18, నవంబర్ 2021, గురువారం

నిద్రలేని రాత్రులు...(సీరియల్)...PART-10

 

                                                                               నిద్రలేని రాత్రులు...(సీరియల్)                                                                                                                                                              PART-10

సాయంత్రం ఆఫీసు నుండి అనిల్ ఇంటికి వచ్చినప్పుడు...వస్తువులన్నీ అందంగా సర్దేసి ఉన్నాయి.

మీకెందుకండి అనవసరమైన శ్రమ?”--అని సౌందర్య దగ్గర అడిగాడు.

ఇందులో నాకేమిటి శ్రమ? ఇంట్లో ఖాలీగానే కదా ఉన్నాను? నాకోసం మీరు ఎంత శ్రమ పడుతున్నారు? మీ కొసం నేను ఇది కూడా చెయ్యకూడదా?” అన్నది.

ఆమె ఎలా ఉండాలనుకుంటే అలా ఉండనీ అని అనిల్ వదిలేశాడు.

అప్పుడు వరున్ కూడా తన గదిని ఖాలీ చేసి వస్తువులతో వచ్చాడు. కాళ్ళూ, చేతులూ, మొహం కడుక్కుని వచ్చినప్పుడు సౌందర్య అతని వస్తువులను కూడా సర్దటం మొదలు పెట్టింది. అతను కూడా ఆమెతో పాటూ   పనిలో కలిశాడు.

అనిల్ దూరంగా ఉన్నప్పుడు సౌందర్య మెల్లగా వరున్ తో అన్నయ్యా, మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి అన్నది.

చెప్పు సౌందర్య

మీరెందుకు కవిత ను కలిసి - జరిగిందంతా చెప్పి ఆమెను సమాధాన పరచకూడదు?”

నేనూ అదేనమ్మా ఆలొచిస్తున్నాను. వచ్చే ఆదివారం నాకు సెలవు. కవిత కూడా హాస్టల్లోనే ఉంటుంది. వెళ్ళి చూసి మాట్లాడాలనే అనుకుంటున్నాను

సౌందర్య కి అప్పుడు కొంచం రిలాక్స్ నెస్ వచ్చింది. తనకు ఇంత మంచి చేసే అనిల్ కు, కవిత కూ మధ్య ఏర్పడిన బేధాభిప్రాయాలు త్వరగా ముగింపుకు రావాలి అని మనసారా కోరుకుంది. 

రాత్రి డిన్నర్ తరువాత ముగ్గురూ కూర్చుని మాట్లాడారు.

సౌందర్యా, మీరు మీ తల్లి-తండ్రుల దగ్గరకు వెళ్ళటమే మంచిదని అనుకుంటున్నాను అన్నాడు అనిల్.

మీరేం చెప్పిన చేయటం నా బాధ్యత. కానీ, కన్నవారి దగ్గరకు మాత్రం వెళ్ళమని చెప్పకండి. దానికంటే బిడ్డతో సహా ట్యాంక్ బండ్ లోకి దూకి చచ్చిపోతాను అన్నది ఖచ్చితంగా.

మీ ఇంటికి వెళ్ళటానికి మీకెందుకు అంత సంకోచం?”---కన్ ఫ్యూజ్డ్ గా అడిగాడు వరున్.

సంకోచం ఏమీ లేదు. ఇది వాళ్ళ మీద ప్రేమతో తీసుకున్న నిర్ణయం

ప్రేమతోనా? అర్ధం కాలేదే!

మా నాన్న పంచాయతీ ప్రెశిడెంటు. ఊర్లో ఉన్నవాళ్ళందరి సమస్యలకు తీర్పు చెబుతారు.  ఆయన మాటలకు ఎవరూ ఎదురు చెప్పరు. వాళ్లను నిర్లక్ష్య పరిచి, అవమాన పరిచి...ఊర్లో తలవంచుకునేలా చేశాను. నా తండ్రీ-తల్లీ ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా తెలియదు. రెండు సంవత్సరాలలో కొంచం నన్ను మర్చిపోయి ఉండవచ్చు. నేను తిరిగి వెళ్ళి వాళ్ళ బాధను మళ్ళీ ఓపెన్ చెయ్యటానికి నాకు ఇష్టం లేదు.

నాకు జరిగిన అన్యాయం నాన్నకు తెలిస్తే, మా ఊర్లో జాతి గొడవలు మొదలవుతుంది. అనవసరంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. ఊరే ప్రశాంతత కోల్పోతుంది. అలాంటి ఒక పరిస్థితి నా వల్ల నా గ్రామంలో తలెత్త కూడదు -- కళ్ల నీళ్ళు పొంగుతూ చెప్పింది.

ఇలాంటి ఒక మంచి అమ్మాయికా పరిస్థితి?’ అని బాధపడ్డారు ఇద్దరు స్నేహితులూ.

తరువాత వరున్ చెప్పాడు, “మీ బాధ మాకు అర్ధమవుతోంది. ఇక మీదట మిమ్మల్ని మీ కన్నవారి దగ్గరకు వెళ్ళమని బలవంతం చెయ్యం. అందువల్ల తొందరపడి, మూసీ  నదికో, ట్యాంక్ బండ్ కో లేక రైల్వే స్టేషన్ కో వెళ్ళిపోకండి అని చెప్పి నవ్వాడు వరున్.

అనిల్ అతనితో కలిసి నవ్వాడు. ఇన్ని రోజులు ఇంట్లో వదిలిపెట్ట బడ్డ నవ్వులు రోజు వాళ్ళను మళ్ళీ పులకింపచేసింది.

అప్పుడు అనిల్ తండ్రి ఫోన్ చేసాడు. జాగ్రత్తగా ఇళ్ళు చేరుకున్నట్టు చెప్పాడు.  అంతకంటే ముఖ్యంగా అనిల్ కు, గౌరికి ఎప్పుడు పెళ్ళి పెట్టుకుందామని అడిగాడు.

నాన్నా, కంపెనీలో నన్ను అమెరికా వెళ్ళమంటున్నారు. దానికి నేను .కే. చెప్పాను. అక్కడ పది నెలలు ఉంటాను. వీసాకు ధరాఖాస్తు చేశారు. రెండు నెలలో బయలుదేరాలి...అందువల్ల నా పెళ్ళి ఇంకో సంవత్సరం తరువాతే జరుగుతుంది -- ఖచ్చితంగా చెప్పాడు.

కొడుకు విదేశాలకు వెళ్తున్నాడనే సంతోషం, వాడి పెళ్ళి వాయిదా పడిందే నన్న బాధ ఒకటిగా అనుభవించి మాటలు ముగించాడు అనిల్ తండ్రి. వాళ్ళ మాటలను మౌనంగా వింటున్న వరున్, సౌందర్య అతనికి కంగ్రాట్స్ చెప్పారు.

నువ్వు ఆఫీసు నుండి వచ్చి నాలుగు గంటలయ్యింది. ఇప్పటివరకు నీ అమెరికా విషయం మాతో చెప్పనేలేదు?” అన్నాడు వరున్.

లేదురా, ఆఫీసు నుండి వచ్చిన వెంటనే చెబుదామనుకున్నా. సౌందర్య మాత్రమే  ఉంది. సరే నువ్వు వచ్చిన తరువాత ఇద్దరికీ చెప్పొచ్చు అనుకున్నా. ఇద్దరూ పనులలూ ఉండిపోయారు. డిన్నర్ ముగించుకున్న తరువాత చెబుదామనుకున్నా, ఇంకేవో విషయాలు మాట్లాడాము. లోపు నాన్న ఫోను. నా పెళ్ళి విషయం ఎత్తారు కాబట్టి అప్పుడు బయటపెట్టానుఅన్నాడు అనిల్.

అది సరే పదినెలలు ఉండాలనేది కూడా నిశ్చయం చేశారా?”

అవునురా...తిరిగి రావటానికి కూడా రిటర్న్ టికెట్టు కొంటున్నారు  

పది నెలలు అనిల్ ను విడిచి ఉండాలే నన్న బాధ వరున్ కు ఏర్పడింది. సౌందర్య కి కూడా అలాంటి భావన ఏర్పడింది. కానీ దాన్నివాళ్ళిద్దరూ శ్రమతో కనబడకుండా దాచి పెట్టారు.

అమెరికా గురించి, అక్కడ ఎక్కడ స్టే చెయ్యబడతాడు అనేలాంటి పలు విషయాలు ముగ్గురూ కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు.

మధ్యలో సౌందర్య అడిగింది....“ఇంకా ఎన్ని రోజులకు మనం హోటల్ నుండి తెప్పించుకుని తింటాము? అతి ముఖ్యమైన వంట పాత్రలు, వంట సామాన్లు రాసిస్తాను, కొనుకొచ్చి ఇస్తే నేనే వంట చేస్తాను

ఏమిటీ...ఇక్కడే గుడారం వేసుకుందామని ఆలొచిస్తున్నావా?”--గలగలమని నవ్వుతూ అడిగాడు వరున్.

అది విని అనిల్, సౌందర్య కూడా నవ్వారు.

నేను వెళ్ళిన తరువాత మీరే వంటచేసుకోవచ్చు. తరువాత అది కవిత కు ఉపయోగపడుతుందే!--అంటూ అనిల్ ను చూసి చెప్పింది. దానికి అతను సమాధానమూ చెప్పలేదు.

ఆమె గబగబా లిస్టురాసి ఇచ్చింది. త్వరగానే కొనుకొచ్చి ఇచ్చారు స్నేహితులు.

మరుసటి రోజు వంటకు కావలసినవి ముందే ఏర్పాట్లు చెయ్యటం మొదలుపెట్టింది.

స్నేహితులిద్దరూ బెడ్ రూముకు వెళ్ళి పడుకున్నారు.

రోజు సమస్యలను కొంచంగా మర్చిపోయి అమెరికా గురించి ఆలొచించటం మొదలుపెట్టాడు అనిల్.

అతను అమెరికా వెళ్ళిన తరువాత తాను ఏం చేయాలి అని ఆలోచించాడు వరున్.

అవసరమైన పనులను ముగించుకుని, పక్క గదికి వెళ్ళి బిడ్డతో కలిసి పడుకుంది సౌందర్య. ఆమె ఆలొచన...ఆదివారం ఎప్పుడు వస్తుంది? కవిత, వరున్ తో మాట్లాడుతుందా? వాళ్ళ మాటల ముగింపు ఎలా ఉంటుందిఅని పరుగులు తీసింది.

మొత్తానికి, రోజు కూడా వాళ్లకు నిద్రలేని రాత్రిగానే అమరింది.

                                                                                                                      Continued....PART-11

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి