ప్రేమ కలలు (సీరియల్-PART-2)
మరో రెండు వారాలు గడిచినై. కానీ,
అంజలికి ఉద్యోగం దొరకలేదు. మనసు నొచ్చుకుంది. ఆమె తల్లి కూడా
బాధపడింది.
“అంజలీ...మనం గ్రామానికే
వెళ్ళిపోదామా? నీకు ఇక్కడ ఉద్యోగం దొరికేటట్టు లేదే?”
“అక్కడికి వెళ్ళి ఏం
చేయబోతాము? అక్కడ మాత్రం నాకు ఉద్యోగం దొరుకుతుందా?”
“నా వరకు నేను స్కూల్లో
టీచర్ గా పనిచేసుకుంటున్నాను. దాన్ని వదిలేయమని చెప్పి...నన్ను ఇక్కడకు పిలుచుకు
వచ్చి -- హు...నేను నీకు భారం అయిపోయాను. అది తలచుకుంటేనే బాధగా ఉంది”
“ప్లీజ్ అమ్మా. ఒంటరిగా
నిలబడి పోరాడి నన్ను పెంచావు. అప్పుడు నీకు నేను భారంగా అనిపించానా? చెప్పమ్మా...అనిపించానా?”
“లేదు. నువ్వే నాకున్న బలం.
నేను ప్రాణాలతో ఉండేదే నీ కోసమే”
“అలాంటప్పుడు నాకు మాత్రం
ప్రేమ ఉండదా? కొన్ని రోజులు కాచుకోమ్మా...అంతా సర్దుకుంటుంది”
“చేతిలో ఉన్న డబ్బు ఖాలీ
అవుతూ వస్తోందే. నీకు పెళ్ళి చేయాలి. ఇవన్నీ ఎప్పుడు జరగబోతాయో తెలియదు...భగవంతుడు
నన్ను ఎక్కువ పరీక్షిస్తున్నాడు!”
"మనసు పాడు చేసుకోకు. ఈ రోజు ఒక
కంప్యూటర్ కంపెనీలో ముఖాముఖి ఇంటర్ వ్యూ ఉన్నది. అక్కడ ఉద్యోగం దొరుకుతుంది.
చూద్దాం"
"ఏమ్మా...ఆ అబ్బాయి సుధీర్ కు ఎవరైనా
తెలుసేమో కనుక్కో. అతను పెద్ద ఆఫీసులోనే కదా పనిచేస్తున్నాడు. అక్కడ నీకు ఉద్యోగం
ఇప్పించలేడా?"
"ఎందుకమ్మా ఆయనకు
ట్రబుల్ ఇవ్వటం? ఏదో కనికరించి మనల్ని తక్కువ అద్దెకు ఈ
ఇంట్లో ఉండటానికి వొప్పుకున్నాడు. అది చాలదంటూ ఆయన్నే ఉద్యోగం ఇప్పించమని అడగటం
బాగుంటుందా?"
"సరి...సరి...భోజనం
చేసి బయలుదేరు. ఈ రోజైనా ఉద్యోగం దొరకనీ" అని చెప్పి అంజలిని పంపించింది
తల్లి.
ముఖాముఖి ఇంటర్ వ్యూ ముగించుకుని బస్సు
కోసం కాచుకోనున్నది. అప్పుడు సుధీర్ సడన్ గా వచ్చాడు.
“ఏం అంజలీ...ఇక్కడ
నిలబడ్డావు? ఎక్కడికి వెళ్ళాలి? నేను
డ్రాప్ చేస్తాను” అన్నాడు.
“ఊహూ...ఎక్కడికీ
వెళ్ళను...మనసే బాగోలేదు సార్. ఎక్కడైనా కనబడకుండా వెళ్ళిపోదామా అని అనిపిస్తోంది” అన్నది విరక్తిగా!
ఆమెను చూడటానికే అయ్యో పాపం అనిపించింది సుధీర్
కు. ‘యుక్త వయసులో చాలా మంది అమ్మాయలు
దుప్పటాతో ముఖం మూసుకుని వాళ్ళిష్టం వచ్చినట్టు ఊరంతా తిరిగి వస్తుంటే ఈమె పాపం.
అమ్మా...కుటుంబ బాధ్యత అని ఉంటోంది’ అని అనుకున్నాడు.
“ఏమిటి సార్
ఆలొచిస్తున్నారు? వీళ్ళకు ఎందుకురా ఇల్లు ఇచ్చాము అని
ఆలొచిస్తున్నారా? భయపడకండి...ఖచ్చితంగా అద్దె ఇచ్చేస్తాము”
“అంజలీ...మీకు అభ్యంతరం
లేకపోతే అదిగో 'కాఫీ షాప్' ఉంది.
అక్కడికెళ్ళి మాట్లాడుకుందామా? నా కిప్పుడు కాఫీ తాగకపోతే తల
నొప్పి వచ్చేస్తుంది" అన్నాడు.
ఆమె కూడా కాదనకుండా బయలుదేరింది.
షాపులో జనం లేరు. చిన్నగా సంగీతం
వినబడుతోంది. అక్కడక్కడ ప్రేమ జంటలు లోకాన్ని మర్చిపోయి కూర్చోనున్నారు. వాళ్ళను
చూసిన వెంటనే అంజలికి సిగ్గు కమ్మేసింది.
"ఏమిటి సార్...ఇక్కడంతా ప్రేమికులుగా
ఉన్నారు? నాకు ఇబ్బందిగా ఉంది"
"ఓ...మీరు గ్రామం నుండి వచ్చారు కదా?
అందుకే ఇదంతా మీకు కొత్తగా ఉంది. ఇక్కడ ఇది సహజం. ఎవరూ ఎవర్నీ పట్టించుకోరు.
మీరు కూర్చోండి" అన్నాడు.
"ఒక మూలగా ఇద్దరూ కూర్చున్నారు. ఆ
చిరు చీకటి వెలుతురులో అంజలి దేవతలాగా కనిపించింది అతని కళ్ళకు! చెవులకు
ప్లాస్టిక్ పోగులు, చేతులకు గాజులు లేవు.
మెడలో ఒకే ఒక 'క్రిస్టల్ మాల’ అంటూ
చాలా సింపుల్ గా ఉన్నా గానీ ఆమె యొక్క సహజ అందంతో ముఖం ప్రకాశంగా కనబడుతోంది.
"ఏమిటి...నన్నే చూస్తున్నారు?"
అన్న తరువాత మామూలు స్థితికి వచ్చాడు.
"అవును...నేనే అడగాలనుకున్నాను.
మీరెందుకు గ్రామం నుండి నగరానికి వచ్చారు? మీ
నాన్న ఎక్కడ ఉన్నారు? మీరు వచ్చిన రోజే అడిగేవాడిని. తప్పుగా
అనుకుంటారేమోనని అడగలేదు"
"చెబుతాను సార్. మా
ఊరు శ్రీకాకుళం. నాకు ఊహ వచ్చినప్పటి నుండి నేను నాన్నను చూడలేదు. కానీ, ఆయన కట్టిన తాలి అమ్మ మెడలో వేలాడుతోంది. ఎప్పుడైనా ఆయన గురించి
అడిగినా...ఎక్కువగా కోపం తెచ్చుకుని అరిచి అలాగే స్ప్రుహ తప్పి పడిపోతుంది"
"అయ్యో పాపం...అంటే మీ నాన్న బ్రతికే
ఉన్నారు. అవునా?"
"అవును...నేనే ఆయన్ని
రెండు మూడు సార్లు చూసాను. ఉర్లో అమ్మ ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. నన్నూ
చదివించింది. నేను డిగ్రీ చదువు పూర్తి చేసుకుని అక్కడే కొన్ని రోజులు పనిచేశాను.
కానీ, అమ్మకు అప్పుడప్పుడు ఒళ్ళు బాగుండకుండా పోతుంది"
"ఏమైంది?"
"బ్లడ్ ప్రషర్. ఈ
ఊర్లోనే ఉంటే మీ అమ్మకు బ్లడ్ ప్రషర్ ఎక్కువ య్యే అవకాశం ఉంది. అందుకని ఆమెను వేరే
ఊరికి తీసుకు వెళ్ళండి అని డాక్టర్ చెప్పాడు"
"ఎందుకని?"
"మా ఊరు చిన్న గ్రామం.
అక్కడున్న అందరూ ఆమెను ఒకలాగా మాట్లాడటం మొదలు పెట్టారు. నేను చిన్న దానిగా
ఉన్నప్పుడు ఆమె అన్నిటినీ ఓర్చుకుంది. కానీ, నేను పెద్దవను,
పెద్దవను...ఊరి ప్రజల మాటలు విని ఎక్కడ నేను కూడా ఆమెను
చీదరించుకుంటానేమోనని భయపడింది"
"అది న్యాయమే కదా?"
"అది మాత్రమే కాదు.
ఆమెకున్న చెడ్డపేరు వలన నాకు మంచి సంబంధం దొరకదేమోనని బాధ పడటం మొదలు పెట్టింది.
ఒక సారి బ్లడ్ ప్రషర్ ఎక్కువ అయి, కళ్ళు తిరిగి పడిపోయింది.
మంచి కాలం కాపాడేశాను. కానీ, 'ఇంకోసారి ఇలా వస్తే ఆమె
ప్రాణానికే ముప్పు...లేకపోతే పక్షవాతం వచ్చినా వస్తుంది అని డాక్టర్ చెప్పినందు
వలన ఇక్కడికి తీసుకు వచ్చాను”
అది విని బాధపడ్డాడు సుధీర్.
"పాపం అంజలి మీరు. ఇంత చిన్న వయసులో
ఎంత బాధ్యత?"
“నన్ను పొగడటం ఉండనివ్వండి.
మీరు మీ గురించి చెప్పండి. మీది ఏ ఊరు? అమ్మా, నాన్నా అందరూ ఎక్కడున్నారు? తోడబుట్టిన వారు ఎంతమంది?
అన్ని వివరాలూ చెప్పండి" అన్నది.
కాఫీ తాగుతూ చిన్నగా నవ్వాడు.
"నా గురించి చెప్పటానికి ఏముంది?"
"ఏమిటి అలా
చెబుతున్నారు? చిన్న వయసులోనే వృద్దాశ్రమం పెట్టి
నడుపుతున్నారంటే సామాన్యమైన పనా...ఇలాంటి సేవా మనోభావం ఎవరికి వస్తుంది?"
"అరే...మీరొకరు. సేవా
లేదు...గీవా లేదు. నేను డబ్బులు తీసుకునే కదా వాళ్ళకు చోటిస్తున్నాను...భోజనం
పెడుతున్నాను"
"అయినా కానీ,
ఎంతమందికి ఈ మనసు ఉంటుంది? మీరు మీ గురించి
చెప్పటం ఇష్టం లేకపోతే చెప్పొద్దు"
"అయ్యయ్యో... అలా ఏమీ లేదండి. నాకు
ఇదే ఊరని అనుకుంటా. ఎందుకంటే వివరాలు చెప్పటానికి అమ్మో,
నాన్నో లేరు. నాకు రెండేళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు ఒక ప్రమాదంలో
చనిపోయారు"
"అరే భగవంతుడా..."
"మా నాన్న పెద్ద వ్యాపారస్తుడుట.
అందువల్ల నాకు కొంచం డబ్బు పెట్టి వెళ్ళారు. ఆ డబ్బు తీసుకుని మామయ్య నన్ను
చదివించారు. ఉండటానికి చోటూ, తినటానికి
తిండీ దొరికింది. కానీ, ఒక కుటుంబంలో దొరకవలసిన ప్రేమ,
అనురాగం దొరకలేదు. మా అత్తయ్య తన పిల్లల్ను బుజ్జగిస్తుంటే అది చూసి
చూసి వేధన పడేవాడిని. ఎందుకు నన్ను బుజ్జగించటం లేదు అనేది అర్ధం అయ్యేటప్పటికి
పది సంవత్సరాలు పట్టింది"
వింటున్న అంజలికి కళ్ళు నీటితో నిండినై.
అదేమీ పట్టించుకోనట్టు చెప్పటం తిరిగి ప్రారంభించాడు.
"నాకు వివరాలు తెలియటం ప్రారంభమైన
తరువాత మనసును దృఢ పరచుకున్నాను. ఆ కుటుంబం నుండి బయటకు వెళ్ళిపోవాలని కచ్చెతో
చదవటం మొదలుపెట్టాను. సి. ఏ.
ముగించిన వెంటనే మామయ్య దగ్గర చెప్పేసి వేరుగా వచ్చాసాను. ఆయన మా నాన్నగారి డబ్బు అంటూ కొంత డబ్బు
ఇచ్చారు. అదిపెట్టుకుని ఈ వృద్దాశ్రమం మొదలుపెట్టేను. అందులో ఒక స్వార్ధం"
"ఏమిటీ?"
"ఇక్కడికొస్తున్న
వృద్దులు నన్ను తమ పిల్లాడుగా తలచి ప్రేమ చూపిస్తారు కదా? అమ్మ
ప్రేమంటే ఏమిటో తెలియని నాకు అది ఊరట కలిగిస్తుంది కదా అని మహిళలకు మాత్రమే అంటూ
మొదలుపెట్టేను" అన్నాను.
కళ్ళల్లో నుండి పొంగి పొర్లుతున్న
కన్నీటిని అతను తనకు తెలియకుండానే తుడుచుకున్నాడు. కొంచం సేపు మౌనం చోటు
చేసుకుంది.
"అంజలీ...మీరేం చదువుకున్నారు"
సడన్ గా అడిగాడు!
అతని మాటలకు సోకంలో మునిగిపోయున్న ఆమె
కొంచం హడావిడి పడింది.
"నేను ఎం.ఎస్.సి బయోలజీ
చదువుకున్నాను. ఒక స్కూల్లో టీచర్ గా ఒక సంవత్సరం పనిచేశాను. మీకు తెలిసిన చోట ఎక్కడైనా
నాకు ఉద్యోగం దొరుకుతుందా? కొంచం
చెప్పండి...ప్లీజ్"
"ఓ...మీరు అంతవరకు చదువుకున్నారా? సరే. మొదట మా ఆఫీసులోనే ఒక
క్లర్క్ ఉద్యోగం ఖాలీగా ఉంది. దానికి మిమ్మల్ని దరఖాస్తు చేయండి అని
చెబుతామనుకున్నా. కానీ ఇప్పుడు...."
"పరవాలేదు సార్...ఏ ఉద్యోగమైనా
చేస్తా"
"ఉండండి...తొందరపడకండి. నిన్ను నేను
ఒక దినపత్రికలో ఒక ప్రకటన చూశాను. మన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద స్కూల్లో 'టీచర్లు కావాలి’ అని వేసుంది. మీరు దానికి దరఖాస్తు
చేసుకోండి"
"ఏ స్కూలు?
మన వీధి చివర ఉన్నదే అంతర్జాతీయ స్కూలు...అదా?"
"అవును...నాకు ఆ
స్కూల్ ప్రిన్సిపాల్ బాగా తెలుసు. జీతం కూడా బాగా ఇస్తారు. మీరు దానికి ట్రై
చేయండి"
ఆమె మొహంలో సంతోషం కనబడింది.
“సార్...చాలా 'థ్యాంక్స్’. రేపే డైరెక్టుగా వెళ్ళిపోతాను”
"కుదిరితే మీరు ఒక
రికమెండేషన్ లెటర్ ఇవ్వండి. ఎలాగైనా నాకు ఆ ఉద్యోగం దొరికితే సరి" అంటూ
లేచింది.
ఇద్దరూ ఒకటిగా బయటకు వచ్చారు.
వచ్చేటప్పుడు ఒక జంట ఎదురుగా వస్తే ...కొంచంగా వొదిగింది. అప్పుడు చిన్నగా సుధీర్
ను ఢీ కొన్నప్పుడు భుజాలపైన కరెంటు పాస్ అయినట్టు అనిపించింది అంజలికి.
'ఏమిటిది. ఇంతవరకు కలగని
భావం? బస్సులో వెడుతున్నప్పుడు ఎంతో మంది తెలియక, కొంత మంది తెలిసి రాసుకుంటారు. అప్పుడంతా రాని భావన ఇప్పుడెందుకు కలిగింది?'
ఆమె మొహం ‘తామర పువ్వు వికసించటం సూర్యుడికే సొంతం’ అనే భావంతో
ఆశగా చూశాడు సుధీర్.
Continued....PART-3
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి