11, జనవరి 2022, మంగళవారం

35 ఏళ్ల తర్వాత 92 అస్థిపంజరాలతో ల్యాండైన విమానం!...(మిస్టరీ)

 

                                                   35 ఏళ్ల తర్వాత 92 అస్థిపంజరాలతో ల్యాండైన విమానం!                                                                                                                                              (మిస్టరీ)

                        గంటల వ్యవధిలో ల్యాండ్ కావల్సిన విమానం...35 ఏళ్ల తర్వాత ఎలా ల్యాండైంది?

1954లో జర్మనీలో బయల్దేరిన శాంటియాగో ఫ్లైట్ 513 విమానం సుమారు 35 ఏళ్ల తర్వాత 1989లో బ్రెజిల్లో ల్యాండైంది. అందులో ఒక్కరూ ప్రాణాలతో లేరు. పైలట్తో సహా అంతా చనిపోయి.. అస్థిపంజరాల్లో మారిపోయారు. సైన్స్ ఫిక్షన్ను తలపిస్తున్న ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగాటైమ్ ట్రావెల్ను నమ్మే వ్యక్తులు దీన్ని బలంగా విశ్వసిస్తున్నారు. ఇంతకీ ఘటన వెనుక ఉన్న మిస్టరీ ఏమిటీ?

అది 14 నవంబరు, 1989. ‘వీక్లి వరల్డ్ న్యూస్అనే పత్రిక సంచలన వార్తను ప్రచురించింది. 35 ఏళ్ల కిందట మిస్సైనఫ్లైట్ 513’ విమానం అక్టోబర్ 12, 1989లో బ్రెజిల్లోని పార్టో అలెగ్రే విమానాశ్రయంలో ల్యాండైందని, అందులో 92 అస్థిపంజరాలు ఉన్నాయని వార్తలో పేర్కొంది. ఫ్లైట్ 513 రికార్డులను పరిశీలించగా.. విమానం 1954, సెప్టెంబరు 4 పశ్చిమ జర్మనీలోని ఆచెన్ విమానాశ్రయం నుంచి బయల్దేరినట్లు ఉంది.

విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని గంటల్లోనే అట్లాంటిక్ సముద్రంలో కుప్పకూలింది. అయితే, విమానం మళ్లీ 1989లో ల్యాండ్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఘటనపై జర్మనీ ప్రభుత్వం తమ ఏజెంట్ల ద్వారా విచారణ జరిపించిందని పత్రిక వెల్లడించింది. ఘటనపై వివరాలను తెలిపేందుకు నిరాకరించారని పేర్కొంది. బ్రెజిల్ విమానాశ్రయవర్గాలు విషయాన్ని ధృవీకరించాయని తెలిపింది. రోజు ల్యాండైన విమానం చాలా పురాతనమైనదని, దానికి శక్తివంతమైన టర్బోప్రాప్ ఇంజిన్లు ఉన్నాయని తెలిపారంది.

ఘటనలో మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. విమానంలో ఉన్న 88 మంది ప్రయాణికులే కాదు, నలుగురు విమాన సిబ్బంది కూడా అస్థిపంజరాల్లా మారిపోయారు. వీరిలో విమానం నడిపే పైలట్ కూడా ఉన్నాడు. నేపథ్యంలో ఘటనపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. విమానం ఎలా ల్యాండైంది? దానికి ల్యాండింగ్ అనుమతి ఎలా ఇచ్చారు? ఇలా ఒకటి కాదు.. అనేక సందేహలు నెలకొన్నాయి.

‘‘ విమానం పైలట్ కెప్టెన్ మిగ్యూల్ విక్టర్ క్యూ.. కాక్పీట్లో విమానం నడుపుతున్న పొజిషన్లో కనిపించారు. ల్యాండింగ్కు ముందు విమానం విమానాశ్రయం చుట్టూ చక్కర్లు కొట్టింది. విమానం గురించి మాకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో గందరగోళం ఏర్పడింది. తర్వాత విమానం దానంతట అదే ల్యాండైంది. పైలట్ చనిపోయి ఉన్నా విమానం క్రాష్ ల్యాండ్ కాకపోవడం ఆశ్చర్యం కలిగించింది’’ అని విమానాశ్రయ సిబ్బంది తెలిపారని పత్రిక వెల్లడించింది.

ఐర్విన్ ఫిషర్ అనే విలేకరి రాసిన వార్త అప్పట్లో సంచలనంగా మారింది. నేపథ్యంలో విమానాశ్రయ అధికారుల తీరుపై పలువురు నిరసన వ్యక్తం చేశారు. విషయాన్ని గోప్యంగా ఉంచడం నేరం. విమానంలోని ప్రయాణికుల వివరాలు తెలుసుకుని.. సమాచారం వారి బంధువులకు పంపించండి అంటూ పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రజల భయాందోళనకు గురవ్వుతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వార్తను ధృవీకరించి ఉండరని మరికొందరు చెబుతున్నారు.

ఘటన విషయాన్ని పక్కన పెడితే.. 1954లో మిస్సయిన ఫ్లైట్ 513 విమానం ఏమైందనేది ఇప్పటికీ తెలియరాలేదు. దాని కోసం ఏళ్ల తరబడి గాలించినా ఫలితం దక్కలేదు. నేపథ్యంలో పత్రికలో వచ్చిన కథనాన్ని చాలామంది నమ్మారు. కానీ, ప్రభుత్వం ఘటనను అధికారికంగా ధృవీకరించకపోవడంతో పత్రిక కథనం నిజమా, ఫేకా అనే అనుమానాలు నెలకొన్నాయి. అప్పట్లో కొన్ని పత్రికలు సంచలనాల కోసం ఇలాంటి వార్తలను సృష్టించేవని, పత్రిక కూడా వార్తను సృష్టించి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి

2014, మార్చి నెలలో మిస్సయిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం 370 ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. దీంతో చాలామంది అది కూడా టైమ్ వ్రాప్లోకి వెళ్లిపోయి ఉండవచ్చని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Image Credits: To those who took the original photos.

**********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి