2, సెప్టెంబర్ 2019, సోమవారం

తొలివలపు(సీరియల్)....PART-3


                                                  తొలివలపు….(సీరియల్)

                                                                (PART-3) 

మెడికల్ రిపోర్ట్ ఒకటి తీసుకుని తన కుర్చీలో నుండి లేస్తున్నప్పుడు, "లోపలకు రావచ్చా...డాక్టర్ గాయత్రీ బాపిరాజు?" అని చాలా క్లియర్ గా వచ్చిన మాటలు వినబడి తలెత్తి చూసింది.

తలను మాత్రమే లోపలకు పెట్టి, నవ్వు మొహంతో సమాధానం కోసం ఎదురుచూశాడు అతను.

"ఎస్...కమిన్" అని పిలిచి, తన కళ్ళద్దాలను తీసి టేబుల్ మీద పెట్టింది డాక్టర్ గాయత్రీ బాపిరాజు.

"థాంక్యూ" అంటూ లోపలకు వచ్చి చొరవుగా కుర్చీ లాక్కుని కూర్చున్న అతని చర్య కంటే, అతను తనను పిలిచిన విధమే ఆమెను కొంచం ఆశ్చర్యానికి గురిచేసింది

"నాపేరు రమేష్"

"ఏం కావాలి?"

"చెబుతాను డాక్టర్. చాలా సంవత్సరాలుగా నాలో ఒక వ్యాధి ఉంది. అందువల్ల..."

"క్షమించాలి మిస్టర్ రమేష్. మీరు చోటు మారి వచ్చారనుకుంటా. నేనొక గైనకాలజీ డాక్టర్ను..."

"తెలుసు డాక్టర్. ఈ ఊరుకు నేను కొత్తగా వచ్చాను. కానీ నేను ఇప్పుడొచ్చింది సరైన చోటుకే"

"అర్ధం కాలేదు"

"నాకోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించగలరా?"

"హూ...ఓ.కే"

"థాంక్యూ డాక్టర్. హూ. ఏం చెబుతున్నాను? ఆ, నా వ్యాధికి కావలసిన మందుకోసం నేను పలు సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగాను. ఫలితమే దొరకలేదు. ఇకమీదట దొరకదని ఆశ వదులుకుని నీరశంగా కూర్చునప్పుడు ఆ మందు నా కళ్ళకు కనబడింది. ఈ మధ్యే, అందులోనూ ఈ ఊర్లో"--ఏదో ఒక అర్ధంతో తనని లోతుగా చూస్తూ చెప్పిన అతన్ని చూస్తుంటే గాయత్రికి ఒళ్ళు మండింది.

"మిస్టర్ రమేష్, మీ సమస్య ఏమిటో నాకు అర్ధం కాలేదు. అయినా కానీ... రాజేశ్వరి అనే ఒక డాక్టరమ్మ, అమీర్ పేటలో ఉన్నది. నేను అడ్రెస్స్ ఇస్తాను. ఆమెను చూస్తేనే మంచిది"

"అవసరం లేదు గాయత్రీ. సా...సారీ...డాక్టర్ గాయత్రీ. నేను అక్కడ్నుంచే వస్తున్నాను"

"ఏమిటీ?" అని ఆశ్చర్యంతో అన్న డాక్టర్.గాయత్రి, "సరే...ఇక్కడికి ఎందుకు వచ్చారు?" వొంట్లో మంట తెచ్చుకుని, మండిపడ్డది.

"చెబుతాను. నేను వెతికిన ఆ మందు..." అని చెప్పటం ఆపి కొంటె చూపుతో ఆమె కళ్ళల్లోకి చూశాడు. 'అతను తనను చూసిన ఆ చూపులలో ఆమెకు ఏదో అర్ధమయ్యింది…'

గబుక్కున అతను...."మీరే" అన్నాడు.

కుర్చీలో నుండి లేచింది గాయత్రి.

అతనూ లేచాడు. "ఎస్. డాక్టర్ గాయత్రీ....ఎస్. ఐ లవ్ యూ గాయత్రీ" అన్నాడు నిదానంగా.

"బయటకు వెళ్ళండి మొదట..." కోపంగా అరిచింది. ఆమె వొంట్లో ఒక విధమైన వణుకు మొదలయ్యింది, పడిపోకుండా టేబుల్ ను పట్టుకుంది.

"గాయత్రీ...ప్లీజ్ రిలాక్స్"

“ఇంకేమీ మాట్లాడకండి. మొదట బయటకు వెళ్ళండి”.--అతని మొహం కూడా చూడకుండా గుమ్మం వైపు చేతులు చాపి ఉగ్రముగా అరిచింది.

"గాయత్రీ...నేను..." అతను ముగించేలోపు ఎక్కడ్నుంచొచ్చిందో ఆమెకు అంత కోపం…

"నీకు ఒకసారి చెబితే అర్ధంకాదా? పోరా బయటకు"

ఆ రూమే అధిరిపోయేలా అరిచిన గాయత్రిని చూసి ఒక్క క్షణం వణికిపోయాడు రమేష్.

"ఓ.కే. గాయత్రీ. నేను వేళతాను. కానీ, రేపు మళ్ళీ వస్తాను. ఇది మనయొక్క మొదటి పర్సనల్ మీటింగ్ మాత్రమే కాదు. నా యొక్క మొదటి ఓటమి కూడా ఇదే! ఇక జరగబోయే యుద్దంలో రక్తం వచ్చినా దాని గురించి పట్టించుకోను. మీరు నాకు దొరికేంత వరకు నా ప్రయత్నం ఆగదు. ఇష్టపడినది చేజిక్కించుకోకుండా నేను వదిలిపెట్టను. గుడ్ బై"---దగ్గర దగ్గర సవాలు విసిరి వెళ్ళాడు.

తన గంభీరం సడిలినట్లు అవడంతో ఒళ్ళు తూలి కుర్చీలో పడింది గాయత్రి.

ఎప్పుడూ తేటతెల్లగా నిర్మలంగా ఉండే ఆమె మనసు ఇప్పుడు కెలికిపడేసిన చెత్త కుప్ప తొట్టిలాగా అయిపోయింది.

మూసుకున్న కళ్ళను దాటి కన్నీటి వరద...చెంపలమీద పడుతుంటే, రమేష్ మాటలు అమె చుట్టూ చక్రంలా తిరుగుతున్నాయి.

ఈ లోపు చాలాసేపు ఎండలో నిలబడే ఉన్న జానకి నర్స్ ఇక ఆ ఎండను తట్టుకోలేక అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది.

అదే సమయంలో బయటకు వచ్చిన రమేష్, జానకి పడిపోవటం చూసి అమె దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు. గబుక్కున ఆమెను ఎత్తుకుని మళ్ళీ లోపలకు పరిగెత్తాడు.

పద్మా నర్స్ వచ్చి మొహం మీద నీళ్ళు జల్లిన తరువాత స్పృహలోకి వచ్చింది.

పద్మా నర్స్ ఫోనులో చెప్పింది విని ఆందోళనతో లేచి జానకిని చూడటానికి పరిగెత్తింది గాయత్రి. జానకిని 'అడ్మిట్' చేసిన రూముకు గాయత్రి చేరుకున్నప్పుడు...రమేష్ జానకి బెడ్ మీద కూర్చుని, జానకితో ఉత్సాహంగా కబుర్లు చెబుతోంది......గాయత్రి జానకి దగ్గరకు వెళ్ళినప్పుడు,

"ఏం డాక్టర్...? 'మెడికల్ సీటు దొరికేవరకు ఎక్కడైనా టీచర్ ఉద్యోగం చేశేవారా...? స్కూల్ స్టూడెంట్ కు దండన ఇచ్చినట్టు..." రమేష్ ముగించేలోపు,

"ఈమె మీకు బంధువా?" అడిగింది గాయత్రి.

"లేదు...లేదు..."

"అలాగైతే నీకు ఇక్కడేం పని...బయటకు పో"

ఇంకేం మాట్లాడాలో తెలియక బయటకు వెళ్ళాడు రమేష్.

అతన్ని మళ్ళీ చూడటం జరిగినందువలన గాయత్రిలో చేదు అనుభవం తలెత్తింది. అదే సమయం జానకి మనసో అతన్ని తలచుకుని తీపి పాకంలాగా తియ్యగా మారింది.

ఇంకా ఉంది.....Continued in:PART-4

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి