14, సెప్టెంబర్ 2020, సోమవారం

జీవన పోరాటం…(సీరియల్)...PART-13


                                                                       జీవన పోరాటం…(సీరియల్)                                                                                                                                                                   (PART-13)

('పేద అని చెప్ప తగింది ఏదంటే, తనకు మంచి చేసే వాళ్ళను వదిలిపెట్టి, అవసరం లేని చెడు సావాసంతో చేతులు కలిపే అమాయకత్వం మే 'పేద అని చెప్ప తగింది)

తనని కలవటానికి వచ్చిన గాయిత్రిలో ఆగ్రహము, కోపముక్షోభ అంటూ పలురకాల భావాలతో పాటూ కలత కూడా ఉండటం చూసిన నవీన్..."ఏమిటీ, దేవత ఈరోజు బాగా నీరసంగా వస్తోంది?" అన్నాడు.

ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఏడుస్తుందేమో అనిపించింది. ఆమె స్వీయ గౌరవం ఆమెను అడ్డుకుంది.

"ఏమిటి...సమాధానమే లేదు?"

"నా ఇల్లే నరకంగా ఉన్నది!  ఎప్పుడ్రా ఆ ఇంట్లో నుండి వచ్చేద్దామని అనిపిస్తోంది"

పరిస్థితి తనకు అనుకూలంగా మారుతూ ఉండటాన్ని... గాయిత్రి మెల్ల మెల్లగా దిగి రావటాన్నీ గ్రహించాడు.

" ఇల్లు వదిలి రావటంలో పెద్ద శ్రమ ఏమీ ఉండదు గాయిత్రీ. ఆ తరువాత వాళ్ల ముందు మనం బాగా జీవించి చూపాలి. దానికి మనం తయారుగా ఉండాలి"

"ఏం నవీన్...నీ 'క్యాంపస్ ఇంటర్ వ్యూ' ఏమైంది?"

"రెండు కంపెనీలు సెలెక్ట్ చేసేయి...ఎప్పుడైనా కాల్ లెటర్ రావచ్చు"--మనసారా అబద్దం చెప్పాడు. నిజానికి అతన్ని ఏ కంపనీ సెలెక్ట్ చేయలేదు.

"సమస్యేమీ లేదు, వదిలేయ్. నీకు ఉద్యోగం దొరికేంత వరకు ఖర్చులు నేను చూసుకుంటాను"

"ఏం చెయ్యబోతావు?"

అతని మనసు, లోపల పాట పాడుతోంది: 'డబ్బు...డబ్బూ, మనీ...మనీ...'

"అది నా సమస్య. నువ్వు ఎందుకు దాని గురించి బాధపడుతున్నావు?"

"లేదు గాయిత్రి, నువ్వు ఏం చెయ్యబోతావు అనేది నేను తెలుసుకుంటే బాగుంటుంది"

ఇంతకు ముందే నా 'బ్యాంక్ అకౌంట్ బ్యాలన్స్ కొద్ది కొద్దిగా పెంచి ఉంచాను. నువ్వు పిలిచేంత వరకు పెంచుతాను. వచ్చేటప్పుడు వీలైనన్ని నగలు వేసుకుని వస్తాను. తరువాత ఏందుకు ఆందోళన?"

"లేదు గాయిత్రి. నాకు నువ్వు మాత్రమే కావాలి. నీ డబ్బుతోనూ, నగలతోనూ మన జీవితాన్ని ప్రారంభించటం నాకు ఇష్టం లేదు"

"ఏమీటి నువ్వు...నీది-నాదీ అని వేరుచేసి మాట్లాడుతున్నావు? మా నాన్న ఆస్తిని ఊర కుక్కలు అనుభవిస్తున్నప్పుడు  ఆ ఆస్తిని మనం అనిభవిస్తే తప్పా?"

ఇది కూడా అతను ఎదురు చూసిన జవాబే!

"అదికాదు గాయిత్రి..."

ఇక నువ్వేమీ మాట్లాడకు! నేను చెప్పేది మాత్రం చెయ్యి. ఏ రోజు అని మాత్రం చెప్పు. ఏ.టీ.ఏం కార్డు, నగలతో వచ్చేస్తాను"

'పెళ్ళి అని చెప్పిన వెంటనే ఇంత అధికారమా? రావే...రా. తాలి కట్టిన తరువాత పెట్టుకుంటాను నీతో కచేరీ'--చొక్కా కాలర్ ఎగరేశాడు. మనసు ఆనంద తాండవం ఆడింది.

స్నేహితులు చెప్పిచ్చినట్లు తల్లితో మాట్లాడాడు. మొదట్లో జాతి, కులం, గోత్రం అంటూ గొడవ పడ్డ ఆమె గాయిత్రి ఆస్తిపాస్తుల గురించి తెలుసుకున్నాకు నోరు వెళ్ళ బెట్టింది.

"ఆ అమ్మాయి నిజంగానే నిన్ను ప్రేమిస్తోందారా?"

అపనమ్మకంతో అడిగింది.

"నిజంగానే నమ్మా"--బల్ల గుద్ది నట్టు చెప్పాడు.

ఆశ్చర్య పోయిన నవీన్ తల్లి, ఈ విషయాన్ని భర్తతో చెప్పటానికి మంచి సంధర్భం కోసం కాచుకోనున్నది.

ఆ మంచి సంధర్భం దొరికింది. భర్తకు విషయం చెప్పింది. ఆయన ఒకే మాటలో 'కుదరదు అని చెప్పేడు.

"నీ కొడుకే ఒక పోకిరి వెధవ. వాడ్ని నమ్మి మరో పోకిరి ఈ ఇంటికి రాబోతోందా?"

 "ఏమిటండి మీరు. మరో ఇంటి అమ్మాయి గురించి అలా మాట్లాడుతున్నారు?”

తన కొడుక్కి ఇంత మంచి జీవితం దొరికే తీరాలి అనే ఆశతో పరితపించింది తల్లి.

"ఇలా చూడవే...నీ కొడుకూ, నువ్వూ కలిసి ఆపద అనే ఆటతో ఆడుకోబోతున్నారు. వాళ్ళు చాలా పెద్ద ఆస్తిపరులు అని చెబుతున్నావు. వాళ్ళకు ఈ విషయం తెలిసినప్పుడు ఉంటుందే మీకు"

"...................."

"కన్నవారి అంగీకారంతో...వాళ్ళ ఆశీర్వాదంతో జరిగేదే పెళ్ళి. తాలి కట్టుకుని లేచిపోవటం సినిమాలలోనే జరుగుతుంది. నిజ జీవితంలో వేలకొలది సమస్యలు ఉన్నాయే. ఇదంతా మనకు మంచిది కాదు"

"మీ ప్రసంగాన్నంతా తరువాత వచ్చి వింటాను. ఇప్పుడు మీరు పెళ్ళికి వస్తారా...రారా?"

 "వెళ్ళండే వెళ్ళండి! ఈ పాపంలో నాకు ఏ సంబంధమూ లేదు"

"కొడుక్కి ఒక మంచి జరుగుతుంటే తండ్రి మాట్లాడుతున్న మాటలను చూడండి" ---అంటూ గట్టిగా అరుస్తూ వెళ్ళింది ఆమె.

'వాళ్ళు పెళ్ళి చేసుకుని వచ్చిన తరువాత ఎన్ని పోలీసు స్టేషన్ల గడపలు ఎక్కాలోఎవరెవరి దగ్గర ఏమేమి అవస్తలు పడతామో?" అని .... రాబోవు పరిణామాలకు తనని తాను సిద్దం చేసుకుంటున్నాడు ఆయన.

తల్లీ, కొడుకులిద్దరూ కలిసి రాబోవు ముహూర్తం రోజుననే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొడుకు కంటే తల్లే ఇప్పుడు ఈ వివాహంలో ఎక్కువ ఆసక్తి చూపింది.

గాయిత్రిని కలిసి పెళ్ళి రోజు తారీఖు చెప్పాడు నవీన్. ఆ రోజే ప్రొద్దున 9.30 కి తాలి కట్టే కార్యక్రమం. ఆతను చెప్పే చోటుకు 8.30 కల్లా గాయిత్రి వచ్చేయాలి. ఆమెను పిలుచుకుని 9 లోపు అమ్మవారి గుడికి వెళ్లాలి. అక్కడ అతని తల్లి, స్నేహితులూ పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేసి ఉంచుతారు. 

తాలి కట్టిన వెంటనే ఆలస్యం చేయకుండా నవీన్ తనని వాళ్ళింటికి తీసుకు వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఏం జరుగుతుందో చూసుకుని తరువాత ఏం చేయాలనేది ఆలొచిద్దాం. పెళ్ళిని రిజిస్ట్రేషన్ చేయాలంటే కనీసం నెల రోజులు పడుతుంది. దానికి కావలసిన ఏర్పాట్లను నవీన్ ఈ రోజే మొదలు పెడతాడు.  

అతను తన పధకాన్ని వివరించి చెబుతుంటే, దాన్ని ఎంతో ఆసక్తితో వింటున్న గాయిత్రి, చివర్లో "సూపర్" అన్నది.

"పెళ్ళి జరిగేంతవరకు మన పధకం రహస్యంగా ఉండనీ. నీకు బాగా క్లోస్ గా ఉండే స్నేహితురాలి దగ్గర కూడా చెప్పకు" అని హెచ్చరించాడు.

"ఇంకో విషయం గాయిత్రి. పెళ్ళి తరువాత ఎలాగూ విషయం మీ ఇంటికి తెలిసిపోతుంది.  అప్పుడు వాళ్ళు ఇచ్చే ఒత్తిడి వలన మీ నాన్న మనుష్యులు---ఆయన అడ్వకేట్లు మన మీద చేసే బెదిరింపు చర్యలు వలన నువ్వు మనసు మార్చుకుని నన్ను విడిచి వెళ్ళిపోవు కదా?"

నవీన్ మాట్లాడిన మాటలతో కరిగిపోయింది గాయిత్రి. నవీన్ యొక్క మనసు, 'హు...'రస్క్' తినాలంటే 'రిస్క్' తీసుకునే కావాలి అని 'పంచ్ డైలాగ్' మాట్లాడుకుంటోంది.

"నవీన్...నువ్వు ఎక్కువ భయపడుతున్నావు! నన్ను తక్కువగా అంచనా వేయకు. నా మాటల్లోనూ, చేష్టల్లోనూ నేను చాలా పట్టుదలగా ఉంటా" అన్నది.

అతని మెదడులో  ఏదో ఒక మూలన 'దీనికొసమే కదా ఆశపడ్డావు నవీన్?' అన్న స్వరం పలకటాన్ని విని సంతోష పడ్డాడు.

"లేదు...నువ్వు మాత్రం నన్ను వదిలేస్తే, నన్ను చంపేస్తారు" అంటూ మొహాన్ని డల్ గా పెట్టుకుని చెప్పాడు.

"రేయ్...నువ్వు ఎక్కువ ఆలొచిస్తున్నావని అనుకుంటా. పిచ్చి పిచ్చి ఆలొచనలు మాని జరగాల్సిన పనులు చూడు" అని చెప్పి బయలుదేరింది.

వెళ్ళేటప్పుడు నవీన్ చేతిలో వంద రూపాయల కట్ట ఒకటి ఇచ్చి "ఖర్చులకు ఉంచుకో" అని చెప్పి వెళ్ళిపోయింది.

ఆమె తన కళ్ళకు కనిపించనంత దూరం వెళ్ళిన తరువాత, ఆమె తన చేతికి ఇచ్చిన వంద రూపాయల నోట్ల కట్టని తలపైన పెట్టుకుని నిజంగానే సంతోషంతో ఆడిపాడాడు నవీన్.

డబ్బు...మనీమనీ.

మనీమనీ...డబ్బు.

                                                                                                      Continued......PART-14


వీటిని కూడా చదవండి:

ఆనందనిలయం(కథ)

మాయాలోక నది!

**************************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి