ప్రేమ కలలు (సీరియల్-PART-5)
రోజులు చాలా నిదానంగా నడుస్తున్నట్టు
అనిపించింది అంజలికి. అంతకు ముందు స్కూలుకు బయలుదేరినప్పుడూ సరి,
లీవు రోజులైనా సరి...ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది. కానీ, ఇప్పుడు, ఏదో జీవించాలే అనే ఒత్తిడి కోసం
జీవిస్తున్న దానిలా అనిపిస్తోంది. రోహినికి ఆరొగ్యం మెల్ల మెల్లగా మామూలు
పరిస్థితికి వస్తోంది.
ఇల్లు...ఇల్లు వదిలితే స్కూలూ,
తరువాత బి.ఏడ్. కోసం చదువు అంటూ సమయాన్ని కేటాయించింది అంజలి.
అందులో సుధీర్ కు చోటు ఇవ్వలేదు. ఎప్పుడైనా అతన్ని చూసినప్పుడు చిన్న నవ్వు...అంతే. అతను మాత్రం ఏమిటి? అంతకు
ముందు ఆదివారం వస్తే అంజలి ఇల్లే గతి అని ఉండేవాడు. ఇప్పుడు అటువైపు తొంగి కూడా
చూడటం లేదు. తానూ, తన పని అంటూ దూరంగానే ఉంటున్నాడు. ప్రేమ
గాయం ఒక తగ్గని గాయంలాగా అతని మనసులో ఉండిపోయింది.
ఒక రోజు స్కూలు వదిలిపెట్టిన తరువాత ఇంటికి
వస్తున్న దారిలో ఒక పెద్ద కారు అంజలిని రాసుకుంటూ వచ్చి ఆగింది. అందులోంచి దిగిన
ఆయన... అంజలి
తండ్రి హరికృష్ణ. ఆమె కళ్ళను ఆమే నమ్మలేకపోయింది. ఫోటోలో చూసినట్లే ఉన్నారు. కారు
దిగిన ఆయన ఆమె వైపుకు నడిచారు.
"అమ్మా... అంజలీ నేనెవరో తెలుస్తున్నానా?"
అన్నారు.
తల ఊపింది.
“కారులో ఎక్కమ్మా…నీతో మాట్లాడవలసింది చాలా ఉంది ఆరగంటలో తీసుకు వచ్చి వదిలిపెడతాను"
అంటూ ఆమెను బలవంత పెట్టి కారులో ఎక్కించుకుని, ఒక గుడికి
వెళ్ళి ఆపారు. జనమే లేని ఆ గుడిలో ఆమెను కూర్చోబెట్టిన ఆయన వెక్కి వెక్కి ఏడవటం
మొదలుపెట్టాడు.
"ఏమైంది...ఎందుకు ఏడుస్తున్నారు?
ప్లీజ్...కారణం చెప్పి ఏడవండి! నాకు భయంగా ఉంది"
అన్నది.......కళ్ళు తుడుచుకుంటూ తలెత్తి ఆమెను చూసాడు.
"అంజలీ...నన్ను క్షమించమ్మా.
తండ్రిగా నేను నా బాధ్యతను నిర్వహించనే లేదు. నిన్నూ,
మీ అమ్మనూ అనాధలుగా వదిలేసి పారిపోయాను. అప్పుడు నాకు జీవితంలో
పెద్ద డబ్బు గలవాడిగా అవాలనే పిచ్చి ఉండేది. దానికి నువ్వు, నీ
తల్లీ అనకట్టలాగా అడ్డుపడతారని చెప్పకుండా పారిపోయాను"
"ఓహో...ఇప్పుడే అది తప్పని జ్ఞానోదయం
అయ్యిందో? నన్ను పెంచటానికి అమ్మ
ఎంత కష్టపడుంటుంది? ఈ సమాజం ఆమెను ఎన్ని మాటలు అనుంటుంది?”
"ఒప్పుకుంటా. నేను
చేసింది తప్పే. లేదని చెప్పటం లేదు. కానీ, ఇప్పుడు మనసు మారి
వచ్చాను. ఒక కుటుంబంగా జీవించాలనేది నా ఆశ. నువ్వేదో ఒక స్కూల్లో ఉద్యోగం
చేస్తున్నావట. నీకెందుకీ తలరాత? మనింట్లో మహారాణిలాగా
ఉండాల్సిన దానివి"
"టీచర్ అనే ఉద్యోగం ఒక గౌరవమైన
ఉద్యోగమే. దాన్ని తక్కువ చేసి మాట్లాడకండి. ఇప్పుడు మీకు ఏం కావాలి"
"ఒకసారి...ఒకే ఒక్క సారి మీ అమ్మను
చూడాలి. దానికి గొప్ప మనసు. నన్ను మన్నించి ఏలుకుంటుంది. మీకొసమే పెద్ద ఇల్లు
చూసుంచాను. మనందరం అక్కడ ఉండొచ్చు"
“ఇలా చూడండి. అమ్మకు ఒళ్ళు
బాగుండక సీరియస్ అయిపోయి...ఇప్పుడు సరై నార్మల్ గా ఉన్నది. మీరు పాటికి
వచ్చి...మిమ్మల్ని చూసిన షాక్ తో ఆమె తిరిగి పడిపోతే, ఆమెను
బ్రతికించటం కష్టం"
"నన్ను ఏం చేయమంటావు?
మనం కలిసుండటమే కుదరదా?"
"నాకు మీ మీద ప్రేమ
లేదు. అదే సమయం అసహ్యమూ లేదు. కానీ, మీ భార్యను మీరు
చూడకూడదని చెప్పే అధికారం నాకు లేదు. ఒకవేల మిమ్మల్ని చూస్తే అమ్మ ఆరొగ్యం
పూర్తిగా బాగుపడొచ్చు. అందుకోసమైనా మిమ్మల్ని తీసుకు వెడతాను"
"ఎప్పుడు?"
"తొందరపడకండి.
నిదానంగా ఆవిడకు చెప్పి, ఆమె మనసును రెడీ చేసిన తరువాతే
మిమ్మల్ని పిలుస్తాను. వెంటనే మేము మీతోటి వచ్చేస్తామని అనుకోకండి. అది అమ్మ
మాత్రమే తీర్మానించే విషయం"
"సరేనమ్మా. నాకు రోహినిని చూస్తే
చాలు!" అన్న ఆయన మాట్లాడటం ముగించుకుని, కారులో
అంజలిని దింపారు. ఆమె కారులో నుండి దిగటం సుధీర్ చూశాడు. అతని కళ్ళల్లో
ప్రశ్నార్ధకం, ఆశ్చర్యం రెండూ ఉన్నాయి.
ఇల్లు చేరింది అంజలి. అక్కడ అమ్మతో పాటూ నిర్మలా
ఆంటీ కూడా ఉంది.
"ఏమిటే అంజలీ...కారులో
వచ్చి దిగుతున్నావు? ఎవరే అది? ఎవరైనా
విద్యార్ధిని వాళ్ళ నాన్నా?"
నిర్మలా ఆంటీ గబుక్కున అలా అడిగేటప్పటికి
తడబడింది అంజలి. ఏం సమాధానం చెప్పాలి? అమ్మతో
చెప్పటానికి రెడీగా లేని సమయంలో ఇలాంటి ఒక ప్రశ్నను అంజలి ఎదురు చూడలేదు.
"కారులోనా వచ్చావు...ఎవరితో?"
ఆశ్చర్యంతోనూ, భయంతోనూ అడిగింది.
"అదొచ్చమ్మా....అదొచ్చి"
"ఏమిటే అమ్మాయి మింగుతున్నావు?" అన్నది తల్లి, స్వరం పెద్దది చేసి.
"అమ్మా ప్లీజ్...టెన్షన్ అవకండి.
మీకు ఆరొగ్యం క్షీణిస్తుంది"
"అయితే ఎవరితో వచ్చావో చెప్పు"
"అమ్మా...వచ్చింది మా నాన్నే. నేను ఈ
రోజు స్కూలు వదిలి వస్తుంటే నన్ను దారిలో చూసి,
గుడికి తీసుకు వెళ్ళి క్షమించమని అడిగారు. నిన్నూ చూడాలట"
అన్నది గబగబ.
రోహిని తల పట్టుకుని వెనక్కి జరిగి గోడను
ఆనుకుంది. మొహం పలు రకాల భావాలను ప్రతిబింబించిది.
"ఆ మనిషి ఎందుకు ఇప్పుడు వస్తున్నాడు?
ఇప్పుడే కొంచం ప్రశాంతంగా ఉన్నాను. అది ఆయనకు కష్టంగా ఉందా?"
తన లోపల తానే చెప్పుకుంటున్నట్టుగా మెల్లగా సనిగింది.
"అంజలీ...మీ నాన్నా వచ్చింది?
ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లేరట? ఇప్పుడేమిటి
సడన్ గా మీ మీద ప్రేమ?" అక్కడే ఉన్న నిర్మలా ఆంటీ అడిగింది.
“నాకు ఏమీ తెలియదు ఆంటీ...ఆయన్ని
చిన్న వయసులో చూసిన జ్ఞాపకం. అమ్మతో పాటూ ఆయన నిలబడి తీసుకున్న ఫోటో ఒకటుంది. అది
గుర్తుకు తెచ్చుకునే ఆయన మా నాన్నే నని కనిపెట్టాను"
"ఏం చెప్పారు?"
"నేను చేసిందంతా
తప్పు. నిన్నూ, అమ్మనూ వదిలి పారిపోయాను. అప్పుడు డబ్బే నాకు
పెద్దగా అనిపించింది. ఇప్పుడు మీ మంచితనం తెలుసుకున్నాను. అందువల్ల నన్ను మన్నించి
చేర్చుకో అన్నారు అడిగింది"
"నువ్వేమంటావ్ రోహినీ?"
నోట మాట రాక కూర్చుండిపోయింది రోహిని.
“ఏమిటే రోహినీ...ఏమిటే
అదోలాగా ఉన్నావు? తిరిగి బ్లడ్ ప్రషర్ ఎక్కువగా ఉన్నదా.
అయ్యయ్యో... రోహినీ, రోహినీ " అని అరిచింది.
"ఊరికే ఉండండి ఆంటీ...నాకు ఏమీ
అవలేదు. నేను బాగానే ఉన్నాను. ఆ మనిషి దేనికోసం ఈ ప్లాను వేస్తున్నారో తెలియటం
లేదే?"
"ఆయన నిజంగానే
మంచివారుగా మారి ఉండొచ్చు కదా?" అన్నది అంజలి.
"నువ్వు అలా అనుకుంటున్నావా?
ఎందుకని అలా అంటున్నావు?"
"లేకపోతే ఎందుకమ్మా
ఆయన మనల్ని వెతుక్కుంటూ రావాలి? మన దగ్గర డబ్బులు ఎక్కువ
ఉన్నాయా ఏంటి? ఆయన మన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టే
వస్తున్నారనుకుంటా".
"నాకు అంజలి చెప్పేది 'కరెక్ట్' అనే అనిపిస్తోంది. ఏం అంజలి...నొవ్వొచ్చింది
మీ నాన్న సొంత కారా?"
"తెలియదు ఆంటీ...కానీ,
ఆయన ఇప్పుడు పెద్ద బిజినస్ మ్యానట. లక్షల్లో ఆస్తి ఉందట. అమ్మ
జ్ఞాపకాల వలనే రెండో పెళ్ళి చేసుకోలేదట. అని ఆయన చెప్పారు"
"చూసావా రోహినీ?
అప్పుడేదో బ్యాడ్ టైమ్. నిన్ను, పసిపిల్లగా
ఉన్న అంజలిని వదిలేసి వెళ్ళిపోయారు.
అందుకనే ఇప్పుడు తిరిగి వచ్చారు కదా...ఆయన్ని క్షమించి చేర్చుకోవచ్చు కదా?"
"ఆంటీ...మీకు ఆయన
గురించి తెలియదు. అందుకే అలా మాట్లాడుతున్నారు. అతను మనిషే కాదు. డబ్బు దయ్యం...డబ్బు...డబ్బు....అదే
అతనికి ఎప్పుడూ కల, జీవితం అంతా"
"అది ఆయనే వొప్పుకున్నారే...'అప్పుడు నాకు డబ్బు పిచ్చి ఉన్నదని. అంతా ఒక బ్యాడ్ టైము. ఆ బ్యాడ్ టైము
వెళ్ళిపోయేటప్పుడు మంచి ఆలొచనలు వస్తాయి. వసతిగల జీవితాన్ని వద్దు అని
చెప్పకు"
"ఈ వసతులన్నీ నా కేమీ కొత్త కాదు ఆంటీ.
ఇంతకంటే ఎక్కువ డబ్బు చూసిన దానిని నేను"
"ఏం చెబుతున్నావు?
నువ్వు మాట్లాడేది చూస్తుంటే నువ్వు చాలా పెద్ద అస్తిపరుల ఇంటి అమ్మాయిలాగా కనబడుతున్నావే?
నీ మనసులో ఏదో ఉందని నేను అనుకున్నది కరెక్టే. అదేమిటో బయటకు చెప్పి
నీ మనసును తెలిక చేసుకో. అది నీ మనసులోని భారాన్ని కూడా తగ్గిస్తుంది"
"అవునమ్మా..నీమనసులో ఉన్న భారాన్ని
బయట పెడితేనే కదా తగ్గుతుంది. దాని వలన బ్లడ్ ప్రషర్ కూడా కంట్రోల్ లో ఉంటుందని
చెప్పాడు డాక్టర్. నిజం చెప్పమ్మా...నువ్వు ఎవరు?
నీకూ, నాన్నకూ ఎలా పెళ్ళి జరిగింది? అంతా వివరంగా చెప్పు"
దీర్ఘమైన నిట్టూర్పు ఒకటి వెలువడింది రోహిని
దగ్గర నుండి. ఆమె కళ్ళు జరిగిపోయిన కాలాన్ని చూస్తున్నట్టు కదులుతున్నాయి.
"ఆంటీ...మీరు అనుకుంటున్నట్టు నేను
మామూలు ఇంటి అమ్మాయిని కాదు. మీకు 'ఆర్.వీ
ఇండస్ట్రీస్’ గురించి తెలుసా...దాని గురించి విన్నారా?"
"ఏమిటే అలా అడిగావు?
మన దేశంలో ఆ పేరు తెలియని వారు ఉంటారా? దగ్గర
దగ్గర వంద సంవత్సరాలుగా ఎన్నో ఫ్యాక్టరీలు స్థాపించిన సంస్థ అది. నా చెల్లెలు భర్త
చెన్నైలో ఉంటారు. ఆయన ఆ ఆఫిసులోనే మెనేజర్ గా పనిచేశారు"
"ఏమ్మా...వాళ్ళు అతిపెద్ద
కోటీశ్వర్లు కదా?"
"అవును...ఆ సంస్థ
ఎం.డి, యజమాని బాపిరాజు గారి ఒకే ఒక కూతుర్ని నేను"
రోహిని చెప్పిన ఆ మాటకు అంజలీ,
ఆంటీ నూ స్థానువులా అయిపోయారు. ఇద్దరి కళ్ళూ ఆమెనే చూస్తుండగా
...ఆమె తన కథను చెప్పటం మొదలు మొదలుపెట్టింది.
Continued...PART-6
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి