16, సెప్టెంబర్ 2020, బుధవారం

జీవన పోరాటం...(సీరియల్)...PART-14

 

                                                                           జీవన పోరాటం...(సీరియల్)                                                                                                                                                                  (PART-14)

(మంచి దారి తెలియని పేదవాడు ఏ కార్యం మొదలుపెట్టినా ఒకటి అది పాడైపోతుంది లేకపోతే ఆ పని అతన్ని నేరస్తుడిగా నిలబెడుతుంది)

ఒక రోజు ప్రొద్దున గాయత్రి, రాజరాజేశ్వరితో చెప్పింది: "అమ్మా నేను 7.30 కల్లా ఒక పెళ్ళికి వెల్తాను. కొంచం నగలు ఇవ్వమ్మా" అన్నది.

రకరకాల నగలను కూతురికోసం కొని ఉంచినా వాటిని ఒక్క రోజు కూడా కూతురికి వేసి అలంకరించి చూడలేదు. అందువల్ల ఈ రోజు ఆమె నగలు కావాలని అడగగానే ఆశ్చర్యంతో నగల పెట్టెను తీసుకువచ్చి ఇచ్చింది.

తరువాతి కొద్ది నిమిషాలలో పట్టు చీర యొక్క తలతల మెరుపులతో...ఒళ్ళంతా నగలతో నిండిన కాంతితో వచ్చి నిలబడ్డ గాయత్రిని ఆశ్చర్యంగా చూసింది. అంతవరకు గాయత్రి పట్టు చీర కట్టలేదు...ఇన్ని నగలు వేసుకోనూ లేదు.

"టిఫిన్ తిని వెళ్ళవే..."

"పెళ్ళివాలింట్లో తింటానమ్మా! నా 'ఫ్రండ్స్  అందరూ నా కోసం కాచుకోనుంటారు" -- తొందర తొందరగా చెప్పి వేగంగా నడుచుకుంటూ వెళ్ళింది.

కూతురు నడిచి వెడుతున్న అందాన్ని చూసి ఆనందపడుతూ వెనక్కి తిరిగిన రాజరాజేశ్వరి, వెనుక మంగమ్మ నిలబడి గాయత్రిని చూసి ఆనందపడుతుండటం గమనించింది.

"ఏమిటి మంగమ్మా...అలాగే నిలబడిపోయావు?"

"చిన్నమ్మగారే పెళ్ళి కూతురులాగా ఉన్నారు. తిరిగి వచ్చిన వెంటనే ఆమెకు దిష్టి తీసి వేయండి. దేవత లాగా ఎంత అందం? నా కళ్ళే పడేటట్టు ఉన్నది"

"మన కళ్ళన్నీ గాయత్రిని ఏమీ చెయ్యవు. ఊరి కళ్ళు కోసమే దిష్టి తీసేయాలి" అని చెప్పుకుంటూ లోపలకు వెల్లిపోయింది రాజరాజేశ్వరి.

దేవత ఎక్కడికి వెలుతోందో తెలియని ఆ ఇద్దరు మహిళలపై జాలి చూపాల్సిందే!

నవీన్ - గాయత్రి ఒక 'టూ వీలర్ లోనూ, అతని స్నేహితులు ఇద్దరు వేరొక 'టూ వీలర్ లోనూ ఎక్కగా ఆ రెండు 'టూ వీలర్ లు అమ్మవారి గుడి వైపుకు వెళ్ళే దారిలో వెళ్ళటం మొదలైయ్యింది.  

గాయత్రి మొహంలో కళ్యాణ కళ ఉట్టి పడుతుంటే, నవీన్ దగ్గర వేరే విధమైన ఉత్సాహం కనబడుతోంది. 

దానిని చెదరగొట్టే విధంగా రోడ్డు వంకర తిరుగులో హఠాత్తుగా రెండు కార్లు వచ్చి వాళ్ళకు అడ్డుపడింది.

ఆ కార్లలో నుండి గబ గబ మంటూ దిగిన కొందరు, 'టూ వీలర్ లను ఆపారు. వాళ్ళ చేతులలో ఉన్న ఆయుధాలను చూసి గాయత్రి, మిగిలిన వారు అధిరిపడ్డారు.

కార్లో వచ్చిన వాళ్ళలో కొంతమంది నవీన్ స్నేహితులను చూసి, "ప్రాణాల మీద ఆశ  ఉంటే పారిపొండి" అంటూ బెదిరించారు.

ఆయుధాలను చూసి భయపడిపోయిన స్నేహితులు ఇద్దరూ ఎటువంటి తిరుగుబాటూ చూపకుండా వాళ్ళ 'టూ వీలర్ ను వెనక్కు తిప్పుకుని కనిపించకుండా పారిపోయారు.

కొందరు నవీన్ గొంతు మీద కత్తి పెట్టి లాక్కుని వెళ్ళి కారు వెనుక సీటులో కూర్చో బెట్టి అతని చెరోపక్క ఇద్దరు కూర్చున్నారు.

ఒక్క క్షణంలో ఇవన్నీ జరిగిపోగా...ఒకడు గాయత్రి దగ్గరకు వచ్చి, "మేడం, మేము మీ దగ్గర మొరటుగా ప్రవర్తించటానికి ఇష్టపడటం లేదు. మమ్మల్ని శ్రమ పెట్టకుండా ఆ ముందు కారులో ఎక్కి కూర్చోండి" అన్నాడు.

ఎదురు చూడని ఈ సంఘటనతో షాక్ తిన్న గాయత్రి, "మీరు ఎవరు? ఎందుకోసం మమ్మల్ని ఎత్తుకుపోతున్నారు? నేను ఎవరనేది మీకు తెలుసా?" అని కోపంగా అడిగింది.

"అవన్నీ మాకు తెలియదు. తెలుసుకోవలసిన అవసరమూ లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి కారులో ఎక్కలేదనుకోండి  మేము లాక్కుని వెళ్ళి బలవంతంగా ఎక్కించవలసి వస్తుంది"

తనకు సహాయపడటానికి ఎవరైనా కనిపిస్తారా అని అటూ ఇటూ చూసింది. జన సంచారమే లేని ప్రాంతాన్నే వాళ్ళు ఎన్నుకున్నారు.

ఆ షాక్ నుండి తేరుకోలేకపోయిన గాయత్రి కారు వైపుకు నడిచింది. ఆ మనిషి కూడా ఆమెతో కలిసి వెళ్ళి, కారు డోర్ తెరిచాడు. ఆమె అందులో ఎక్కింది.

అప్పుడు డ్రైవర్ సీటులో కూర్చున్న వ్యక్తిని చూసి ఇంకోసారి  షాకుకు గురైంది.

అది సాక్షాత్తు సత్యపాల్!

"అరే దుర్మార్గుడా...నువ్వా?" అంటూ ఆమె అరవటాన్ని అతను పట్టించుకోలేదు.

బయట నిలబడి ఉన్నతనితో చెప్పాడు: నవీన్ నోరుకు ప్లాస్టర్ అతికించండి. చేతులను వెనుకపెట్టి కట్టేయండి. ఎదురు తిరిగితే కొంచం కూడా జాలి చూపకండి. అతని 'టూ వీలర్ ను ఎవరైనా ఒకరు తీసుకుని మా వెనుకే రండి" అని గబ గబా ఆదేశాలిచ్చి, ఆ తరువాత కారు స్టార్ట్ చేసి పోనిచ్చాడు.

గాయత్రి, సత్యపాల్ ను శపించటం, కొట్టటం, కారును తోలనివ్వ కుండా అడ్డుపడటం చేసింది.

ఓర్పు కోల్పోయిన సత్యపాల్, "ఒక అరగంట సేపు మౌనంగా ఉన్నావంటే నీకు పలు నిజాలను నిరూపిస్తాను. కానీ, నువ్వు ఇలా మొరాయిస్తే, అది వెనుక కారులో వస్తున్న నవీన్ కు ఇబ్బందిగా మారుతుంది. పరవాలేదా?" అని కఠినంగా అడిగాడు. 

పరిస్థితిని తనకు అనూకులంగా వాడుకుంటున్నాడనేది గ్రహించిది గాయత్రి. తన ముఖాన్ని రెండు చేతులతో మూసుకుని తల దించుకుని మౌనంగా కూర్చుంది.

'తరువాత ఏం జరుగుతుంది?' అని ఆలొచించింది.

పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి నిలబెడతాడు. తన పలుకుబడి నంతా ఉపయోగించి బెదిరిస్తాడు. 'అక్కడే మనం గట్టిగా మన మాట మీదే నిలబడాలీ

వాళ్ళకు ఎలా సమాధానం చెప్పాలి అని ఆలొచిస్తూ తనని తాను తయారుచేసుకుంటోంది. తల్లీ-తండ్రీ వచ్చి బ్రతిమిలాడినా ఎటువంటి పరిస్థితిలోనూ నవీన్ ను కాపాడాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ వచ్చినప్పుడు, కారు వాళ్ళ ఆఫీసులోకే వెళ్ళటం గాయత్రి గమనించలేదు. 

                                                                                                         Continued...PART-15

వీటిని కూడా చదవండి:

బొమ్మ కాదా? మరి?...(మిస్టరీ)

నీకంటూ ఒకరు...(కథ)

**************************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి