కెనడా, అమెరికాలలో మండుతున్న ఎండలు (న్యూస్)
"ప్రపంచంలోనే
రెండో అతిశీతల
దేశమైన కెనడాలో
మంచు తుపానులను
తరచూ చూస్తుంటాము.
కానీ ఇంతలా
భానుడి ప్రతాపంపై
ఎప్పుడూ మాట్లాడుకోలేదు.
ప్రస్తుతం కెనడాలో
ఉన్న ఉష్ణోగ్రతలతో
పోల్చితే దుబాయిలో
ఇంకాస్త చల్లగా
ఉంటుంది కావొచ్చు"
అని కెనడాకు
చెందిన సీనియర్
వాతావరణ నిపుణుడు
డేవిడ్ ఫిలిప్స్
అన్నారు.
కెనడాలో మునుపెన్నడూ
లేనివిధంగా రికార్డు
స్థాయిలో గరిష్ఠ
ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
బ్రిటిష్ కొలంబియాలోని
లిట్టన్లో
మంగళవారం రికార్డు
స్థాయిలో ఉష్ణోగ్రత
గరిష్ఠంగా 49.5 డిగ్రీలకు
చేరుకుంది. ఇంతకు
ముందు కెనడాలో
ఎప్పుడూ గరిష్ఠ
ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు
దాటలేదు.
వడగాల్పుల ప్రభావంతోనే
ఎక్కువ మంది
మృతిచెందినట్టు
పోలీసులు తెలిపారు.
మృతుల్లో ఎక్కువగా
వృద్ధులు, ఇతర
అనారోగ్య సమస్యలతో
బాధపడుతున్న వారు
ఉన్నట్టు చెప్పారు.
పశ్చిమ అమెరికా
భారీ ఉష్ణోగ్రతలతో
పశ్చిమ అమెరికాలోని
కొన్ని నగరాలు
కూడా ఉక్కిరిబిక్కిరి
అవుతోంది. వేసవికాలం
ఆరంభంలోనే అమెరికాను
ముఖ్యంగా పశ్చిమ
అమెరికా రాష్ట్రాలను
ఎండలు ఠారెత్తిస్తున్నాయి.
దీంతో పశ్చిమ
ప్రాంతాల్లో సుమారు
4 కోట్ల మంది
ప్రజల్ని అమెరికా
వాతావరణ శాఖ
అప్రమత్తం చేసింది.
అనవసరంగా బయటకు
రాకూడదంటూ హెచ్చరికలు
జారీ చేసింది.
వాతావరణాన్ని స్ప్రేయర్స్ ద్వారా చల్లబరచటం
దేశవ్యాప్తంగా
11 రాష్ట్రాల్లో
గతంలో కంటే
ఎక్కువ ఉష్ణోగ్రతలు
నమోదైనట్లు వాతావరణ
శాఖ తెలిపింది.
ఇదో అనూహ్య
పరిస్థితిగా పేర్కొంది.
అంతేగాకుండా ఈసారి
వేసవిలో అన్ని
రికార్డులూ బద్దలయ్యేలా
ఉన్నాయని అంచనా
వేస్తోంది. సోమవారం
ఫీనిక్స్లో
46 డిగ్రీల సెల్సియస్, సియాటిల్లాంటి
చోట్ల 44 డిగ్రీల సెల్సియస్
ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదివారం పోర్ట్లాండ్లో
44.4 డిగ్రీల సెల్సియస్
ఉష్ణోగ్రత నమోదైంది.
1940 నుంచి ఇప్పటిదాకా
ఇదే అత్యధిక
రికార్డుగా చెబుతున్నారు.
సియాటిల్లో
గత వారాంతం
ఉష్ణోగ్రతలు 1894 నాటి రికార్డులను
బద్దలుగొట్టాయని
చెబుతున్నారు. అన్ని
పట్టణాల్లోనూ ఇదే
పరిస్థితి. ప్రతిచోటా
పాత రికార్డులు
బద్దలవుతున్నాయి.
కాలిఫోర్నియా పాల్స్ప్రింగ్స్లో
47 డిగ్రీల సెల్సియస్పైగా
నమోదైంది.
రోడ్లను చల్ల బరచుట
పసిఫిక్ మహా
సముద్రంలో ఉష్ణోగ్రతల్లో
తేడా వల్ల
ఏర్పడే హీట్‌డోమ్
కారణంగా ఉష్ణోగ్రతలు
అధికంగా నమోదవుతున్నాయని
వాతావరణ నిపుణులు
చెబుతున్నారు. పర్యావరణ
మార్పుల కారణంగానే
ఇవన్నీ సంభవిస్తున్నాయన్నారు.
ఇలా ఉష్ణోగ్రతలు
పెరగటం ఇకమీదట
మామూలవుతుందన్నారు.
వాతావరణ మార్పుకు
అన్ని దేశాలూ
కలిసి ఏదైనా
చేస్తేనే, ఈ
వాతావరణ విపరీతాల
నుండి కొంతైనా
బయటపడటానికి దారుంది.
అంతవరకు దీనికి
అంతా అలవాటు
పడాల్సిందేనట.
Images Credit: To those who took the original
photos.
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి