6, నవంబర్ 2021, శనివారం

నిద్రలేని రాత్రులు...(సీరియల్)...PART-4

 

                                                                             నిద్రలేని రాత్రులు...(సీరియల్)                                                                                                                                                                  PART-4

ఇక్కడున్న వాళ్ళందరికీ పిచ్చి పట్టిందా? లేక నేను పిచ్చిదాన్ని అయిపోయానా?’ అనే గందరగోళంలో పడ్డది సౌందర్య.

ప్రేమ గల నాన్న, అభిమానం చూపే అమ్మ, బద్రత నిండిన ఇల్లు, ఆందోళన పడకుండా చుట్టి తిరిగే గ్రామం, గౌరవించి మర్యాద చూపే ప్రజలు...వీటన్నిటినీ వదిలేసి, మోహన్ గురించిన వివరమూ తెలుసుకోకుండా వాడితో లేచి వచ్చేసి ఇలా అవస్త పడుతున్నామే?’ అని తన మూర్ఖత్వానికి నొచ్చుకుంది.

అదే సమయం చోట ఉన్న ప్రతి క్షణమూ, తనకి ఆపద అని హెచ్చరిక భావం ఆమె మెదడులో వెలిగింది.

మోహన్ చాలా చెడ్డవాడు. ఇక్కడున్న వాళ్ళందరూ వాడితో చేతులు కలిపిన గుంపే అనే భావం ఏర్పడిన వెంటనే ఆమె ఒళ్ళు భయంతో వణికింది.

పరిగెత్తుకుని వెళ్ళి కానిస్టేబుల్ ను చేరుకుంది. అతని వెనుకే వెళ్ళింది.

మళ్ళీ పోలీస్ స్టేషన్...

సౌందర్య ని మాటి మాటికీ చూస్తూ అధికారి దగ్గర భవ్యంగా ఏదేదో చెబుతున్నాడు కానిస్టేబుల్. అర్ధమయినట్టు తల ఊపాడు అధికారి.

ఇంతలో ఫోన్ మోగింది. అధికారి తీసి మాట్లాడాడు. సరే నండి...సరే నండి అని చెప్పి...చివర్లో నేను చూసుకుంటాను అని ఫోన్ కట్ చేశాడు.

సౌందర్య దగ్గరకు కానిస్టేబుల్ తో కలిసి ఆ అధికారి వచ్చాడు. నువ్వేదో మెంటల్ గా డిస్టర్బ్ అయినట్లు ఉన్నావు. కూర్చుని బాగా ఆలొచించు. మీ ఇంటికి వెళ్ళి చేరటానికి ప్రయత్నించు. లేకపోతే పిచ్చాస్పత్రిలో తీసుకు వెళ్ళి చేర్చాల్సి ఉంటుంది. నీకు ఇంకా ఒక గంటే టైముంది. ఆరు గంటల తరువాత ఒక మహిళను మేము స్టేషన్లో ఉంచుకోకూడదు అని హెచ్చరించాడు అధికారి.

ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అలసట కారణంగా కూర్చుండిపోయింది. స్వప్నా ఆకలితో ఏడవటం మొదలు పెట్టింది.

అధికారి ముందు కూర్చోనున్న ఒకరు , అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్నారు. ఆయన్ని చూస్తేనే ఒక డబ్బుగల రాజకీయ వ్యక్తి అనేది అర్ధమయ్యింది. సౌందర్య ను చూపించి వ్యక్తి పోలీసు అధికారి దగ్గర ఏదో చెప్పాడు. రాజకీయవేత్త మాటలను కాదనలేని పరిస్థితిలో అధికారి ఉన్నట్టు తెలుస్తోంది.

మళ్ళీ ఇంకెవరితోనో ఫోనులో మాట్లాడాడు. సరి...సరి అని చెప్పి ముగించి, అధికారి, వ్యక్తితో సౌందర్య దగ్గరకు వచ్చాడు.

ఇలా చూడమ్మా, ఈయన పెద్ద వ్యాపరవేత్త. ప్రబలమైన రాజకీయవేత్త. ఈయన ఇంటికి వెంటనే ఒక పనిమనిషి కావాలట. ఈయనకు భార్యా, పిల్లలూ ఉన్నారు. నువ్వు ఈయనతో వెడితే నీకూ, బిడ్డకూ కావలసినవన్నీ దొరుకుతాయి. ఏమంటావ్?”

దానికి ఓకే చెప్పటం తప్ప, ఆమెకు వేరే ఏమీ తోచలేదు.

మోహన్ కు, పోలీస్ స్టేషన్ కు మంచి కాంటాక్ట్ ఉన్నదని అధికారి మాటల్లో నుండి అర్ధమయ్యింది. ఇక్కడుంటే మళ్ళీ అతని దగ్గరే అప్ప చెబుతారు లేక శరణాలయానికి పంపొచ్చు. రెండూ భయానకమైనవే.

కాబట్టి, తాత్కాలికంగా బద్రత దొరికే చోటికి వెళ్ళిపోవాలీ అని నిర్ణయించుకుంది.

ఈయన ఇంటికి మోహన్ రాలేడని, అధికారి ఆయన దగ్గర చూపిన మర్యాద నుండే అర్ధమయ్యింది. పనిమనిషిగా వెళ్లటానికి అంగీకరించింది. ఆయన తన కారులోనే తీసుకు వెళ్ళాడు.

ఆమె పరిస్థితిని భార్యకు వివరించాడు. ఆవిడ కూడా అభిమానంగానే నడుచుకుంది. తినటానికి తిండి, మార్చుకోవటానికి దుస్తులు, ఉంటానికి చోటూ ఇచ్చింది.

ఒక పెద్ద బురద గుంటలో నుండి తప్పించుకు వచ్చిన భావంతో కొత్త ఇల్లు ఆమెకు కావలసిన బద్రత ఇచ్చినట్టు అనిపించింది.

తన కన్న వాళ్ళను గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా...వాళ్లకు తాను చేసిన నమ్మక ద్రోహానికి తనకు శిక్ష అవసరమేనని తనని తాను తిట్టుకుంది. బిడ్డ స్వప్న కోసం తనని పూర్తి సమయం పనిమనిషిగానే మార్చుకుంది.

కానీ, ఆమెను తరమటం మొదలు పెట్టిన విధి, ఆమెను మళ్ళీ మళ్ళీ తరుముతూనే ఉంది.

ఒక రోజు పెళ్ళి రిసెప్షన్ కి అందరూ కారులో బయలుదేరుతుండగా, వ్యాపారవేత్త కొడుకు మాత్రం...తల నొప్పిగా ఉంది. నేను రావటం లేదుఅని చెప్పేసి ఇంట్లోనే ఉండిపోయాడు. అతనికి కావలసినవి చేసి పెట్టమని సౌందర్య దగ్గర చెప్పేసి మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు.

అలాంటి ఒక సందర్భం కోసమే ఎదురు చూస్తున్న అతను, తనకు కావలసిందిఅడిగాడు.

ఎంతో నిదానంగా అతనికి అది తప్పని చెప్పింది. అతను వినేటట్టు లేడు. అందులోనేతీవ్రంగా ఉన్నాడు. చివరికి బలాత్కారం చేయటానికి పూనుకున్నాడు.

ఏంతో బ్రతిమిలాడింది. అతనో సంధర్భాన్ని జారవిడుచుకోవటానికి సిద్దంగా లేడు.

సౌందర్య తప్పించుకుంది. బిడ్డ స్వప్నతో దగ్గరున్న గదిలోకి పరిగెత్తి గొళ్లెం వేసుకుంది.

అదృష్ట వసాత్తూ రూములో టెలిఫోన్ ఉన్నది.

వ్యాపారవేత్తకు ఫోన్ చేసి వెంటనే బయలుదేరి రమ్మని చెప్పింది.

ఎందుకు?” అని ఆయన అడిగేలోపు ఫోన్ కట్ చేసింది.

అతను గది తలుపును మూర్ఖత్వంగా కొడుతున్నాడు.

మీ నాన్నా-అమ్మకు ఫోన్ చేశాను. వాళ్ళు తిరిగి వస్తున్నారు అని ఎదిరించి అరిచింది.

అతను భయపడుంటాడు. మౌనంగా ఉండిపోయాడు.

బయటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేంతవరకు తలుపులు తెరవకూడదుఅని అనుకుని, బిడ్డను హత్తుకుని ఒక చివరగా కూర్చుని ఏడవటం మొదలు పెట్టింది.

ఒక్కొక్క క్షణమూ అవస్తతో గడిచింది. హాలులో శబ్ధం వచ్చినప్పుడు...వ్యాపార వేత్త కుటుంబీకులు తిరిగి వచ్చేసిన భావం కలిగింది.

వాళ్ళ దగ్గర ఏదేదో చెప్పాడు కొడుకు. అందరూ వచ్చి తలుపు తట్టారు. తలుపులు తీసుకుని బయటకు వచ్చిన సౌందర్య, జరిగింది చెప్పింది.

అతనో ఆమె చెప్పిన దానికి బిన్నంగా చెప్పి, సౌందర్య పైన తప్పును వేశాడు.

అక్కడ జరిగిందేమిటో కన్నవారు ఊహించారు. అయినా కానీ కొడుకును నమ్ముతున్నట్టు చూపించుకోవటం తప్ప వాళ్ళకు వేరే దారి లేదు. సౌందర్య పై నేరం మోపి మాట్లాడారు.

చివరకు తన బిడ్డను తీసుకుని మళ్ళీ వీధికి వచ్చింది. తుఫానలో చిక్కుకున్న చెక్క పడవ దారితెలియక సముద్రంలో కొట్టుకుంటునట్టు అయ్యింది ఆమె పరిస్థితి.

కళ్లకు అందినంత దూరంలో తీరం కనబడని పరిస్థితిలో చెక్క పడవలో ఉన్న వాళ్ళు చావా,....బ్రతుకా? అనే సందిగ్ధంలో పడ్డట్టుంది ఆమె పరిస్థితి.

కాళ్ళు వెళ్ళిన వైపుకు నడిచింది. అలసటగా ఉన్నట్టు అనిపించినప్పుడు, చెట్టు నీడలో కూర్చుంది. ఆదరణకు ఎవరి దగ్గరకు వెళ్ళాలో తెలియటం లేదు.

వేరే ఎవరి దగ్గరా పని అడగటానికి భయపడ్డది. చూసిన మగవాళ్ళందరూ తనని బలత్కారం చేయాలని ఆలొచిస్తునారని వణికిపోయింది.

తల్లి-తండ్రుల అవసరం పూర్తిగా అర్ధమైయ్యింది. నుదుటి మీద కొట్టుకుంటూ ఏడ్చింది.

ఆకలి కడుపును గిల్లుతోంది. బిడ్డ కూడా ఏడుస్తోంది.

మరుసటి పూట భోజనానికి ఏం చేయాలి?’----ఏం చేయాలో తెలియక అలమటించింది.

అడుక్కుంటేనే గాని దొరకదు. కానీ దానికి మనసు చోటు ఇవ్వటం లేదు. పంచాయతీ ప్రెశిడెంటు కూతురు, కోట్ల ఆస్తికి ఒకే వారసురాలు, హైదరాబాద్ రోడ్లలో అడుక్కొవటమా?

ఎంత మంది పేద ప్రజలకు పండుగ రోజులలో తన చేతుల మీదగా ఆహారం-తిండి గింజలు, పంచె- చీరలు ఇచ్చుంది.

రోజు ఒక పూట ఆహారానికి దారిలేదు. మార్చుకోవటానికి దుస్తులు లేవు.

చిన్న వయసులో చూసిన ఒక సినిమా కథలో లాగా తన జీవితం అయిపోయిందే అని కుమిలిపోయింది.

సమయంలో ఆమెకు ఒక ఐడియా తట్టింది.

అవును, సినిమా కథలో హీరోయిన్ తీసుకున్న నిర్ణయమే తనకు కూడా సరిపోతుందని నిర్ణయించుకుంది. తనూ అలాగే ఆత్మహత్య చేసుకోవటమే సమస్యకు పరిష్కారం అని తీర్మానం చేసుకుంది.

ఎలా చచ్చిపోవాలి?’--- సౌందర్య ఆలొచిస్తున్నప్పుడు దగ్గరగా రైలు వెడుతున్నశబ్ధం  వినబడింది.

అటువైపుకు నడిచింది.

చోటే మౌలాలి రైల్వే  స్టేషన్.

                                                                                                               Continued...PART-5

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి