకు వెళ్ళేంత వరకు అదే పరిస్థితి.సింధుజా తన గదిలోకి వెళ్ళకుండా, భర్త వెనుకే వచ్చి అతని గదిలోకి వస్తున్నప్పుడు ఆమెను చూశాడు లక్ష్మీప్రసాద్.

"ఏమిటి సింధుజా...ఏదైనా మాట్లాడాలా?" అని అడిగాడు.

"అవును!"---ఆమె చెప్పి మంచం మీద సైలంటుగా కూర్చుంది.

"చెప్పు..."

"ఇక మీదట నేను సింధుజా కాదు. వైష్ణవిని...ఈ రోజు నుండి ఈ మంచం నాకూ సొంతమే!"

"ఎందుకని?"

"నటించటం మానేశాను...ఇక పూర్తి సమయం మీతోనే!"

"వైష్ణవీ!"---అంటూ ఆశ్చర్యపడ్డాడు.

"చాలండి ఈ జీవితం! బయట స్వర్గం, లోపల నరకం. ఒకసారి ఎవడో ఒకడు ముట్టుకున్నాడని తొమ్మిది సంవత్సరాలు వనవాసం. ఇక ఈ నరకం నేను తట్టుకోలేను. మీ ఒంటరి తనాన్నీ సహించలేను. ఆ రోజు నా మనసును మీరు గౌరవించారు. మీ మనసును నేను ఆమొదించాను. అది సరి సమం అయిపోయింది"

"దానికి శిక్షగా మన దాంపత్యానికి నిషేదం. దాన్ని కూడా నేను సాధించి సమం చేశేశాను. ఇంతకు పైన ఈ జీవితం ఎందుకు? అవసరం లేదు. ఇకపై మనిద్దరం భార్యా-భర్తలం. ఏమంటారు?" ఆశగా చూసింది.

లోపల ఆలొచనలు సుడిగుండం లాగా తిరుగుతుంటే లక్ష్మీప్రసాద్ కళ్ళు రెప్ప వాల్చకుండా వైష్ణవిని చూస్తూ ఉండిపోయినై.

భర్త అలా చూస్తుంటే వైష్ణవికి ఏడుపు ముంచుకు వచ్చింది. మొహం ఎర్రబడింది.

లక్ష్మీప్రసాద్ నిదానం తెచ్చుకున్నాడు.

“నువ్వు ఇంకా సాధించాలి. చనిపోయేంత వరకు సాధిస్తూనే ఉండాలి. దానికి ఎటువంటి అడ్డంకులూ ఉండకూడదు. కానీ వెళ్ళే దోవలో ముళ్ళు అడ్డుపడతాయి. అడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, ముళ్ళు వచ్చి మనమీద పడినా, మనం వెళ్ళి ముళ్ళ మీద పడినా దెబ్బతినేది ఆడతనం అనే పువ్వు కే" అంటూ వైష్ణవిని దగ్గరకు లాక్కుని గట్టిగా కౌగలించుకున్నాడు.

"ఏ.మం.డీ..."

అతని హృదయానికి అతుక్కుపోయింది వైష్ణవి.

                                                                                                                సమాప్తం ****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి