22, సెప్టెంబర్ 2020, మంగళవారం

జీవన పోరాటం...(సీరియల్)...PART-17



                                                                        జీవన పోరాటం...(సీరియల్)                                                                                                                                                                     (PART-17)

(భార్య యొక్క మంచి గుణాలు కుటుంబ జీవితం యొక్క అందమైన, మంగళకరమైన లక్షణం. ఇవి కుటుంబానికి గౌరవ మర్యాదలు తీసుకు వస్తాయి. అలాంటి గౌరవం తీసుకు వచ్చే భార్యకు...మంచి పిల్లలు ఉండటం మరింత గౌరవం చేరుస్తుంది)

రాజరాజేశ్వరిని, సత్యపాల్ ని పిలిచి అత్యవసర సమావేశం పెట్టింది గాయత్రి. ఆ టైములో ఇంట్లో మంగమ్మ లేకుండా జాగ్రత్త పడింది. 

ఆమే వివాదాన్ని మొదలుపెట్టింది: ఇది కొంచం తొందర పడాల్సిన - అత్యవసర విషయం"

ఆమె ఏం చెప్పబోతోంది అనేది తెలుసుకోవటానికి ఆసక్తిగా ఉన్న వాళ్ళిద్దరూ ఆమె మొహాన్నే చూస్తూ ఉన్నారు. గాయత్రి మొదలుపెట్టింది, "చిన్నమ్మకు ఈ ఇంట్లో ఒక సరైన చోటు ఇవ్వాలి"

"ఏం, ఆవిడకు మనం ఏదైనా తక్కువ చేశామా?"

"మనం ఏమీ తక్కువ చేయలేదు. కానీ, నాన్నే తక్కువ చేశారు."

"అమ్మకు నాన్న ఎటువంటి కొరత పెట్టినట్లు నాకేమీ అనిపించటం లేదు. నువ్వు చెప్పేదేమిటి గాయత్రి?" సత్యపాల్ అడిగాడు.

"నాన్న, చిన్నమను ఈ ఇంట్లో ఏ బంధుత్వం చెప్పి ఉంచారు?"

"వాళ్ళిద్దరూ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈరోజు వరకు కరెక్టుగా నడుచుకుంటున్నారు. మేము ఈ ఇంట్లో సంతోషంగానూ, బద్రతతోనూ, అన్ని  వసతులతోనూ జీవిస్తున్నాము. దీని కంటే ముఖ్యంగా 'నాన్నా' అని పిలవటానికి నాకు హక్కు ఇచ్చారు. ఇంతకంటే మాకు ఇంకేమీ అక్కర్లేదు" - నీళ్ళు నిండిన కళ్ళతో చెప్పాడు సత్యపాల్.

"అమ్మా...అన్నయ్య స్వీయ నియంత్రణతో ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఇది నగరం కాబట్టి చిన్నమ్మ గురించి ఎవరూ సూటిపోటి మాటలు అనడంలేదు.. ఇదే గ్రామం అయ్యుంటే ఆమెను ఏం పేరు పెట్టి పిలిచేవారో మీకు తెలియదా? మన గ్రామంలో చిన్నమ్మను  ఎంతెంత మాటలతో ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? వాళ్ళతో కలిసి నేనూ ఒక కాలంలో చిన్నమ్మ గురించి ఎంతో అసహ్యంగా మాట్లాడాను" ఆవేదనతో చెప్పింది గాయత్రి.

"అందుకని...?"

"నాన్నా, చిన్నమ్మా తాము వేసుకున్న ఒప్పందం నుండి బయటకు రావాలి. ఇప్పుడు నేను కూడా వాళ్ళను బాగా అర్ధం చేసుకున్నాను కాబట్టి వాళ్ళ మధ్య ఒప్పందం  అవసరం లేదు. చిన్నమ్మని నాన్న బహిరంగంగా ఏలుకోవాలి"

"ఇప్పుడు దానికి ఏమిటమ్మ అవసరం?"

"అవసరం మనకు లేదు. చిన్నమ్మకు ఉంది. ఆమె బయటకు వెళ్ళదు. కానీ, ఆమెకు ఒక వాంఛ ఉంటూనే ఉంటుంది. దాన్ని ఆమె చెబుతుందని అనుకుంటున్నారా?"

ఆడదాని మనసు ఆడదానికి అర్ధం కాదా? కానీ, ఇంత కాలంగా దీని గురించి నేను ఎందుకు ఆలొచించ లేదు అని బాధ పడ్డది రాజరాజేశ్వరి.

రాజరాజేశ్వరి ఆలొచిస్తూ ఉండటాన్ని తప్పుగా అర్ధం చేసుకున్న గాయత్రి, "ఏంటమ్మా...నేను ఏదైనా తప్పుగా మాట్లాడేనా?" అని అడిగింది.

"నువ్వేమీ తప్పుగా మాట్లాడ లేదు తల్లీ. ఇన్ని రోజులు దీని గురించి ఆలొచించకుండా ఉండిపోయేనే నని నేను బాధపడుతున్నాను.  ఎందుకంటే, నాకు పిల్లలు పుట్టరని తెలుసుకున్న వెంటనే నేను మీ నాన్నను రెండో పెళ్ళి చేసుకోమని అప్పుడే అడిగాను, బలవంతం చేసాను. కానీ, మీ నాన్నే చేసుకోనంటే చేసుకోనని పట్టుదలగా ఉండిపోయారు.  అలాంటప్పుడు, ఇప్పుడు మీ నాన్నకు రెండో భార్యగా మంగమ్మ ఉంటే నాకేం ఆక్షేపం? నువ్వు కడుపులో ఉన్నది తెలియక సత్యపాల్ ను దత్తత్తు తీసుకుందామని ఆశపడ్డాము. మంగమ్మ కూడా దానికి ఆమోదం తెలిపింది. కానీ, నువ్వు కడుపులో పెరుగుతున్నావని తెలుసుకున్నాక మా పధకాన్ని మార్చుకున్నాము. వాళ్ళను ఎప్పుడో ఒకటిగా చేర్చుండాలి. నేనే తప్పు చేశాను"

"అమ్మా, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు బాధ పడితే ఏ ప్రయోజనమూ లేదు. ఇంకా సమయం పోనివ్వకుండా నాన్ననూ, చిన్నమ్మనూ చేర్చటానికి ఒక దారి చూడండి"

"అది సరేనే....వాళ్ళిద్దరి దగ్గరా దీని గురించి ఎలా మాట్లాడేది?"

"మీరు ఏం చేస్తారో, ఎలా చేస్తారో...అవన్నీ మాకు తెలియదు. ఎలాగైనా వాళ్ళిద్దరినీ కలపండి. అన్నయ్యా...రా"

నిర్ణయం తీసుకునే హక్కును నాయకుడికి వదిలేసి బాధ్యతగా వెళ్ళిపోయే రాజకీయ కార్యకర్తలలాగా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.

"ఇంత చిన్న వయసులోనే దీనికి ఎంత తెలివి?" అంటూ ఆశ్చర్య పడుతూ ఆమె వెనకాలే వెళ్ళాడు సత్యపాల్.

'ఇది ఎలా చేసి ముగిస్తాను?' అని ఆలొచించటం మళ్ళీ మొదలుపెట్టింది రాజరాజేశ్వరి.

భర్త ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి చెప్పింది రాజరాజేశ్వరి.

"ఏమండీ...మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి"

"ఏమైంది...ఎందుకిలా ఆందోళనగా మాట్లాడుతున్నావు?"

"మీ దగ్గర ఎలా ప్రారంభించాలో తెలియటం లేదు"

" మొదలు పెట్టేశావు కదా...పైన చెప్పు"

"లేదండీ...మనం మంగమ్మకి..."

"మంగమ్మకి ఇప్పుడేమిటి?"

"ఏమీలేదండి...కానీ, ఆమెకు ఒక చిన్న కొరత..."

"ఆమెకు ఏం కొరత? ఆమెను బాగానే చూసుకుంటున్నావుగా?"

మేము బాగానే చూసుకుంటున్నాం. కానీ, మీరే..."

పరంధామయ్య మనసులో ఆందోళన పెరిగింది. "కొత్తగా ఏదైనా సమస్యా? నేను బాగానే కదా నడుచుకుంటున్నాను" అని ఆలొచించిన ఆయన...కన్ ఫ్యూజ్ అయిన ఆయన, “చెప్పేదేదో క్లియర్ గా చెప్పు" అన్నారు.

"అందరం ఆమెను బంధువుగానే చూస్తున్నాము. కానీ, మీకు ఆమె ఎవరనేది మీరు బహిరంగంగా ఒప్పుకోవాలని ఇష్టపడుతున్నాం"

"ఇప్పుడే ఒక పెద్ద సమస్య నుండి బయటపడి ఇళ్ళు కొంచం సైలంటుగా ఉన్నది. ఇంతలో ఏమిటిది ఇంకో వ్యవహారం? మీదగ్గర మంగమ్మ ఏమైనా అడిగిందా?"

"ఆమె ఏదీ అడగలేదండి! ఇది మనంగా ఆమెకు ముఖ్యంగా చేయాల్సిన ఒకటి. దీన్ని నేను ఎప్పుడో చేసుండాలి. కానీ, అప్పుడు బుర్రలో ఎక్కలేదు. ఇప్పుడు గాయత్రి చెప్పిన తరువాతే అర్ధమయ్యింది"  

"అంటే...ఈ గందరగోళానికీ గాయత్రినే కారణమా?"

"అయ్యో... గాయత్రిని అన్యాయంగా తప్పు పట్టకండి. చిన్న పిల్లగా ఉన్నా కూడా ఏంత వివరంగా మాట్లాడుతోందో? దాని మాటల్లో ఉన్న న్యాయాన్ని గ్రహించే ఇప్పుడు మీ దగ్గర మాట్లాడుతున్నాను"

"ఏం చేయాలని చెబుతున్నావు?"

"మంగమ్మను మీ భార్యగా ఏలుకుని, ఆ విషయాన్ని బహిరంగంగా చూపించాలి"

"ఏమిటి రాజేశ్వరీ...నువ్వే ఇలా మాట్లాడుతున్నావు?"

"అవునండీ....మిమ్మల్ని రెండో పెళ్ళి చేసుకోమని ఎప్పుడో బలవంత పెట్టాను. అప్పుడు చేసుకోనుంటే ఇప్పుడు మీకు ఇంకొక భార్య ఉండేది కదా? ఆమె నన్ను బాగా చూసుకోనుండేది అనేది నమ్మగలమా? మంగమ్మ ఇన్ని సంవత్సరాలుగా మన దగ్గర ఎలా నడుచుకున్నది చూస్తూనే ఉన్నారు కదా. మీరు ఆమెనే రెండో పెళ్ళి చేసుకున్నారనే అనుకుంటాను. ఇది నాకు రెట్టింపు సంతోషమే"

"ఇన్ని సంవత్సరాలైన తరువాత ఈ బంధుత్వం అవసరమా?"

"శరీరాలు కలిపే బంధుత్వాన్ని మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటా. అది ప్రతి భార్యా-భర్తలకు ఏదో ఒక వయసులో తీరిపోతుంది. కానీ, భర్త యొక్క అనురాగం, ప్రేమ, అభిమానం, ఆదరణ అని ఎన్నో విషయాలను ప్రతి భార్య ఆమె చనిపోయేంతవరకు  భర్త దగ్గర ఎదురుచూస్తుంది. మంగమ్మ కూడా ఒక ఆడదే కదా. ఆమెకూ ఇలాంటి ఆశాపాశాలు ఉంటాయి కదా?"

"ఊరు, సంఘం మనల్ని ఇంకో విధంగా మాట్లాడదా?"

"సరే, ఇదే ఊరు, సంఘం ఇప్పుడు మంగమ్మను, భర్తని వదిలేసి పారిపోయి వచ్చింది, మీకు సెటప్పుగా ఉంటోంది, మీరు ఉంచుకున్న ఆమె అని అవీ, ఇవీ అంటూ ఇంతకంటే నీజంగా మాట్లాడుతున్నారే! అది పరవాలేదా? 'ఊరు,సంఘంతో కలిసిపోయి తాను కూడా నీచంగా మాట్లాడేనే...' అని చెప్పి చెప్పి గాయత్రి కన్నీళ్ళు పెట్టుకుంటోందే! అది పరవాలేదా?"

రాజరాజేశ్వరి, పిల్లలూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాశారు. ఇక దీనిలో నుండి నన్ను తప్పించుకోనివ్వరు అనేది గ్రహించారు. భార్య మాటల్లో న్యాయం ఉండటం కూడా గమనించారు పరంధామయ్య. 

"దీని గురించి నేను బాగా ఆలొచించి జవాబు చెబుతా " అని చెప్పి ఆయన గబగబా అక్కడ్నుంచి బయటకు వచ్చారు.

మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికి తిరిగి వచ్చిన ఆయన, హాలులో నిలబడి అందరికీ వినబడేలాగా " మంగమ్మా...ఆకలేస్తోంది. భోజనం పెట్టు" అంటూ పెద్ద స్వరంతో మాట్లాడారు.

మంగమ్మ తన చెవులను నమ్మలేక పోయింది. తాను విన్నది నిజమేనా అని నిశ్చయించుకోవటానికి మెల్లగా వంట గదిలో నుండి తొంగి చూసింది. పరంధామయ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోనున్నారు.

అది గమనించిన పరంధామయ్య మళ్ళీ పిలిచారు "ఏం మంగమ్మా...నేను పిలిచింది చెవులకు వినబడలేదా?"

తాను అడిగింది ఇంత త్వరగా నెరవేరుస్తారని ఎదురుచూడని రాజరాజేశ్వరి, తాను కూడా " మంగమ్మా... నాకూ ఆకలేస్తోంది. నాకు కూడా భోజనం పెట్టు" అని చెప్పి తాను కూడా ఆయన పక్కనే కూర్చుంది.

'ఎప్పుడూ భర్తకు తన చేతులతోనే వడ్డన చేసే రాజరాజేశ్వరి ఈ రోజు ఆయనతో కలిసి భోజనానికి కూర్చుందే...' అంటూ ఆశ్చర్యపోయి శిలలా నిలబడి పోయింది మంగమ్మ. 

వేగంగా వచ్చిన గాయత్రి ఆమె చెయ్యి పుచ్చుకుని తీసుకు వెళ్ళి నాన్న దగ్గర వదిలి పెట్టి ఆమె కూడా ఒక కుర్చీలో కూర్చుంది.

సత్యపాల్ కూడా వచ్చి వాళ్ళతో కలిసి కూర్చున్నాడు.

"ఏమిటి మంగమ్మ...అలాగే నిలబడిపోయావు?" అని రాజరాజేశ్వరి అడిగిన తరువాత  మామూలు స్థితికి వచ్చింది....పరిస్థితిని త్వరగానే అర్ధం చేసుకుంది. దానిని అంగీకరిద్దామా...వద్దా అనే గందరగొళంలో ఆమె ఉన్నదని ఆమె మొహంలో క్లియర్ గా కనబడింది. 'చేసిన వాగ్ధానాన్ని ఎలా మీరేది?' అని తడబడింది.

దాన్ని ఈజీగా అర్ధం చేసుకున్న రాజరాజేశ్వరి, "ఇక మీదట నీ వాగ్ధానాన్ని కాపాడాల్సిన అవసరం నీకు లేదు. అందరికీ అన్నీ తెలిసిన తరువాత వాగ్ధానానికి అవసరమేముంది? లోకం గురించి భయపడకుండా మన జీవితం మనం జీవిద్దాం. చివరి రోజుల్లో అదే మనకు మంచిది. ఒప్పుకో మంగమ్మ"

సత్యపాల్, గాయత్రి కూడా ఆమెను బ్రతిమిలాడుతున్న దోరణిలో చూశారు.  

తాను ఎంతో అదృష్టవంతురాలినని అనుకుంది. లోపల మనసు ఆనందపడుతుంటే దానిని బయటకు కనబడనివ్వకుండా అణుచుకుంది. వాళ్ళ కోరికను అంగీకరించిన దానిలాగా పరంధామయ్య కు భోజనం వడ్డించడం మొదలుపెట్టింది. అప్పుడు  వణుకుతున్న చేతులను కనిపించకుండా దాచుకోవటానికి ఎంత ప్రయత్నించినా ఆమె వలన కుదరలేదు.

ఆ ఇంట్లో మంగమ్మకి దొరకవలసిన చోటు దొరికిందని అందరూ సంతోషపడ్డారు.

గాయత్రి యొక్క తెలివితేటలను, దాన్ని అమలు పరిచిన తీరును గమనించి ఎక్కువ ఆశ్చర్యపడిన సత్యపాల్.......

'ఆమె నా చెల్లెలు తనకు తానే గర్వ పడ్డాడు.

                                                                                  Continued....PART-18(చివరి పార్టు)

వీటిని కూడా చదవండి:

ప్రకృతితో పరాచికాలా?

ఎడారి హోటల్

**************************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి