19, సెప్టెంబర్ 2019, గురువారం

తొలివలపు (సీరియల్)...PART-12



                                               తొలివలపు….(సీరియల్)
                                                           (PART-12)


ప్రొద్దున్నే సెల్ ఫోన్ మోగటంతో నిద్ర మత్తులో నుండి బయటపడి, సెల్ ఫోన్ ఆన్ చేసి "హలో!" అన్నాడు రమేష్. అవతల ఎవరిదో తడబడుతున్న గొంతు.

"అదొచ్చి...గాయత్రికి సడన్ గా"

"గాయత్రికి ఏమైయ్యింది?...హలో!" గాబరాగా అడిగాడు రమేష్.

అంతే. అవతల వైపు మౌనం.

"హలో...హలో" అరిచాడు రమేష్.

ఫోన్ కట్ అయ్యింది.

వెంటనే బయటకు వచ్చి మెట్ల క్రింద ఉన్న బైకు తీశాడు రమేష్.

గాయత్రి ఇంటికి చేరుకోవటమే ఆలశ్యం, బైకు స్టాండు కూడా సరిగ్గా వేయకుండా బైకును క్రిందపడేసి లోపలకు పరిగెత్తాడు రమేష్.

అదే సమయం రోడ్డుకు అవతలివైపు ఉన్న చెట్టు వెనుక నుండి జానకీనూ, పద్మానూ బయటకు వచ్చారు.

"నేను చెప్పినట్లే జరిగింది చూశావా? ఇప్పుడేమంటావ్ జానకీ?" - అంటూ మాటలు కొనసాగించింది పద్మ. పద్మ మాట్లాడేదేదీ జానకికి వినబడలేదు. కారణం జానకి గాయత్రి ఇంటివైపే కళ్ళార్పకుండా, కన్నీటితో చూస్తూ నిలబడింది.

'ఇలా కూడానా నమ్మించి మోసం చేస్తారు? వీళ్ళ ప్రేమ కోసం నన్ను ఒక కవచంలాగా ఉపయోగించుకున్నారా? నాది చెప్పనటువంటి ప్రేమే! చెప్పకుండానే ఉంటాను. పరవాలేదు. కానీ, గాయత్రి... నువ్వు నా నుదుటి మీద ముద్దు పెట్టుకుని నా హృదయాన్ని కదిలించావే! నాకూ- రమేష్ కు పెళ్ళి చేయాల్సిన పూర్తి బాధ్యత నాది అని మా అమ్మతో చెప్పావే? నేను నీకు ఏం పాపం చేశాను? నా ఇళ్లు వెతుక్కుంటూ వచ్చావు కదా అని నిన్ను నేను ఏంతో నమ్మాను. ప్రేమ మాత్రమే గుడ్డిదా? కాదు...అభిమానమూ, వాత్సల్యము కూడా గుడ్దివే! అది నీవలనే నాకు అర్ధమయ్యింది. సరే...పోనీ. నమ్మించి మోసం చేసినందుకు ధ్యాంక్స్. కపటం కలిసిన నీ కళ్ళను చూడటానికి నాకు ఇష్టం లేదు. నేను వెళుతున్నాను’

ధారగా కారుతున్న కన్నీటిని తుడుచుకుని బయలుదేరబోయిన జానకి చేతులు పుచ్చుకుని ఆపింది పద్మ.

"ఎక్కడికే వెడుతున్నావు?"

"ఇంటికి?"

"నీకేమన్నా పిచ్చా? ఇంతసేపు నేను చెబుతున్నదేమిటి? నువ్వు చేస్తున్నదేమిటి? నీకు ద్రోహం చేశేసి ఇద్దరూ సంతోషంగా ఉండాలని చూస్తున్నారు. నువ్వు...నాకేమిటని? వెడుతున్నావు! వదలకూడదు జానకీ. రెడ్ హ్యాండడ్ గా దొరికిపోయారు. ఈ చాన్స్ ను నువ్వు వదిలి పెడతావేమోగానీ నేను వదిలిపెట్ట దలుచుకోలేదు. నీకు నమ్మక ద్రోహం చేసిన ఆ గాయత్రిని బాగా కడిగేసి వస్తాను. నాతో రా చెబుతాను" అన్న పద్మ జానకి వద్దంటున్నా అమె చేతులు పుచ్చుకుని గాయత్రి ఇంటివైపుకు నడిచింది.

అదే సమయం...ఇంట్లో గాయత్రి, రమేష్ మీద అరుస్తోంది.

"నేను చచ్చేపోయినా దాని గురించి బాధ పడటానికి నువ్వెవరు? ఎవరో ఏదో చెప్పారనే కారణం చెబుతూ ఇలా ప్రొద్దున్నే వచ్చి నా ప్రాణం ఎందుకు తీస్తున్నావు"

"అదొచ్చి...గాయత్రి. మీకేమైందో నన్న భయంతోనే"

"చాలు...నీ పిచ్చి డైలాగులు! నీకొసం ఒకత్తి కాచుకోనుందే...ఆమె దగ్గరకు వెళ్ళి చెప్పు. మొదట ఇక్కడ్నుంచి బయలుదేరు"

కోపంగా చెప్పిన గాయత్రిని సూటిగా చూశాడు.

'నన్ను అర్ధం చేసుకోవటానికి ఎందుకు ప్రయత్నించవు గాయత్రీ? ఇంకా ఎన్ని రోజులు మన పోరాటం కొనసాగుతుంది? నీ వలన నా హృదయం మాత్రమే బలహీనం అయ్యింది. నా నమ్మకం ఇంకా చచ్చిపోలేదు. ఇప్పుడు కూడా తిరిగి వెళ్ళిపోతున్నాను. ఓటమిలు నిరంతరం కావు’ మనసులో అనుకుంటూ, చిన్నగా నవ్వుతూ వేనక్కి తిరిగి నడిచాడు రమేష్.

"ఒక్క నిమిషం. జానకి విషయం ఏమైంది?"

"మైగాడ్...ప్లీజ్ గాయత్రీ. నా మనసంతా మీరు నిండిపోయి ఉన్నప్పుడు నేనెలా?"

"ఆపు. జానకిని ఎప్పుడు పెళ్ళిచేసుకోబోతావు? దానికి మాత్రం జవాబు చెప్పు"

"జానకీ...జానకీ...జానకీ...ఎవరండీ ఈ జానకీ? నిన్నటి వరకు ఆ అమ్మాయి మీద మీకు రాని ఇంటరెస్టు ఈ రోజు ఎందుకు హఠాత్తుగా వచ్చింది? నేను మిమ్మల్ని 'లవ్' చేస్తున్నాను. మిమ్మల్నే చుటి చుట్టి వస్తున్నాను. అలా ఉన్నా నా మనోభావాలను కొంచం కూడా అర్ధం చేసుకోకుండా మీరు ఎవత్తో ఒకత్తి కోసం"

"ఆపు" అని గట్టిగా అరిచిన గాయత్రి కొద్దిసేపు తరువాత…........

"జానకి ఎవత్తో ఒకత్తి కాదు"----కొంచంసేపు మౌనంగా ఉండి, ఆ తరువాత మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది."అమె...ఆమె నా చెల్లెలు"

అది విన్న రమేష్, బాలాజీ మాత్రమే కాదు...బయట నిలబడి రమేష్-గాయత్రీ మాటలను వింటున్న జానకీ, పద్మ కూడా ఆశ్చర్యపోయారు.

"అవును..నేను చెప్పేది నిజం. జానకీ నా చెల్లెలు. అది నేను రుజువు చేయాలంటే నా చిన్న నాటి జీవితం గురించి మీరు తెలుసుకోవాలి" అని చెబుతూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని తన చిన్ననాటి జీవితం గురించి వాళ్ళకు చెప్పటం మొదలుపెట్టింది.

ఇంకా ఉంది.....Continued in: PART-13

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి