UFO లు ద్రువీకరించబడ్డాయి! (ఆసక్తి)
UFO లు ధృవీకరించబడ్డాయి! ‘గుర్తించబడని వైమానిక దృగ్విషయం’ చూపించే మూడు పాత యుఎస్ మిలిటరీ వీడియోలు నిజమైనవే...ఆమెరికా నేవీ తెలిపింది.
డిసెంబర్ 2017 మరియు మార్చి 2018 లో, లీకైన మూడు UFO ఫుటేజ్ లు ఆన్లైన్లో ప్రదర్శించబడ్డాయి. యుఎస్ నేవీ, మొదటిసారిగా, ఆ వీడియోల యొక్క విశ్వసనీయతను ధ్రువీకరించింది. మరియు ఫుటేజ్ను ఎప్పుడూ బహిరంగపరచరాదని పట్టుబట్టింది. యుఎస్ నేవీ పైలట్లు హైపర్సోనిక్ వేగంతో కదిలి వెడుతున్న కొన్ని గుర్తుతెలియని ఎగిరే వస్తువులను చేస్ చేస్తూ వెనుకంజలో ఉన్నట్లు చూపించారు. భూమికి కొన్నివేల అడుగుల ఎత్తులో ఎగురుతూ కనిపించని ఆ ఎగిరే వస్తువులకు ఇంజన్లు లేదా ప్రొపెల్లెర్ ఉన్న సంకేతాలు లేవు. ఆ మర్మమైన ఎగిరే వస్తువులు ఏమిటో పైలట్లకు తెలియదు. వివిధ మీడియా సంస్థలు పంచుకుని ఆన్‌లైన్‌లో ఆ వీడియోలను లీక్ చేసినై. లీకైన ఆ మూడు వీడియోలలోని ఎగిరే వస్తువులు "గుర్తించబడని వైమానిక దృగ్విషయం" అని యుఎస్ మిలటరీ నేవీ అధికారులు ధ్రువీకరించారు.
ఈ ఫుటేజ్ 2017 మరియు 2018 లో సంచలనం సృష్టించింది. న్యూయార్క్ టైమ్స్, ది వాషింగ్టన్ పోస్ట్ మరియు ఇతర చాలా వార్తా పత్రికలు తమ వార్తాపత్రికలలో మొదటి పేజీలో హెడ్ లైన్స్ లో ప్రచురించారు. ఆ వీడియోలను 'ది స్టార్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్' అనే ఒక ప్రైవేట్ పరిశోధన మరియూ మీడియో సంస్థ పరిశోధనకు తీసుకుని ఆ వీడియోలను విడుదల చేసినట్లు ప్రచురించినై. ఒక వీడియోలో, ఇద్దరు నేవీ పైలట్లు 2015 లో తూర్పు తీరంలో ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువును ట్రాక్ చేశారు. మరొకదానిలో, "టిక్ టాక్"(ఎందుకంటే మిఠాయి ఆకారంలో ఉన్నందున) అని పిలువబడే ఒక వస్తువు,
2004 లో కాలిఫోర్నియా తీరంలో, కేవలం సెకన్ల వ్యవధిలో 60,000 అడుగుల నుండి 50 అడుగుల వరకు జారిపోతున్నట్లు గుర్తించబడింది. మళ్ళీ, 2014లో జరిగిన ఒక సంఘటనలో, యుఎస్ నేవీ సూపర్ హార్నెట్ పైలట్ వర్జీనియా బీచ్ సమీపంలో అధికారిక మిషన్ సమయంలో గుర్తు తెలియని ఎగిరే వస్తువును దాదాపుగా ఢీ కొట్టాడు.
ఇది కూడా చదవండి: ఆత్మలతో మాట్లాడించే బోర్దు(మిస్టరీ)
అధికారిక ప్రకటనలో, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ ప్రతినిధి జోసెఫ్ గ్రాడిషర్ ఈ దృశ్యాలను "గుర్తించబడని వైమానిక దృగ్విషయం" గా నేవీ అధికారులు ధ్రువీకరిస్తున్నట్టు ప్రకటించారు. దీని అర్థం వీడియోలు నిజమైనవే. మరియు 2004,
2015 లో పరిమితం చేయబడిన సైనిక శిక్షణ గగనతలాలలో రాకూడని ప్రదేశాలలో కనుగొనబడిన వస్తువులు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే,
ఆ ఎగిరే వస్తువులు ఇప్పటికీ వారికి తెలిసిన ఏ రకమైన
విమానంగా గుర్తించబడలేదు.
ఈ ధృవీకరణతో అన్యులు, అన్యగ్రహాలు, ఎగిరే పళ్ళాలు ఉన్నాయనడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని చాలామంది నమ్ముతున్నారు.
UFO మరియు ఎలియెన్స్ లు రియల్?
నాసా మాజీ ఆస్ట్రొనాట్ బజ్ ఆల్డ్రిన్ ఏలియన్ ఎన్కౌంటర్లపై లై డిటెక్టర్ పరీక్షలు పాస్ అయ్యారు అని ఒక నివేదిక తెలుపుతోంది.
గ్రహాంతరవాసులు ఉన్నారా లేదా? ఈ పాత ప్రశ్నకు ఎప్పుడూ నమ్మదగిన సమాధానం దొరకలేదు. వివిధ యుఎఫ్‌ఓ వీక్షణలు భూలోకేతర శక్తి గురించి మనకు ఆశ్చర్యం కలిగించినప్పటికీ, ఏ ప్రభుత్వమూ ఇతర అధికారిక సంస్థలూ దీనికి అంగీకరించలేదు. వ్యోమగాములచే గ్రహాంతర ఎన్కౌంటర్ల గురించి చాలా వాదనలు ఉన్నప్పటికీ, ఇంతవరకు బలమైన ఆధారాలు రాలేదు.
బజ్ ఆల్డ్రిన్
ఏది ఏమయినప్పటికీ, UK టాబ్లాయిడ్ డైలీ స్టార్ లో ఇటీవల వచ్చిన ఒక నివేదిక, బజ్ ఆల్డ్రిన్తో సహా నలుగురు నాసా వ్యోమగాములు తమ అపోలో 11 మిషన్ల సమయంలో గ్రహాంతర ఎన్కౌంటర్లు జరిగాయని పేర్కొన్నట్లు శాస్త్రీయంగా నిరూపించబడింది. సోషల్ మీడియాలో విస్తృతంగా భాగస్వామ్యం చేయబడుతున్న నివేదికలో, బజ్ ఆల్డ్రిన్ మరియు ఇతరులు "గ్రహాంతర" వాదనలలో అబద్ధం గుర్తించే పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారని పేర్కొంది.
"అంతరిక్షంలో ఎల్-ఆకారంలో గమనించదగినంత దగ్గరగా ఏదో ఉంది" అని ఇంతకుముందు ఆల్డ్రిన్ తెలిపినట్లు ఆ పత్రిక తెలిపింది.
ఇది కూడా చదవండి: మంత్రాల బావి(మిస్టరీ)
"వారు గ్రహాంతర ఎన్కౌంటర్లను చూసిన వాదనలపై నిజం గుర్తించే పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు" అని నివేదిక పేర్కొంది. "వింత అంతరిక్ష వీక్షణలు" గురించి వ్యోమగాముల చెప్పింది "సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం" ఉపయోగించి పరిశీలించామని మరియు నిపుణులు వారి వాదనలను "పూర్తిగా ఒప్పుకున్నారు" అని వివరించింది.
ఒహియోలోని అల్బానీలోని ది ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ బయోఅకౌస్టిక్ బయాలజీ నివేదిక ప్రకారం:
పరీక్షల సమయంలో "వ్యోమగాముల వాయిస్ నమూనాలను సంక్లిష్ట కంప్యూటర్ తో విశ్లేషించారు" ప్రస్తుత లై డిటెక్టర్ పరీక్షల కంటే సాంకేతికంగా ఎక్కువగా నమ్మదగినదిగా దీనిని పేర్కొన్నారు. ఇది సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల గొంతులను అర్థం చేసుకోవడానికి స్కాన్ చేస్తుంది. ఈ కొత్త వ్యవస్థ ప్రస్తుతం ఎఫ్బిఐ మరియు పోలీసులు ఉపయోగిస్తున్న దాన్ని భర్తీ చేయగలదు.
ఈ ధృవీకరణతో అన్యులు, అన్యగ్రహాలు, ఎగిరే పళ్ళాలు ఉన్నాయనడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని చాలామంది నమ్ముతున్నారు.
Image credits: To those who took the original photos
************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి