22, జులై 2021, గురువారం

ముత్యాల వంతెన...(ఆసక్తి)R

 

                                                                                    ముత్యాల వంతెన                                                                                                                                                                             (ఆసక్తి)

జపాన్ దేశంలోని అకాసీ కైకో వంతెన ప్రపంచంలోని పొడవైన వేలాడే వంతెనలలో ఒకటి. బ్రహ్మాండమైన వంతెనకు ముత్యాల వంతెన అనే మరో పేరు కూడా ఉన్నది.  జపాన్ దేశంలోని ముఖ్యమైన నగరాలలో ఒకటైన అకాసి నగరాన్ని, అవాజీ దీవిని కలపటానికి అకాసి సముద్ర నీటి జలాలపై వంతెనను నిర్మించారు.

కొన్ని సంవత్సరాల ప్రణాళిక తరువాత 1986, మే నెలలో నిర్మాణం మొదలుపెట్టి పన్నెండు సంవత్సరాల తరువాత ఏప్రిల్-5,1998లో వంతెన పూర్తి చేశారు. మొదట రైల్వే లైను కుడా అమర్చాలనుకున్నారు. కానీ, తరువాత ఉద్దేశం మానుకుని కార్లూ, బస్సులూ, లారీలూ వెళ్ళడానికి మాత్రం ఆరు రోడ్లు (వెళ్ళడానికి మూడు, రావడానికి మూడు) ఉండేటట్లు వంతెనను నిర్మించారు. పెను తుఫానలనూ, పెద్ద భూకంపాలనూ ( రిక్టర్ స్కేల్లో 8.5 వరకు నమోదయ్యే భూమి అధుర్లను) తట్టుకోగలిగే అతి గొప్ప ఇంజనీరింగ్ టెక్నాలజీతో అకాసీ కైకో వంతెనను కట్టారు.

1986 సంవత్సరం అకాసీ కైకో వంతెనను నిర్మిస్తున్నప్పుడు జనవరి-17, 1995లో రిక్టర్ స్కేల్లో 7.2 గా నమోదైన భూకంపం ఏర్పడింది. భూకంప తాకిడిలో వంతెన నిర్మాణం ఎటువంటి నష్టానికీ గురికాకపోయినా వంతెన నిర్మాణ పొడవు ఒక మీటరుగా పెరగటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే మొదట్లో 1990 మీటర్ల సరిపడ వేసిన 2 వంతెన పిల్లర్లు భూకంపం తరువాత 1991 మీటర్లుగా జరిగాయి.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వేలాడే వంతెన (అకాసీ కైకో/ముత్యాల వంతెన) గురించిన మిగిలిన ఆశ్చర్య పరిచే అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుందాం.

1) వంతెన మొత్తం పొడవు 3,911 మీటర్లు( 12,831 అడుగులు) వంతెనకు ఊపిరిగా ఉండే రెండు పిల్లర్ల దూరం 1,991  మీటర్లు (అంటే 1,24 మైళ్ళు).

2) వంతెన మధ్య వేయబడిన ఊపిరి పిల్లర్ల దూరంలో ఎక్కువ దూరం ఉన్న వంతెన ప్రపంచంలోనే ఇదొక్కటే.

3) 100 కు పైన వంతెనలు నిర్మాణ కంపెనీలు కలిసి పనిచేసిన మొదటి వంతెన. 20 లక్షల మంది కార్మీకులు కలిసికట్టుగా పనిచేసిన వంతెన.

4) 286 కిలోమీటర్ల వేగమైన గాలినీ, రిక్టర్ స్కేల్లో 8.5 బలమైన భూకంపాన్ని తట్టుకునే శక్తి కలిగింది.

5) మొత్తం వంతెనకు ఉపయోగించిన ఇనుము 1,81,000 టన్నులు. పిల్లర్లకు వాడబడిన సిమెంట్ కాంక్రీట్ 14 లక్షల క్యూబిక్ అడుగులుగా ఉంటుంది.

6) అత్యంత ఉష్ణోగ్రతలలొ వంతెన 2 మీటర్లకు సాగుతుంది.

7) వంతెన సముద్రమట్టానికి 65 కిలోమీటర్ల ఎత్తులో కట్టబడ్డది కాబట్టి పెద్ద ఓడలు కూడా వంతెన కింద నుండి వెళ్ళవచ్చు.

8) వంతెన మొత్తం పొడవుకు ఉపయోగించబడ్డ మొత్తం ఐరన్ కేబుల్స్ పొడవు 3,00,000 కిలోమీటర్లు (అంటే 1, 90,000 మైళ్ళు). ఇందులోని ఒక్కొక్క కేబుల్ 44 ఇంచుల లావుగా ఉంటుంది.

9) పిల్లర్లలో వేసిన ఇనుప చట్రాలు, ఇనుప పైపులను చుట్టడానికి 36,880 ఇనుప కేబుల్స్ ఉపయోగించారు.

10) ఈ వంతెన మొత్తానికి ఉపయోగించిన ఇనుప కేబుల్స్ ను లెక్క వేస్తే అది ప్రపంచ మొత్తాన్నీ 7 సార్లు చుట్ట వచ్చుట.

11) అంతర్జాతీయ నౌకా రవాణా దారి అయిన సముద్ర నీటి జలపాత దారిలో రోజుకు 1000 నౌకలు ప్రయాణం చేస్తాయట.

12) రోజుకు సరాసరి 23,000 వాహనాలు వెళ్ళే వంతెనకు రాత్రిపూట వెలుతురు కోసం 1,737 లైట్లు అమర్చారు.

13) ఈ వంతెన కట్టటానికి అయిన మొత్తం ఖర్చు 500 బిల్లియన్ అమెరికన్ డాలర్లు.

Images Credit: To those who took the original photos.

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి