30, నవంబర్ 2021, మంగళవారం

నిద్రలేని రాత్రులు...(సీరియల్)...PART-16

 

                                                                            నిద్రలేని రాత్రులు...(సీరియల్)                                                                                                                                                                 PART-16

సౌందర్య కి మంచి జీవితం ఏర్పాటు చేసివ్వటానికి ఆమె తల్లి-తండ్రులు ఎక్కువ శ్రమ పడ్డారు. బంధువుల మధ్య చర్చ చాలా ఎక్కువ ఇబ్బందిగా ఉన్నది. పెళ్ళి బ్రోకర్లనే పూర్తిగా నమ్మారు.

సౌందర్య ని, స్వప్నాతో కలిపి ఏలుకోవటానికి విశాల హృదయం ఉన్న ఒకతన్ని కనిపెట్టడం అంత సులభమైన కార్యమా ఏమిటి? కులం, అంతస్తు, మతం అనే అడ్డంకులు అన్నీ దాటి వరుడ్ని చూడటానికి ఒప్పుకున్నారు.

వయసు మళ్ళిన వాళ్ళు, రెండో పెళ్ళి వాళ్ళు అనే బ్రోకర్లు వరుళ్లను తీసుకు వచ్చేరె తప్ప ఇరవై ఏళ్ళున్న అమ్మాయికి సరిపోయే వరుడు దొరకలేదు. కొందరు ఆస్తికోసం ఆశపడి వచ్చారు. సౌందర్య అనే ఆమెను ఆస్తులతో ఇవ్వబడే ఒక వస్తువులాగా చూశారు.

అందులోనూ కొందరు స్వప్నాను అంగీకరించం అని చెప్పారు.

అనిల్ యొక్క ఆలొచనలలో కూర్చుండిపోయిన సౌందర్య ను అర్ధం చేసుకోకుండా ఆమె శోఖాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారు కన్నవాళ్ళు.

తమకు ఆమె భారంగా లేకపోయినా ఆమెను పెళ్ళికి ఒప్పించటానికి ప్రయత్నించారు.

కన్నవాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో అనేది  అనుభవపూర్వంగా అప్పుడు గ్రహించింది. తల్లి చూపించే అభిమానం, ఆదరణ  బాషలలో తన బాధలను మరిచింది. అయినా కానీ, వాళ్ళకు తృప్తిగా వరుడూ దొరక కూడదని అన్ని దేవుళ్లనూ ప్రార్ధించింది.

ఆమె తల్లి-తండ్రులు స్వప్నాను ప్రేమగా చూసుకుంటున్నారు. దగ్గరలో ఉన్న నర్శరీ స్కూల్లో చేర్చారు. ప్రొద్దున్నే దించి రావటం, సరైన టైములో ఇంటికి పిలుచుకు రావటం తాత యొక్క ముఖ్యమైన పనిగా మారింది. ఊరికే తీర్పు చెప్పే పంచాయతీ ప్రెశిడెంట్, ఇప్పుడు మనవరాలి ఆదేశాలకు కట్టుబడి ఉండటాన్ని చూసి ఆనందం చెందారు.

స్కూల్లో నేర్చుకుని వచ్చే చిన్న చిన్న విషయాలను స్వప్నా తన ముద్దు ముద్దు మాటలతో చెప్పటం చూసి సౌందర్య మనసు మైమరచింది.

రోజు వరున్ త్వరగానే ఇంటికి వచ్చాడు.

అందరూ హాలులో కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు, అనిల్ ఫోనులో  పిలిచాడు.

వరున్ వెంటనే ల్యాప్ టాప్ కెమేరాను ఆన్ చేసి అనిల్ మొహం చూసి మాట్లాడేటట్టు చేశాడు.

అమెరికాలో తన గదిలో కూర్చునే అనిల్ మాట్లాడటం చూసి ఆనందపడ్డారు. స్నేహితులు కుశల ప్రశ్నలు వేసుకున్న తరువాత పలు విషయాల గురించి మాట్లాడుకున్నారు.

తన గురించి అనిల్ ఏదైనా మాట్లాడేడా?’ అని ఆందోళనతో వాళ్ళ మాటలను వింటోంది సౌందర్య..... వరున్ తో మాట్లాడిన తరువాత సౌందర్య తండ్రిని పిలిచాడు. ఆయన దగ్గర ఒక్కొక్కరి కుశలాలూ అడిగి తెలుసుకున్నాడు. 

సౌందర్య -- స్వప్నా గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతున్నప్పుడు ఆమెకు ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపించింది. కానీ, వరుడ్ని చూసే వివరాలను అడుగుతున్నప్పుడు తల్లడిల్లింది.  

తరువాత అతను తనని పిలవటాన్ని ఆమె కొంచం కూడా ఎదురు చూడలేదు. ఒళ్లంతా వణుకు పుట్టింది.

ఏం సౌందర్య...ఎలా ఉన్నావు?”

ఆమెకు దఢ ఎక్కువయ్యింది.  అతనేదో లవ్ యూ చెప్పినట్లు వంకర్లు పోయింది. సమాధానం చెప్పటానికి గొంతు రాలేదు.

ఏమిటి... సమాధానమే లేదు?”

...బాగున్నాను తడబడుతూ సమాధానం చెప్పింది.

ఒళ్ళు జాగ్రత్తగా ఉంచుకోండి. టైము టైముకూ తినండి...’-- ఇంకా ఏదేదో మాట్లాడాలనుకున్నది. కానీ గొంతు రాలేదు.........

సరే, నేను పెట్టేస్తాను అని చెప్పి ముగించాడు అనిల్. మరుక్షణం తెరమీద నుండి మాయమయ్యాడు.

ఆమెపై ఆమెకే కోపం వచ్చింది. తానుగా వచ్చి మాట్లాడిన అతనితో, నాలుగు మాటలు మాట్లాడకుండా వదిలేశేమే అని ఆవేదన చెందింది.

తండ్రి వరుడ్ని చూడటం నాకు కొంచం కూడా ఇష్టం లేదుఅంటూ గట్టిగా అరిచి చెప్పాలనుకుంది. కానీ, ‘దేనినీ ఎవరి దగ్గరా నోరువిప్పి చెప్పలేని మూగదాన్ని అయిపోయానే?’ అని దైవం దగ్గర మొరపెట్టుకోవటం తప్ప వేరే దారి తెలియలేదు.

రోజులు అవస్తతో గడుస్తుండగా...ఒక్కొక్క రాత్రీ కన్నీటిలో కరిగిపోయింది. పాత సౌందర్య గా ఉండుంటే అంతా విధి రాసినట్లే జరగనీఅని వదిలేసి ఉండేది. ఇప్పుడు అలా వదలలేక పోతోందే! మనసు ఓర్పు నసించి తల్లడిల్లింది.

కంప్యూటర్ వైపు చూసినప్పుడల్లా అందులో ఉన్న అనిల్ తనని చూస్తూ ఉన్నట్టు బ్రమ ఏర్పడింది.  వరున్ దాన్ని రోజూ ఓపెన్ చెయ్యడా? నేను అనిల్ ను రోజూ చూడలేనా?’  అని మనసు తపన పడింది.

తన ఆశను వరున్ దగ్గర ఎలా చెబుతుంది? కాబట్టి తరువాతి ఫోన్ కోసం ఎదురు చూసింది.

అలా ఒకరోజు అనిల్ జ్ఞాపకంతో సౌందర్య మునిగిపోయున్నప్పుడు, స్వప్నా ఒక ఫోటోను తీసుకు వచ్చి జాపింది.

అది అనిల్ ఫోటో!

మరు క్షణం తన మనోభావాలను అనిచిపెట్టుకోలేక ఫోటోను స్వప్నాకు చూపించి నాన్న అన్నది. మొదట తన బిడ్డ అనిల్ ను తండ్రిగా అంగీకరించాలే అన్న పరితపనతో బిడ్డను చూసింది.

బిడ్డ ఫోటోను చూస్తూ నాన...నాన్న... తన ముద్దు మాటలతో చెప్పింది.

అది విన్న సౌందర్య ఒంట్లోనూ, మనసులోనూ ఒక తెలియని ఆనందం, దఢ ఏర్పడింది.

నాన్న ఎక్కడమ్మా?”

“...............”

బయటదేశానికి వెళ్ళారు. ఏరోప్లేన్ లో తిరిగివస్తారు

విమానం ఎగురుతున్నట్టు చేతితో సైగ చేసి చూపించింది. అప్పుడు మొహంలో ఒక కాంతి కనబడింది.

తన దగ్గర అనిల్ ఫోటో ఏదీ లేకపోవటంతో స్వప్నాకు ఎక్కడి నుంచి దొరికింది ఫోటో  అని ఆశ్చర్యపోయింది.

ఏయ్...అది ఇవ్వు... అని బుజ్జగించింది.

స్వప్నా తన ముద్దు మాటలతో ఇవ్వను పో అని చెబుతూ పరిగెత్తి వెళ్ళిపోయింది.

అప్పుడు అక్కడికి తల్లి రావటంతో మౌనం అయ్యింది సౌందర్య.

                                                                                                                    Continued...PART-17

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి