26, నవంబర్ 2021, శుక్రవారం

నిద్రలేని రాత్రులు...(సీరియల్)...PART-14

 

                                                                          నిద్రలేని రాత్రులు...(సీరియల్)                                                                                                                                                               PART-14

అనిల్ ను ఎక్కించుకుని వెడుతున్న విమానం, అతన్ని ఎప్పుడు తీసుకు వచ్చి దిగుతుంది?’ అని అప్పుడే ఎదురు చూడటం మొదలు పెట్టింది.

ఇంటికి వచ్చినప్పుడు అందరి దగ్గరా హడావిడి అంటుకుంది. సౌందర్య మనసులో నిరంతరంగా తుఫాన వీస్తోంది.

తన ఆశ న్యాయమైనదా?’ అని ఆలొచించింది.

ఆమె మనశ్శాక్షి అది తప్పుఅని నిరంతరం చెబుతూనే ఉంది.

మోహన్ ను ప్రేమించావు. ఇప్పుడు అనిల్ ను ప్రేమిస్తున్నావు నీ ప్రేమ అనుకున్న వెంటనే మనిషిని మార్చుకో గలిగినదా?’ అని ఎగతాలి చేసింది ఆమె తెలివి.

అది తెలియని వయసులో, అర్ధం కాని పరిస్థితుల్లో వ్యామోహానికి లొంగిపోయి తీసుకున్న నిర్ణయం. కానీ, అనిల్ ను ప్రేమించే పక్వం తనకు తెలియకనే ఏర్పడున్నది. అతను నా మనసంతా నిండిపోయున్నాడు. ఇది వ్యామోహంతో వచ్చింది కాదు, ఇదే నిజమైన ప్రేమఅన్నది మనసు.

మీ ఇద్దరి కుటుంబాలూ ఇప్పుడే దగ్గరయ్యాయి. అనిల్ తల్లి-తండ్రులు నీతో సహజంగా మాట్లాడుతున్నారు. పరిస్థితుల్లో నీ ఇష్టాన్ని చెబితే ఇద్దరి కుటుంబాలకు మధ్య పగ ఏర్పడదా?’ తెలివి అడిగింది.

నా ఇష్టాన్ని మొదట ఆయన దగ్గరే చెబుతాను. ఆయన ఒప్పుకునే పక్షంలో నా తల్లి-తండ్రులు కూడా ఒప్పుకుంటారు. తరువాత అతని తల్లి-తండ్రుల ఒప్పుదల కూడా  బ్రతిమిలాడి పొందొచ్చు’......అనే ఆలొచనను తెలిపింది మనసు.

తెలివి, మనసు పెద్ద పోరాటమే చేసినై.

అనిల్ పెద్ద చదువు చదువుకున్నాడు. చేతి నిండా సంపాదన. అతనికీ, ఇంటర్ ముగించిన నీకూ ఎలా కలుస్తుంది?’

గౌరి కూడ ఇంటరే కదా చదువుకుంది? నా తండ్రి ఆస్తంతా నాకే కదా? ఆయనకు గౌరి కంటే నేనే కదా సరైన జత

గౌరి తో అనిల్ పెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నారు అతని తల్లి-తండ్రులు. వాళ్ళు ఎలా నీ ప్రేమను అంగీకరిస్తారు?’

కష్టమే! కానీ, కొడుకు అడుగుతున్నప్పుడు కన్నవాళ్ళు కుదరదని చెప్పరనే నమ్మకం ఉంది. అదే సమయం గౌరి, ఆయన ప్రేమించే అమ్మాయి కాదు. కన్నవాళ్ళు తమ కొడుకు కోసం సెలెక్ట్ చేసిన అమ్మాయి. అతని మేనమామ కూతురు. ఆయన కూడా ఆమెనే పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంటే నేనే ముందుండి వాళ్ల పెళ్ళి జరిపిస్తాను. తరువాత ఎవరికీ కష్టమూ ఇవ్వకుండా తప్పుకుంటాను

వరున్, అనిల్ యొక్క ప్రాణ స్నేహితుడు. అతను నీ ఆశకు అడ్డు వస్తే?’

ఆయనకు వరున్ ప్రాణమే. కానీ, నాకు తోడబుట్టని సహోదరుడు. మా పెళ్ళి అతనికి రెండింతల సంతోషం ఏర్పరుస్తుంది. ఎటువంటి ఆటంకమూ కలిగించడు

నీ ప్రేమను అనిల్ అంగీకరించకపోతే?’ 

నాకూ భయం ఎక్కువగానే ఉన్నది. నా ప్రేమను అంగీకరించటానికో, నిరాకరించటానికో అతనికి పూర్తి హక్కు ఉంది. అతను నిర్ణయం తీసుకున్న నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను

నీకు సహాయ పడటంలో అనిల్ చాలా కష్టాలు ఎదుర్కొని, ఇప్పుడే కొంత ప్రశాంతత పొందుతున్నాడు. అతనికి తిరిగి మనో కష్టం ఇవ్వబోతావా?’

లేనే లేదు. ఇందులో అతనికి ఇష్టం లేకపోతే...అది నన్నో, లేక మిగిలిన వారినో విధంగానూ కష్టపెట్ట నివ్వకుండా జాగ్రత్తగా నడుచు కుంటాను

అనిల్ నిన్ను అంగీకరించకపోతే, తరువాత నీ పరిస్థితి ఏమిటనేది ఆలొచించి చూశావా?’

అలాంటి పరిస్థితి ఒకటొస్తే...జీవితాంతం ఇలగే ఉండిపోతా. కన్న వారు, స్వప్నా - వీళ్ళే నాలోకం అని జీవిస్తాను

పోరాటం చివరలో తెలివిని పక్కకు నెట్టింది మనసు.

అనిల్ పైన ఏర్పడ్డ ప్రేమ వలన, అతని తల్లి-తండ్రుల పైన ఎక్కువ శ్రద్ద, మమకారము చూపించటం మొదలుపెట్టింది సౌందర్య. మాటల మధ్యలో ఒకసారి అతని తండ్రిని మామయ్యాఅని పిలిచి చూసింది.

ఆయన దాన్ని తప్పుగా తీసుకోకపోవటంతో, అప్పట్నుంచి వాళ్లను మామయ్యా’ –‘అత్తయ్యాఅనే పిలవటం మొదలుపెట్టింది. వాళ్ళకు కావలసినవి చూసి చూసి చేసింది.

గత రెండు రోజులుగా ఆమెలో ఏర్పడిన మార్పులను కూడా ఎవరూ అర్ధం చేసుకోలేదు. అనుమానించనూ లేదు. ఆమె చేసేవన్నీ అనిల్ పై ఉన్న మర్యాదతోనే చేస్తోందని అనుకున్నారు.

నిజానికి ఆమె కూడా నిన్నటి వరకు అలాగే అనుకునేది. కానీ, అనుకోకుండా ఏర్పడిన ఎడబాటు, అతని మీద తనకున్నది మర్యాద కాదు...అపరిమితమైన ప్రేమ అని గ్రహించింది.

అప్పట్నుంచి అనిల్ ను తన భర్తగా అనుకునే ప్రవర్తించటం మొదలుపెట్టింది.

నువ్వు చేసేది తప్పుఅని అప్పుడప్పుడు మనస్సాక్షి ఎత్తి చూపుతున్నా దాన్ని అణిచివేసింది.

ఇంతవరకు విధిని నమ్మిన ఆమె, ఇప్పుడు దేవుడ్ని మళ్ళీ మనసు కరిగేలాగా ప్రార్ధించడం మొదలుపెట్టింది. అనిల్ దన్నం పెట్టుకునే దేవుళ్లందరినీ తనకు కూడా ఇష్ట దేవతలుగా చేసుకుంది.

మరుసటి రోజు అనిల్ కాలిఫోర్నియా వెళ్ళి చేరిపోయాడని వరున్ చెప్పి నప్పుడు ఆమె ఎక్కువ ప్రశాంతత చెందింది.

తరువాత అనిల్ తల్లి-తండ్రులు తమ ఊరికి తిరిగి వెళ్ళారు. వాళ్ళను అత్యంత మర్యాదతో సాగనంపింది. వాళ్ళు తనని వాళ్ళ కోడలుగా ఒప్పుకోవాలే అనే తపన ఆమె దగ్గర కనబడింది.

రాత్రి-పగలు ఆమెకు అనిల్ గురించిన ఆలొచనలే మెదులుతున్నాయి.

రెస్టు దొరికినప్పుడల్లా ఒంటరిగా కూర్చుని మౌలాలి రైలు స్టేషన్ లో జరిగిన సంఘటన మొదలు, అతను విమానం ఎక్కి వెళ్ళేంతవరకు జరిగిన ఆనంద సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవాలని ఆశపడింది.

సౌందర్య తల్లి ఇది గమనించింది. కానీ, తన ఒంటరి తనాన్ని తలచుకునే అలా ఉన్నదేమో నన్న తప్పు లెక్క వేసింది.

సౌందర్య యొక్క ఆలొచనలలో అనిల్ ఉండటాన్ని ఎవరూ అర్ధం చేసుకోలేదు. సౌందర్య కు మరో పెళ్ళి చేయటానికి వరుడ్ని చూడమని సౌందర్య తల్లి, తన భర్తను పురమాయిస్తూనే ఉన్నది. 

ఒకరోజు డిన్నర్ తరువాత అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

ఒక మంచి వరుడ్ని చూసి నీకు పెళ్ళి చేయదలుచుకున్నాం...నువ్వేమ్మా చెబుతావు?” అడిగాడు తండ్రి.

అదిరిపడ్డది సౌందర్య.

నాన్నా ఎందుకు హఠాత్తుగా నా పెళ్ళికి అంత అవసరం?”

కానీ, తన పెళ్ళిమాట తండ్రే ప్రారంభించారు కాబట్టి ఆమెకు ప్రశాంతత అనిపించింది. తన అంగీకారాన్ని ఎలా తెలపాలో తెలియక గింజుకుంది.

నీకు ఇరవై ఏళ్ళే అవుతోంది. ఇంతలోనే చేతిలో ఒక బిడ్డతో ఒంటరిగా నిలబడ్డావు. నీ గురించిన బాధ మాకుండదా?” అన్నది తల్లి.

మీ ఆదరణే నాకు చాలమ్మా

మా ఆదరణ నీకు ఎన్ని రోజులు ఉంటుందమ్మా? మాకూ వయసవుతోంది. మా తరువాత నీకు ఒక తోడు కావద్దా?” అన్నాడు తండ్రి.

అంతవరకు వాళ్ళ సంభాషణలో తాను తల దూర్చ కూడదనే మౌనంగా ఉన్న వరున్ మీ పెళ్ళి గురించి మీరు ఏమనుకుంటున్నారు? అది చెప్పండి మొదట అన్నాడు.

తనని మనసు విప్పి మాట్లాడేటట్టు చేసిన తల్లి-తండ్రులకూ, వరున్ కూ మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. ఒక సారి చేసిన తప్పుకోసం పెళ్లే వద్దని చెప్పటంలేదు. నన్ను పూర్తిగా అర్ధం చేసుకుని, తరువాత నన్ను ఏలుకునే వాడే రావాలి. ముఖ్యంగా స్వప్నను తన కూతురుగా అతను అంగీకరించాలి. అలాంటి ఒకతను దొరికితే ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటాను

అనిల్ కు స్వప్నా పైన ప్రేమ ఎక్కువ. కాబట్టి ఇద్దర్నీ అతను ఏలుకుంటాడనే నమ్మకం ఆమెకు! కానీ, దానిని బహిరంగంగా బయటకు చెప్పలేకపోయింది.

ఇలా ఒకడ్ని ఎక్కడ -- ఎలా వెతికేది?’ అనే అయోమయంలో ఉండిపోయారు సౌందర్య తల్లి-తండ్రులు, వరున్.

ఆమె అనిల్ ను మనసులో ఉంచుకునే మాట్లాడుతున్నదని వాళ్ళు ఇంకా గ్రహించలేదు.

                                                                                                                   Continued...PART-15

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి