10, జులై 2021, శనివారం

ప్రకృతితో పరాచికాలా?..... (ఆసక్తి)R

 

                                                                            ప్రకృతితో పరాచికాలా?                                                                                                                                                                      (ఆసక్తి)

గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడానికి వాతావరణ జోక్యం పద్దతితో(Geoengineering)భూమి యొక్క వాతావరణాన్ని కృతిమంగా మార్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.భూమి చుట్టూ అతి నీల లోహిత కిరణాల నుండి రక్షణ కవచంగా పనిచేస్తున్న ఓజోన్ పొర, గ్రీన్ హౌస్ వాయువుల వల్ల తరిగిపోతోంది. దీనినే 'గ్లోబల్ వార్మింగ్' లేదా 'భూమి వేడెక్కడం' అని అంటారు.

నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, మిధేన్ లాంటి కొన్ని రకాల వాయువులను 'గ్రీన్ హౌస్ వాయువులు అని పిలుస్తారు. ఇవి ప్రకృతి సహజంగా విడుదల అయినప్పుడు భూమిపైన ఇన్ ఫ్రా రెడ్ కిరణాలు ఉత్పన్నం చేసే రేడియో ధార్మికతను తగ్గించి ఉష్ణొగ్రతను నియంత్రించేందుకు సాయం చేస్తాయి.

అయితే శిలాజ ఇంధనాల వినియోగం...అంటే... పెట్రో ఉత్పత్తుల వినియోగం ద్వారా అవసరాన్ని మించి అధికమొత్తంలో విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులు భూగోళంపై ఉష్ణోగ్రతను విపరీతంగా పెంచేస్తున్నాయి. దీంతో భూమి విపరీతంగా వేడెక్కిపోతోంది.

గ్లోబల్ వార్మింగ్ వల్ల మానవాళి అనేక దుష్పరిణామాలను ఎదుర్కోంటోంది. హిమాలయాల్లో హిమానీనదాలు రికార్డు స్థాయిలో కుచించుకుపోతున్నాయి. పరిస్తితులు ఇలాగే ఉంటే 2035 నాటికల్లా తూర్పు మధ్య హిమాలయాల్లో హిమానీ నదాలే కనిపించవట. ఆహార, నీటి సంక్షోభాలను ఎదుర్కోవడమే కాకుండా. వేసవి వడగాల్పుల వల్ల వేలాదిమంది అసువులుబాయాల్సి వస్తుంది. సముద్ర మట్టాలు పెరిగిపోవడం, అడవులు మునిగిపోవడం, కరువు పరిస్థితులు లాంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది

గ్లోబల్ వార్మింగ్ వల్ల భూగ్రహంపై అనేక మార్పులు జరుగుతున్నాయి. గ్రీన్ హౌస్ వాయువుల విడుదలతో వాయు, జల, భూతల కాలుష్యం పెచ్చరిల్లి భూగ్రహంపైన అనేక విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయి. ఎన్నడూ ఎరుగని రీతిలో వరదలు పట్టణాలనూ, ఊళ్ళనూ ముంచెత్తుతున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు విపరీత స్థాయిలో కురుస్తూండడం వల్ల ఊళ్ళకి ఊళ్ళే జలాశయాలుగా మారుతుండగా మరి కొన్ని చోట్ల సంవత్సరాల తరబడి వర్షాలు కురవక కరువు పరిస్థితులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. గత వంద సంవత్సరాలుగా 'గ్లోబల్ వార్మింగ్' పెరుగుతూనే ఉంది. వనరులనూ,శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించినప్పుడే 'గ్లోబల్ వార్మింగ్' ప్రభావాన్ని తగ్గించగలం.

వనరుల, శిలాజ ఇంధనాల వాడకాన్ని ఒక్కసారిగా తగ్గించగలమా? తగ్గించలేము. ప్రణాళిక వేసుకుని కొద్ది సంవత్సరాలలో కొంతైనా తగ్గించకుందామని ప్రపంచదేశాలన్నీ మాట్లాడుకున్నాయి గానీ దేశాలు ఎంత తగ్గించాలి అన్న ఆంశంలో రాజీ పడలేకపోయారు. ఎవరికి వారే మీరు ఎక్కువగా తగ్గించాలి అని అవతలి దేశాన్ని ఎత్తి చూపాయి. ఎన్నిసార్లు కలుసుకున్నా ఒక నిర్ణయానికి రాలేకపోయాయి/పోతున్నాయి.

ప్రణాళికలతో దేశాలు రాజీపడలేవు, పడినా వెంటనే ప్రయోజనం ఉండదు. భూమి వేడెక్కడాన్ని వెంటనే తగ్గించటానికి గ్రీన్ హౌస్ వాయువుల తగ్గింపును తగ్గించే ప్రయత్నాలు అన్ని దేశాలూ అమలుచేసినా వేడిని వెంటనే తగ్గించలేము కాబట్టి, ఈలోపు భూమికి పెద్ద ముప్పు రావచ్చు అని గ్రహించిన కొందరు శాస్త్రవేత్తలు జియో ఇంజనీరింగ్ (కృతిమ రసాయణాలతో) మూలం గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించవచ్చు అనే ఒక ప్రాతిపదికను ముందు పెట్టారు. సత్వరమార్గం అంటే ఎవరికైనా ఆశే కదా! 'సరే' అన్నారు పెద్దలు. వంతు పలికారు మిగిలినవారు.

జియో ఇంజనీరింగ్ పద్దతితో భూమి వేడిని తగ్గించటం మంచిది కాదు. దాని వలన  లాభం కంటే, నష్టమే ఎక్కువ జరుగుతుందని మరికొందరు శాస్త్రవేత్తలు గొంతు చించుకు చెప్పారు. ఎవరూ వినిపించుకోలేదు. కృతిమ రసాయన ప్రయోగంతో భూమి వేడిని తగ్గించటానికి మొదటి ప్రయోగం చేయటానికి సన్నాహాలు పూర్తి అయినట్లు తెలుపుతున్నారు. ప్రయోగాలు మొదలుపెట్టబోతామని చెబుతున్నారు. జియో ఇంజనీరింగులో మొదటిది ఉప్పు తుంపరలను (aerosols of sea salt) సముద్ర మేఘాలలోకి ఇంజెక్ట్ చేయటం. దీని వలన సముద్ర మేఘాలలో నీటి బిందువు ఉనికిని ఎక్కువ చేసి దాని మూలంగా సూర్యరశ్మిని ప్రతిఫలింపజేయటం. ఇలా చేయటం వలన సముద్ర మేఘాలు కాంతివంతమౌతాయి. దీని వలన సూర్యరశ్మి భూమి మీద ఎక్కువగా పడకుండా వెనక్కి(అంతరిక్షంలోకి) పంపబడుతుంది. అప్పుడు సూర్యుని వేడి ఎక్కువగా భూమిమీద పడదు కనుక భూమి చల్లగా ఉంటుంది.

జియో ఇంజనీరింగ్ లో రెండవది, సల్ఫర్ తో కూడిన పదార్ధాలను భూమికి 20 కిలోమీటర్ల పైన విరజిమ్మడం. ఇవి భూమి నుండి పైకి వెళ్ళే గ్రీన్ హౌస్ వాయువులను ఓజోన్ లేయర్ దగ్గరకు పోకుండా అడ్డుకుంటుంది. అప్పుడు ఓజోన్ లేయర్ తనని తాను బాగుచేసుకుంటుంది. జియో ఇంజనీరింగ్ లో మూడవది, చిల్లులులేని మేఘాలలో చిల్లులను   ఏర్పరిచే బిస్మత్ ఐయోడిన్ చిమ్మితే మేఘాలలో చిల్లులు ఏర్పడి భూమి నుండి వెళ్ళే గ్రీన్ హౌస్ వాయువులను క్రిందకు పంపకుండా చిల్లుల మూలంగా దుర్భలము చేస్తుంది.

భూమిని కాపాడాల్సిన మనమే, దానికి ఇది పద్దతి కాదు అని జియో ఇంజనీరింగ్ వ్యతిరేక ప్రచారకులు చెబుతున్నారు. దీని వలన వాతావరణం ఇప్పుడున్న దానికంటే మనం బాగుచేసుకోలేనంతగా మారిపోతుంది. అప్పుడు ఎటువంటి ప్రయత్నాలూ చేయలేము. గ్లోబల్ వార్మింగుకు గ్రీన్ హౌస్ వాయువులే కారణమని తెలుసుకున్నట్లే, వాటిని తగ్గించుకుంటూ వాతావరణ మార్పిడిని మనకు అనుకూలంగా ఏర్పడేటట్లు ప్రయత్నాలు చేయాలి గానీ ఇలా ప్రకృతినే మార్చాలనుకోవడం సరికాదు. దీనివలన మనం లాభం పొందలేము. దీనివలన ఏర్పడే సైడ్ ఎఫెక్టులను మనం తట్టుకోలేము అని వాపోతున్నారు.

Images Credit: To those who  took the original photos.

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి