ప్రేమ కలలు (పూర్తి నవల)
సుధీర్ అనే ఒక అనాధ, జీవితంలో విజయం సాధించటమే కాకుండా సమాజంలో విడిచిపెట్టబడ్డ మహిళలకు ఆదరణగా ఉంటాడు. అతను స్థాపించిన మహిళా హోమ్ లో జీవిస్తున్న మహిళలలో తన తల్లిని చూసుకునే అభిమానం కలిగినవాడు.
అంజలి అనే ఒక యువతి, తన తల్లిని సుధీర్ నడుపుతున్నమహిళా హోమ్ లో చేరుద్దామని వస్తుంది. తనకు ఉద్యోగం దొరికేంత వరకు తానూ తన తల్లితో పాటూ హోమ్ లో ఉండటానికి అనుమతి అడుగుతుంది. మొదట అనుమతించని సుధీర్ తరువాత అంగీకరిస్తాడు.
కొన్ని రోజులలో సుధీర్-అంజలి ఒకరినొకరు ఇష్టపడతారు. కలలు కంటారు. ధైర్యం చేసి సుధీర్ ఒక రోజు తన ప్రేమను అంజలి దగ్గర చెబుతాడు. తన తల్లి 'మన ప్రేమను అంగీకరిస్తేనే తాను పెళ్ళికి ఒప్పుకుంటాను ' అని చెబుతుంది.
కానీ అంజలి తల్లికి 'ప్రేమ ' అంటేనే గిట్టదు. అందువలన వాళ్ళిద్దరి ప్రేమను అంగీకరించదు.
అంజలి అందరిలాగానే ఆశాప్రీతికి కట్టుబడినదే. కానీ ఆమె తల్లి యొక్క ప్రేమ కథ మిక్కిలి అసాధారణమైనది. అందువలన ప్రేమను విపరీతంగా ఎదురిస్తుంది.
ప్రేమంటే అంజలి తల్లికి ఎందుకంత విరక్తి? ఆమె యొక్క అసాధారణమైన ప్రేమ కథ ఏమిటి? అదెందుకు ప్రేమ మీద విరక్తిగా మారింది? ప్రేమ మీద ఆమెకేర్పడిన ఆ విరక్తి పోయిందా? అంజలి యొక్క నిజమైన ప్రేమ కల నెరవేరిందా? లేదు తన తల్లి కోసం అంజలి ప్రేమను త్యాగం చేసిందా?.....ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ నవల చదవండి.
నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది.....వ్యత్యాసమైన ప్రేమ కథ మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది.
మీకు సమయం ఉండి ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్ లోనే చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:
ప్రేమ కలలు...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2.
నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ దొరికినప్పుడల్లా చదువుకోవటానికి ఈ క్రింద లింకు క్లిక్ చేసి PDF ను డౌన్ లోడ్ చేసుకుని చదవండి:
https://drive.google.com/file/d/16GrllIYjGT9Wcw3i16CKAAPe2YEr0Y8S/view?usp=sharing
ఈ నవలను పార్టులుగా చదవాలనుకుంటే:
ఈ రోజు నుండి రోజు విడిచి రోజు 12 పార్టులుగా ఈ బ్లాగులోనే ప్రచురణ అవుతుంది. మొదటి పార్ట్ క్రింద ప్రచురణ అయ్యింది: చదివి మీ అభిప్రాయాలు తెలుపండి.
************************************************************************************************
ప్రేమ కలలు...(నవల) (PART-1)
‘రంగుల
కలలు’ అనే
పేరు రాయబడ్డ
ఇంటి ముందు
పెద్దగా అరుస్తున్నాడు
సుధీర్. అందంగా
ఉండే అతని
ముఖం, విపరీతమైన
కొపంతో ఎర్రబడింది.
అతను చూపులు
లోపలకు రావడంతో
అక్కడ పనిచేస్తున్న
గోపి , రాజా
దాక్కున్నారు.
“బాబాయ్...ఎక్కడికెళ్ళారు? చాలా
సేపటి నుండి
అరుస్తున్నాను.
ఇక్కడ నేను
వృద్దాశ్రమం నడుపుతున్నానా...లేక
హాస్టల్ నడుపుతున్నానా? దీన్ని
ఇల్లులాగా చూసుకోవాలని
చెప్పాను కదా? ఇప్పుడు
మీరు నా
ముందుకు వస్తారా
లేకపోతే పనిలోంచి
తీసేయనా?”
రాజా మెల్లగా
తల బయటకు
పెట్టాడు.
“ఏం
తమ్ముడూ...ఎందుకు
అరుస్తున్నారు?”
“నిదానంగా అడగండి.
నన్ను మీకు
తెలియదా? ఈ
రోజు ప్రొద్దుటి
టిఫిన్ బాగుండలేదని
చెబుతున్నారు. గోపి
బాబాయ్ ఎక్కడ?”
“ఇదిగో
ఇక్కడున్నా తమ్ముడూ”--కుంటుకుంటూ
నడిచి వచ్చాడు.
“ప్రొద్దున
ఏం టిఫిన్
పెట్టారు?”
“ఉప్మా’. నిన్న
కరెంటు కట్.
అందువల్ల పిండి
రుబ్బలేకపోయాము.
రేపు ఇడ్లీ
వేస్తాను తమ్ముడూ”
“అది
సరే. ఎందుకు
ఉప్మాను ఉడకకుండా
పెట్టారు? చూడండి...ఇక్కడున్న
కొందరికి పడలేదు.
నేను ఎన్నిసార్లు
చెప్పాను...’ఇక్కడున్న
వాళ్ళందరూ వృద్దులు.
బాగా ఎనర్జిటిక్
ఫుడ్ పెట్టాలి’
అని?”
“ఈ
రోజుకు క్షమించు
తమ్ముడూ. రేపటి
నుండి బాగా
చేస్తాను” అనటంతో లోపలకు
వెళ్ళాడు సుధీర్.
అతని తల
కనుమరుగయ్యాక మాట్లాడాడు
గోపి.
“అవును.
ఇక్కడ ఉంటున్న
వాళ్ళందరూ వి.ఐ.పి.
లు చూడు? భర్త
లేని వాళ్ళు, పిల్లలు
వదిలేసిన వాళ్ళు
లాంటి వారే
వస్తున్నారు. అలాంటి
వాళ్లకు ఈ
భోజనం సరిపోదా? ‘ఉప్మా
ఉడకలేదు’
అని కంప్లైంట్
చేసారు. కానీ, కానీ...ఈ
రోజు కాఫీలో
ఉప్పు వేసి
ఇస్తాను”
ఆ మాటలు
వింటూ నిలబడ్డ
నిర్మలా ఆంటీ, తిన్నగా
సుధీర్ దగ్గరకు
వచ్చింది.
“తమ్ముడూ...ఇలా
చూడూ. నువ్వేమో
ఏదోవిధంగా వృద్దాశ్రమాన్ని
మంచిగా జరుపుకుంటూ
వస్తున్నావు! కానీ, ఈ
గోపి మిమ్మల్ని
గౌరవించకుండా ఇష్టం
వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.
ఇక్కడ వంట
చేయటానికి జీతం
తీసుకునే వంట
మనిషి ఎందుకు? మేము
చేయలేమా?”
“లేదు
ఆంటీ. మీరు
డబ్బులిచ్చి ఇక్కడ
చేరుతున్నారు. మిమ్మల్ని
ఎలా వంట
చేయమని చెప్పగలను? అది
బాగుండదు!”
“అలా
అనుకుంటే ఒక
స్త్రీని వంట
మనిషిగా పెట్టు? నీకు
ఈ గోపీనే
దొరికాడా? నేనొకటి
చెబితే వింటావా?”
“చెప్పండి”
“నాకు
ఒక చెల్లెలు
ఉంది. అది
కూడా చాలా
కష్టపడుతోంది...తన
సొంత కొడుకు
ఇంట్లో ఉంటూనే
కష్టపడుతోంది. చేతిలో
చిల్లి గవ్వ
లేదు. అందుకని
ఆమెను ఇక్కడకు
రమ్మంటాను. ఆమె
వంట చేయనీ.
నేనూ ఆమెకు
తోడుగా హెల్ప్
చేస్తా. ఆమె
చేసే పనికి
జీతంగా భోజనం
పెట్టి, తలదాచుకోవటానికి
ఇంత చోటివ్వు.
సరేనా...?”
ఆలొచించాడు.
“ఏమిటి
ఆలొచిస్తున్నావు? నా
చెల్లెలు రుక్మణి
బాగా వంట
చేస్తుంది. శుభ్రంగానూ
ఉంటుంది. ఏమంటావు?”
నిర్ణయం తీసుకున్నాడు.
“సరే
ఆంటీ. మీరు
ఆమెను రమ్మనండి.
మనం చేర్చుకుందాం” అన్నాడు.
అతనికి థ్యాంక్స్
చెప్పి అక్కడ్నుంచి
వెళ్ళింది ఆంటీ.
అదే సమయం
గోపీని వెంటనే
పనిలో నుండి
తీసేయలేదు. మార్కెట్టుకు
వెళ్ళి రావటానికి, ఇతర
బయటి పనులు
చేయటానికి ఉండనీ
అని వదిలేసాడు.
వంట పనిలో
నుండి విడుదల
దొరికేటప్పటికి
సంతోష పడ్డాడు
గోపీ.
“నా
కేమన్నా వీళ్ళ
మీద పగా? రోజూ
పొయ్యి దగ్గర
నిలబడలేక పోతున్నాను.
ఆ పనులన్నిటికి
స్త్రీలే సరిపోతారు.
ఇంకే పని
చెప్పినా చేస్తాను
తమ్ముడూ”
“పెళ్ళిళ్ళకు
వంట చేసేది
మగవారే కదా
గోపీ. అది
మర్చిపోకు. రాజానే
మర్కెట్టుకు వెళ్ళి
కూరలూ అన్నీ
పట్టుకొస్తున్నాడు.
ఆ లెక్క
సరి చూసి
ప్రతి వారం
నాకు అప్పగించాలి.
తోటను సరిగ్గా
ఉంచుకోవాలి. ఇక్కడున్న
వాళ్ళల్లో ఎవరికైనా
ఆరొగ్యం బాగ
లేకపోతే...డాక్టర్ను
తీసుకురావాలి”
“ఏం
తమ్ముడూ...ఇవన్నీ
నువ్వే కదా
చూసుకునే వాడివి?”
“అవును.
నేను సోమవారం
నుండి ఉద్యోగానికి
వెళ్ళబోతాను. ఆఫీసు
నుండి
వచ్చిన తరువాత
అన్నిటినీ చూసుకోలేను.
అందుకనే శని, ఆదివారాలలో
నిన్నడిగి తెలుసుకుంటాను”
“ఎందుకు
హఠాత్తుగా ఉద్యోగాని
వెడుతున్నారు?”
“చాలా
రోజుల నుండి
నాకు ఈ
ఆలొచన ఉన్నది. ఎంతగా
వృద్దాశ్రమం నడుపుతున్నా, వాళ్ళ
దగ్గర డబ్బులు
తీసుకునే కదా
వాళ్ళకు చోటిస్తున్నాను.
అంటే, కొంచం
వసతి ఉన్న
వాళ్ళే కదా
రాగలరు. కష్టపడే
వాళ్ళు ఏం
పాపం చేశారు? అలాంటి
వాళ్ళకి ఒకరిద్దరికి
చోటు ఇవ్వాలని
నాకు ఆశ”
“మీకు
చాలా గొప్ప
మనసు తమ్ముడూ”
“ఊహూ...అలాగంతా
ఏమీ లేదు.
నేను ఉద్యోగానికి
వెడితే దొరికే
జీతంతో ఎవరైనా
పేదవారిని చేర్చుకోవచ్చు
కదా? అందుకనే...”అన్నాడు.
అతన్ని మర్యాదతో
నమస్కరించింది
గోపీ మనసు.
బాగా తిరుగుతున్న
చక్రంలాగా బాగానే
జరుగుతున్నది వృద్దాశ్రమం.
నిర్మలా ఆంటీ చెల్లెలు
రుక్మణి యొక్క
చేతి వంట
రుచి అందరూ
పొగిడారు. గోపీ
కూడా బాధ్యత
తెలుసుకుని నడుచుకోవటం
మొదలుపెట్టాడు.
ఆ రోజు
శుక్రవారం. సాయంత్రం
సుధీర్ ఆఫీసు
నుండి ఇంటికి
వచ్చినప్పుడు ఒకటే
గోలగా ఉంది.
ఎవరో అమ్మాయి
గొంతు, గోపీ
గొంతు గట్టిగా
వినబడుతున్నాయి.
ఆలోచనతో లోపలకు
దూరాడు.
సుమారు 45 ఏళ్ళ
వయసున్న ఒక మహిళ, 22 ఏళ్ళుండొచ్చు...ఒక
యుక్త వయస్సు
అమ్మాయి, పెట్టే
బేడతో నిలబడున్నారు.
ఆ అమ్మాయి
అరుస్తున్నది.
“సార్.
నేను ‘లెటర్’
రాసినప్పుడు తీసుకు
వచ్చి చేరండి
అని జవాబు
రాసేసి...ఇప్పుడు
కుదరదంటే ఏం
సార్ చేస్తాను?”
“మేడం!
మీరు ఉత్తరంలో
ఎటువంటి వివరాలూ
రాయలేదు. మేమూ
చూడ కుండా
‘అనుమతిస్తున్నాము’
అని జవాబు
రాసేము. ఇప్పుడుఇక్కడ
చోటు లేదు.
బయటకు నడవండి...” అన్నాడు.
“గోపీ...ఏమైంది? ఎందుకలా
అరుస్తున్నారు? బయటవరకు
వినబడుతోంది” అన్నాడు
సుధీర్ లోపలకు
వస్తూ!
ఆ అమ్మాయి
గబుక్కున తిరిగి
చూసింది.
ఆమెను చూసిన
ఆ క్షణం
అతన్ని అతను
మరిచాడు సుధీర్.
అమ్మాయ్ అంటే
ఎలా ఉండాలో
తన మనసులో
ఊహించుకుని ఉన్నాడో
అలాగే ఉన్నది
ఆ అమ్మాయి.
ఛామన ఛాయ.
సన్నని శరీరం.
రంగుకు తగిన
దుస్తులు. డబ్బు
వసతి అంతంత
మాత్రమే నని
ఆమె వేసుకున్న
దుస్తులే చెబుతున్నాయి.
ఆమె కళ్ళూ
అయస్కాంతంలా లాగుతున్నాయి.
ఒక్క నిమిషం
తనని తాను
మరిచి ఆమెనే
చూస్తూ నిలబడ్డాడు.
“సార్...మీరేనా
దీనికి యజమాని? మీరే
వినండి సార్
ఈ అన్యాయాన్ని!
మా అమ్మను
ఇక్కడ చేర్చుకుంటామని
చెప్పి నాకు
ఉత్తరం వచ్చింది.
అది నమ్ముకునే
శ్రీకాకుళం నుండి
బయలుదేరి వచ్చాము.
ఇప్పుడు ఈయన
చోటు లేదని
చెబితే...ఎక్కడికి
సార్ పోతాము?” అన్నది
బాధపడుతూ.
తనని తాను
సర్దుకున్నాడు.
“మేడం...మీ
పేరేమిటి?”
“అంజలి.
ఈవిడ మా
అమ్మగారు.ఈమెనే
చేర్చుకోమని చెబుతున్నారు
మీ మనిషి” అంటూ
అతని దగ్గరకు
వచ్చింది. వేగంగా
కొట్టుకుంటున్న
గుండెను అదుపులోకి
తెచ్చుకుంటూ గోపీ
వైపు కోపంగా
చూశాడు.
“ఏమిటి
గోపీ...వీళ్ళేం
చెబుతున్నారు? ఎందుకు
ఈ అమ్మగారిని
చేర్చుకోలేమని
చెబుతున్నావు?”
“సార్...ఈ
అమ్మాయి అబద్దం
చెబుతోంది సార్.
మనకు రాసిన
ఉత్తరంలో...‘మా
అమ్మను చేర్చుకో
గలరా? దానికెంత
డబ్బు కట్టాలో
కట్టేస్తాను’
అని రాసున్నారు.
కానీ ఇప్పుడొచ్చి
నేనూ ఈమెతోనే
ఉంటాను అని
చెబుతున్నారు” అన్నాడు.
ఆశ్చర్యపోయాడు
సుధీర్.
“మిస్
అంజలి. ఇది
వృద్దులకొసం నడుపుతున్న
ఆశ్రమం. ఇందులో
మీరు ఉండటానికి
అనుమతించలేము”
“మీరు
ఎంత డబ్బు
అడుగుతారో, అంత
డబ్బూ కట్టటానికి
రెడీగా ఉన్నాను
సార్”
“ఇక్కడ
డబ్బు సమస్య
కాదు మిస్.
ఈ రోజు
మిమ్మల్ని ఉండమని
చెబితే, రేపు
ఇంకో అమ్మాయి
తన అమ్మతో
వచ్చి నేనూ
ఇక్కడే ఉంటాను
అంటుంది. ఆ
తరువాత అలాగే
జరిగితే...’లేడీస్
హాస్టల్’
నే నడపాలి.
అదంతా నా
వల్ల కాదు.
మీరు ఇంకొక
చోటు చూసుకోండి” అన్నాడు
మనసు రాయి
చేసుకుని.
“సార్...మా
పరిస్థితి కొంచం
అర్ధం చేసుకోండి
సార్. మాకు
ఈ ఊర్లో
వేరే ఎవరినీ
తెలియదు. నాకు
ఉద్యోగం దొరికేంత
వరకు ఎక్కడ
సార్ ఉండను? బద్రత
ఉన్న ఈ
చోటే బెస్టు.
కొంచం దయ
చూపండి సార్” ఆమె
బ్రతిమిలాడగానే
అతని మనసు
జాలిపడింది.
సుధీర్ చుట్టూ
అటూ ఇటూ
చూసాడు...’ఎవరైనా
ఈ అమ్మాయిని
చేర్చుకో అని
రెకమండ్ చెయ్యకపోతారా?’ అని
మనసులో ఒక
చిన్న ఆశ.
అంజలి తల్లి
మెల్లగా నడిచి
వచ్చింది.
“తమ్ముడూ...మీ
పరిస్థితి నాకు
అర్ధమవుతోంది. నాకు
కొంచం ఆరొగ్యం
బాగలేదు. మద్య
రాత్రి రెండింటికి
ఒక మాత్ర
వేసుకోవాలి. అదే
అంజలికి బాధగా
ఉంది. ఒక
వారం ఉండటానికి
అనుమతిస్తే చాలు.
ఈ లోపు
దానికి ఉద్యోగం
దొరికి...మేము
వేరే చోటు
చూసుకుని వెళ్ళిపోతాం” అన్నది
నీరసించిన స్వరంతో.
“ఆ
పని ఇప్పుడే
చెయచ్చుగా?” అన్నాడు
గోపీ.
“వూరికే
వుండు గోపీ” అన్న సుధీర్, ఆమె
వైపు తిరిగాడు.
“నాకు
ఏం చేయాలనేది
అర్ధం కావటం
లేదు. నేనూ
ఈ ఆశ్రమాన్ని
ఎనిమిది సంవత్సరాలుగా
నడుపుతూ వస్తున్నాను.
వయసైన వారిని
తీసుకు వచ్చి, డబ్బులు
కట్టేసి, పరిగెత్తుకుని
వెళ్ళే వాళ్లనే
చూశాను. కానీ, ఈవిడ
మీతోనే ఉంటానని
చెబుతోంది. ఇది
ఆశ్చర్యంగా ఉన్నా...
సమస్య కూడా
అదే” అన్నాడు.
వీళ్ళ సంభాషణను
బయట నిలబడి
వింటున్న రుక్మణీ
ఆంటీ లోపలకు వచ్చింది.
“తమ్ముడూ...నువ్వు
చదువుకున్న వాడివి.
దేశంలో జరుగుతున్న
మంచి, చెడు
తెలిసున్నవాడివి.
తను పాపం.
వయసులో ఉన్న
ఆడపిల్ల. తల్లిని
తీసుకుని ఎక్కడికి
వెడుతుంది? అలాగే
వెళ్ళినా వాళ్లను
ఎవరైనా మోసం
చేస్తే...పాపం
కదా?”
“నాకూ
అర్ధమవుతోంది ఆంటీ.
కానీ వేరే
దారి ఏదీ
దొరకటం లేదే?”
“నాకు
ఒక దారి
తోస్తోంది...చెప్పనా?” అన్నది
రుక్మణీ ఆంటీ.
“చెప్పండి
ఆంటీ...మంచి
దారైతే చూద్దాం?”
“మన
తోటలో ఒక
ఇల్లు ఖాలీగానే
ఉంది కదా.
అక్కడ వీళ్ళను
ఉంచు. కావాలంటే
అద్దె తీసుకో.
ఏమిటి...ఓకే
నా?”
“అయ్యో
ఆంటీ, అక్కడా!...అది
చెత్తగా ఉంటుందే.
శుభ్రం చేసి
రెండు సంవత్సరాలు
అవుతోందే?”
“పరవాలేదు
సార్...దాన్ని
మేము శుభ్రం
చేసుకుంటాం. ఎంత
అద్దె అని
మాత్రం చెప్పండి.
ఇప్పుడే ఇచ్చేస్తాం” అన్నది
అంజలి.
అందులో సుధీర్ కు పూర్తి సమ్మతమే.
ఎందుకంటే ఏ సమయంలోనైనా సరే అంజలిని చూస్తూ ఉండొచ్చు.
"సరి సరి...ఇది కూడా మంచి ఆలొచనే. కానీ, ఒక
మనిషి వల్ల శుభ్రం చేయటం కుదరదు. అందరం కలిసి చేస్తే తొందరగా అయిపోతుంది. కాబట్టి,
ఈ రోజు రాత్రికి మీరు ఇక్కడే ఉండిపొండి. రేపు ప్రొద్దున అందరం కలిసి
శుభ్రం చేసి, సాయంత్రం మీరు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఒక
రోజులో ఏమీ అయిపోదు" అన్నాడు.
అదేలాగా వాళ్ళు ఆ రోజు రాత్రి అక్కడ ఉండి
మరుసటి రోజు తెల్లవారగానే శుభ్రం చేసే పని మొదలుపెట్టి మధ్యాహ్నానికి
ముగించారు. సుధీర్ కూడా వాళ్ళతోనే ఉండి
అన్ని సహాయాలూ చేశాడు. వంటకి కొన్ని గిన్నెలూ,
పొయ్యి లాంటివి అవసరమయ్యింది. ఇద్దరూ వెళ్ళి వాటిని కొనుకొచ్చారు.
సాయంత్రానికి ఇంటిని అందంగా అమ్ర్చి దిద్దింది అంజలి.
పాలు పొంగించి అందరికీ ఇచ్చింది. ఆ రోజు సుధీర్
అక్కడే భోజనం చేశాడు. అంజలి వంట సుమారుగా ఉన్నా పొగడి ఆనందపరిచాడు. లోలోపల
నవ్వుకుంది నిర్మలా ఆంటీ.
రాత్రి పడుకునే ముందు అంజలి ఉండే దిక్కు
వైపు తలపెట్టుకుని పడుకున్నాడు.
'అంజలీ నువ్వు
ఎవరు...ఎందుకు ఈ ఉరికి వచ్చవు...? ఏదీ నాకు తెలియదు. ఈ రోజు
ఇంట్లోకి మాత్రమే రాలేదు. నా మనసులోకి కూడా వచ్చావు! నా లోపల ప్రకంపనలు
ఏర్పరిచినట్లుగా నేను నీ మనసులో ప్రకంపనులు ఏర్పరిచానా? నీకు
నేను నచ్చానా?' ఇలా ఎన్నో రకాలుగా ఆలొచిస్తూ నిద్రలోకి
జారుకున్నాడు.
అక్కడ అంజలి ...'ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుంది. అంతవరకు ఈ డబ్బు సరిపోతుందా? చాలకపోతే ఏం చేయాలి?' అనే కలతతో నిద్రపోలేక మేలుకునే
ఉన్నది.
Continued...PART-2
************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి