12, నవంబర్ 2021, శుక్రవారం

నిద్రలేని రాత్రులు...(సీరియల్)...PART-7

 

                                                                             నిద్రలేని రాత్రులు...(సీరియల్)                                                                                                                                                                 PART-7

నిద్రపోలేని రాత్రి అయినా, అదీ తెల్లవారుతుంది కదా. వెలుతురికి అనిల్, వరున్ హడావిడిగా లేచారు.

కానీ, సౌందర్య దానికి ముందే లేచుంది. ఇలాంటి ఒక వెలుతురు తనకు దొరుకుతుందని, ముందు రోజు ఆమె అనుకోనే లేదు. వెంటవెంటనే జరిగిన విషయాలు ఆశ్చర్యపరిచినై.

ప్రొద్దున బ్రేక్-ఫాస్ట్ కొనడానికి బయటకు వెళ్లాడు అనిల్. అప్పుడు తడబడుతూ,  బిడియంతో వరున్ దగ్గరకు వచ్చిన సౌందర్య, “అన్నయ్యా అన్నది.

చెప్పండి...

వెళ్ళే చోట చోటు దొరకకపోయినా పరవాలేదు. అక్కడ పనికి చేరటానికి తయారుగా ఉన్నాను. జీతం అక్కర్లేదు. మాకు బద్రత దొరికితే చాలు. దానికంటే మాకు ఇంకేమీ అక్కర్లేదు

అది విన్న వరున్ కరిగిపోయాడు. అంతనికి గుండె పట్టేసినట్టు అనిపించింది.

సరేమ్మా, చూద్దాం అని సౌందర్య దగ్గర చెప్పాడు.

అనిల్ టిఫిన్ పోట్లాలతో వచ్చాడు. దాంతో పాటూ బిడ్డకు పాలు, పండ్లు, బిస్కెట్లు...మార్చుకోవటానికి దుస్తులూ కొనుకొచ్చాడు.

ప్రొద్దున టిఫిన్ తిన్న తరువాత మహిళా దయా గృహాలు, ఉమెన్స్ హాస్టల్ యొక్క వివరాలు సేకరించారు స్నేహితులు. తమ ఆఫీసులకు సెలవు ఈ-మైల్స్ పంపించి బయటకు బయలుదేరారు.

తలుపులు తాళం వేసుకోండి. ఎవరొచ్చినా తెరవకండి. ఏదైనా అడిగితే...మీరు మా బంధువులని చెప్పండి. మేము బయటకు వెళ్లామని కిటికీలో నుండే చెప్పండి. జాగ్రత్తగా ఉండండి అని వదిలేసి వెళ్ళిపోయారు.

సౌందర్య తల ఊపి, తరువాత తలుపు గొళ్ళేం వేసుకుంది.

మధ్యాహ్నం భోజనం పోట్లాలతో తిరిగి వచ్చారు. ఏదైనా మంచి వార్త చెప్తారని ఎదురు చూసింది. కానీ వాళ్ళు ఏదీ చెప్పక పోవటంతో నిరుత్సాహం మిగిలింది.

మధ్యాహ్నం బోజనం తరువాత ఇద్దరూ మళ్ళీ బయటకు వెళ్ళారు.

సాయంత్రం నీరసంతో తిరిగి వచ్చారు. వాళ్ళ ప్రయత్నాలేవీ విజయవంతం  కాలేదని వాళ్ళ మోహాలే చూపుతున్నాయి.

ఏమైంది?”-- వరున్ దగ్గర అడిగింది.

అనిల్ దగ్గర అడగడానికి ఆమెకు కష్టం అనిపించింది.

ఏం చెప్పమంటావు? చోటా మా ప్రయత్నం ఫలించలేదు. నా కథ విన్న అందరూ జాలి పడ్డారు. మమ్మల్ని పొగడారు, మెచ్చుకున్నారు. కానీ నీకు చోటివ్వటానికి మాత్రం వెయ్యి కారణాలు చెప్పి కుదరదన్నారు

ఒక పనిమనిషిగా కూడ...

అది కూడా అడిగి చూశాం. చాలా ఆలొచించారు. మోహన్ వలన గానీ, పోలీసుల వైపు నుండి గానీ వాళ్ళకు అనవసరమైన సమస్య వస్తుందేమోనని భయపడుతున్నారు

తల విధి తనని ఎలా తరుముతోందో అని నొచ్చుకుంది సౌందర్య. నన్ను అక్కడే చచ్చిపోనిచ్చుండాలి అని గొణుక్కుంది.

మీరు చెప్పేది చాలా తప్పు. జీవితంతో చివరి వరకు మనం జీవించి చూపించాలి. సమస్యలను చూసి పారిపోకూడదు. మా ఇద్దరి ఆదరణ ఉన్నంత వరకు, మీరు ఇంకేవిధమైన తప్పైన  ఆలొచనలకు వెళ్లకూడదు

అనిల్ చెప్పిన దాన్ని తల ఊపి ఆమొదించాడు వరున్.

సరి, తరువాత ఏం చేయాలనేది ఆలొచిద్దాం

వరున్ అలా చెబుతున్నప్పుడే తుఫానలాగా వచ్చింది కవిత.

గది మధ్యలో నిలబడి వాళ్ళ ముగ్గురుని మారి మారి చూసింది-- సౌందర్య ను చూసిన వెంటనే కోపం నషాలానికి ఎక్కింది.

అనిల్ ను చూసి ఏక వచనంతో అరిచింది, “ఈమెతో జీవిస్తూనే నన్నూ ప్రేమించావా? నువ్వు మోసగాడివి. మంచికాలం. నీ లక్షణం ఇప్పుడే తెలిసిపోయింది. ఇక మీదట నిన్ను తలుచుకోను. నీకూ, నాకూ ఎటువంటి సంబంధమూ లేదు. గుడ్ బై

మెట్లలో గబగబమని దిగి వెళ్ళిపోయింది.

అన్నయ్యా, ఆమెను ఆపండి. పిలిచి మాట్లాడి వివరాలు చెప్పండి-- వరున్ ని బ్రతిమిలాడింది సౌందర్య.

అడ్డుపడ్డాడు అనిల్ ప్రయోజనం లేదు వరున్. మా ఇద్దరి మధ్య ఒక తప్పైన సంబంధాన్నిఊహించుకోనుంది కవిత. మా ఇద్దరి మధ్యా అభిప్రాయ బేధాలు వచ్చినై కాబట్టే సౌందర్య ఆత్మహత్యకు పూనుకుందని నిర్ణయించుకుంది. అందుకోసమే నేను ప్రాణాలకు తెగించి ఈమెను కాపాడానని ఖచ్చితంగా నమ్ముతోంది.

రోజు ప్రొద్దున కూడా ఆమెతో మాట్లాడి చూశాను.  నా మాటలను ఆమె నమ్మటం లేదు. తన నిర్ణయాన్ని మార్చుకోవటానికి కూడా ఆమె తయారుగా లేదు. ప్రాణం అడ్డుపెట్టి ఆమెను కాపాడవలసిన అవసరమేమిటీ?’-- అనే ప్రశ్నను మాత్రమే మాటి మాటికి అడిగింది. ఎంత మాట్లాడినా దాన్ని అర్ధం చేసుకునే పరిస్థితిలో ఆమె లేదు.  వదిలేయండి. కొన్ని రోజులైన తరువాత సమాధాన పరుస్తాను. ప్రస్తుతానికి ఆమెను మర్చిపోయి -- తరువాత ఏం చేయాలని చూద్దాం -- బాధపడుతూ చెప్పాడు అనిల్.

గదిలో తుఫాన పడి వెళ్ళినంత మౌనం ఏర్పడింది. కానీ, తరువాత సునామీ ఇంటి ఓనర్ రూపంలో మెట్టు ఎక్కి వచ్చింది.

వేగంగా లోపలకు వచ్చారు...అదే వేగంతో అనిల్ ను చూసి అరిచారు మీరు నా దగ్గర చెప్పిందంతా అబద్ధం. ఇప్పుడు వచ్చి వెళ్ళిన అమ్మాయి, నా దగ్గర అన్ని నిజాలూ చెప్పింది

వెళ్ళేటప్పుడు అంటించి వెళ్ళింది కవిత.

మీకు వారం రోజులు టైమిస్తున్నా. అంతలోపు గది ఖాలీ చెయ్యండి. లేకపోతే...పోలీసులను పిలవాల్సి వస్తుందిఅని కోపంతో అరిచిన మనిషి ఎటువంటి సమాధానం ఎదురుచూడకుండా మెట్లు దిగి వెళ్ళిపోయాడు.

పిడుగు పడినట్టు తల మీద చేతులు పెట్టుకుని కూర్చుండిపోయాడు అనిల్.

పోలీస్అనేటప్పటికి వణికిపోయింది సౌందర్య.

అనిల్ -- ఎందుకురా ఇలా కూర్చుండిపోయావు? ఆకాశమే విరిగి మన తల మీద పడ్డా, మనసు పాడుచేసుకోకుండా ధైర్యంగా ఉండు. తరువాత ఏం చెయ్యాలో ఆలొచిద్దాం -- ధైర్యం చెప్పాడు వరున్.

అనిల్ ఏదీ ఆలొచించే పరిస్థితిలో లేడు అప్పుడు. స్నేహితుడు చెప్పింది వినడం తప్ప వేరే దారిలేదు అనేట్టు చూశాడు.

ఆమె...తనని వెంటాడుతున్న విధి, తనకు సహాయం చేసే వారిని కూడా ఇలా పరీక్షిస్తోందే అని నొచ్చుకుంది.

                                                                                                                  Continued...PART-8

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి