ప్రేమ కలలు (సీరియల్-PART-3)
అతను చెప్పిన స్కూల్లో అంజలికి ఉద్యోగం
దొరికింది. మంచి జీతం. ఇంటికి దగ్గరగా ఉండడం వలన నడిచే వెళ్ళొచ్చు. తల్లి రోహినికి అప్పుడే మనశ్శాంతి కలిగింది. అంజలీ
స్కూలు నుండి వచ్చే సమయమూ, సుధీర్ ఆఫీసు నుండి
వచ్చే సమయమూ వేరు వేరు. అందువలన ఆమెను చూడటమే అరుదుగా అయిపోయింది సుధీర్ కు.
ఆ రోజు ఆదివారం. నూనె రాసుకుని స్నానం
చేసి, రిలాక్స్ గా కూర్చుని
మాట్లాడుకుంటున్నారు తల్లీ, కూతుర్లు.
"అమ్మా...ఈ రోజు మా స్కూల్
ప్రిన్సిపాల్ నన్ను పిలిచారు. నాకు విపరీతమైన భయం పట్టుకుంది. వణుకుతూ
వెళ్ళాను"
"ఏం చెప్పారు?"
"మీరు పాఠాలు చెప్పే
విధం బాగుంది. కానీ, మిమ్మల్ని ఇంటర్ మొదటి సంవత్సరం,
ఇంటర్ రెండవ సంవత్సరం తీయమని చెప్పలేకపోతున్నాను...అన్నారు"
"అలా గనుక చెయ్యమంటే. జీతం ఎక్కువ
వస్తుంది. ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది కదా? ఎందుకు
తీయమనటం లేదు"
"అది కూడా ఆయనే చెప్పారమ్మా. నేను
ఎం.ఎస్.సి మాత్రమే చదువుకున్నానట. పెద్ద క్లాసులు తీయాలంటే ప్రభుత్వ ఆదేశాల
ప్రకారం ఖచ్చితంగా 'బి.ఎడ్' చదివుండాలి అన్నారు"
"అవును...నేను
మర్చిపోయాను. నువ్వు ఇప్పుడు కూడా 'బి.ఎడ్' చదవచ్చే?" అన్నది తల్లి.
అప్పుడు "ఏమిటీ...నేను లోపలకు
రావచ్చా? చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారా?"
అని అడుగుతూ లోపలకు వచ్చాడు సుధీర్. అతన్ని చూసిన వెంటనే పువ్వులాగా
వికసించింది అంజలి మొహం.
"రండి సార్... లోపలకు రండి. ఇప్పుడే
మిమ్మల్ని తలచుకున్నాను. మీరు వచ్చారు. మీకు వందేళ్ళు" అన్నది.
ఆమె తనని తలుచుకున్నది అని విన్న వెంటనే
ఒక బుట్టెడు పూవులు అతనిపైన పోసినట్లు మైమరచి పోయాడు సుధీర్.
"ఏందుకు
తలుచుకున్నారు...చెప్పండి"
తల్లి తొందరపడింది. " అంజలి
పనిచేస్తున్న స్కూల్లో ఇది పెద్ద క్లాసులకు కూడా వెళ్ళాలంటే 'బి.ఎడ్' ఖచ్చితంగా చదవాలని చెప్పారట. దాని గురించే
మాట్లాడుతున్నాం...ఇంతలో మీరే వచ్చారు"
"'బి.ఎడ్' చదవాలా...ఎవరు చెప్పేరు?"
"స్కూల్ ప్రిన్సిపాల్.
అది ప్రభుత్వ ఆదేశాలు అన్నారు"
"మీరేం ఆలొచిస్తున్నారు?"
"ఏదైనా ఒక యూనివర్
సిటీలో 'కరెస్పాండన్స్’ కోర్సులో చేరి
చదవాలని అనుకుంటున్నా. దానికి మీరే సహాయం చేయాలి"
"ఇది కూడా చెయ్యకపోతే ఎలా?
నాకు తెలిసిన ప్రొఫసర్ ఒకరున్నారు. ఆయన దగ్గర అడిగి చెబుతాను. ఆయన
మంచి దారి చెబుతారు" అన్నాడు.
"అయితే ఇప్పుడే మాట్లాడండి" అని
తొందర పెట్టింది అంజలి.
అతనూ "సరే" అని చెప్పి ఫోన్
చేశాడు. లోపల సిగ్నల్ సరిగ్గా రాకపోవటంతో బయటకు వెళ్ళి మాట్లాడి వచ్చాడు.
అతన్ని ఆదుర్దాగా చూసినై నాలుగు కళ్ళు.
"ఏం చెప్పారు తమ్ముడూ?"
"ఆంటీ...ఇప్పుడు 'బి.ఎడ్’ చాలా చోట్ల ఉన్నదట. కానీ మనకి 'కరెస్ పాండన్స్’ కావాలి కాబట్టి ఇందిరా గాంధీ ఓపన్
యూనివర్ సిటీ చాలా బాగుంటుందట. అక్కడికి వెళ్ళి కనుక్కో...అన్నారు"
"అది ఎక్కడుంది?"
"ఇక్కడ్నుండి కొంచం
దూరంలోనే. ఇక్కడ్నుంచి బస్సు ఉంది. మీరు బస్సులో వెళ్ళి కనుక్కుని రండి. ఈ రోజు
వెళ్ళకండి...లీవు. రేపు వెళ్లండి" అన్నాడు.
"తమ్ముడూ అంజలికి ఈ ఊరు కొత్త. మీరూ
తోడుగా వెళ్ళి ఎంక్వయరీ చేసి రండి. మీకే శ్రమ
ఇవ్వాల్సి వస్తోంది"
ఆ మాటనే కదా అతను ఎదురు చూసేడు.
"ఇందులో శ్రమేమీ లేదు. మీకు
ఎన్నింటికి రేపు స్కూల్ విడిచిపెడతారు"
"సాయంత్రం నాలుగు గంటలు"
"అయితే సరిగ్గా నాలుగింటికి 'పర్మిషన్’ వేసి వచ్చేస్తాను. కలిసే
విచారిద్దం...సరేనా...?" అన్నాడు. ఆమె కూడా అంగీకరించింది.
మరికొంతసేపు మాట్లాడుకుని బయలుదేరాడు.
సోమవారం సరిగ్గా నాలుగు గంటలకు వచ్చేసింది
అంజలి. రెడీగా ఉన్న అతని 'బైకు’ లో కూర్చుని ప్రయాణించింది. అది ఆమెకు చెప్పలేని భావాలను ఇచ్చింది. తన
మనసు మెల్లగా అతని మీద వంగుతుండడం అర్ధం చేసుకుంది.
ముప్పావు గంట ప్రయాణించి యూనివర్ సిటీకి
వచ్చి వివరాలు సేకరించింది. అప్లికేషన్ ఒకటి కొనుక్కుని బయటకు వచ్చింది.
"అంజలీ నేను అనుకున్న టైము కంటే
ముందే పనిపోయింది. అదిగో కనబడుతోందే ఆ హోటల్లో ఏదైనా తినేసి వెళదామా"
అన్నాడు.
కానీ,
అతని మనసు వేసిన ప్రణాళిక వేరు. ఈ రోజు వదిలితే మళ్ళీ ఆమెను ఒంటరిగా
కలవడం చాలా కష్టం. అందువలన అంజలిని తీసుకు వెళ్ళి తన మనసులోని మాటను చెప్పాలని
అనేది అతని ఐడియా.
"వద్దు...నాకు ఆకలిగా
లేదు. మీరు తినేసి రండి. నేనిక్కడ కూర్చోనుంటాను" అని చెప్పిన ఆమె చెవులు
పట్టుకుని పిండేద్దామా అన్నంత కోపం వచ్చింది సుధీర్ కు.
'కొంచమైనా అర్ధమవుతోందా
చూడు. మనిషి ఇక్కడ నరక వేధన అనుభవిస్తున్నాడు. అదేమీ తెలియనట్లు అమాయకంగా ఉంది
చూడు అని అనుకున్నాడు.
"నాకు ఆకలిగా ఉంది. రండి...మిమ్మల్ని
ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళను. నేను ఆకలితో
ఉండటం మీకు ఇష్టమైతే మీరు రావద్దు" అన్నాడు తెలివిగా.
"అయ్యో...అయితే రండి..." అన్న అంజలి
లేచి నడిచింది.
అదొక పెద్ద హోటల్. జనం చాలా తక్కువగా
ఉన్నారు. మంచి చోటు చూసుకుని ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. మనసేమో ఆమెతో విషయాన్ని
ఎలా చెప్పాలి అని ఆలొచిస్తోంది.
"ఏమిటి సుధీర్ సార్...కూర్చునే కలలా?
ఏసీ లో కూడా మీకెందుకు చెమటలు పట్టాయి?" అని
అడిగింది.
" అంజలీ...మీరు
నన్ను సార్ అని పిలిచి నన్ను వేరు మనిషిగా చూస్తున్నారు?
సుధీర్ అనే పిలవండి!" అని ఒక రాయి విసిరేడు.
ఆమె ఏమీ మాట్లాడకుండా తలవంచుకుని
కూర్చుంది.
'సర్వర్’ వచ్చి 'ఆర్డర్’
అడిగాడు..."నాకు పైనాపిల్ జ్యూస్. మీకు ఏం కావాలి?" అని అడుగుగా ఆమె పెద్దగా సాగదీయకుండా "నాకూ అదే" అని చెప్పింది.
'సర్వర్’ వెళ్ళిపోయాడు.
"అంజలీ...అదొచ్చి...మీరు....వచ్చి..."
"నేను మిమ్మల్ని 'సార్’ అని పిలవకూడదంటే మీరు నన్ను 'ఏమండి, రండి, పొండి’ అని పిలవటం ఆపాలి. సరేనా?" అంటూ నవ్వింది.
ఆమెను దీర్ఘంగా చూశాడు.
"చిన్న వయసు నుండి నేను ఒంటరిగా పెరిగాను.
ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో...ఎలా మాట్లాడ కూడదో ఏదీ నాకు తెలియదు. అందువలన నేను
మాట్లాడబోయేది తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి. అరిచి,
ఆర్బాటం చేసి నన్ను అవమాన పరచకూడదు?"
"ఏమిటీ...ముందే బాగా
ఇరికిస్తున్నారు? ఏమడగాలో అడగండి?"
"హూ...నేరుగానే అడుగుతాను.
నిన్ను చూసిన మొదటి రోజు నుండే నువ్వు నా మనసులోకి వచ్చేశావు. ఇదేమీ మీ శరీర
అందాన్ని మాత్రం చూసి రాలేదు. మీ బాధ్యతా భావం, మీ అమ్మ మీద
మీరు చూపుతున్న శ్రద్ద, పోరాడి అయినా జీవితంలో గెలవాలనే మీ
యొక్క పట్టుదల...ఇవన్నీ చూసే మీ మీద ప్రేమ పుట్టింది. నేనింక నిన్ను తప్ప వేరే
ఇంకో అమ్మాయిని ఆలొచించి కూడా చూడలేను. నా మనసులో నువ్వున్నావు. నీ మనసులో
నేనున్నానా?" అన్నాడు దీర్ఘంగా.
మట్లాడ కుండా కూర్చుంది. ఆమె మనసులో
ఆలొచనలు పలు రకాలుగా పరిగెత్తినై. ఆమెకూ సుధీర్ అంటే ఇష్టమే. కానీ,
అతను చెప్పినట్టు చూసిన మొదటి చూపులోనే వచ్చిన ప్రేమ కాదు. అతని
గుణం, ఆలొచనలు అన్నీ తెలిసి ఏర్పడి వికసించిన ప్రేమ.
"ఏమిటి మాట్లాడకుండా తల
వంచుకున్నావ్! నా మీద కోపమా? నేనేమీ
తప్పుగా అడగలేదే?"
'ఇంకా మాట్లాడకుండా
కూర్చుంటే బాగుండదు’ అనుకుని తలెత్తి అతన్ని చూసింది అంజలి.
"సుధీర్...మీలాగా చూసిన వెంటనే 'ప్రేమ’ అనేది నాకు రాలేదు. నేను ఎందుకు ఇది
చెబుతున్నానంటే...నన్ను తప్పుగా అర్ధం చేసుకోకుండా ఉండాటానికి. మీరు బాగా
చదువుకున్నారు. మంచి ఉద్యోగంలో ఉన్నారు. అన్నిటికీ మించి అవతలివారికి సహాయంచేయాలనే
మనసు ఉంది. మిమ్మలని ఇష్టం లేదని ఏ అమ్మాయి చెబుతుంది"
"ప్లీజ్...అవన్నీ ఎందుకు. మీకు నేను
నచ్చానా...లేదా?"
"నచ్చారు. మీలాంటి
వారిని భర్తగా పొందటానికి పెట్టి పుట్టుండాలి. కానీ, మా అమ్మ
అంగీకరిస్తే మాత్రమే మన పెళ్ళి జరుగుతుంది. సరేనా...?"
"ఇది చాలు. నీకు నేను
నచ్చాను అని చెప్పావు చూడు. అది చాలు. ఈ జవాబు కోసమే నేను ఆశగా ఎదురు
చూస్తున్నాను. నువ్వు అనుకునేటట్టు ఊరు తిరగటానికో, నీతో
సరదాగా ఉండటానికో నిన్ను ప్రేమించటం లేదు. సరే నని చెబితే రేపే మీ అమ్మ దగ్గరకు
వచ్చి నిన్ను పెళ్ళిచేసుకుంటానని చెబుతాను...ఏమంటావు?"
మళ్ళీ నవ్వింది అంజలి.
"చాలా తొందర పడుతున్నారు మీరు. నా 'బి.ఎడ్' చదువు ముగియనివ్వండి. ఆ తరువాత అమ్మ దగ్గర
చెబుదాం"
"ఎందుకలా?
పెళ్ళి చేసుకుని చదువుకో. నాకు ఇప్పుడు 27 ఏళ్ల
వయసు. ఇప్పుడు పెళ్ళి చేసుకుంటేనే మనం సరదాగా కొన్ని రోజులు తిరిగి, ఆ తరువాత పిల్లల్ను కనొచ్చు. ఇంకా ఆలశ్యం అయితే నేను రిటైర్డ్
అయ్యేటప్పుడు మన పిల్లాడు ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉంటాడు" అన్నాడు.
కళ్ళల్లో నీళ్ళు కారుతుంటే నవ్వింది అంజలి.
"అబ్బో మీకు వేగం చాలా ఎక్కువ. ఇంకా
పెళ్ళి మాటలే మొదలుపెట్టలేదు. అంతలోనే పిల్లలూ,
చదువులు దాకా వెళ్ళిపోయారు?"
"లేదు అంజలీ. నాకు ఇది
పలు సంవత్సరాల కల. నాకని ఒక కుటుంబం, నన్ను ప్రేమించే భార్య,
అందంగా -- కవితలలాగా ఇద్దరు పిల్లలూ అంటూ జీవించాలని ఆశగా ఉంది.
నిన్ను చూసినప్పుడు నాకు అది వెర్రిగా మారిపోయింది. ఇంకా ఆలశ్యం చేయను. ఒక మంచి
రోజు చూసుకుని నిర్మలా ఆంటీనీ, రుక్మణీ ఆంటీనీ తీసుకుని మీ
ఇంటికి వస్తాను"
"సరే. మా అమ్మ దీనికి ఎదురు చెప్పరని
అనుకుంటున్నాను. ఎందుకంటే...మీరంటే ఆవిడకూ చాలా ఇష్టం" అంటూ బయటకు నడిచింది.
బైకు మీద ఈసారి హక్కుతో ఎక్కింది.
తల్లి రోహిని వాకిట్లోనే నిలబడుంది.
వాళ్ళు బైకు నుండి దిగటం... అంజలి
చెయ్యి పుచ్చుకుని సుధీర్ కరచాలనం చెయ్యటం, ఎగిరే
ముద్దు ఒకటి ఇవ్వటం చూసింది.
ఆమెలో పలు కన్ ఫ్యూజన్లు పరిగెత్తినై. తల
జివ్వున లాగుతూ నుదిటి మీద చెమట పట్టేట్టు చేసింది. కళ్ళను కోపం కప్పేయగా -
ఆవేశంతో నిలబడింది. ఇద్దరూ దగ్గరకు వచ్చారు.
"అత్తయ్యా..."
అంటూ ఏదో చెప్పాలని అనుకున్న సుధీర్ చెంప చెళ్ళు మన్నది.
"అనాధ కుక్కా...నా కూతురితో
నీకేమిటిరా రహస్య మాటలు? ఆమె చెయ్యి
పుచ్చుకుంటున్నావు! ఎంత ధైర్యం?" అని అరిచింది. కోపంతో
ఆయసపడుతోంది.
'జరిగింది నిజమా లేక కలా?'
అనే షాక్ లో చెంపను పట్టుకుని అలాగే నిలబడిపోయాడు సుధీర్. తాను ఏం తప్పు చేశాడో అనేది అతనికి
అర్ధం కాలేదు.
అంజలీనే కోపంగా ముందుకు వచ్చింది.
"అమ్మా...నీకేమన్నా పిచ్చా?
ఎందుకు ఇప్పుడు ఆయన్ని కొట్టావు?" అన్నది.
కొంచం కూడా కోపం తగ్గించుకోలేని ఆవిడ అంజలి
చెంప మీద కూడా ఒకటిచ్చింది.
"ఆయనా!?
ఏమిటే ఆయన? ఏమిటీ కొత్త వరుస? వాడేవరే నీకు? అతన్ని కొడితే నీకెందుకంత కోపం వస్తోంది?"
రోహిని వేసిన అరుపులకు...ఆశ్రమంలో ఉన్న
కొందరు బయటకు వచ్చి, తొంగి చూడటం మొదలు
పెట్టారు.
"అమ్మా...నేను ఆయన్ను
ప్రేమిస్తునాను. ఆయన్నే పెళ్ళి చేసుకుంటాను" అని అంజలి చెప్పటంతో కాళ్ళూ --
చేతులూ వణకటం మొదలైయ్యింది రోహినిలో. నోట మాట రాక స్థంభించింది.
మెదడుకు రక్తం వేగంగా వెళ్ళటంతో ఆమె
ముక్కు నుండి రక్తం కారటం మొదలైయ్యింది.
చెమట కాలువలాగా ప్రవహించగా...అలాగే సృహ
కోల్పోయింది.
Continued...PART-4
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి