25, మే 2020, సోమవారం

గాలితో ఒక యుద్దం (సీరియల్)..PART-9




                                            గాలితో ఒక యుద్దం (సీరియల్)
                                                                (PART-9)


జీవితంలో గొప్పగా విజయం సాధించిన కొందరి దగ్గర ఒక సర్వే జరిగింది. వాళ్ళందరూ వాళ్ళ విజయానికి కారణం వాళ్ళు చిన్న వయసు నుండే కలలు కన్న వాళ్ళుగా ఉండటమే ఆశ్చర్యం.

అందులో పలు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినై. విజయం సాధించినవారి విజయం వెనుక వాళ్ళ తల్లి-తండ్రుల కలలూ దాగి ఉన్నాయి.

ముఖ్యంగా సినిమా రంగంలో పెద్దగా విజయం సాధించిన వారి మనసుల్లో వాళ్ళు చాలా కాలంగా సినిమాలో విజయం సాధించాలనే పడ్డ తపన...కోరిక ఎక్కువగా ఉన్నది.

అదేలాగా క్రికెట్టులో విజయం సాధించటానికి ఒక వీరుడు, "నేను ఎప్పుడూ ఎదో ఒకటి తీసుకుని దానితో ఒకదాన్ని కొడుతూ ఉండే వాడిని. అదేలాగా రోడ్డు మీద పడున్న రాళ్ళను ఏరుకుని ఎక్కడైనా గురిచూసి వేసేవాడిని" అన్నారు.

తరువాత రోజులలో అతను ఎలా కొట్టినది...గురి చూసి వేసినదే క్రికెట్టు ఆటలో అతన్ని పెద్ద వీరుడుగా చేసింది.

మనసులో పాతుకుపోయిన ఇలాంటి ఇష్టాలు ఎలా విజయంగా మరినై? దాన్నీ నిపుణులు కనుగొన్నారు. అది ఒక ఆశ్చర్యకరమైన జవాబే!

వెక్కి వెక్కి ఏడుస్తున్న కార్తిక్ ను గమనించిన వీరబద్రం "కార్తిక్... ఎవరురా ఫోనులో...ఎందుకురా ఏడుస్తున్నావు?"

“బద్రం! దెబ్బకు పైన దెబ్బరా. నన్ను పాము కరిచిన విషయం తెలిసి అమ్మా-నాన్నలు బెదిరిపోయి ఒక కారులో నన్ను చూడటానికి వస్తున్నారు. వచ్చే దారిలో వారు కారు ప్రమాదానికి గురై వాళ్ళిద్దరూ రోడ్డు మీద పడున్నారట..."

"నిజంగానా! అవును...ఎక్కడ?"

"నువ్వు వేగంగా వెళ్ళు...మనం వచ్చిన దారిలోనే"--కార్తిక్ కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పడంతో......

"అంతలోపు ఇంత దూరం వచేశారా?"--అని అడుగుతూ, కారు వేగం పెంచాడు వీరబద్రం. కారు వేగానికి మట్టిరోడ్డు కదా దుమ్ము పైకి లేచింది.

రోడ్డుకు చివర్లో నడుస్తున్న బాతుల గుంపు నీటి గుంట ఉన్న వైపు వెడుతున్నాయి. అవన్నీ కారు వేగం చూసి బెదిరిపోయి ఎగరటంతో కలవరం మొదలైంది.

బాతులను తోలుకెలుతున్న కాపరి అలాగే పక్కనున్న మొక్కల పొదల్లో పడుతూ గట్టిగా అరిచాడు.

వీరబద్రానికి మొదటి సారిగా...'ఒకవేల నిజంగానే గాలిదేవుడు ఉన్నాడో?' అనే ఆలొచన మొదలైయ్యింది.

                                                        ****************

రోడ్డు చివర!

అక్కడున్న చింత చెట్టుకు ఒక కారు ఢీ కొని, కారు బ్యానెట్ తెరవబడి ఉండగా...కారుకు ఇరుపక్కలున్న డోర్స్ పక్షి రెక్కలలాగా విరుచుకోనున్నాయి.

"అదిగో ఆక్సిడెంట్ కారు...!"

వీరబద్రం ఎదురుగా చూస్తూ కొంచం గట్టిగా చెప్పగా... కార్తిక్ గమనించాడు.

వేగంగా వచ్చిన వీరబద్రం కారు...యాక్సిడెంట్ అయిన కారును అనుకుని నిలబడ్డది. అదే సమయం...సైరన్ మోతతో ఒక ఆంబులాన్స్ వచ్చి నిలబడ్డది. చుట్టూ ఉన్న ప్రజలందరూ అక్కడ గుమికూడారు.

కార్తిక్ ఆందోళనతో తనొచ్చిన కారులోంచి దిగి పరిగెత్తాడు.

రామశర్మ గారు, విమలాదేవి ఒకరి మీద ఒకరు పడున్నారు. ఇద్దరిలో విమలాదేవికి తలమీద దెబ్బ తగిలి రక్తం కారుతోంది. రామశర్మ గారికి కాలు మీద గాయం.

వణుకుతూ వాళ్ళను ముట్టుకోవటానికి వెళ్ళిన కార్తిక్ ను ఆంబులాన్స్ లో వచ్చిన హాస్పిటల్ స్టాఫ్ పక్కకు తోసి, వాళ్ళిద్దర్నీ స్టెక్చర్లో ఎక్కించారు. వాళ్ళతో వచ్చిన డాక్టర్ ఆంబులాన్స్ లోనే చేయాల్సిన ఫస్ట్ ఏయిడ్ చెయటం మొదలుపెట్టాడు.

ఐదు నిమిషాలు కూడా అవలేదు! ఆంబులాన్స్ బయలుదేరింది.

"అమ్మా...నాన్నా..." అంటూ కేకలు వేశాడు కార్తిక్.

"మీరు వాళ్ళ అబ్బాయా?"

"అవును డాక్టర్"

"అలాగే ఫాలో చేస్తూ రండి. ప్రాణాపాయం ఏమీ లేదు. కానీ, ఎముకులు విరగటానికీ...చర్మం గీసుకుపోవటానికీ ఎక్కువ చాన్స్ ఉంది"-- అన్నారు.

డాక్టర్ మాట్లాడుతున్నప్పుడు...యాక్సిడెంట్ జరిగిన చోటును తన మొబైల్ కెమేరాలోనూ, డిజిటల్ కెమేరాలోనూ ఒకతను పలు కోణాలలోంచి ఫోటోలు తీసాడు. ఇంతలొ పోలీసులు కూడా వచ్చారు.

"అయ్యా...'ఢాం' అని పెద్ద శబ్ధం వినబడగానే వచ్చి చూసానయ్యా. ఒకాయన, ఒకమ్మగారూ బోర్లా పడున్నారు. కారు డ్రైవ్ చేసుకు వచ్చిన డ్రైవర్...మేము చూసేటప్పుడు పరిగెత్తి వెళ్ళిపోయాడండి”

"దొంగ వెధవ...మందు తాగి కారు నడిపుంటాడు. అందుకనే చిక్కితే చితకబాదుతారని పరిగెత్తి తప్పించుకున్నాడు..." అని ఒక పోలీస్ అతను చెప్పగా, ఇంకొక పోలీసు కారును ఒక చుట్టు చుట్టి వచ్చాడు. 'డాష్ బోర్డు’ నుండి చూడ గలిగింది చూశాడు. ముఖ్యంగా 'ఆర్.సి పేపర్లూ', 'ఇన్స్యూరన్స్ జెరాక్స్’ ఒక కవరులో ఉన్నాయి. అది చాలు వాళ్ళకు...డ్రైవర్ను పట్టుకుని లోపల వెయ్యటానికి.

ఆంబులాన్స్ బయలుదేరింది. వీరబద్రం, కార్తిక్ దాన్ని వెంబడించారు.

వీరబద్రం ఈ సారి కార్తిక్ దగ్గర ఏమీ అడగలేదు, మాట్లాడలేదు.

కానీ, అతని మనసులో 'గాలిదేవుడు ఇలా ఒక కోపమైన దేవుడా?' అనే ప్రశ్న మాత్రం పెద్దగా తలెత్తింది.

                                                         *********************

ఖచ్చితంగా ఇరవై గంటల విరామం తరువాత రామశర్మ గారు, విమలాదేవి గారూ కళ్ళు తెరిచారు.

రామశర్మ గారికి తొడ ఎముక విరిగింది. 'ప్లేట్' పెట్టాలి. విమలాదేవి గారికి తల మీద ఆరు కుట్లు వేశారు.

కళ్ళు తెరిచిన రామశర్మ గారి కళ్ళ ముందు, ఏడుస్తున్న కార్తిక్, అతనికి దగ్గరగా అతని భార్య అఖిలా, చెల్లెలు పల్లవి. వాళ్ళ ముఖాలు వాడిపోయున్నాయి.

"కార్తిక్..."

"నాన్నా..."

"నీకేమీ అవలేదే...?"

"నన్ను చూస్తున్నారు కదా నాన్నా...నేను బాగానే ఉన్నాను"

"పాము కరిచినట్టు 'ఫోన్’ వచ్చిందే?"

"అవును! కానీ, నాటు వైద్యుడు కాపాడాడు. ‘జి.హెచ్’ కు వెల్లి ఇంజెక్షన్ చేయించుకున్నాను. 'ఐ యాం ఆల్ రైట్'! కానీ మీకు ఇలా జరగటమే నన్ను ఎక్కువ కలవరపరిచింది"

"నన్ను వదులు! మీ అమ్మ ఎలా ఉంది?"

"బాగుంది...మాట్లాడుతోంది"

"భగవంతుడా! కాపాడేవయ్యా...కాపాడేశేవు"

"అవును నాన్నా...ఆ గాలిదేవుడు మనల్ని చిన్నగా దెబ్బ వేసి వదిలేశాడు. నేను ఇక మీదట ఆ ఇంటి పక్కకే వెళ్ళను నాన్నా. బామ్మ చెప్పింది కరెక్టే! ఆ దేవుడు చాలా పవర్ ఫుల్"

"అవును కార్తిక్...దాన్ని యాక్సిడెంట్ అయిన చోటే గ్రహించాము"

రామశర్మ గారు అలా మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వీరబద్రం వచ్చాడు.

అతని చేతిలో ఆపిల్, ఆరెంజ్ పండ్లు.

"వీరబద్రం...వచ్చేశేవా? నిన్నే మొదటగా చూడాలని ఆశపడ్డాను. రా...రా..."

"మీకు ఇప్పుడెలా ఉంది అంకుల్?"

"కాలు ఎముక విరిగిందట! కట్టు వేసి 'పైన్ కిల్లర్’ ఇంజేక్షన్ ఇచ్చినందు వలన మీ అందరితో మాట్లాడ గలుగుతున్నాను"

"యాక్సిడెంట్ ఎలా జరిగింది అంకుల్...డ్రైవర్ తాగుబోతా?"

"లేదబ్బాయ్...మంచి డ్రైవర్. నాకు బాగా అలవాటున్న వాడు"

"మరెలా...?"

"చెబుతాను...!”

                                                                                                      (ఇంకా ఉంది) ************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి