15, సెప్టెంబర్ 2019, ఆదివారం

తొలివలపు (సీరియల్)....PART-10



                                             తొలివలపు….(సీరియల్)
                                                          (PART-10)

రాత్రి పన్నెడు గంటలు అవుతున్నా నిద్రరాక అటూ ఇటూ దొర్లుతోంది గాయత్రి. నిద్ర ఎలా వస్తుంది. ఒకటా...రెండా? ఇరవై సంవత్సరాలు తరువాత కదా వదిలి వెళ్ళిన రక్త సంబంధం మళ్ళీ వచ్చి అతుక్కుంది. ఈ విషయాన్ని ఎలా-ఎవరితో చెబుతుంది? తడిసిన దిండు హాయిని ఇవటం దిక్కరించినప్పుడు లేచి కూర్చుంది. ఏడుపు ఆపేసినా ఆమె కళ్ళల్లో శోకం ఇంకా కనబడుతూనే ఉన్నది.

'కావ్యా!' అప్పుడే పూసిన పువ్వుకు నేను పెట్టిన పేరు కదా ఇది. ఎలా మరిచిపోతాను. నిన్ను నా హృదయానికి హత్తుకుని లాలించిన రోజులను ఎలా మర్చిపోతాను? నా చిట్టి తల్లీ! బంధువులే లేకుండా ఏకాకిగా తిరుగుతున్న నాకు 'బంధువు నేనున్నాను’ అని చెప్పటానికి వచ్చావా? నల్లటి మేఘాలన్నీ ఒకచోట జేరి వర్షం కురుస్తున్నట్లు, నీ జ్ఞాపకాలు మాత్రమే నా మనసంతా నిండి సంతోష జల్లు పడుతున్నట్టు ఉన్నది. ఇక నేను అనాధను కాను...అనాధను కాను.

కావ్యా! నా ప్రియమైన చెల్లి...ఈ నిజాన్ని ఈ ప్రపంచంలో అందరికీ వినబడేటట్టు అరిచి చెబుతాను, 'ఈమె నా రక్త సంబంధం' అని! చాలు. మనిషికోపక్క అనాధగా మనం జీవించింది చాలు కావ్యా. నా దగ్గరకు వచ్చేయి. నీకు నేనున్నానే చిట్టి తల్లీ! కానీ...కానీ...నా చెల్లీ...నన్ను క్షమిస్తావా? నీ పేగు బంధాన్ని గుంట తవ్వి పూడ్చిపెట్టిన దాన్ని నేనే అని తెలిస్తే నన్ను అక్కయ్యగా ఆదరిస్తావా?

అయ్యో! వద్దు. నువ్వు బలహీనమైన గుండెను మోసుకుంటూ తిరుగుతున్నావు. నిజాన్ని తట్టుకునే శక్తి నీకు లేదు. నాతోనే అన్నీ సమాధి అయిపోనీ. దూరంగా ఉండైనా నా ప్రేమను నువ్వు అర్ధం చేసుకోవాలి. నాకు అది చాలు. నేను పోగొట్టుకున్న సంతోషాలను నీకైనా వెతికి ఇస్తాను. ఇది సత్యం!'

లేచి వెళ్ళి మంచి నీళ్ళు తాగింది. తిరిగి వచ్చి గడియారం చూసింది. మధ్య రాత్రి మూడు దాటింది. తెల్లారే వరకు మేలుకునే ఉన్నది గాయత్రి.

********************

"నిజంగానా చెబుతున్నావా" పద్మా నర్స్ ఇలా అడగటం అది పదోసారి.

"ఇంకా నువ్వు నన్ను నమ్మటం లేదా?" - విసుగ్గా అన్నది జానకి.

"అదికాదే. గాయత్రి మ్యాడమ్ గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. కారణం లేకుండా గాయత్రి మ్యాడమ్ ఏ విషయంలోనూ కలుగజేసుకోదు. ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు"

"నీకు అన్నిటికీ అనుమానమే"

"సడన్ గా నీ మీద ఆమెకు ఎందుకు అంత ప్రేమ? నాకెందుకో డౌట్ గా ఉంది"

"అదే నాకూ అర్ధం కాలేదు"

ఇద్దరూ ఆలొచనలో ఉన్నప్పుడు నర్స్ కల్యాణి లోపలకు వచ్చింది.

"జానకీ, నిన్ను మ్యాడమ్ పిలుస్తోంది"

"ఎందుకు?"

"నాకేం తెలుసు. రమ్మని చెప్పారు"-- అని చెప్పి వెళ్ళిపోయింది.

"సరే...నాకు డ్యూటీ ముగిసింది. నేను బయలుదేరుతాను జానకీ. నువ్వెళ్ళి ఏమిటో చూడు" అని చెప్పి నర్స్ పద్మ కూడా బయలుదేరింది.

'ఏమై ఉంటుంది?' - అనే ఆలొచనతో గాయత్రి యొక్క గది వైపు నడవటం మొదలుపెట్టింది జానకి.

తలుపు మీద తట్టి లోపలకు వచ్చిన జానకిని చూసి... 'వచ్చేసిందా నా చిట్టి తల్లి?'….ఆమె కోసమే ఎదురుచూస్తున్నట్లు కుర్చీలో నుండి లేచి వెళ్ళి స్వాగతించి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది గాయత్రి.

తన చెల్లిని చూడాలనిపించిందే తప్ప, ఆమెతో ఏం మాట్లాడాలో తెలియక భాష మరిచి మౌనంగా నిలబడ్డ గాయత్రిని చూసి......

'ఈమెకు బుర్ర ఏమైనా చెడిపోయిందా ఏమిటి?' అనేలాగా గాయత్రినిని చూస్తూ ఉండిపోయింది జానకి. తరువాత ఓర్పు కోల్పోయింది. "మ్యాడమ్...రమ్మని చెప్పారట?" అన్నది.

"ఏమిటీ?... ఏమీలేదు. వచ్చి...అదే...రమేష్ దగ్గర నుండి ఫోన్ ఏదైనా వచ్చిందా?"

‘లేదు’ అనేలాగా జానకి తల ఊపేటప్పుడు జానకి మొహంలో కనబడ్డ శోకం గాయత్రిని కాల్చింది. దాన్ని చూడలేక,....

"సరే...నువ్వెళ్ళు" అన్నది. జానకి వెళ్ళిన కొన్ని నిమిషాల వరకు ఆలొచనలో కూరుకుపోయింది.

'కావ్యా...నా చిట్టి తల్లీ! నీలో ఏర్పడే చిన్న శోకాన్ని కూడా నా హృదయం తట్టుకోలేకపోతోంది. ఏం చేయను? నీ శోకానికి కారణం తెలియని దానినా నేను? కొంచం వైట్ చెయ్యి. నీకైన సంతోషం నీ ఇళ్ళు వెతుక్కుంటూ వచ్చేటట్టు చేస్తాను’

తన కుర్చీలో కూర్చుని బాలాజీకి ఫోన్ చేసింది గాయత్రి.

"ఏమైంది...అడ్రస్ దొరికిందా?"

"మీ ‘సెల్’ ఫోన్ కట్ చేసి గుమ్మంవైపు ఒకసారి చూడండి"

ఆమె తలెత్తి గుమ్మం వైపు చూసినప్పుడు అద్దాల తలుపు తోసుకుంటూ లోపలకు వచ్చాడు బాలాజీ.

"ఇదిగోండి" అంటూ ఒక కాగితం ముక్కను అమె ముందు జాపాడు.

"వద్దు...నీ దగ్గరే ఉంచుకో. రా...వెళదాం" అంటూ లేచి బయలుదేరింది. గాయత్రి వెనుకే నడిచాడు బాలాజీ.

ఇంకా ఉంది.....Continued in: PART-11

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి