29, నవంబర్ 2021, సోమవారం

నిద్రలేని రాత్రులు...(సీరియల్)...PART-15

 

                                                                         నిద్రలేని రాత్రులు...(సీరియల్)                                                                                                                                                                PART-15

శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో దిగాడు అనిల్.

హైదరాబాద్ కంటే పలురెట్లు ఎక్కువాగా ఉన్న ఆకాశహర్మ్యంలు, నిటారుగా, వెడల్పుగా, పటిష్టంగా, శుభ్రంగా ఉండే రోడ్లు. ప్రశాంతంగా, గట్టిగా మాట్లాడని ప్రజలు...హడావిడి లేని వాళ్ళ జీవితం.

ఎందులోనూ చట్టాలనూ, కట్టుబాట్లనూ అమలుపరిచే గుణం. కరెంటు కొత లేదు. ట్రాఫిక్ జాం లేదు. రైళ్ళల్లోనూ, బస్సుల్లోనూ పొంగిపొర్లే జనం లేరు.

సినిమా హీరోల పోస్టర్లు లేవు. ముఖ్యంగా నగరమంతా వాసన-దోమలను పోషించే మురికి కాలువలు లేవు.

ఇంకా ఎన్నెన్నో లేవు... లేవు.

హైదరబాద్ నగరానికి పూర్తి విరుద్దంగా ఉన్న నగరం. హైదరబాద్ కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది? అని కొంత విచారపడ్డాడు.

వరున్ తో మాట్లాడి తాను కులాసాగా వచ్చి చేరినట్టు అందరికీ తెలియపరిచాడు. మరుసటి రోజే పనిలో జేరి తనని పూర్తిగా అందులో అంకితం చేసుకున్నాడు. పనులను హుషారుగానూ, తొందరగానూ చేసి ముగించి పై అధికారుల మన్ననలు పొందాడు.

రోజులు వేగంగా గడిచినై. అతను అక్కడకొచ్చి నెల రోజులైయ్యింది.

ఒకరోజు అతని పై అధికారి అయిన సోఫి అనబడే సోఫియా గదికి వెళ్ళి, రోజు పనికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాడు. మాట్లాడి ముగించి లేచినప్పుడు అమె అడిగింది, “మిస్టర్ అనిల్ మిమ్మల్ని పర్సనల్ గా ఒకటి  అడగవచ్చా?”

అడగండి అని చెబుతూ మళ్ళీ కూర్చున్నాడు.

ఇండియా నుండి వచ్చే వాళ్ళందరూ మనసు విప్పి మాట్లాడే వారుగానూ, గలగలమని కలుపుగోలుగా ఉండేవాళ్ళను చూశాను. మీరు మాత్రం అలా లేరే? పని తప్ప ఇంక దేంట్లోనూ మీరు కలవరే...ఎందుకు?”

అదొచ్చి...

సారీ మీ పర్సనల్ విషయంలో నేను కలుగజేసుకుంటున్నానూ అనుకుంటే సమాధానం చెప్పక్కర్లేదు.

మీ ప్రశ్నలో న్యాయం ఉంది. నన్ను నేనే ఇప్పుడే తెలుసుకుంటున్నాను. మీరడిగింది నేను స్వాగతిస్తున్నాను

అనిల్, సోఫి స్నేహం అలా మొదలయ్యింది.

అనిల్ కంటే ఆమెకు పది సంవత్సరాలు ఎక్కువ వయసు ఉంటుంది. చాలా చలాకీగా, హాస్యంగా మాట్లాడే అలవాటు గలది. అవతలి వారికి తానుగా ముందుకు వచ్చి సహాయం చేస్తుంది.

ఉత్సాహం ఆమెను తనకు తెలుసున్న వాళ్ళ దగ్గరకూ వచ్చి అతుక్కునేటట్టు చేస్తుంది. అందువలనే అనిల్ యొక్క మౌనం ఆమె అర్ధం చేసుకోలేకపోయింది.

రోజు నుండి సోఫి తో మనసు విప్పి మాట్లాడటం మొదలు పెట్టాడు అనిల్.

తన గురించి, తన జీవితాన్ని తలకిందలు చేసిన మౌలాలి రైల్వే స్టేషన్ సంఘటనను, తరువాత ఏర్పడిన  మార్పులనూ వివరించాడు.

రైలు క్రింద పడి చనిపోవాలనుకున్న అమ్మాయిని తన ప్రాణాన్ని అడ్డుపెట్టి కాపాడిన నిజమైన హీరోముందు కూర్చున్నాము, అనే ఆశ్చర్యంతో అతన్ని చూసింది సోఫి. మనసారా అభినందించింది. ఇంత చిన్న వయసులో ఎన్నో సాహసాలు చేసినా, చాలా సింపుల్ గా నడుచుకుంటున్నాడే  నని ఆలొచించి ఆశ్చర్యపోయింది.

సౌందర్య, స్వప్నా, కవిత, వరున్, గౌరి, తన తల్లి-తండ్రులు, సౌందర్య తల్లి-తండ్రులు అంటూ అందరి గురించి సంధర్భం దొరికినప్పుడల్లా వివరాలు చెప్పాడు. అప్పుడు తన మనో భారం తగ్గటం గ్రహించాడు అనిల్.

అతను విషయాలను చెప్ప చెప్ప మిస్టర్. అనిల్, యు వార్ గ్రేట్...యు వార్ రియల్లీ గ్రేట్... అప్రిషియేట్ యు... అడ్మైర్ యు అంటూ మనసార అభినందించేది. 

తరువాత అతన్ని చూసినప్పుడల్లా ముద్దుగా కొన్ని మాటలు మాట్లాడుతుంది. రండి హీరో అని అప్పుడప్పుడు హాస్యంగా పిలుస్తుంది.

అనిల్ తన గురించి పూర్తిగా చెప్పిన తరువాత, ఒక రోజు... అనిల్, మీతో కొంచం పర్సనల్ గా మాట్లాడొచ్చా?” అన్నది.

పర్మిషన్ అడగక్కర్లేదు. అడగాలనుకున్నది హక్కుతో అడగొచ్చు

అయితే సరే. తిన్నగా విషయానికే వస్తాను. నువ్వు ఎవర్ని పెళ్ళి చేసుకోబోతున్నావు... గౌరినే కదా?”

లేదు. నాకు ఆలొచనే లేదు

మరి విషయాన్ని ఎందుకు నీ తల్లి-తండ్రుల దగ్గర చెప్పలేదు?”

వాళ్ళ మనసును కష్టపెడతానేమో నని ఆలొచిస్తున్నాను. సరైన కారణాన్ని చెప్పలేక పెళ్ళి వాయిదా వేస్తూ వస్తున్నాను. అమ్మతో ఎలా కాదని చెప్పడం అని బాధపడుతున్నాను

మీ పేరంట్స్ బలవంత పెడితే గౌరినే కదా పెళ్ళి చేసుకుంటావు?”

ఆమెతో చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండే వాడినే. కానీ, పెళ్ళి చేసుకోవాలనే ఆశ ఎప్పుడూ వచ్చింది లేదు

నిజమే. ఎందుకంటే... కవిత తరువాత నీకు సౌందర్య మీదే ఎక్కువ ఇంటరెస్ట్

అధిరిపడ్డాడు. ఇది తప్పైన ఆలొచన

ఇందులో తప్పేముంది?”

ఆమె పెళ్లైన మనిషి

మోహన్ తోటి సౌందర్య జీవించిన జీవితం పూర్తిగా తెలియటంతో, ఆమెను పెళ్ళి చేసుకోవటానికి నువ్వు వెనుకాడుతున్నావు?”

అలాంటిదేమీ లేదు. దాన్ని ఒక సమస్యగానే అనుకోవటం లేదు

అలాగైతే నీ సంశయానికి కారణం

ఆపదలో సహాయం చేశాము కదా అని ఆమెను పెళ్ళి చేసుకుందామనుకోవడం న్యాయం కాదు

అలాగైతే ఎందుకు పెళ్ళి వద్దంటున్నావు? మీ తల్లి-తండ్రులు ఇష్టపడి నట్లు గౌరినే పెళ్ళి చేసుకోవచ్చే?”

కవిత ఏర్పరచిన గాయమే ఇంకా నయం కాలేదు. అందువలన నాకు పెళ్ళిలో ఇంటరెస్ట్ లేదు

నువ్వు అబద్ధం చెబుతున్నావు

ఎలా అంత ఖచ్చితంగా...?”

నీ లోతైన మనసులో సౌందర్య ని పొదిగి ఉంచావు..."

అబద్ధం

లేదు. సౌందర్య అంటే నీకు ఇష్టం ఉంది. ఇంతవరకు ఆమె గురించి మాట్లాడిన మాటలలో నుండి, మాట్లాడిన విధంలో నుండి, చూపించిన ఆదరణ నుంచి అది తెలుసుకున్నాను

అలాంటిదేమీ లేదు

కవిత ఏర్పరచిన గాయానికి నీకే తెలియకుండా సౌందర్య ఒక మందుగా ఉన్నది. కొంచం కొంచంగా నీ మనసులోకి చొరబడింది

మంచి కల్పన

కల్పన కాదు...నిజం. నువ్వు హైదరాబాద్ నుండి బయలుదేరేటప్పుడు నీ తల్లి-తండ్రులు -- వరున్ వీళ్ళని వదిలిపెడుతున్నామని బాధపడటం కంటే సౌందర్య ను విడిచి వెడుతున్నామే నని నీ మనసు ఎక్కవ బాధపడలేదా? మనస్సాక్షికి మోసం చేయకుండా చెప్పు

మనస్సాక్షి లేదుఅన్నది. తరువాత అవునుఅని కూడా తలాడించింది.

అతనికి అయోమయంగా ఉన్నది.

వెంటనే అడిగాడు, “మాట వరసకి మీరు చెప్పింది కరెక్టేనని ఒప్పుకున్నా, పెళ్ళి తప్పు కాదా? ”

ఎలా తప్పు అవుతుంది?”

మా అమ్మా -నాన్నలు దీన్ని అంగీకరించ వద్దా?”

గుడ్...పెద్దవాళ్ళ అనుమతి తోనే పెళ్ళి చేసుకోవాలి అనే భారత సంప్రదాయం భావనను అభినందిస్తున్నాను. కానీ జీవితం మీది. తల్లి-తండ్రుల దగ్గర భవ్యంగా చెప్పి, వాళ్ళు అనుమతించేట్టు చెయ్యచ్చే?”

మొదట సౌందర్య దీనికి ఒప్పుకోవాలే?”

నిజమే! మొదట ఆమె అంగీకారాన్ని అడుగు. కాదన్నదా వదిలేయి. కానీ, నిన్ను వద్దని చెప్పేటంత మూర్ఖురాలుగా ఆమె ఉండదనుకుంటా. ఆమె ఒప్పుకుంటే నువ్వు ఏలుకుంటావా?”

అది...అది... ప్రాక్టికల్ గా సాధ్యమా?”

సౌందర్య మీద ఉన్న ప్రేమను దాచి పెట్టటానికి ఇదే కారణం అయ్యుంటుందని  ఊహించాను. అది నువ్వే నీ నోటి వెంట చెప్పేశావు. ఇప్పుడు నా దారికి వచ్చేశావని అనుకుంటున్నా. ప్రాక్టికల్, పద్దతి, సమాజం, సంప్రదాయం, కళాచారం...ఇవన్నీ మనకు మనమే వేసుకున్న కంచెలు. కొన్ని సమయాలలో అవే మనల్ని పనిచెయ్యనివ్వకుండా అడ్డు పడతాయి. అందుకని వాటిని నిర్లక్ష్యం చేయమని చెప్పటం లేదు. అవసరమైనప్పుడు మారుచుకోవటంలో తప్పు లేదు.

మా దేశంలో ఇలాంటి కంచెలను అన్నిటినీ చాలా వరకు పీకి పారేశాం. అందువలన మేము ఇండిపెండంట్ మనిషి యొక్క స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. కానీ, అదే మాకు కొన్ని సమయాలలో కష్టాల్ను తీసుకు వస్తుంది.

మీ దేశంలో పాత పద్దతులకు, సంప్రదాయాలకూ ఇంకా గౌరవం ఇస్తున్నారు. దాన్ని నేను అభినందిస్తున్నాను. దానికోసం మనుష్యుల కంటే కంచెలే ముఖ్యమనేది తప్పు. కంచెలోనే ఉండిపోయి చాలా మంది జీవితాన్ని పోగొట్టుకోవటం నేను అంగీకరించలేను. మన జీవితానికి కంచె అడ్డుగా ఉండే పక్షంలో, దాన్ని కొంచంగా జరిపి పెట్టుకోవటంలో ఎటువంటి తప్పూ లేదు -- ఖచ్చితంగా చెప్పింది సోఫి.

తన వాదనలను ఒక్కొక్క దాన్నీ పిండి పిండి చేసే తెలివితేటలను చూసి ఆశ్చర్యపోయాడు అనిల్. అయినా కానీ వాదించాడు. మా దేశంలో పెళ్ళి అనేది ఇద్దరికి సంబంధించినది కాదు. అదొక సమూహ సంభవం. రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధుత్వం. బంధుత్వం బలపడితేనే సంసార జీవితం సంతోషంగా ఏర్పడుతుంది. కానీ పెళ్ళిని మా సమాజం అంగీకరించదు

అలాగైతే మీ దేశంలో జరుగుతున్న పరువు హత్యలను నువ్వు ఆదరిస్తున్నావా?”

అయ్యో...అందులో న్యాయమే లేదు

నువ్వు మాత్రమే కాదు. మీ దేశంలో ఉన్న తెలివిగల వాళ్లందరూ కలిసి పరువు హత్యలను ఖండించటం లేదా?”

అందుకని...

నీ వంతుకు నువ్వూ కొంచం పనిచెయ్యి. నిన్ను చుట్టుకోనున్న కంచెలను సౌందర్య కోసం కొంచం జరిపి పెట్టు

నేను ఒప్పుకున్నా, ఆమె ఒప్పుకోకపోతే?”

మళ్ళీ చెబుతున్నా. నిన్ను వద్దని చెప్పటానికి ఆమె మూర్ఖురాలు అయ్యుండదు. అదే సమయం, తప్పైన ఒక పెళ్ళి వలన చేతిలో బిడ్డ ఉన్న అమ్మాయి, ధైర్యంగా తన ప్రేమను బహిరంగంగా చెబుతుందని ఎదురుచూస్తున్నావా?”

అనిల్ దీర్ఘంగా ఆలొచించాడు. ప్రశ్నకు సమాధానం చెప్పలేక తడబడ్డాడు.

కాలిఫోర్నియాలో ఉంటూ ఎక్కడో హైదరబాదులో ఒక మూలగా నివసిస్తున్న ఒక అబల అమ్మాయి గురించి ఇంత ఖచ్చితంగా మాట్లాడుతోందే

నువ్వు ఏమి ఆలొచిస్తున్నావో నేను అర్ధం చేసుకోగలను. దేశమైనానూ అమ్మాయలు, అమ్మాయిలే. వాళ్ళ మనొభావాలు ఎలా ఉంటాయో అనేది మేము  ఊహించుకోగలం

తెలివితేటలను చూసి ఆశ్చర్యపోయాడు.

ఆమే మళ్ళీ మొదలు పెట్టింది. కవిత వలన నీ మనసు గాయపడింది. నువ్వు ఆమెను బాగా లోతుగా ప్రేమించావు. కానీ, ఆమె నిన్నూ, నీ ప్రేమనూ సరిగ్గా అర్ధం చేసుకోకుండా అవమానపరిచింది.

సౌందర్య ని బాగా అర్ధం చేసుకున్నావు. అదేలాగా ఆమె కూడా ఇన్ని రోజులలో నీ గురించి  అర్ధం చేసుకోనుంటుంది అని నమ్ముతున్నాను. మీరిద్దరూ పెళ్ళి చేసుకుంటే జీవితం  అద్భుతంగా ఉంటుంది

ముందూ వెనుకా తెలియని ఒక అమ్మాయికొసం ఇంత ఆదరణగా మాట్లాడుతున్నారే?”

నిజానికి నేను నీ కోసం మాట్లడుతున్నాను

నా కోసమా...?”

అవును. నీకు మంచి జీవితం దొరకాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సౌందర్య ని నిజంగానే ప్రేమిస్తున్నావు. కవిత వలన ఏర్పడిన గాయానికి ఇన్ని రోజులు ఈమె నీకు మందుగా ఉన్నది. ఈమెను పెళ్ళి చేసుకుంటే నీకు మంచిది.

కవితానే ఇంకొకరిని పెళ్ళి చేసుకోవటానికి అంగీకరించినప్పుడు, నువ్వెందుకు మనసు గాయపరచుకుని తిరగటం? సౌందర్య ని పెళ్ళిచేసుకుంటే, ఆమె నీకు మంచి భార్యగా ఉండబోయేది ఖచ్చితం. అందుకోసమే ఇంత పట్టింపుగా మాట్లాడుతున్నాను

ఆమె నాకు మంచి భార్యగా ఉంటుందని ఎలా అంత ఖచ్చితంగా చెబుతున్నారు?”

ఇప్పుడు సమాధానం చెప్పలేను. తొందరగానే నీకు అర్ధమయ్యేటట్టు చేస్తాను

సోఫి మాటల్లోని ఖచ్చితమైన భావాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.

ఒక ముఖ్యమైన విషయం. అయోమయమైన ప్రశ్నకు జవాబులు కనుక్కోలేక తడబడుతున్నప్పుడు, మనల్ని స్నేహంతో -- మన సమస్యలను అర్ధం చేసుకునే మూడో మనిషి దగ్గర బాధ్యతను అప్పగిస్తే, అతను మనకోసం ఆలొచించి మంచి నిర్ణయం తీసుకోవటానికి సహాయపడతాడు. అందువలనే ఆలొచించి నిర్ణయం చెబుతున్నాను

నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు. మీరు చెప్పే నిర్ణయాలు సరైనవే అనడానికి సాక్ష్యాలు?”

నువ్వే...

నేనా...ఎలా?” ఆశ్చర్యంగా అడిగాడు.

మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం. కానీ ఒకసారి కూడా సౌందర్య ని నీకు నచ్చలేదని, ఆమెపై ఎటువంటి ప్రేమా లేదని నువ్వు చెప్పలేదు. ఆమె గురించి మాట్లాడినప్పుడల్లా నీ మొహాన ఒక ప్రకాశమైన కాంతి రావటం చూశాను. అదొకటి చాలు...నీలో ఆమె మీద ప్రేమ  ఉన్నదని దృవీకరించడానికి. ఇండియాకు వెళ్లేంతవరకు నీకు చాలా సమయం ఉన్నది. ఆలొచించి చూడు. నీ నిర్ణయం మాత్రం విప్లవాత్మకంగా ఉండనీ

థాంక్యూ

...వచ్చే ఆదివారం లంచ్ కు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి. మా ఆయన, పిల్లలూ నిన్ను కలుసుకోవటానికి చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు

...నాపేరు ఇంతలోనే వాళ్ల వరకు వ్యాపించిందా?”

ఇద్దరూ మనసారా నవ్వుకున్నారు.

                                                                                                                 Continued....PART-16

**************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి