'పవిత్ర'...(సీరియల్) PART-10
పవిత్ర కొన్ని
అడుగులు
వేసిన
తరువాత
‘ఏమీ
చెప్పకుండా
వెళుతోందే?’ అనే
దఢతో
హడావిడిగా
పిలిచాడు.
“పవిత్రా...”
“ఏమిటీ?”
“బయలుదేరావా?”
“అవును...”
“ఏమీ చెప్పకుండా
వెడుతున్నావే...?”
“ఏం చెప్పాలి?” --- అర్ధం
కాకుండా
అడిగిన
ఆమెతో
అవస్త
పడుతూ
చేతిలోని
పాపను
చూపించాడు.
“పిల్ల గురించి
మాట్లాడామే...?”
“మీ ‘ప్రేమ’
పెళ్ళాం
చెప్పిందే
నేనూ
చెబుతున్నాను.
ఆ
పాప
మీరు
ఆశపడి
కన్న
బిడ్డ.
ఆ
పాపను
మీరే
జాగ్రత్తగా
పెంచుకోవాలి”
“ఊ...”
“మా అమ్మకు
‘చెక్
అప్’ చేయాలి.
నేను
బయలుదేరుతాను”--మళ్ళీ నడవసాగిన
ఆమెను
ఆపాడు.
“ఒక్క నిమిషం”
“ఏమిటి?”
“అదొచ్చి...నన్ను
చూస్తే...నీకు
కోపమే
రావటం
లేదా?”----తడబడుతూ
అడిగిన
అతని
మొహం
వైపు
చూసింది.
“దేనికి?”
“లేదు...నేను...నిన్ను...”
“ఇది మీరే
కోరుకున్న
జీవితం.
ఇందులో
కష్టపడతారో
-- నష్టపడతారో అది
మీ
సొంత
విషయం.
మీ
మీద
జాలిపడటానికి
నేనెవరిని?”
“ప...”
“ఇప్పుడు మీరు
ఇంకొక
అమ్మాయి
భర్త.
అది
మర్చిపోకండి”
“ఆమె వెళ్ళిపోయిందే...?”
“దానికి నేనేమీ
చెయ్యలేను
సార్.
ఇది
మీ
కుటుంబ
విషయం”
“ఏమిటి పవిత్రా
అలా
మాట్లాడుతున్నావు?”
“మీరు నా
ఆఫీసులో
పనిచేస్తున్న
సాధారణ
గుమాస్తా...అంతే.
హాస్పిటల్లో
ఒక
పసి
పిల్ల
అల్లాడుతోందే
అని
సహాయం
చేశా.
ఇది
మానవత్వం
గల
వాళ్ళు
చేసేదే.
అదే
నేనూ
చేసింది.
అంతవరకే.
దీనికి మీ
ఇష్టం
వచ్చినట్టు
రంగు
పూయకండి.
మీ
భార్యకు
మంచి
భర్తగా
నడుచుకోలేదు.
ఈ
పిల్లకు
మంచి
తండ్రిగా
నైనా
ఉండండి” -- అన్న ఆమె, అంతకు
మించి
అక్కడ
ఉండలేక
గబగబ
నడిచి
వెళ్ళింది.
ఆమె మాటలు
అతని
లోపలి
మనసులో
నిద్రపోతున్న
అహంకార
మృగాన్ని
తట్టి
లేపినా, దాన్ని
అణిచాడు. ‘ఇది
కోపగించుకునే
సమయం
కాదు...ఆలోచించాల్సిన
సమయం’
ఒకటిగా జీవించిన
రోజుల్లో
పవిత్ర
గురించి
బాగా
అర్ధంచేసుకోనున్నాడు
రామ్మోహన్.
‘పవిత్ర మెత్తని
మనసు
కలిగింది.
భక్తిలో
మునిగిపోతుంది.
ఏదీ
చెప్పినా
తల
ఊపే
గంగిరెద్దు.
లోకం
మాటలకు భయపడే
మనిషి.
భర్త
మాటలను
వేద
వాక్కులాగా
భావించే
మనిషి.
ఆ ఆలొచనతోనే
ఆ
రోజు
ఏ
ఎదిరింపూ
చెప్పకుండా
డైవర్స్
పేపర్లలో
సంతకం
పెట్టి
ఇచ్చింది.
ఈ
రోజు
వరకు
ఆమెకు
నా
మీద
కోపమో
- విరక్తో రాలేదు!
అలా ఉండుంటే
నా
బిడ్డను
తీసుకోనుంటుందా? బిజ్జగించి, ఆడించి
నిద్ర
పుచ్చి
ఉంటుందా? రాణి
కూడా
ఆమె
దగ్గర
ఎంతగా
కలిసిపోయింది?
ఒక పూట
మందు
ఇవ్వటానికీ
-- భొజనం పెట్టటానికీ
రోజూ
ఎంత
కఠినంగా
పోరాడుతున్నాను? ఈ
రోజు
ఎంతో
ఇష్టంగా
పవిత్ర
చేతిలోని
మందును
తాగేసి, ఆమెతో
ఆడుకుంది.
పవిత్ర మనసులో
ఇంకా
తడి
ఉంది.
దయా
గుణం
ఎక్కువగా
ఉన్నది.
వీటిని
బాగా
ఉపయోగించుకోవలి.
ఇంకా
పసిపిల్లను
పెట్టుకుని
ఒంటరి
పోరాటం
చేయలేను.
నా భారాన్ని
దించి
పెట్టటానికి
ఒక
ఒడి
దొరికింది.
మళ్ళీ
ఆమె
దగ్గర
శరణుకోరటానికి
ఇదే
సరైన
ఆయుధం
-- చేతిలో ఉన్న
పాపను
చూశాడు.
తండ్రి
యొక్క
కుట్ర
తెలియక, మంచి
నిద్రలో
ఉంది
పాప.
నువ్వు నా
ఆయుధం. నువ్వే, నన్నూ
- పవిత్రనూ చేర్చే
వంతెన
అవబోతున్నావు
-- నువ్వు పుట్టటంలోనే
ఈ
రోజే
నాకు
పూర్తి
ఆనందం’
-- అనుకుంటూ ఉత్సాహంతో
మొట్టమొదటి
సారిగా
పాపను
గుండెలకు హత్తుకున్నాడు.
ఆ తరువాత
వచ్చిన
రోజులలో, పవిత్ర, పిల్ల
గురించి
అడగకపోయినా
రామ్మోహనే
పలు
వివరాలు
చెప్పేడు.
ఆఫీసుకు
వస్తే
కనీసం
పదిసార్లు
అయినా
ఏదో
ఒక
కారణం
చెప్పుకుంటూ
ఆమె
ముందు
నిలబడేవాడు.
రెండే రోజుల్లో
అతని
మనసును
బాగా
అర్ధం
చేసుకుంది
పవిత్ర.
ఆమేమీ
పాత
పవిత్ర
కాదు.
భర్త
తన
గొంతు
పిసికినా, అది
తనకు
దొరికిన
భాగ్యం
అనుకునే
పాత
పవిత్ర
కాదు!!
ఎదుటి వారు
చూసే
చూపులను
బట్టే
వాళ్ల
గురించి
అర్ధం
చేసుకునే
తెలివితేటలు, చదువు, అనుభవమూ
ఆమెకు
ఆందించినై.
అందువల్ల
రామ్మోహన్
ఎందుకలా
మాటి
మాటికీ
తన
గదికి
వస్తున్నాడో
వెంటనే
ఆమెకు
అర్ధం
అయ్యింది.
తమ్ముడు మనో
నిశ్చయతార్ధానికి
ఒక
రోజే
ఉంది...
పవిత్రను వెతుక్కుంటూ
వచ్చిన
స్వాతి, రామ్మోహన్
కళ్ళల్లో
పడింది.
స్వాతితో
బంధుత్వం
కలుపుకుని
విచారించినప్పుడు, తాంబూలాల
ఏర్పాటు
గురించి
తెలియటంతో
అతని
మనసు
గంతులేసింది.
'ఇదే సాకుగా
పెట్టుకుని
పిల్లతో
వెడితే
ఏమవుతుంది? అని
వచ్చిన
ఆలొచనను
వెంటనే
అమలులో
పెట్టాడు.
ఆదివారం సాయంత్రం
దాకా
ఓర్పుతో
కాచుకున్న
అతను
-- పెళ్ళి కొడుకు
తరపు
వాళ్ళందరూ
వచ్చేరని
తెలుసుకుని
పిల్లతో
పాటు
హాజరయ్యాడు.
పట్టు చీర
కట్టుకుని
ఉత్సాహంగా
తిరుగుతున్న
పవిత్ర, అందమైన
దేవతలా
బంధువుల
గుంపుతో
నిలబడున్న
స్వాతి, పెళ్ళి
కొడికు
స్టైలులో
మెరిసిపోతున్న
మనోహర్, కొడుకునూ--కోడల్నీ
పొంగిపోయి
చూస్తున్న
గోపాలకృష్ణ
దంపతులు.
అందరూ
అది
చూసి
మొహం
మాడ్చుకున్నారు.
“కంగ్రాట్స్ స్వాతీ...కంగ్రాట్స్
అల్లుడూ...” అంటూ హక్కుగా
షేక్
హ్యాండ్
ఇస్తున్న
రామ్మోహన్ను
చూసి
అగ్నిపర్వతం
అయ్యాడు
మనోహర్.
“ఏమిటిది? ఎవరు
వీడ్ని
పిలిచింది?” -- దగ్గరగా
ఉన్న
స్వాతిని
గట్టిగా
అడిగాడు
మనో.
స్వాతి
నిజంగానే
బెదిరిపోయింది.
“తెలియదు...మేమెవరం
పిలవలేదు”
“పిలవకుండా ఎలా
వచ్చాడు?”
“ఏమిటల్లుడూ...అంతలా
కోపగించుకుంటున్నారు”
“స్వాతి నాకు
చెల్లెలు
వరుస.
చెల్లెలు
తాంబూలాలకు
ఎవరైనా
పిలిస్తేనే
రావాలా?” అన్న
రామ్మోహన్ని
కొట్టబోయాడు
మనో.
“ఎవరికి ఎవరురా
అల్లుడు? ఏమిటి
కొత్తగా
బంధుత్వం
కలుపుతున్నావు?”
“మనో ప్లీజ్...కోపగించుకోకండి... రామ్మోహన్ అన్నయ్యా...మీరెళ్ళి
భోజనం
చేయండి” స్వాతి ఆందోళన
పడుతూ
చెప్పగా, మనోహర్
కోపం
ఇంకా
ఎక్కువైయ్యింది.
“వాడికెందుకు గౌరవ
మర్యాదలు? వీడ్ని
బయటకు
వెళ్లమని
చెప్పు”
“అది...”
“వీడు ఇక్కడ
నిలబడితే...నేను
బయటకు
వెళ్ళాల్సి
వస్తుంది”-- అంటున్న మనోని
కోప్పడింది
పవిత్ర.
“ఏయ్ మనో...ఏమిట్రా
మాట్లాడుతున్నావు?”
“అక్కా...ఈ
మనిషి
ఎందుకు
ఇక్కడికి
వచ్చాడు?”
“మనో...విశేషం
అంటే
భందువులు
వస్తారు.
నువ్వెందుకు
అవన్నీ
గమనిస్తావు”
“లేదక్కా...వీడేదో
ప్లానుతో
వచ్చాడు...కొత్తగా
బంధుత్వం
కలుపుతున్నాడే...?”
“అది ఎప్పుడూ
అతకదు...ఎవరైనా
మూర్ఖత్వంగా
అతికించ
దలుచుకుంటే...మొహానికి
బురద
పూసుకుని
వెళ్ళాల్సిందే.
పాత
చెత్తను
గుర్తుకు
తెచ్చుకుని
ఎందుకు
బాధ
పడతావు?” రామ్మోహన్
కూ
కలిపే
పవిత్ర
చెప్పటంతో, అతని
మొహం
వాడిపోయింది.
“లేదక్కా…”
“మనో...ఈ
రోజు
నువ్వు
పెళ్ళికొడుకువి.
నీ
కళ్ళూ, మనసు
స్వాతి
పైనే ఉండాలి. అర్ధమైందా...?”
“వ...ది...నా...” -- స్వాతి స్వరం
వణికింది.
“ఏంటమ్మా?”
“ప్రామిస్ గా
మేమెవరం
ఈయన్ని
పిలవలేదు.
మీ
తమ్ముడు
నన్ను
తప్పుగా
అర్ధం
చేసుకుని
కోపగించుకుంటున్నారు” -- కళ్ళు తడవటానికి
రెడీ
అవుతుండగా, స్వాతి
బుగ్గలపై
ముద్దుగా
దెబ్బ
వేసింది.
“నువ్వెందుకమ్మా బాధపడతావు? దీనికంతా
బంధువులు
ఖచ్చితంగా
వస్తారు”
“అక్కా”
“రేయ్...నువ్వు
పెళ్ళి
కొడుకువి.
దేనీకీ
టెన్షన్
పడకూడదు.
చూడు...నీ
వలన
తను
కూడా
భయపడిపోయింది.
మొహం
నవ్వినట్టు
పెట్టుకోరా.
ఊ...అలాగే
ఉండాలి.
నేను
వెళ్ళి, వచ్చిన
వాళ్లకు
మర్యాదలు
చూసుకుంటాను” -- నవ్వుతూ తిరిగి
వెడుతున్న
పవిత్ర
వెనుకే
వెళ్ళాడు
రామ్మోహన్.
“పవిత్రా...?” కోపంగా
వెనక్కి
తిరిగిన
ఆమె
మొహంలో
చిటపట
తెలుస్తోంది.
“ఏమిటి...విడిపోయిన
బంధాన్ని
పునరుద్ధరించాలని
చూస్తున్నావా? అది
కలలో
కూడా
జరగదు.
వూరికే
ఇలా
నా
పేరు
చెప్పుకుంటూ
నా
వెనుకే
తిరిగేవనుకో
నీ
మర్యాద
చెడిపోతుంది”
“లే...దు...”
“చాలా సంవత్సరాల
తరువాత
ఇప్పుడే
మా
ఇంట్లో
ఒక
శుభకార్యం
జరగబోతోంది.
దాన్ని
చెడపాలని
వచ్చారా? మళ్ళీ
మనో
కంట్లో
పడకండి” -- కోపంగా చెప్పి
వెనుతిరిగిన
ఆమెను
చూసి
భయపడిపోయాడు
రామ్మోహన్.
‘బిడ్డతో ప్రేమగా
అతుక్కుపోతుంది.
దాన్ని
సాకుగా
పెట్టుకుని
పవిత్ర
దగ్గరకు
చేరుదాం
అనుకుంటే, ఇంత
కోపగించుకుంటోందే...!
ఈమె
మనసులో
ఇంకా
నా
మీద
విసుగు
ఎక్కువగానే
ఉందనుకుంటా?’
‘ఇక మీదట
ఈమెతో
ఎలా
మాట్లాడేది? బిడ్డను
పెట్టుకుని
ఒంటరిగా
పోరాడలేను.
ఖచ్చితంగా
బిడ్డకు
ఒక
తల్లి
కావాలి.
అది
పవిత్ర
అయితే
చాలా
మంచిది’
‘ఆమె ప్రేమ, అభిమానం, ఓర్పు...
బిడ్డకు
మాత్రమే
కాదు, నాకూ
కావాలి.
ఏం
చేద్దాం? ఎలా
ఈ
విషయాన్ని
-- ఎవరితో మాట్లాడను?’ గందరగోళంతో
నిబడున్న
అతనికి
స్వరాజ్యం
బాధపడుతూ
మాట్లాడుతున్న
మాటలు
అతని
చెవులను
తాకినై.
“ఎన్ని సంవత్సరాలు
విచారంగా
ఉన్నాను? ఈ
మనిషికి
ఇప్పుడు
మనసు
మారింది”
“బాధ పడకు
స్వరాజ్యం... పవిత్ర కూడా
త్వరగా
మనసు
మార్చుకుంటుంది” --- మీనాక్షీ ఆదరణగా
చెప్పగా, చెవులు
రిక్కించాడు
రామ్మోహన్.
“అందులో నాకు
నమ్మకం
లేదు.
నేనూ
ఎంతో
మాట్లాడి
చూసాను”
“పవిత్రకి ఎప్పుడు
'లీవు’?”
“ఆదివారం మాత్రమే”
“అలాగా...సరే.
నేను
వచ్చే
ఆదివారం
మీ
ఇంటికి
వస్తాను”
“వచ్చి”
“పవిత్ర దగ్గర
మాట్లాడతాను.
చెప్పాల్సిన
వారు
చెబితే
రాయి
కూడా
కరుగుతుంది.
నువ్వు
కావాలంటే
చూడు... పవిత్రానే నీ
దగ్గరకు
వచ్చి, ‘అమ్మా...నేను
పెళ్ళి
చేసుకుంటాను’
అని
చెబుతుంది” మీనాక్షీ గర్వంగా
చెప్పటంతో...ఉలిక్కిపడ్డాడు
రామ్మోహన్.
“ఏమిటీ...
పవిత్రకు పెళ్ళా?”
“ఇదంతా జరుగుతుందో
లేదో? నువ్వు
మాట్లాడేది
వింటే
మనసుకు
సంతోషంగా
ఉంది
మీనాక్షీ”
“బాధపడకు స్వరాజ్యం.
మా
బంధువు
ఒకతను
ఉన్నాడు.
పెళ్ళైన
ఆరు
నెలలలోనే
ఒక
యాక్సిడెంట్
లో
అతని
భార్య
చనిపోయింది.
నాలుగు
సంవత్సరాలుగా
వేరే
పెళ్ళి
చేసుకోకుండా
ఉన్నాడు.
అతని
దగ్గర
పవిత్ర
గురించి
చెప్పుంచాను.
‘అమ్మాయికి
ఓకే
అయితే, నాకూ
ఒకేనే’ అన్నాడు.
పవిత్రను
ఓకే
అనిపించటం
నా
బాధ్యత”
“మీనాక్షీ...ఇది
మాత్రం
జరిగితే, నీకు
గుడి
కట్టి
కొలుస్తాను” --- ఆవేశపడుతున్న స్వరాజ్యం
కళ్ళల్లో
నీళ్ళు
రాగా, రామ్మోహన్
చెవులలో
సీసం
పోసినట్లు
ఉన్నది.
‘జరగకూడదు...ఇది జరగకూడదు. జరగ నివ్వను. నా భార్యకు ఇంకొక భర్తా? వదిలిపెట్టను. ఇక టైము వేస్టు చేయకూడదు. వచ్చే వారం దాకా ఎందుకు కాచుకోనుండాలి? ఈ రోజే దీనికి ఒక ముగింపు పెట్టేయాలి’ ----మనసులో గట్టిగా అనుకుని బిడ్డతో సహా వచ్చి స్వరాజ్యం పాదాల మీద పడి కాళ్ళు పట్టుకుని ఏడుపు మొదలుపెట్టాడు.
Continued...PART-11
ఈ సీరియల్ ను పూర్తి నవలగా ఒకేసారి చదవాలనుకుంటే: 'పవిత్ర '...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి