'పవిత్ర'...(సీరియల్) PART-8
మొట్ట మొదటి
సారిగా
కొత్త
ఆఫీసు
లోపలకు
అడుగు
పెడుతున్నప్పుడు
కొంచం
భయంగానే
ఉన్నది
పవిత్రకు!
ఇంతకు
ముందున్న
ఆఫీసుకు
తమ్ముడితో
కలిసి
వెళ్లటం
వలన
భయమో
-- ఆందోళన ఏర్పడలేదు.
మనో యొక్క
సహోదరి
అనే
మర్యాదతో
అందరూ
సులభంగా
స్నేహితులయ్యారు.
కానీ
ఇక్కడ
మనోగానీ
-- తెలిసిన ముఖాలుగానీ
లేరు.
అందులోనూ
ఈ
ఆఫీసులో
పనులు
సరిగ్గా
జరగటం
లేదనే
ఫిర్యాదు
ఉంది.
‘అందరినీ ఎలా
ఫేస్
చెయ్యబోతాం?’ అనే
బిడియంతో
లోపలకు
వెళ్ళిన
పవిత్రను
-- ఆఫీసు మేనేజర్
గణపతి
భవ్యంగా
స్వాగతించారు.
తనని
పరిచయం
చేసుకుని
పవిత్రను
లోపలకు
తీసుకు
వెళ్ళారు.
పెద్ద ఆఫీసే.
మొత్తం
నలభై
ఎనిమిది
మంది
పనిచేస్తున్నట్టు
ఆయన
చెప్పగా, వరసగా
ఆ
కుర్చీలను
చూసిన
ఆమె
నుదురు
చిట్లించింది.
ఇరవైకీ తక్కువగానే
ఉద్యోగస్తులు
వచ్చున్నారు.
అందరూ
గౌరవ
పూర్వకంగా
లేచి
నిలబడి
‘గుడ్
మార్నింగ్’ చెప్పారు.
ఆమె
తిరిగి
'గుడ్
మార్నింగ్' చెప్పి
అందరినీ
కూర్చోమన్నది.
“మేనేజర్”
“మ్యాడం”
“మొత్తంగా స్టాఫ్
ఎంత
మంది?”
“వాచ్ మ్యాన్
తో
కలిపి
మొత్తం
నలభై
తొమ్మిది
మంది
ఉన్నాం
మ్యాడం...” -- ఆయన తడబడడుతూ
చెప్పగా, ఖాలీగా
ఉన్న
కుర్చీలను
ఒకసారి
చూసి
అడిగింది.
“అంటే...మిగిలిన
వాళ్ళందరూ
లీవు
చెప్పేరా?”
“లేదు మ్యాడం...వచ్చేస్తారు”
“ఎప్పుడు”
“వచ్చే సమయమే...”
“ఓహో...ఇప్పుడు
టైమెంత?” -- నిలబడే
పవిత్ర
అడగగానే, భయంతో
గడియారాన్ని
చూశాడు.
“తొమ్మిది గంటల
ఐదు
నిమిషాలు
మ్యాడం...”
“ఆఫీసు ఎన్నింటికి?”
“తొమ్మిదింటికి”
“మీ అందరికీ
కలిపే
చెబుతున్నా.
రేపటి
నుండి
సరిగ్గా
ఎనిమిది
యాభై
ఐదుకు
అందరూ
సీటులో
ఉండాలి”
“ఓ.కే.
మ్యాడం...” కోరస్ గా
చెప్పారు
అందరూ.
“పర్మిషన్ తీసుకోకుండానో
–
‘లీవు’
చెప్పకుండా
ఎవరు
లేటుగా
వచ్చినా, సగం
రోజు
జీతం
‘కట్’. మేనేజర్...ఈ
విషయాన్ని
అందరితోటీ
చెప్పండి...నోటీస్
బోర్డులో
పెట్టండి”
“సరే...మ్యాడం”
“పనికి సంబంధించిన
ఫైల్లను
తిసుకుని
రూముకు
రండి.
నేను
చూడాలి”
“ఎస్ మ్యాడం”
“మీరందరూ మీ
పనులు
చూడండి” -- అని చెప్పిన
పవిత్ర
తన
ఏసీ
గదిలోకి
వెళ్ళింది.
ఉద్యోగస్తులలో సగం
మంది
మొహాలలో
భయం, మిగిలిన
వాళ్ళల్లో
కొత్త
ఉత్సాహం.
అందరూ
పనులు
మొదలుపెట్టారు...పది
గంటల
తరువాత
వచ్చి
చేరాడు
రామ్మోహన్.
ఎప్పటిలాగా నిర్లక్ష్యంగా
టిఫిన్
బాక్స్
ను
తన సీటుపక్కన
పెట్టి, ప్యూన్
ను
పిలిచాడు.
“మూర్తీ...”
“సార్?”
“రిజిస్టర్ తీసుకురా
సంతకం
పెడతాను”
“సారీ సార్...అది
ఎం.డి
మ్యాడం
రూముకు
వెళ్ళిపోయింది”
“ఏమిటీ...ఏం.డీ.
నా?”
“అవును సార్.
కొత్తగా
ఒక
మ్యాడం
వచ్చింది.
తొమ్మిదింటికి
అందరూ
సంతకం
చేసిన
తరువాత
‘రిజిస్టర్’
తన
టేబుల్
కు
వచ్చేయాలి
అని
చెప్పారు.
“అదెవ్వర్రా కొత్త
మ్యాడం? వచ్చిన
రోజే
గొప్పగా
‘రూల్స్’
పెట్టింది?” -- రామ్మోహన్
కడుపు
మంటతో
అడగగా, పక్క
కుర్చీలో
కూర్చున్న
ఒక
పెద్దాయన
కసురుకున్నారు.
“ఉష్...మర్యాదగా
మాట్లాడు”
“ఏం?”
“తొమ్మిదింటికే
ఆ
మ్యాడం
ఆఫీసులోపలకు
వచ్చింది.
అంతలోనే
రెండుసార్లు
‘రౌండ్స్’
కు
వచ్చి
వెళ్ళింది.
“ఎందుకు...?”
“అందరూ పక్కాగా
పని
చేస్తున్నామా
లేదా
అని
గమనించటానికి”
“ఎవరయ్యా అది? వచ్చిన
రోజే
ఇంత
గొప్పలు
పోతోంది?”
“రామ్మోహన్ సార్...మీరు
వచ్చిన
వెంటనే
మిమ్మల్ని
మ్యాడం
రమ్మన్నారు”—‘ప్యూన్’
చెప్పగా...కోపంగా
అడిగాడు.
“నన్నా...ఎందుకు?”
“లేటుగా వచ్చినవారంతా
మ్యాడం
ను
కలిసే
వచ్చారు”
“ఇదేంటయ్యా కొత్తగా
ఉందే?” -- సనుగుతూ
లేచి
ఏం.డి
రూము
వైపు
నడుస్తుంటే, ఎదురుగా
సహ
ఉద్యోగి
నిలబడ్డాడు.
“మోహన్...నువ్వూ
లేటా?”
“మనకు అదేగా
అలవాటు”
“ఇకమీదట లేటుగా
వస్తే
జీతం
‘కట్’ అంట”
“ఏమిటీ?”
“ఈ మ్యాడం
చాలా
స్ట్రిక్టుగా
మాట్లాడుతోంది.
బోలెడు
రూల్స్
వేసింది”
“మన దగ్గరేనా? వదులు...చూసుకుందాం” -- నిర్లక్ష్యంగా చెప్పేసి
తలుపు
దగ్గరకు
వచ్చి, మెల్లగా
తలుపు
మీద
కొట్టాడు.
“ఎస్...కమిన్” -- కొంచం కోపంగానే
ఉంది
స్వరం.
గాజు గ్లాసు
తలుపులను
తెరుచుకుని
లోపలకి
వెళ్లాడు.
టేబుల్ మీదున్న
ఫైల్స్
లో
ఉన్న
సందేహాలను
బ్రాంచీ
మేనేజర్
ను
అడిగి
తెలుసుకుంటున్న
పవిత్ర
తలెత్తి
చూడానే
లేదు.
చిన్నగా
గొంతు
సవరించుకున్నాడు.
“గుడ్ మార్నింగ్
మ్యాడం...”
“గుడ్ మార్నింగ్” -- అంటూ తలెత్తి
చూసిన
ఆమె
కళ్ళు
విరుచుకున్నై.
రామ్మోహన్ కేమో
కాళ్ళ
క్రింద
భూమి
జారుతున్నట్టు
అనిపించింది.
‘ఈమెనా!?...ఈమె
ఎలా
ఇక్కడ? ఇది
నాకు
పై
అధికారా? ఏడో
క్లాసో
-- ఎనిమిదో క్లాసో
చదువుకున్న
ఇది
ఎలా
ఇంత
పెద్ద
పదవికి
వచ్చింది?’
కడుపుమంట, ఈర్ష్యతో
ఆ
టేబుల్
మీదున్న
వాటిని
పరీక్షగా
చూసాడు.
‘పవిత్ర గోపాలకృష్ణ
అనే పేరుకు పక్కన
పొడుగుగా
ఆమె
పూర్తిచేసిన
డిగ్రీలు
వరుసగా
రాయబడున్నాయి.
నమ్మలేక
తలెత్తి
ఆమెను
చూసాడు.
పక్కకు దువ్వుకున్న
జట్టు, నుదిటిపైన
పెద్ద
కుంకుమ
బొట్టు, ఎప్పుడూ
తలెత్తి
చూడని
పవిత్రను, ఎప్పుడూ
చూసే
అలవాటున్న
అతనికి, ఇప్పుడు
ఆమె
ఉన్న
అలంకరణలో
చూసి
ఆశ్చర్యపోయాడు.
పట్టులాగా మెరిసిపోతున్న
జుట్టును
విరబోసుకుని
ముడివేసుకోనుంది.
విల్లులాగా
వంగున్న
కురుల
మధ్యలో
చిన్న
బ్లాక్
కలర్
స్టిక్కర్
బొట్టు.
గొంతులో
వేలాడుతున్న
సన్నని
బంగారు
గొలుసు.
చెవులకు
అందమైన
పోగులు.
కళ్లను గుచ్చుకోని
అద్భుతమైన
రంగులో
కాస్టిలీ
చీర, దాన్ని
అందంగా
కట్టుకున్న
విధం
అంటూ
అన్నీ
మారిపోయున్నాయి.
కాలేజీ స్టూడెంటులాగా
కనబడుతున్న
ఆమెను
ఆశ్చర్యంతనూ
-- గందరగోళంతోనూ కళ్లార్పకుండా
చూస్తుంటే, పవిత్ర
మొహంలో
ఎటువంటి
మార్పు
లేదు.
“మిస్టర్ రామ్మోహన్”
“ప... వి... త్రా...ను...వ్వా?” పరిస్థితి
అర్ధం
చేసుకోకుండా
అతను
పిలవగా, బ్రాంచ్
మేనేజర్
గణపతి
భయపడి
పోయాడు.
“ఏయ్...మ్యాడం
ను
పేరు
పెట్టి
పిలుస్తున్నావు!
నీ
నోటికి
మర్యాదే
రాదా?”
“సా...సారీ...మ్యాడం...”
“మిస్టర్...రామ్మోహన్...ఇప్పుడు
టైమెంత?”
“పదిన్నర” -- తనని కొంచం
కూడా
గుర్తు
పట్టినట్టు
చూపించుకోకుండా, ఎంత
పొగరుగా
తన
పేరు
చెప్పి
పిలుస్తోంది? అనే
కచ్చెతో
పళ్ళు
కొరుక్కుంటూ
అతను
సమాధానం
చెప్పగా... పవిత్ర వాయిస్
పెరిగింది.
“ఇదేనా ఆఫీసుకు
వచ్చే
లక్షణం?”
“సారీ...’లేట్’ అయ్యింది”
“ఇక మీదట
‘లేట్’ అయితే
లీవు
అవుతుంది”
“.................”
“సరిగ్గా తొమ్మిదింటికి
ఆఫీసులో
ఉండాలి.
మటి
మాటికీ
ఆలశ్యంగా
వస్తే
‘జీతం’ కట్
అవుతుంది”
“మ్యాడం...మీరేమిటి...?”
“పని సరిగ్గా
జరగాలి.
ఆలశ్యంగా
రావటం
-- పని టైములో
మిగిలిన
వారితో
మాట్లాడటం
నాకు
నచ్చదు.
మీరు
వెళ్ళొచ్చు”
“ఎస్. మ్యాడం...” -- కోపంగా చెప్పేసి
వెనక్కి
తిరిగిన
అతన్ని
‘హలో’ అంటూ
ఆపింది
పవిత్ర.
“ఒక్క నిమిషం”
“ఏమిటి మ్యాడం?”
“అవునూ...ఇదేమిటి? నెలకి
సగం
రోజులకు
పైగా
లీవు
తీసుకోనున్నారు?”
“అ...ది.
పర్సనల్”
“అందుకని...ఇలా
లీవు
పెడితే
పనెలా
జరుగుతుంది? మీ
టేబుల్
మీదున్న
ఫైల్స్
అన్నీ
కొన్ని
నెలలుగా
జరగకుండా
ఉండిపోయాయి
-- వాటిని ఎప్పుడు
‘క్లియర్’
చెయ్యబోతారు?” -- పవిత్ర
అడిగిన
ప్రశ్నకు
సమాధానం
చెప్పలేక
బిగుసుకుపోయి
నిలబడ్డాడు
రామ్మోహన్.
మేనేజర్ గణపతి
మాట్లాడాడు.
“ఇంట్లో
పసి
బిడ్డను
పెట్టుకుని
ఒంటరిగా
కష్టపడుతున్నారు...అందుకే”
పవిత్ర మొహం
మారింది.
“ఏం...ఆయనింట్లో
వాళ్ళావిడ
లేదా?”
“లేదు”
“ఏం...ఆవిడ్నీ
పంపించేసారా?” -- వెక్కిరిస్తున్నట్టు
మాట్లాడిన
పవిత్రను
చటుక్కున
తలెత్తి
చూశాడు
రామ్మోహన్.
“లేదు మ్యాడం...ఆ
అమ్మాయి
కూడా
ఇక్కడే
మన
ఆఫీసులోనే
పని
చేస్తూ
ఉండేది.
ఆరు
నెలలకు
ముందు
మన ఆఫీసులోని మాజీ గుమాస్తాను
పెళ్ళి
చేసుకుని....” గణపతి చిన్న
స్వరంతో
చెబుతుండగా...అతను
కోపంగా
అరిచాడు.
“మేనేజర్ సార్...నా
పర్సనల్
మ్యాటర్
గురించి
ఎవరూ
మాట్లాడొద్దు”
“మిస్టర్. రామ్మోహన్...నాకు
ఎవరి
సొంత
విషయాలూ
తెలుసుకోవలసిన
ఆశ
లేదు.
అవసరమూ
లేదు.
నాకు
ఆఫీసు
పనులు
జరిగితే
చాలు.
ఇక
మీదట
ఎటువంటి
సాకుబోకులూ
చెబుతూ
అనవసరంగా
'లీవు’
పెట్టకూడదు.
ఇక
ఇప్పుడు
కూడా
పనిజరగకపోతే
...ఆ చోట
వేరే
మనిషిని
పెట్టుకోవలసి
వస్తుంది” -- అన్న ఏం.డి
పవిత్రని
విసుగ్గా
చూసి
కోపంగా
వెళ్ళిపోయాడు
రామ్మోహన్.
“తప్పుగా తీసుకోకండి
మ్యాడం.
ఈయన
ఎప్పుడూ
అంతే, ఎవరినీ
గౌరవించడు”
“చూస్తేనే తెలుస్తోంది”
“ఇలాంటి మనిషితో
ఏ
అమ్మాయి
కాపురం
చేస్తుంది? అందుకే
ఆమె
దారి
ఆమె
వెతుక్కుని
వెళ్ళిపోయింది.
ఆ
అమ్మాయి
చాల
ధైర్యవంతురాలు
-- తెలివిగలది. ఇతని
వలన
పుట్టిన
బిడ్డను
కూడా
ఇతని
దగ్గరే
వదిలేసి
వెళ్ళిపోయింది...”
“మేనేజర్...మనకెందుకు ఇతరుల ఇంటి సమస్యలు? మనం మన పని చూసుకుందాం” -- అంటూ తన పనిలో శ్రద్ద పెట్టినా పవిత్ర మనసు, మొహం తెలియని ఆ పసిపాప కోసం పరితపించింది.
Continued...PART-9
*****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి