18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

జీవన పోరాటం...(సీరియల్)...PART-15

 

                                                                          జీవన పోరాటం...(సీరియల్)                                                                                                                                                                   (PART-15)

(అనురాగం గురించి ఎమీ తెలియన వాళ్ళు, అనురాగం అనేది సంతోషాన్ని మాత్రమే ఇస్తుందని చెబుతారు. కానీ, కొన్ని సమయాలలో మనం మిగిలినవాళ్ళకు ఇచ్చే కష్టాలకు కూడా అనురాగమే మూలాధారంగా ఉంటుంది)

ఆఫీసుకు చేరుకున్న గాయత్రి, అక్కడకి ఎందుకు తనని తీసుకు వచ్చారో తెలియక సతమత పడింది.

పోలీస్ స్టేషన్ కు కాదు అని తెలిసినప్పుడ ఆమె మనసులో లోతుగా ఏర్పడిన భయం పోయింది. కొత్త ఉత్సాహంతో, కొత్త ధైర్యంతో పరిస్థితిని ఎదుర్కొనటానికి తయారయ్యింది.

కారులో నుండి దిగిన సత్యపాల్, ఆఫీసులోని తన గదిలోకి వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు.

గాయత్రి ఆ గదిలోకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు రావటానికి ముందే పరంధామయ్య, రాజరాజేశ్వరి, మంగమ్మ అని ముగ్గురూ ఉన్నది చూసి ఆశ్చర్యపోయింది. జరిగేదంతా వీళ్ళందరూ 'కలిసి చేసిన కుట్ర అనేది గ్రహించిన ఆమె కోపం, వెర్రిగా మారింది.   

కానీ, వీళ్ళ ప్లాను ఏమిటి అనేది తెలుసుకుని ఆ తరువాత మన ప్రతాపం చూపిద్దం అని అనుకుని, తన కోపాన్ని అణుచుకుని తన కుర్చీలో కూర్చుని, 'తరువాత సత్యపాల్ ఏం చెయ్యబోతాడు?' అని ఎదురుచూస్తూ కాచుకోనుంది.

నవీన్ ను ఇద్దరు మనుషులు ఆ గదిలోకి లాక్కుని వచ్చారు.

సత్యపాల్ కళ్ళతో సైగ చేయగా... నవీన్ కట్లు ఊడదీసి వాళ్ళిద్దరూ ఆ గదిలో నుండి వెళ్ళిపోయారు.

ఇంతవరకు సత్యపాల్ కఠినత్వాన్ని చూడని గాయత్రి ఇప్పుడు చూడటంతో ఆమెకే ఒక విధమైన భయం ఏర్పడింది. సత్యపాల్ ఇంత కఠినంగా నడుచుకోవటం ఇంతకు ముందు చూడని వారు కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు.  

"నవీన్, అందులో కూర్చో" -- సత్యపాల్ చూపించిన కూర్చీలో కూర్చున్నాడు నవీన్. అతను బాగా భయపడుతున్నాడని అతని మొహమే బయటపెడుతోంది.

కఠినత్వం తగ్గని స్వరంతోనే అడిగాడు: " నవీన్, నువ్వు దాచకుండా నిజం చెబితే  ఎటువంటీ తరుగు లేకుండా ఇంటికి వెళ్ళిపోవచ్చు"

'ఏ నిజాన్ని ఇతను ఎదురుచూస్తున్నాడు?' అనేది అర్ధం కాక తడబడ్డ నవీన్, ఏదైనా  తానుగా ఏదీ వాగకూడదు అని జాగ్రత్త పడ్డాడు.

"మీరేం అడుగుతున్నారో నాకు అర్ధంకావటంలేదు"

"సరే...తిన్నగానే అడుగుతున్నా. గాయత్రిని నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావా?"

గాయత్రికి ఒకప్రేమ వ్యవహారం ఉన్నదని గ్రహించిన గాయత్రి తెల్లి-తండ్రులు ఆశ్చర్యపోయారు.

నవీన్ ఎటువంటి సమాధానం చెప్పకుండా గాయత్రినే చూస్తూ ఉండటం గమనించిన సత్యపాల్, కోపంగా మళ్ళీ అదే ప్రశ్ననే అడిగాడు.    

"నేనూ, గాయత్రి ఒకర్నొకరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం. మీ దగ్గర చెబితే ఖచ్చితంగా మా పెళ్ళి చెయ్యరు. అందువల్ల మేమే పెళ్ళి చేసుకోవటానికి అమ్మోరి గుడికి వెలుతున్నాము. ఇప్పుడు కిరాయి గూండాలను పెట్టి మమ్మల్ని ఎత్తుకోచ్చి ఇక్కడకు తీసుకు వచ్చి బెదిరిస్తున్నారు"

'ఇప్పుడు మమ్మల్ని ఏం చేయగలరు?' అంటునట్టు సత్యపాల్ ని నిర్లక్ష్యంగా చూసింది గాయత్రి.

"దుర్మార్గురాలా! దీనికొసమేనా ప్రొద్దున పట్టుచీర, నగలతో బయలుదేరి వెళ్ళావు? ఇది గ్రహించలేక నిన్ను గుమ్మం వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించాను?" అంటూ మహిళలిద్దరూ కోపగించుకున్నారు.

ఎదురుచూడని ఈ సంఘటన గురించి విని పరంధామయ్య ఆశ్చర్యంతో నోరెల్లబెట్టేరు.

వీటి గురించి ఆందోళన చెందని సత్యపాల్, మరొక ప్రశ్నను పిడుగులాగా దింపాడు: "సరే నవీన్... గాయత్రి నీకు ఎన్నో ప్రేమికురాలు?"

ఈ ప్రశ్న అతనిని మాత్రమే కాదు, గాయత్రిని కూడా కలవరపరిచింది.

కానీ, నవీన్ కలవరం నుండి వేగంగా తేరుకుని, "మిస్టర్. సత్యపాల్, అన్యాయమైన నేరాలను మోపి నన్నూ, గాయత్రిని విడదీయటానికి ప్రయత్నిస్తున్నారు" అని విరక్తిగా సమాధానం చెప్పాడు.

కోపంతో చూసిన గాయత్రిని నిర్లక్ష్యపరిచిన సత్యపాల్, ఇంటర్ కాం లో ఎవర్నో..."లోపలకు రా" అన్నాడు.   

లోపలకు వచ్చిన వసంతను చూసిని నవీన్ కు వెంటనే చెమటలు పట్టినై. అతని మొహంలో భయం కనబడ్డది. తను సత్యపాల్ దగ్గర బాగా చిక్కు కున్నట్టు అర్ధం చేసుకున్నాడు.   

"ఏం నవీన్, ఈ వసంత నీకు గుర్తుందా? పవిత్రా హాస్పిటల్ ఎక్కడుందో నీకు తెలుసా?  డాక్టర్ జయలక్ష్మి తెలుసా? అక్కడ పనిచేస్తున్న నీ స్నేహుతుడు రాజును కూడా మర్చిపోయావా?" అంటూ సత్యపాల్ ప్రశ్నలడుగుతూ వెడుతూంటే, తన జాతకమే సత్యపాల్ చేతిలో ఉన్నదని బాగా అర్ధమయ్యింది నవీన్ కు. 

ఇంతకు మించి ఎదిరించి మాట్లాడితే తన గురించి మొత్తం కథ బయటకు వచ్చేస్తుంది అని భయపడి అక్కడ్నుంచి తప్పించుకుంటే చాలు అనుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు.

"సార్. నేను ఏం చేయాలి చెప్పండి?" శరణాగతి అయ్యాడు.

పరిస్థితి తలకిందలుగా మారిపోవటాన్ని చూసి గాయత్రి కూడా నోరెళ్లబెట్టింది.

"గుడ్! ఇకమీదట వసంతకో, గాయత్రికో నీవల్ల ఎటువంటి ఇబ్బందీ రాకూడదు. అలా ఏదైనా జరిగితో నేను నీకు శత్రువుగా మారిపోతాను. ఇంకోసారి ఇలా నాగరీకంగా కూర్చోబెట్టి మాట్లాడను--మిక్కిలి కఠినంగా హెచ్చరించాడు.

దాన్ని అక్కడున్న అందరూ ఆశ్చర్యంతో చూశారు.

ఎలాంటి బురద గుంటలో నుండి గాయత్రిని కాపాడాడు అనేది అర్ధం చేసుకున్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించారు. అందుకోసమే ఆ రోజు వసంతను ఉద్యోగంలోకి తీసుకోవాలని పట్టుదల పట్టటంలో అతని తెలివితేటల తీరు, నిర్వాహ తెలివి, గాయత్రి మీద అతనికున్న అనురాగం, ఆమెకు ఎటువంటి హాని జరగకూడదని జాగ్రత్త పడటంలో అతను చూపిస్తున్న ఇంటరెస్టు ను తలచుకుని ఆశ్చర్యపోయారు.     

మంగమ్మకి దగ్గరే కూర్చోనున్న రాజరాజేశ్వరి మంగమ్మ చేతి మీద తన చెయి వేసి నొక్కి, వెయ్యి మాటలతో చెప్పాల్సిన మెప్పును ఆ ఒక్క స్పర్శతో తెలియజేసింది.

"ఇంకెవరైనా ఏదైనా అడుగుతారా?" అని గాయత్రిని చూసి అడిగాడు.

అతను చూసిన ఆ చూపులో తన శరీరాన్ని తొలుచి వెడుతున్న తూటాలు, తాను మరోకసారి ఓడిపోయిన భావాన్ని ఏర్పరచి అవమానంతో తల దించుకునేటట్టు చేసింది. దానికి కారణమైన నవీన్ ను కాల్చివేసేలాగా ఉగ్రంగా చూసింది గాయత్రి.

ఆ చూపులను తట్టుకోలేక తలవంచుకుని కూర్చున్నాడు నవీన్.

వసంతను పంపించి గాయత్రిని చూశాడు సత్యపాల్. ఆమె ఏమీ మాట్లాడే దోరణిలో లేదనేది అర్ధం చేసుకున్నాడు.

అతను పిలిచిన వెంటనే ఒకడు లోపలకు వచ్చాడు. అతనితో "సార్ గారికి ఆయన బండి ఇచ్చేసి దగ్గరుండి జాగ్రత్తగా పంపించండి" అన్నాడు. ఆ తరువాత నవీన్ వైపు తిరిగి "నువ్వు వెళ్ళొచ్చు. మళ్ళీ మనిద్దరం కలిసే సంధర్భం రాకూడదు. వస్తే అది నీకే మంచిది కాదు" అన్నాడు.

వెంటనే అతను లేచి తడబడుతున్న నడకతో నడిచాడు...కాల్చివేసేలాగా చూసింది గాయత్రి.

జరుగుతున్నవన్నిటినీ సినిమాలాగా చూస్తున్నారు అందరూ. ఎందుకంటే విషయం గురించి ఏమీ చెప్పకుండా వాళ్ళను అక్కడకు తీసుకు వచ్చాడు సత్యపాల్.

పరంధామయ్య అడిగాడు: "ఇన్ని విషయాలు తెలుసుకోవటానికి నువ్వు ఎంతో శ్రమ పడుంటావే?"

ఆయన ప్రశ్నలో...ఇతను ఉన్నప్పుడు ఇక నాకు ఎటువంటి ఆందోళన ఉండదు అనే గర్వం కనబడుతోంది.

"దీనికంతా ఇప్పుడు మనం పెద్దగా శ్రమ పడక్కర్లేదు పెదనాన్నా. ప్రైవేట్ గూఢాచార సంస్థలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర మనకు కావలసిన సేవలు చెప్పి డబ్బులు కడితే చాలు. రహాస్యంగా పనిచేసి మనకు కావలసిన వివరాలు అందజేస్తారు"

గాయత్రి తాను ఒక మోసగాడి దగ్గర నుండి కాపాడ బడ్డను అనేది నిదానంగా అర్ధం చేసుకుంది.  దాని కోసం సంతోష పడాల్సిన ఆమె, సత్యపాల్ మీద మరింత కోపం పెంచుకుంది. చాలా రోజులుగా అతను తనను, నవీన్ ను ఫాలో చేశాడు. మా వెనుక నీడలాగా పలువురు చుడుతూ వచ్చారు. నా ప్రైవసీ లో తల దూరుస్తూ ఉన్నారు. ఇంకా ఏమేమి తెలిసిపెట్టుకున్నాడో? ఏమేమి చెయ్యబోతాడో? వీడిని ఇలాగే వదిలేస్తే నాకు ప్రశాంతత ఉండదు. వీడిని, వీడి తల్లినీ వెంటనే ఇంటి నుండి తరిమేయాలి అని గట్టిగా తీర్మానించుకుని ఎవరి దగ్గరా, ఏమీ చెప్ప కుండా ఆఫీసు గదిలో నుండి తుఫాన లాగా బయటకు వెళ్ళింది. 

ఇంటికి వెళ్ళిన వెంటనే తుఫాన తాకబోతోందని మిగిలినవారు అర్ధం చేసుకున్నారు. ఆ తుఫాన తాకిడి నుండి ఎలా తప్పించుకోవాలో నని ఒక్కొక్కరూ తమ తమ ప్లానుల గురించి ఆలోచిస్తూ ఇంటి దారి పట్టారు.

కన్నవారిని పంపిచేసి సత్యపాల్ కొంతసేపు ప్రశాంతంగా కూర్చున్నాడు. కొంతసేపైన తరువాత వసంతను పిలిచి మాట్లాడాడు, "చాలా థ్యాంక్స్".

అంతకు మించి మాట్లాడలేక అతని గొంతు బొంగురు పోయింది.

"నాకు ఎందుకు సార్ థ్యాంక్స్ చెబుతున్నారు? మ్యాడం ను ఆమెకు రాబోయే పెద్ద ఆపద నుండి కాపాడటంలో నేనూ సహాయ పడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్"

"అయినా కానీ వసంతా, నీ పర్సనల్ రహస్యాలను బయట చెప్పాల్సి వచ్చిందే...?"

"పరవాలేదు సార్. 'ఇలాంటి ఒక సమయం వస్తుంది...అప్పుడు మీకు సహాయంగా ఉంటుందని ఇంతకు ముందే తెలుసు. అందువల్ల దీని గురించి నేనేమీ బాధపడటంలేదు. మీరు కూడా బాధపడ అక్కర్లేదు"

"థ్యాంక్స్ వసంతా, చాలా థ్యాంక్స్"

ఆమెను పంపించి, తాను కూడా ఇంటికి వెళ్ళాడు.

                                                                                                 Continued....PART-16

వీటిని కూడా చదవండి:

మనుషులకూ మూడో కన్ను?(మిస్టరీ)

మరణం తరువాత జీవితం(ఆసక్తి)

**************************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి