29, జనవరి 2022, శనివారం

దృశ్యం...(సీరియల్)...PART-6

 

                                                                                   దృశ్యం...(సీరియల్)                                                                                                                                                                           PART-6

కమలకు కు రోజు సెలవు.

"అమ్మగారూ...మీరు ఇక్కడే ఉండండి"

"నా దగ్గర డబ్బులు కూడా లేవమ్మా!"

"మీ అమ్మాయి బ్యాంక్ అకౌంట్లో డబ్బులున్నాయి. నామినేషన్ ఎవరి పేరు మీదుందో అడుగుదాం. అది కుదరకపోతే, మా యజమానిని అడుగుదాం...ఆయన సహాయం చేసే మనిషే"

కమలా ఇలా అడుగుతున్నాని తప్పుగా అర్ధం చెసుకోకమ్మా...నా కూతురు ఎవర్నో నమ్మి మోసపోయి గర్భం తెచ్చుకుంది కదా! నీకు ఏదైనా తెలుసామ్మా? పాపత్ముడు ఎవరనేది కనిపెట్టాలి కదా?"

కమల మాట్లాడలేదు.

"చెప్పమ్మా...నేను దాన్ని కన్నదాన్ని. కడుపు మండిపోతోంది"

"కొన్నిరోజులుగా దాని ప్రవర్తన బాగాలేదు. ఎవరినో కలవడానికి వెడుతోంది.గత ఏడెనిమిది నెలలుగా ఇది జరుగుతోంది. నేను అడిగినప్పుడు కోపగించుకుంది. అది తన సొంత విషయమని చెప్పి నా నోరు మూసింది. మాట్లాడలేకపోయాను."

"ఎవరది?"

"తెలియదమ్మా! ఇక్కడ్నుంచి ప్రొద్దున ఆరుగంటలకు బయలుదేరుతుంది. నడిచే చాలా దూరం వెడుతుంది.  ఎక్కడ, ఎవరు కాంచనను పిక్ అప్ చేసుకుంటున్నారనేది తెలియదు. తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు వస్తుంది. ఒక రోజు వొంట్లో బాగుండలేదని షాపులో లీవ్ చెప్పేసి రాత్రి ఎనిమిదింటికి వచ్చాను. ఆరు రోడ్ల జంక్షన్లో కాంచన ఒక కార్లో నుండి దిగింది. ఖరీదైన ఇంపోర్టడ్ కారు. కారులో ఉన్నది ఎవరనేది కనపడలేదు. చేతుల్లో రెండు పెద్ద సంచులతో కాంచన దిగింది"

 తరువాత?" 

"నేను వెనుకే వచ్చాను. కాంచన ఆశ్చర్యపోయింది. ఏమీ మాట్లాడలేదు. గదిలోకి వచ్చినప్పుడు, సంచులను బీరువాలో పెట్టి తాళం వేసింది. వూరుకోలేక అడిగాను....ఎవరిది కారు? నువ్వు ఎక్కడకెళ్ళి వస్తున్నావ్?  అంటూ మరో పది ప్రశ్నలు అడిగాను. అది కోపగించుకుంది.....అవన్నీ నా పర్సనల్ విషయాలు. దీంట్లో తలదూర్చకు అని చెప్పింది. కానీ నేను వదల్లేదు."

"ఏమన్నావ్?"

నువ్వు చిన్న పిల్లవి. కొన్ని రోజులుగా నీ ప్రవర్తనే బాగోలేదే! పడవలాంటి కారు... విదేశీ కారు. ఎవరే అతను? క్యారక్టర్ తప్పైపోతే మన షాపులో ఉద్యోగం నుండి తీసేస్తారు. నీకే మంచిది కాదు. అని ఎన్నో విధాలుగా చెప్పిచూశాను. దేని గురుంచి బయపడినట్లు కనిపించలేదు. సమాధానమూ చెప్పలేదు. మరుసటి రోజు నుండి నాతో మాట్లాడటం మానేసింది. నన్ను వదిలి దూర దూరంగా వెళ్ళిపోయింది. మొదట్లో కొంచం బాధపడ్డాను. తరువాత...మనకెందుకు గోల? అనుకుని తప్పుకున్నాను. రేపు దాని వల్ల నేను కష్టాల్లో ఇరుక్కో కూడదు కదా?"

" విషాయాలన్నీ నువ్వు పోలీసులకు చెప్పలేదా?"

చెప్పలేదమ్మా! గుచ్చి గుచ్చి అడిగారు. అయినా కూడా నేను చెప్పలేదు. చెపితే నా పేరు కూడా పేపర్లలో వస్తుంది. నేనూ పెళ్ళి కాని పిల్లనే. నా జీవితాన్ని బాధిస్తుంది కదా?"

పడవలాంటి కారులో నుండి దిగింది కాబట్టి ఖచ్చితంగా ధనవంతుని సావాసమే. అనుమానమే అక్కర్లేదు.  ఇది ఎవరో ఒక డబ్బు గల వాడితో స్నేహం చేసి, చెడిపోయింది. గర్భం తెచ్చుకుంది. న్యాయం అడగటానికి వెళ్ళుంటుంది, వాడు దీన్ని హత్య చేసుంటాడు

"ఉండొచ్చు".

"అతను ఎవరనేది తెలుసుకో అక్కర్లేదా?"

"దాని వలన కాంచన మళ్ళీ తిరిగొస్తుందా?"  అని కాంచన తల్లి ఏడుస్తూ చెప్పింది.

నేను చేయగలిగిన సహాయం చేస్తాను. మీకు మీ కూతురి దేహం ఇచ్చేంతవరకు చోటిస్తాను. దానికి తరువాత ఇక్కడుంటున్న మిగిలిన అమ్మాయలు అనుమతించరు. నన్ను తప్పుగా అర్ధం చేసుకోకండి. అందులోనూ తమ్ముడు మొగవాడు. అందువలన మీరు ఇంకేదైనా చోటు చూసుకోవాలి"

"సరేనమ్మా"

"కాంచన వస్తువులు బీరువాలో ఉన్నాయమ్మా!"

తల్లి బీరువా తలుపులు తెరిచింది. ఖరీదైన వస్తువులు. బ్యూటీని మెరుగు చేసుకునే వస్తువులే ఎక్కువగా ఉన్నాయి. వాసన ద్రవ్యాలు కొన్ని.

"ఖచ్చితంగా ఎవడో ధనవంతుడే ఇచ్చుంటాడు"

"ఇవన్నీ పోలీసులు చూసారా కమలా?"

"చూశేసారు...వీటిని చూసే ఒక ధనవంతుడే హంతకుడై ఉంటాడని కంక్లూషన్ కి వచ్చారు. వాళ్ళు వెతకటం ప్రారంభించారు"

కమల మౌనంగా బయటకు వచ్చింది.

పడవలాంటి కారు ఇంకా కమల కళ్ళ ముందు కనబడుతోంది. కారును ఎక్కడ చూసినా కమల ఖచ్చితంగా గుర్తు పడుతుంది.

                                                                             ***********************

సాయం కాలం.

స్వాగతం చెప్పటానికి రెండు కుటుంబాల వారూ రెడీ అవుతున్నారు. బ్యూటీషియన్స్ దీపికని అందంగా అలంకరించి అమె అందాన్ని రెట్టింపు చేశారు. ముఖ అలంకారానికి ఒకరు, తల అలంకారానికి ఒకరు, చీర కట్టటానికి ఒకరు అని వేరు వేరు అలంకార నిపుణులు దీపికని అలంకరించారు...రామకృష్ణగారు నగలు, పట్టు వస్త్రాలకు  అధికంగా డబ్బు ఖర్చు చేశారు.

చక్రవర్తికి మరోపక్క అలంకారం జరుగుతోంది.

సాయంత్రం ఐదు గంటలు దాటింది.

జనం రావటం మొదలయ్యింది.

పెళ్ళికొడుకు ఊరేగింపుకు గుర్రాల బండి, బ్యాండ్ మేళం ట్రూప్ రెడీగా ఉన్నది.

సాయంత్రం స్నాక్స్ టిఫిన్ కోసం డైనింగ్ హాల్ జనంతో నిండిపోయింది.

మండపం రంగు రంగుల విద్యుత్ దీపాలతో మెరిసిపోతోంది. అందరూ హడావిడిగా తిరుగుతున్నారు.

ప్రియంవదలో మాత్రం ఆందోళన క్షణం క్షణం పెరిగిపోతోంది.

తల్లి రాజేశ్వరి ఆమె దగ్గరకు వచ్చింది.

ప్రియా...ఏమైందే? నువ్వు డ్రస్సు కూడా మార్చుకోలేదు...నిన్ను కూడా బ్యూటీ పార్లర్ మనుష్యులు పిలుస్తున్నారు.”

వద్దమ్మా

ఏం మాట్లాడుతున్నావే? దీపిక యొక్క ఒకే ఒక్క చెల్లివి, నువ్వు అందంగా కనపడొద్దా?.”

నేను కాదు...అది పెళ్ళి కూతురు. నన్ను వదిలేయండి.”

ఏమైంది నీకు?

రామకృష్ణ గారు వచ్చారు. “అది నాలుగు రోజులుగా అదోలా ఉన్నది. విషయమేమిటో చెప్పదు...నాకు ఇదేమీ నచ్చలేదు" 

వదలండి....కోపగించుకోకండి. అక్కయ్య వేరుగా వెళ్ళిపోతోందే నన్న భాద దానికి ఎక్కువగా ఉన్నది.”

అమ్మాయిగా పుడితో ఒక రోజు పెళ్ళి జరుగుతుంది కదా! దాన్ని మన ఇంట్లోనే ఉంచుకోగలమా? నువ్వూ ఒకరోజు మన ఇళ్ళు వదిలి అత్తారింటికి వెళ్ళాల్సిందే. అర్ధం చేసుకో ప్రియా....సంతోషంగా ఉండు.”

తల్లి తండ్రీ ఇద్దరూ వెళ్ళిపోయారు.

ప్రియ ఒక గోడ చివరకు వెళ్లి ఆనుకుని నిలబడింది.

గౌతం ఆమె దగ్గరకు వచ్చాడు.

ఏంటక్కా...నీకేమిటి ప్రాబ్లం?”

లేదు రా...ఏమీ లేదు!”

నువ్వేదో మనసులో పెట్టుకుని మదనపడుతున్నావు. చెప్పక్కా

లేదురా

పెళ్ళి జరగటం నీకు ఇష్టం లేదా?”

అదేమీ లేదురా

ఏదైనా ప్రాంబ్లం ఉంటే ఇప్పుడే చెపక్కా. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవద్దు!”

గౌతం వెళ్ళిపోయాడు.

ప్రియా...వచ్చిన వాళ్ళకు ఏం కావాలో కనుక్కో!”

ఈలోపు ఎవరో ఒకాయన కుటుంబంతో కల్యాణ  మండపంలోకి రావటంతో, సాంబశివరావ్ గారు పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళకు స్వాగతం పలికారు...రామకృష్ణ గారిని పిలిచి పరిచయం చేశారు.

ఏరియా కౌన్సిలర్. మన బిజినస్సుకు ఎందరినో తీసుకు వచ్చి సహాయం చేశారు.”

నమస్తే నండి....రండి టిఫిన్ చేద్దాం. ప్రియా, వీళ్ళను డైనింగ్ హాలుకు తీసుకు వెళ్ళమ్మా.”

రండి అంకుల్.”

వాళ్ళను తీసుకుని ప్రియ డైనింగ్ హాలువైపు వెళ్ళింది.

ఏమిటి సాంబశివరావ్ గారు...మీ బిల్డింగులో హత్య జరిగిందని పత్రిక వాళ్ళు ఏదెదో రాస్తున్నారు! హత్యలో మీకూ సంబంధం ఉన్నదని రాస్తున్నారు"

చదివాను

అబ్బాయికి పెళ్ళి జరిగే సమయంలో ఇలా న్యూస్ రావటం తప్పుగా ఉన్నదే!”

మీడియాను మనం కంట్రోల్ చేయలేము కదా!”

సరే...మీ భవనంలో జరిగిన హత్య కాబట్టి, మీకు తెలియకుండా జరిగుండదని ఊరే మాట్లాడుకుంటోంది.”

నాకు తల తిరుగుతోంది.”

వియ్యంకుడు ఏం చెబుతున్నారు?”

చాలా మంచి మనిషి. ఒక ప్రశ్న కూడా అడగలేదు. మామీద ఎంతో నమ్మకం కలిగిన కుటుంబం.”

డైనింగ్ హాలు వచ్చింది.

ప్రియంవద వాళ్ళను కూర్చోబెట్టి సర్వ్ చెసేవాళ్ల సూపర్వైజర్ ను పిలిచిముఖ్య అతిధులుఅని పిలిచి చెప్పింది.

నువ్వెళ్ళమ్మా...నేను చూసుకుంటాను 

కౌన్సిలర్ చెప్పటంతో ప్రియంవద అక్కడ్నుండి తప్పుకుంది.

భగవంతుడా...పోలీసులు ఖచ్చితంగా కనుక్కుంటారు. అలా జరిగి చక్రవర్తే హంతకుడని నిరూపించబడితే ఏం జరుగుతుంది?”

మరణ శిక్ష లేకపోతే జీవిత ఖైదు!”

మీడియా ఒలిచిపారేస్తుంది.

ఈమే హంతకుడి భార్య... మధ్యే పెళ్ళి చేసుకున్నదిఅక్కయ్య ఫోటో వేసి ముఖ్య వార్తల్లో వేస్తారు!”

అక్కయ్య జీవితం నరకం అయిపోతుందే?”

ఇది తెలిసి కూడా నేను మౌనం వహిస్తే, తరువాత మౌనమే మనొవ్యాధిగా మారి నన్ను చంపేస్తుందే!”

ఒకవేల నాకు తెలుసని అక్కయ్యకు తెలిస్తే.....”

పాపాత్మురాలా! తెలిసుండి చెప్పకుండా నన్ను నరకంలోకి తోసేసేవే...నువ్వు నా తోడబుట్టిన దానివేనా?....అని అక్కయ్య అడగదా?”

కుటుంబమే నా ముఖం మీద ఉమ్మేయదా?”

ఇప్పుడు పెళ్ళి ఆగిపోతుంది. ఖర్చు పెట్టిన డబ్బు నష్టం కంటే అక్కయ్య జీవితమే నష్టపోవటం అంతకంటే నరకం కాదా?"

లోలోపల గుచ్చుకుంటోంది.

గుండె దఢ ఎక్కువైంది.

సమయం సాయంత్రం అరు గంటలు దాటింది. గౌతం వచ్చాడు.

"అక్కయ్య నిన్ను పిలుస్తోంది ప్రియా"

"అక్కయ్య దగ్గరకే వస్తున్నాను...పద" తమ్ముడుతో పాటు దీపిక గదికి వెళ్ళింది ప్రియంవద.

"ప్రియా...అంతా కరెక్టుగా ఉందా చూడవే, నాకంటే నీకు బాగా తెలుసు" అన్నది దీపిక.

"నీ అలంకారం బాగుంటే చాలా...నీ జీవితం బాగుండొద్దా!" మనసులోనే బాధ పడుతూ మౌనంగా నిలబడింది.

"ఏమిటే మౌనంగా నిలబడ్డావ్?"

అప్పుడు దీపికని పై నుండి క్రిందదాక చూసింది ప్రియంవద.

"సరే...నువ్వోచ్చి ఇలా కూర్చో. బాగా టయర్డుగా ఉన్నావు!... అలాగే మేకప్ వేసుకుందువుగాని"

"వద్దక్కా.... నాకు మేకప్ వద్దు .చాలా పనులున్నాయి. మొహం కడుక్కుని సింపుల్ గా డ్రస్స్ మార్చుకుంటాను!"

"అదికాదే...నువ్వే కదా నా పక్కనే నిలబడేది"

దీపిక ప్రియంవదను బలవంతంగా లాగి కూర్చోబెట్టింది.

"అయ్యో...వద్దక్కా"

"అది అలాగే చెబుతుంది. మీరు అలంకరణ  మొదలుపెట్టండి"

ప్రియంవదకు అలంకరణ మొదలయ్యింది.

ప్రియంవద ఏమీ చెయ్యలేకపోయింది.

ప్రియంవద మనసు కొట్టుమిట్టాడుతోంది. లోపల ఒక కురుక్షేత్ర యుద్దమే జరుగుతోంది.

సమయం సాయంత్రం ఏడు గంటలయ్యింది.

మండపంలో జనం ఎక్కువయ్యారు.

ప్రముఖ లైట్ మ్యూజిక్ పార్టీ పాటలు పాడుతున్నారు.

చక్రవర్తి బయలుదేరి బయటకు వచ్చాడు. అక్కడ నిలబడున్న కారులోకి కుటుంబంతో సహా ఏక్కాడు. కారు బయలుదేరి గుడివైపుకు వెళ్ళింది.

గుడిలో అర్చన ముగించుకుని, అలంకరించబడ్డ కారులో వూరేగింపుగా బయలుదేరాలి.

"అబ్బాయ్...ఏడున్నర కల్లా నువ్వు మండపంలో ఉండాలి. ఇప్పటికే ఆలశ్యమైయ్యింది. ప్రముఖ వ్యక్తులు చాలామంది వచ్చేసుంటారు"

"సరే డాడీ! గుడి దగ్గరే ఉంది. ఏడున్నర కల్లా వెళ్ళిపోవచ్చు"

"వూరేగింపు రద్దు చేశేద్దామా?"

"వద్దు..వూరేగింపు ఉండనివ్వండి. ముఖ్యమైన ప్రముఖులు లేటుగానే వస్తారు"

కారు గుడి ముందు ఆగింది.

అందరూ కారులో నుండి దిగారు. గుడి పక్కన ఆలంకారాం చేసిన మరో కారు ఉన్నది. అందులో కూర్చునే చక్రవర్తి వూరేగింపుగా వస్తాడు.

" కారు వాడి అదృష్టమైన కారు. కోటి రూపాయలు. పోయిన సంవత్సరం కొనిచ్చేను. అందులోనే వూరేగింపుగా వస్తాడు"

సరేనండి

అందరూ గుడిలోకి వెళ్ళారు. దేముడికి అర్చన చేయించి, దన్నం పెట్టుకుని గుడి బయటకు వచ్చారు.

చక్రవర్తి వెళ్ళి అలంకరించబడ్డ కారులో కూర్చున్నాడు.

అక్కడ మండపంలో దీపికకి అలంకరణ ముగిసింది. ఫోటోలు తీస్తున్నారు. వీడియో తీస్తున్నారు.

"నువ్వు రెడిగా ఉండమ్మా! వూరేగింపు సగం దూరం వచ్చినప్పుడు పెళ్ళికొడుకుతో నువ్వు జాయిన్ అవాలి. అక్కడుంచి ఇద్దరూ వూరేగింపుగా రావాలి"

సరేనండి

ప్రియంవదకు కూడా అలంకరణ ముగిసింది.

"నువ్వు కూడా రావే ప్రియా"

"అక్కా...వూరేగింపు కారులో నేను ఎక్కకూడదు. నువ్వు వెళ్ళిరా. నేను ఇక్కడే ఉంటాను"

పెళ్ళికొడుకు  తరపు వాళ్ళు వచ్చి దీపికను పిలిచారు.

"రామ్మా"

దీపిక బయటకు వచ్చిన సమయంలో...

తన మోటార్ సైకిల్ను పార్కింగ్లో నిలిపి, గడ్డం పెట్టుకున్న ఒక మనిషి మండపాన్ని పైకి క్రిందకు చూశాడు.

పెళ్ళి కొడుకు ఎక్కడ?”

ఆయన వూరేగింపుగా వస్తున్నాడు

ఇంకా ఎంతసేపు పడుతుంది?”

పావుగంట

నిర్లక్ష్యంగా మండపంలోకి నడిచాడు.

బయట స్వాగతం పలికే చోట పండ్ల రసం ఇస్తున్నారు.

అతనూ ఒక గ్లాసు తీసుకుని మండపంలోకి నడిచాడు.

                                                                                                                              Continued...PART-7

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి