9, జులై 2021, శుక్రవారం

మాయమైపోయిన విమానం ....(మిస్టరీ)R

 

                                                                         మాయమైపోయిన విమానం                                                                                                                                                       (మిస్టరీ)

మాయమైపోయిన విమానం మలేషియా ఏయిర్ లైన్స్ MH-370. విమానం మాయమైపోయి ఇప్పటికి ఏడు సంవత్సరాలు అయ్యింది. 

ఐదు సంవత్సరాల వెతుకులాట ముగింపుకు వచ్చింది... మాయమైపోయిన విమానం ఇక దొరకదని నిర్ణయానికి వచ్చారు మలేషియా అధికారులు.

మలేషియా ఏయిర్ లైన్స్ కు చెందిన MH-370 విమానం 8 మార్చ్2014 అదృశ్యమైనదని అందరికీ తెలుసు. ఇది మలేషియా రాజధాణీ కౌలాలంపూర్ నుండి చైనా రాజధాణి బీజింగుకు వెళ్ళాలి. కానీ మార్గ మధ్యలో అదృశ్యమైంది.

అదృశ్యమైన విమానం ప్రమాదానికి గురైందని, ప్రమాదంలో విమానంలో ప్రయాణం చెస్తున్న మొత్తం 239 (సిబ్బందితో కలిపి) మంది  ప్రయాణీకులు మరణించారని మలేషియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ ప్రమాదం ఎక్కడ జరిగిందో, శకలాలు ఏమైనాయో మాత్రం తెలుపలేదు.

అదృశ్యమైపోవడానికి అదేమైనా చిన్న వస్తువా?

సముద్రంలో పడిపోయిందా? దారి మళ్ళించారా? సముద్రంలో పడిపోయుంటే ఒక చిన్న ముక్క కూడా దొరకలేదా? అంతమంది ప్రయాణీకులలో ఒకరి దేహం కూడా దొరకలేదా? దారి మళ్ళించి ఉంటే అంతపెద్ద విమానం జాడ తెలియకుండా ఉంటుందా?...ప్రజలకు నచ్చజెప్పే సమాధనం చెప్పలేకపోవటం ఒక అరుదైన విషయం. అందుకే ఇది ఆధునిక మిస్టరీ.

విమానం మిస్సైన దగ్గర నుంచి 26 దేశాలు అవిశ్రాంతంగా దాదాపుగా 20 శాతం భూగోళాన్ని జల్లెడ పట్టాయి. హిందూ మహసముద్రం, బంగాళాకాతం, అండమాన్ సముద్రాలను గాలించినా విమానం జాడ కనిపెట్టలేకపొయాయి.

అద్భుతమైన టెక్నాలజీ, అపారమైన అనుభవం గల అగ్రదేశాల సహకారం, నాసా ప్రతిభ ఏమీ చేయలేకపొయింది. విమానం జాడే తెలియకుండా పోయింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియకపోవడంతో సముద్రంలో పడిపోయిందని కొన్ని, హైజాక్ అయిందని మరికొన్నికధనాలు వచ్చాయి.

భూమిపైన మూలన ఏం జరుగుతోందో తెలుసుకోగల సత్తా అమెరికా మొదలుకుని ఎన్నో దేశాలకు ఉంది. అంతరిక్షంలో నివాసాలు సైతం ఏర్పాటు చేసుకునే టెక్నాలజీని అభివ్రుద్ది చేస్తోంది. ప్రతిభంతా ఎందుకూ కొరగాకుండా పోయిందా? హై టెక్నాలజీ ఉన్న నాసా సైతం చేతులెత్తేసిందిహఠాత్తుగా మాయమైన మలేషియా విమానం మన సాంకేతిక పరిజ్ఞ్నానికి ఒక సవాలుగా మారింది. ఆకాశం సదా అంతర్జాతీయ నిఘాలో ఉన్నప్పుడు ఒక విమానం అదృశ్యమవడం, దాని జాడ ఎవరికీ తెలియకపోవటం...ఎవరూ నమ్మలేకపోతున్నారు

మలేషియా విమానం MH-370 గాలిలో పేలిపోయిందనడానికి గానీ, సముద్రంలో కూలిపోయిందనడానికి గానీ సాక్ష్యాలు లేవని .రా.. కు చెందిన సంస్థ CTBTO ప్రకటించింది. సమగ్ర (అణు) పరీక్షల నిషేద ఒప్పంద సంస్థ (Comprehensive Test Ban Treaty Organisation) ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నెలకొల్పిన పరిశీలనా కేంద్రాలేవీ విమానం కులిపోయిన జాడలను రికార్డు చేయలేదని .రా.. సెక్రటరీ జెనరల్ బాన్-కి-మాన్ ప్రతినిధి డుజరిక్ ప్రకటించారు.

అదే సంవత్సరం జూలై-17 ఊక్రయిన్లోని తిరుగుబాటుదారులు మలేషియన్ ఏయర్ లైన్స్ కు చెందిన MH-17 విమానాన్ని కుల్చివేశారు. విమానంలో 280 మంది ప్రయాణీకులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ మరణించారు. కూల్చివేయబడ్డ విమానమే అదృశ్యమైపోయిన MH-370 విమానం అని కొందరంటున్నారు. కారణం, "కూలిపోయిన MH-17 విమానంలోని చనిపోయిన వారందరి దేహాలమీద పాస్ పోర్టుల అతికించబడి ఉన్నాయిఅని ఊక్రయిన్ తిరుగుబాటుదారుల కమాండర్ ఈగోర్ ఫిర్మిన్ తెలిపారు.

ఎవరైనా 239 ప్రయాణీకులున్న విమానాన్ని దొంగిలించి, విమానాన్ని 6 నెలలవరకు దాచిపెట్టగలరా? అందులోని శవాలను తీసి మరో విమానంలో, అందులోనూ వేరే దేశం నుండి బయలుదేరే విమానంలో పెట్టగలరా? ఇదంతా సాధ్యమయ్యే పనేనా?...అని కొట్టిపడేస్తున్నారు.

"MH-370 విమానం పాకిస్తాని తాలిబన్ నియంత్రిత ప్రదేశాలలో ఉండవచ్చు. ఖాలీ విమానాన్ని వెపెన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ తో నింపి అమెరికాపై దాడి చేయవచ్చు"ఒక రిటైర్ద్ అమెరికా మిలటరీ జెనెరల్ ఫాక్స్ న్యూస్ ఛనెల్ ఇంటర్ వ్యూలో తెలిపారు.

"వియత్నాం దగ్గరలో చైనా మిలటరీ MH-370ని సబ్ మరైన్ క్షిపణులతో కూల్చి ఉండవచ్చు. ఎందుకంటే విమానంలో ప్రయాణం చేస్తున్న కొందరిని చైనా హత్య చేయాలనుకున్నది" అని బ్రిటీష్ బారిస్టర్ Michael Shrimpton అన్నారు. ఒకవేళ ఇదే నిజమైతే విమాన శకలాలు అక్కడ దొరికి ఉండాలి. మొట్టమొదట అక్కడే విమానం కోసం వెతికారు. ఏమీ దొరకలేదు.


అదృశ్యమైన MH-370 విమానంలో ఆమెరికా టెక్నాలజీ కంపెనీ ఫ్రీ స్కేల్ సెమి కండక్టర్ కు చెందిన 20 ఉద్యోగస్తులు ప్రయాణం చేస్తున్నారు. కంపెనీ అత్యంత శక్తివంతమైన మైక్రో చిప్స్ ను తయారుచేస్తోంది. వాటిని రక్షణ పరిశ్రమ, అంతరిక్ష పరిశోధన పరిశ్రమలకు అందిస్తున్నారు. ఉద్యోగస్తుల దగ్గర పరిశ్రమలకు చెందిన రహస్య సమాచారం ఉంది. ఉద్యోగస్తులు చైనా గూఢాచారుల చేతిలో చిక్కుకుంటారేమోనని అమెరికానే విమానాన్ని దారి మళ్ళించి  ఉంటుందని కొందరు ఊహిస్తుంటే, కాదు ఉద్యొగస్తులను చైనా మిలటరీ కిడ్నాప్ చేయడానికి విమానాన్ని హైజాక్ చేసి తీసుకువెళ్ళుంటారని మరికొందరు ఊహిస్తున్నారు.

ఎవరికీ తెలియకుండా, ఎవరి రాడార్లలోనూ కనిపించకుండా ఒక విమానాన్ని దారిమళ్ళించి తీసుకు వెళ్ళగలరా?  అసలు ఇది సాధ్యమా అంటే "సాధ్యమే. మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో హ్యూగో టీసో అనే టెక్నాలజీ నిపుణుడు ఒక మొబైల్ ఫోనుతో విమానాలను ఎలా దారి మళ్ళించవచ్చో చేసి చూపించాడు. టెక్నాలజీని ఉపయోగించుకుని, ఇంకొక విమానం నీడలో విమానాన్ని దారి మళ్ళించే అవకాశం ఉన్నది" అని ఇండి పెండంట్ పేపర్లో ఒక వ్యక్తి రాశారు.

మలేషియన్ ఏయర్ లైన్స్ విమానం MH-370 అదృశ్యమవటానికి కారణం ఏదైనా, అందులో ప్రయాణం చేసిన వారి గతి ఏమిటనేదే ప్రతి ఒక్కరి ఆవేదన. విమానం ఏమైందో బయట ప్రపంచానికి తెలిసేవరకు ఇదొక మిస్టరీగా మిగిలిపోతుంది.

విమానయానం చరిత్రలోనే బహుశా శాశ్వతంగా మిగిలిపోయే మిస్టరీ ఇదేనేమో

Images Credit: To those who took the original photos

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి