2, సెప్టెంబర్ 2020, బుధవారం

జీవన పోరాటం...(సీరియల్)...PART-7


                                                                         జీవన పోరాటం...(సీరియల్)                                                                                                                                                                    (PART-7) 

(మంచిని అందుకోవాలని అనుకున్నప్పుడు మంచి వ్యక్తులను పొందటం తప్ప పెద్ద యుద్దం ఇంకేదీ లేదు)

రాజరాజేశ్వరి చెప్పిన పధకం విని ఆశ్చర్యపోయిన మంగమ్మ దగ్గర మాటలు కొనసాగించింది రాజరాజేశ్వరి: నాకు సంతాన భాగ్యం లేదని తెలుసుకున్న తరువాత ఆయన్ని రెండో పెళ్ళి చేసుకోమని బ్రతిమిలాడాను. దానికి ఆయన ఖచ్చితంగా ఒప్పుకోనని చెప్పేరు. కానీ, ఇప్పుడు చూడు... దేవుడే ఒక సంధర్భం ఏర్పరచి ఆయనకు ఒక వారసుడ్ని ఇచ్చేడు. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను మంగమ్మా"

రాజరాజేశ్వరి తనని తిడుతుంది,శపిస్తుంది, ఇంటి నుండి తరిమేస్తుందని ఎదురు చూసిన మంగమ్మకి ఆమె చెప్పింది ఆశ్చర్యపరిచింది.

"వారసులు లేని మా ఆస్తిని అపహరించటానికి ఆయన బంధువులు చాలామంది పధకాలు వేస్తూ ఉన్నారు. దానివలన ఆయన ప్రాణానికే ముప్పు వస్తుందేమోనని నేను వణికిపోతున్నాను. వాళ్ళ పధకాలన్నీ నీవలన బూడిద అవబోతోంది."

తాను చేసిన తప్పు వలన ఈ కుటుంబానికి ఇలాంటి ఒక మంచి జరుగుతుందని మంగమ్మ ఎదురుచూడలేదు.

"ఇక మీదట నువ్వు నాకు పనిమనిషి కాదు. నా చెల్లివి. నన్ను వదిలిపెట్టి నిన్ను ఎక్కడికీ వెళ్ళనివ్వను మంగమ్మా" ఉద్రేకపడి మాట్లాడింది రాజరాజేశ్వరి.

"అమ్మగారూ...మీకు నావలన ఒక మంచి జరుగుతుందంటే దానికి నేను మనస్పూర్తిగా సహాయపడతానమ్మా. తిన్నింటివాసాలు లేక్కపెట్టే వాళ్ళు ఉన్నారని విన్నాను. కానీ, నేను అలాంటి దానిని కానమ్మా. నేను చేసిన పాపానికి పరిహారం చెయ్యగలిగితే అదే నాకు పెద్ద పుణ్యం"

భర్తను పిలిచి విషయం చెప్పింది. తన వలన మంగమ్మ గర్భం దాల్చిందని తెలుసుకుని ఆయన కంగు తిన్నాడు. అయినా కానీ ఆమెను జాలిగా చూసాడు. మంగమ్మో 'వాగ్ధానం మీరొద్దు అనేట్లు ఆయన్ని చూసి తలవంచుకుంది.

రాజరాజేశ్వరి తన పధకం గురించి ఇద్దరి దగ్గరా వివిరించింది.

తాను గర్భంగా ఉన్నట్లు ఇంట్లో వాళ్ళతోనూ, బయట వాళ్ళతోనూ చెప్పాలి. ఏదో ఒక కారణం చెప్పి మంగమ్మతో హైదరాబాద్ వెళ్ళిపోవాలి. అక్కడ మంగమ్మ ' రాజరాజేశ్వరి '  అనే పేరుతో హాస్పిటల్లో చూపించుకుంటూ రావాలి. పుట్టే బిడ్డకు హాస్పిటల్ రిజిస్టర్ లోనూ, ప్రభుత్వం ఇచ్చే బర్త్ సర్టిఫికేట్ లోనూ ఆ బిడ్డ పరంధామయ్య - రాజరాజేశ్వరి దంపతులకు పుట్టిందని రాసుండాలి.

తల్లిపాలు తాగేంత వరకు బిడ్డ మంగమ్మ దగ్గర పెరగాలి. ఆ తరువాత రాజరాజేశ్వరి దగ్గర పూర్తిగా వదిలిపెట్టి, ఆమె బిడ్డగానే పెంచటం అంటూ...అంతవరకు బంధువులో,  తెలిసిన వాళ్ళో వాళ్ళను చూడకుండా చూసుకోవాలని రాజరాజేశ్వరి తన పధకాన్ని వివరించినప్పుడు ఆశ్చర్యపోయారు పరంధామయ్య.

పుట్టుబోయే బిడ్డ యొక్క మంచి భవిష్యత్తు కోసం, ఆస్తులన్నిటికీ వారసుడు పుట్టాలనే కారణం కోసం, రాజరాజేశ్వరికి ఉన్న 'గొడ్రాలు అనే అవమన పరిచే పేరు పోగొట్టటానికీ మంగమ్మ ఈ త్యాగం చెయ్యాలని మంగమ్మ రెండు చేతులూ పుచ్చుకుని అడిగింది రాజరాజేశ్వరి. 

"అమ్మగారూ...నాకు పూర్తి సమ్మతం. ఎలాంటి పరిస్థితిలోనూ ఈ నిజం నా వల్ల బయటకు రాదు"--నీరు నిండిన కళ్ళతో చేతిలో చెయ్యేసి చెప్పింది మంగమ్మ.

మరుసటి రోజే రాజరాజేశ్వరి గర్భంగా ఉన్నదనే వార్త అనుకున్న ప్రకారం వ్యాపింపచేశారు. పనివాళ్ళందరికీ తలా వెయ్యి రూపాయలిచ్చేరు పరంధామయ్య. మంగమ్మ కూడా పనిమనుష్యులతో కలిసి నిలబడి తానూ వెయ్యి రూపాయలు తీసుకుంది. 

ఒక్కొక్కరూ వచ్చి రాజరాజేశ్వరిని అభినందించి వెళ్ళారు. ఊర్లోని పలువురు సంతోష పడ్డారు. ఎదురుచూసినట్లే కొంతమంది కడుపు మంటతో రగిలిపోయారు. వారసుడు వచ్చేడు కాబట్టి ఆస్తులు చైజారిపోయేయని కొందరు గొణుక్కున్నారు.

రాజరాజేశ్వరి మాత్రం వేరే దేని గురించి ఆందోళన చెందకుండా తన పధకాన్ని కరెక్టుగా అమలు పరచటం లోనే తన పూర్తి దృష్టి పెట్టింది.

ఆసుపత్రి పరిశోధనల కోసం విజయవాడకు రాజరాజేశ్వరిని నకిలీగా తీసుకువెళ్ళి వచ్చారు పరంధామయ్య. మంగమ్మ వాళ్ళతో పాటూ వెళ్ళొచ్చింది.

తిరిగి వచ్చిన తరువాత, కాలం గడిచి దాల్చిన గర్భం వలన రాజరాజేశ్వరి గర్భ సంచీ చాలా బలహీనంగా ఉన్నదంటూ...ఆమెను హైదరాబాద్ లోని పెద్ద హాస్పిటల్లో తరచూ చూపిస్తూ చికిత్స చేసుకోవాలని డాక్టర్ చెప్పినట్లు ముగ్గురూ అందరితో చెప్పుకుంటూ వచ్చారు.

పనివాళ్ళ ముందు మంగమ్మని 'చెల్లీ' అని పిలవటం మొదలుపెట్టింది రాజరాజేశ్వరి. ఆమె వచ్చిన వేళా విశేషం వలనే తన కడుపు పండిందని చెబుతూ వచ్చింది.

మిగిలిన వాళ్ళకు ఇది ఈర్ష్య ఏర్పరచినా, రాజరాజేశ్వరి మాటలను ఎవరు ఎదిరించి ఎం చెప్పగలరు?

ఈలోపు హైదరబాద్ గచ్చిబౌలి ఏరియాలో అన్ని వసతులతో కూడిన ఒక ఇళ్ళును కొన్నారు పరంధామయ్య. 

హైదరాబాద్ కు వెళ్ళే రోజును ఖాయం చేసారు. అందరి ముందూ సహాయానికి మంగమ్మ మాత్రం మనతో రానివ్వండి అంటూ ప్రాధేయపడింది. పరంధామయ్య అందుకు ఒప్పుకున్నారు. పధకం వేసిన నాటకం నెరవేరటం మొదలైయ్యింది.

ఖాయం చేసుకున్న రోజున అందరూ హైదరాబాద్ బయలుదేరారు.

రైలు ఎక్కిన తరువాత అంతవరకూ తమ పధకం ఎటువంటి సందేహానికి చోటివ్వకుండా నేరవేరింది తలుచుకుని సంతోషించారు. అదే సమయం చివరివరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం గురించి కూడా గ్రహించారు.

హైదరాబాద్ చేరిన వెంటనే మంగమ్మని హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారు. జాగ్రత్తగా ఆమె పేరు రాజరాజేశ్వరి అని, భర్త పేరు పరంధామయ్య అని రిజిస్టర్ చేశారు.

కడుపులో బిడ్డ ఆరొగ్యంగా ఉన్నదని, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని, నెల నెలా వచ్చి చూపించుకుంటే చాలని సలహా ఇచ్చి మంగమ్మ దగ్గర ప్రత్యేకంగా కొన్ని సూచనలిచ్చి పంపించారు డాక్టర్లు.

ఆమెను సొంత చెల్లెలు లాగనే చూసుకుంది రాజరాజేశ్వరి.  సత్యపాల్ కి మాటలు రాగానే తనని 'అమ్మా' అంటూ, పరంధామయ్యను 'నాన్నా' అని పిలవమని చెప్పింది. కానీ, మంగమ్మ పట్టుదలతో దాన్ని మార్చి 'పెదనాన్న-పెద్దమ్మా' అని పిలవమని చెప్పింది.  

మధ్య మధ్య పరంధామయ్య గ్రామానికి వెళ్ళి ఇళ్ళూ, పొలాలను చూసి వస్తున్నారు.

తన పత్తి వ్యాపారానికి హైదరాబాద్ ని కేంద్రంగా పెట్టుకుని బిజినస్ మొదలుపెట్టారు. బిజినస్ లోనూ ఆయనకు ఎటువంటి లోటూ రాలేదు.

మంగమ్మని జాగ్రత్తగా చూసుకున్న రాజరాజేశ్వరి ఇంటి పనులన్నీ ఆమే దగ్గరుండి  చేసుకుంది. మంగమ్మ ఆమెకు సహయాం చేయాలని వెడితే 'వద్దు అని ఆపేస్తుంది.  ఇంటి పనులకు పనిమనుషులను ఏర్పాటు చేస్తానని పరంధామయ్య చెప్పినప్పుడు వాళ్ళ నొటి మూలంగా ఇంటి విషయాలు బయటకు వెల్తాయని భయపడి వద్దని  చెప్పింది రాజరాజేశ్వరి. బిడ్డ పుట్టి ఆ బిడ్డ తల్లిపాలు తాగటం మరిచే వరకు కొత్త వారు ఎవరూ ఇంట్లోకి రాకూడదు అనే విషయంలో పట్టుదలగా ఉన్నది. 

డాక్టర్ రమ్మన్న తారీఖులలో మరిచిపోకుండా డాక్టర్ దగ్గరకు మంగమ్మని తీసుకు  వెళ్ళింది రాజరాజేశ్వరి. 'కడుపులోని బిడ్డకు ఏటువంటి కొరత లేదు అని డాక్టర్లు చెప్పినప్పుడల్లా వాళ్ళు చాలా సంతోష పడేవారు.  

ఒకరోజు మంగమ్మకి హఠాత్తుగా 'ప్రసవ నొప్పులు రావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళి చేర్చారు. దగ్గరుండి చూసుకుంది రాజరాజేశ్వరి. గది బయట పరంధామయ్య ఎక్కువ ఎదురుచూపుతో మనశ్శాంతి తక్కువై అటూ ఇటూ నడుస్తున్నారు.  

ఆ రోజు సాయంత్రం అన్ని రోజులు వాళ్ళు తపస్సు చేసి ఎదురుచూస్తున్న ఆ మంచి వార్త దొరికింది.

మంగమ్మ అందమైన ఆడపిల్లను సుఖ ప్రసవంతో కన్నది.

తమకు ఒక వారసులు దొరికిన ఆనందంలో భార్యా-భర్తలు ఇద్దరూ పూరించి పోయారు.

రాజరాజేశ్వరి చేతులలో బిడ్డను చూసిన మంగమ్మ, తాను ఆమెకు చేసిన ద్రొహానికి, ఇప్పుడు పరిహారం చేసి ముగించింది తలచుకుని ప్రశాంతం చెందింది.

                                                                                                               Continued-PART-8

**************************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి