24, నవంబర్ 2021, బుధవారం

నిద్రలేని రాత్రులు...(సీరియల్)...PART-13

 

                                                                        నిద్రలేని రాత్రులు...(సీరియల్)                                                                                                                                                                PART-13

రెండు వారాలలొ అనిల్, అమెరికా వెళ్ళబోతాడనే వార్త హాడావిడి ఏర్పరిచింది.

సౌందర్య తండ్రి, తమకు హైదరాబాద్ లోనే ఒక ఇల్లు చూసి పెట్టమని అనిల్, వరున్ దగ్గర చెబుతాడు.

కొంచంసేపు ఆలొచన తరువాత అనిల్ చెప్పాడు...మీరు హైదరాబాద్ లోనే ఉండబోతారంటే... హడావిడిగా ఇంకో ఇల్లు ఏదీ చూడక్కర్లేదు. మీరు  ఇక్కడే ఉండచ్చు. నేను తిరిగి వచ్చిన తరువాత వేరే ఇల్లు చూసుకోవచ్చు

అందరూ సలహాను ఒప్పుకున్నారు. వరున్ మాత్రం మౌనంగా ఉన్నాడు.

నువ్వేమీ మాట్లాడవేరా?” వరున్ ను చూసి అనిల్ అడిగాడు.

నేను నా పాత గదికే వెళ్ళిపోదామని అనుకుంటున్నా

సౌందర్య అడ్డుపడింది అన్నయ్యా, మీరు మాట్లాడేది కొంచం కూడా న్యాయంగా లేదు. నా తల్లి-తండ్రులు వచ్చేశారు కనుక నన్ను వేరు చేసేద్దామని చూస్తున్నారా? ఇక మీరు నాకు ఎప్పుడూ అన్నయ్యే. ఇంకెక్కడికీ వెళ్ళ కూడదు. మాతోనే ఉండాలి అన్నది హక్కు, అభిమానంతో.

లేదమ్మా...మీకెందుకు శ్రమ...?”

వరున్ ముగించేలోపు నిజమైన కోపంతో మాట్లాడింది సౌందర్య. ఏమిటన్నయ్యా మాట్లాడుతున్నావు? రోజు వరకు మీరు నన్ను అనవసరమైన శ్రమ అనుకున్నారా?  ఇంకోసారి అలా మాట్లాడకు అన్నయ్యా.....అది విని కొంచం మెలికలు తిరిగాడు వరున్.

అనిల్ చెప్పాడు. నీకు ఆక్షేపణ లేకపోతే నేను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉండు. మనిద్దరం ఇంట్లో లేకపోతే...ఇంటి యజమానికి మన మీద అనుమానం  వస్తుంది

వరున్ అది అంగీకరించాడు. సౌందర్య సంతోషపడింది.

అనిల్ మళ్ళీ తన తల్లి - తండ్రులతో మాట్లాడి, తాను రెండు వారాలలో అమెరికా వెలుతున్నట్టు చెప్పాడు. వాళ్ళు కొడుకు అమెరికా వెళ్ళటాన్ని సగం మనసుతో అంగీకరించారు. కొడుకుకు పెళ్ళి వాయిదా పడుతోందే నన్న బాధ ఉన్నది.

సౌందర్య తల్లి-తండ్రులు, మరుసటి రోజు ప్రొద్దున ఉత్సాహంగా వాళ్ళ గ్రామానికి  వెళ్ళారు. అనిల్, వరున్ లు తమతమ ఆఫీసులకు బయలుదేరారు. సౌందర్య దగ్గర కనబడిన మార్పులు చూసి ఇద్దరూ ఆనందపడ్డారు. కవిత వలన ఏర్పడిన బాధింపు అనిల్ ను పూర్తిగా వదిలి వెళ్ళింది. అతని విమాన టికెట్టు వచ్చి, అతను వెళ్ళే తారీఖూ నిశ్చయమయ్యింది. దాన్ని తన ఇంటికీ, సౌందర్య వాళ్ళ ఇంటికీ తెలిపాడు.

ఆమె తల్లి-తండ్రులు గ్రామంలో చేయవలసిన ఏర్పాట్లు అన్నీ చేసి ఉంచటంతో...తమకు కావలసిన అత్యవసరమైన వస్తువులతో వెంటనే తిరిగి వచ్చారు. అనిల్ తల్లి-తండ్రులు అనిల్ బయలుదేరాల్సిన ముందు రోజు వచ్చి చేరారు.

ఒకే ఇంట్లోనే అందరూ ఉన్నందువలన, ఒకరికొకరు మాట్లాడుకుని దగ్గరయ్యారు. అనిల్ తండ్రి, సౌందర్య తండ్రి ఒక పక్కన కూర్చుని తమ గ్రామాల గురించి, రాజకీయాల గురించి కథలు మాట్లాడుకుంటున్నారు. 

అనిల్ అమెరికా నుండి తిరిగి వచ్చిన వెంటనే వాడికీ, గౌరికి పెళ్ళి. మీరు ఖచ్చితంగా రావాలి అన్నాడు అతని తండ్రి.

ఖచ్చితంగా వస్తాము అన్నారు సౌందర్య తండ్రి.

వంట చేస్తూనే ఆడవారు గలగలమని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అనిల్ తల్లి కూడా ఇప్పుడు సౌందర్య తోనూ, ఆమె తల్లితోనూ సహజంగా ఉండగలుగుతోంది.

అనిల్, వరున్ సూటు కేస్సుల్లో వస్తువులు సర్దటంలోనూ, ప్రయాణానికి కావలసిన మిగిలిన  పనులనూ చేయటంలో జాగ్రత్తగా ఉన్నారు. సౌందర్య, వాళ్లకు   సహాయపడటంలోనూ, రాత్రి భోజనానికి వంట చేయటం లోనూ హడావిడిగా ఉంది.

మొత్తానికి ఇంట్లో అందరూ సంతోషంగానూ, ఉత్సాహంగానూ ఉన్నారు. కానీ, సౌందర్య మాత్రం ఎందుకో అలా ఉండలేకపోతోంది. ఏదో అర్ధం కాని ఒక దుఃఖం ఆమె గొంతును అడ్డుకుంటోంది. తెలియని కలతతో తపించింది.

అందరిలాగా ఉండేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఆమె వలన కుదరలేదు. ఒక యంత్రంలాగా అందరికీ రాత్రి డిన్నర్ వడ్డించింది.

డిన్నర్ తరువాత కూడా అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. కానీ, సౌందర్య వల్ల సహజంగా నవ్వుతూ మాట్లాడటం కుదరలేదు. శోఖం వచ్చి ఆమెను అతుక్కోనుంది.

మాటలు ముగించుకుని నిద్రపోవటానికి వెళ్ళారు.

తన చుట్టూ అందరూ ప్రశాంతంగా నిద్ర పోతున్నప్పుడు, ఆమె వలన నిద్ర పోవటం కుదరలేదు. రోజు రాత్రి కూడా ఆమెకు నిద్రలేని రాత్రిగానే గడించింది. దొర్లి దొర్లి పడుకున్నా ఎలాంటి ప్రయోజనమూ లేదు. రాత్రి ముగిసేటట్టుగానూ అనిపించటం లేదు.

మరుసటి రోజు కూడా ఆమె వలన పనిలోనూ పూర్తి శ్రద్ద పెట్టలేకపోయింది. ఎవరి దగ్గరా నవ్వుతూ మాట్లాడటం కుదరలేదు.

దేన్నో పారేసుకున్న మనో భారంతో తడబడింది. శరీరమూ, మనసూ కలిసి పనిచేయటంతో అలసిపోయింది.

అందరూ విమాశ్రయం చేరుకున్నారు.

అనిల్ అందరి దగ్గరా వీడ్కోలు తీసుకున్నాడు.  తన తల్లి-తండ్రుల కాళ్ళ మీద పడి నమస్కరించుకున్నాడు. సౌందర్య తల్లి-తండ్రుల దగ్గర వీడ్కోలు చెప్పాడు. వాళ్ళు అతనికి మనసారా అభినందనలు తెలిపారు.

వరున్ ను కావలించుకుని విడిపోతున్నప్పుడు అతని కళ్ళు స్నేహితునికి ప్రత్యేక అభినందనలు తెలిపినై.

పిల్ల స్వప్నాను ముద్దు పెట్టుకుని - తరువాత సౌందర్య దగ్గరకు వచ్చి వెళ్ళొస్తాను అన్నాడు. ఆమె వలన సమాధానం చెప్పటం కుదరలేదు. కళ్ళు చెరువైంది.  హృదయం పేలిపోతొందేమో అన్నట్టు ఉన్నది. పొంగుకు వస్తున్న కన్నీటిని శ్రమ పడి అనిచిపెట్టుకుంది.

అనిల్ లోపలకు నడిచాడు. ఒక టర్నింగులో కొద్ది క్షణాలు నిలబడి అందరికీ చై ఊపి తరువాతి క్షణం కనుమరుగయ్యాడు.

కళ్ళల్లో నుండి కనుమరుగైనా, తన మనసు నిండా అనిల్ నిండిపోయున్నాడని అప్పుడు పూర్తిగా అర్ధం చేసుకుంది సౌందర్య. అవును...ఇన్ని రోజులూ ఆమెకే తెలియకుండా అతన్ని ఇష్టపడుతున్నదని అనుకోకుండా దూరమవటం ఎత్తి చూపించింది. భావం ఆమెకు సంతోష ఆవేదనగా ఉన్నది.

ఎప్పుడు, ఎలా తన మనసు లోపలకు అతను వచ్చేడనేది ఖచ్చితంగా నిర్ణయించుకోలేకపోయింది.

అనిల్ మీద తనకున్నది మర్యాద మాత్రమే కాదు. దానికీ పైన లోతైన ప్రేమ అనేది అనుకున్నప్పుడు అర్ధం కాని తియ్యటి భావం పొంగుకు వచ్చింది. కానీ, అతన్ని ఇంకో పది నెలలు చూడలేము అనేది గ్రహించినప్పుడు తిరిగి  దుఃఖం ఆమెను చుట్టుముట్టింది.

రాముడిని చూడలేక లంకలో సీత అనుభవించిన కష్టాలు అనుభవ పూర్వంగా గ్రహించింది.

పాపం ఆమె...ఒక అవస్త నుండి మధ్యే బయటకు వచ్చింది. రోజు కొత్త కష్టాలు తలెత్తినై. నిరంతరం అవస్త పడటం ఆమె విధా?

అలాగైతే అతను తిరిగి వచ్చేంతవరకు అన్ని రాత్రులూ ఆమెకు నిద్రలేని రాత్రులేగా?

                                                                                                                 Continued...PART-14

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి