13, సెప్టెంబర్ 2019, శుక్రవారం

తొలివలపు(సీరియల్)....PART-9

                                 
                                               తొలివలపు….(సీరియల్)
                                                             (PART-9)

ఆ ఇంటి ముందు ఆ కారు వచ్చి ఆగిన వెంటనే, అందులో నుండి దిగింది గాయత్రి. ఆ ఇంటి తలుపు తట్టి రెండు నిమిషాలు కాచుకోనున్న తరువాత ఒక మధ్య వయస్కురాలు తొంగి చూసింది.

"ఎవరు కావాలి?"

"ఇది జానకి ఇల్లేనా?"

"అవును...మీరు?"

"నా పేరు గాయత్రి. మీ అమ్మాయి నా దగ్గరే పనిచేస్తోంది"

"అరెరే! మీరా? లోపలకు రండి" అంటూ తలుపును పూర్తిగా తెరిచింది, జానకి తల్లి విశాలాక్షి.

"జానకి లేదా?"

"గుడికి వెళ్ళింది. ఇప్పుడు వచ్చేస్తుంది. ఏం తీసుకుంటారు? కాఫీనా లేక టీనా?"

"నో ధ్యాంక్స్. నేను వచ్చిన కారణం చెప్పేస్తాను. మీ అమ్మాయి రమేష్ అనే ఒకతన్ని ఇష్టపడుతోంది. దాని గురించి మీదగ్గర ఏదైనా చెప్పిందా?"

"ఏం చెబుతున్నారు మ్యాడమ్? నా దగ్గర తను ఏమీ చెప్పలేదే?" అన్నది ఆందోళనతో.

"భయపడకండి. మీ అమ్మాయి ఒక మంచి వాడ్నే ఎన్నుకుంది. ఇప్పుడు నేను ఇక్కడికి రావటానికి కారణం వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయటానికి మీ అనుమతి అడగటానికి వచ్చాను"

"సరే నండి. కానీ, అబ్బాయి గురించి"

"దాని గురించిన భయమే మీకొద్దు. మీ అమ్మాయిని సంతోషంగా చూసుకుంటాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయాల్సిన పూర్తి బాధ్యత నాది. మీరు 'ఓ.కే' అంటే చాలు. ఏమంటారు?"

"తానుగా వచ్చే మంచిని ఎవరు కాదంటారు? మగవాళ్ళు లేని ఇళ్లు. నా బాధ్యతను మీరు తీసుకుంటానని చెబుతుంటే నేను వద్దనా అంటాను? దీంట్లో నాకు పరిపూర్ణ సమ్మతం"

"నన్ను నమ్మి బాధ్యతను అప్పగించి నందుకు కృతజ్ఞతలు. అతి త్వరలో రమేష్ ఇంట్లో నుండి అమ్మాయిని చూసుకోవటానికి వస్తారు. జానకి రాగానే ఈ విషయం గురించి చెప్పండి. నేను బయలుదేరుతాను"

"కొంచం ఉండండి... అంతలోపే బయలుదేరితే ఎట్లా? సంతోషమైన విషయం చెప్పారు. ఇప్పుడే వస్తాను" అని లోపలకు పరిగెత్తింది విశాలాక్షి.

ఒంటరిగా వదిలిపెట్టబడ్డ గాయత్రి ఏం చేయాలో తెలియక అక్కడున్న ఫోటోల వైపు చూసింది. ఆమె చూపు ఇక చిన్న పిల్ల ఫోటోను చూడంగానే అక్కడే ఆగిపోయింది. సడన్ గా ఏదో అనిపించటంతో ఆ ఫోటో దగ్గరకు పరిగెత్తుకెళ్ళి, ఆ ఫోటోను చేతుల్లోకి తీసుకుని క్షుణ్ణంగా గమనించింది.

'ఇది...ఇది...'- అనుకుంటూ ఆలొచనలో ఆమె ఉన్నప్పుడు.

"జానకినే" వెనుక నుండి గొంతు వినబడింది. చేతిలో స్వీటు తో నిలబడున్నది విశాలాక్షి.

'నిజంగానే ఇది జానకీయేనా? నా కళ్ళు నన్ను మోసం చేస్తాయా ఏమిటి? గుండెల్లో ముద్ర వేసుకున్న ఆ పసి మొహాన్ని ఎలా మరిచిపోగలదు? కానీ నా సందేహాన్ని ఎలా తీర్చుకోను? ఈమె దగ్గర ఏమని అడగను? ఎం చెయ్యబోతాను?'-- అనుకుంటూ దీర్గ ఆలొచనలో పడిపోయిన గాయత్రిని చూసిన తరువాత విశాలాక్షే నోరు తెరిచింది.

"మీ దగ్గర ఒక నిజాన్ని చెప్పాలి డాక్టర్. జానకి నేను కన్న బిడ్డ కాదు" అని చెప్పటం ఆపిన విశాలాక్షిని ఆశ్చర్యంగా చూసింది గాయత్రి.

'అలాగైతే నా సందేహం కరెక్టేనా?' --ఏడుపు, సంతోషం కలిసిన ఒక విధమైన భావనతో విశాలాక్షిని చూసింది.

"మా ఆయన స్టేషన్ మాస్టర్ గా ఉండేవారు. మాటి మాటికీ ట్రాన్స్ ఫర్ పేరుతో చాలా ఊర్లకు వెళ్ళిపోయేవారు. అలా ఒకసారి రామాపురం అనే ఊర్లో ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడే జానకిని పసిబిడ్డగా ఆ ఊరి నుండి ఎత్తుకొచ్చారు. పిల్లలు పుట్టే భాగ్యమే లేదని తెలుసుకుని తీవ్ర మనొవేధనకు గురైన మాకు దేవుడే కరునించి మాకు ఈ బిడ్డను ఇచ్చాడనుకుని ఆ బిడ్డను మేము పెంచుకుందామని నిర్ణయించుకున్నాము. జానకి అని పేరు పెట్టుకుని మురిపంగా పెంచుకున్నాము. దానికి ఆరేళ్ళు ఉన్నప్పుడు ఆయన చనిపోయారు" అని చెప్పటం ఆపింది విశాలాక్షి.

అక్కడ గాయత్రికని ఉంచిన మంచి నీళ్ళ గ్లాసు తీసుకుని గబగబా తాగేసి మళ్ళీ మొదలుపెట్టింది విశాలాక్షి.

"తాను ఎవరు అనే విషయం జానకికి ఈ నిమిషం వరకు తెలియదు మ్యాడమ్. ఈ రహస్యాన్ని మీ దగ్గర చెప్పటానికి కారణం, ఒకవేల పెళ్ళి తరువాత పెళ్ళికొడుకు తరఫు వాళ్ళకు ఈ విషయం తెలియవస్తే...తరువాత సమస్య ఏదీ రాకుండా ఉండాలనే. ఇక మీరే చూసుకోవాలి "

మాట్లాడటానికి మాటలు లేక అలాగే కూర్చుండిపోయింది గాయత్రి.

"కావ్యా..."--శబ్ధం రాకుండా పెదవులు ఒకసారి ఉచ్చరించు కున్నప్పుడు లోపలకు వచ్చింది జానకి. గాయత్రిని తన ఇంట్లో ఎదురుచూడని జానకి నిర్ఘాంతపోయి నిలబడ్డప్పుడు కళ్ళార్పకుండా జానకినే చూసింది గాయత్రి.

'పసి బిడ్డా ఈమె? యుక్త వయసులో, యౌవనదశలో సీతాకోక చిలుకలా ఎగురుతున్నదే! ఇన్ని రోజులు నా పక్కనే ఉన్న జానకిని నేను ఎందుకు గుర్తుపట్టలేకపోయాను?'

'మోడు బారిన నా జీవితంలో నేను ఒంటరిగా లేనని అభయం ఇచ్చావే జానకీ! ఎలా ఉన్నావే? రాలిపోయిన నా బంధువా?' - గబుక్కున జానకి మొహాన్ని తన చేతులలోకి తీసుకుని అమె కళ్ళల్లోకి సూటిగా చూసి ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకుంది.

వేనక్కు జరిగింది, బయటకు వచ్చింది. కారు ఎక్కింది. తిరిగి వెళ్ళింది.

గుమ్మం వైపే చూసింది జానకి. 'నేను చూసేది కల కాదు కదా?' అనుకున్నది.

"హిట్లరా...లే...లేదులేదు. గాయత్రీనా ఈమె? నమ్మలేకపోతున్నాను. ఇదేమిటి...నామీద హఠాత్తుగా ఇలాంటొక ప్రేమ? దీనికి కారణం?"

కూతురి యొక్క మనొభవాన్ని అర్ధం చేసుకున్న దానిలాగా...గాయత్రి వచ్చి వెళ్ళిన కారణాన్ని కూతురుకు చెప్పింది విశాలాక్షి.

"రమేష్ గురించి నీ దగ్గర చెప్పనందుకు సారీమ్మా"

"అమ్మ దగ్గర చెప్పటానికి ఎందుకురా అంత సంశయం? సరే...పోనీ. అంతా మంచిగా జరిగితే సరి. ఒకత్తిగా ఉండి నీ పెళ్ళి ఎలా చేయాగలను అని భయపడ్డాను. ఇక నాకు ఆ భయం- లేదు. ఎవరు కన్న బిడ్డో ఆ గాయత్రీ, జీవితంలో బాగుండాలి"

గాయత్రిని అభినందించి లోపలకు వెళ్ళింది విశాలాక్షి.

ఇంకా కూడా ఆలొచనా గుప్పెట్లో చిక్కుకునే ఉన్నది జానకి.

ఇంకా ఉంది.....Continued in: PART-10

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి