నిద్రలేని రాత్రులు...(సీరియల్) PART-11
ఆదివారం వచ్చింది.
ప్రొద్దున్నే
టిఫిన్
తిన్న
తరువాత
సౌందర్య
మెల్లగా
వరున్
దగ్గరకు
వచ్చి, “అన్నయ్యా...ఈ
రోజు” అంటూ సాగదీసింది.
“నేను మర్చిపోలేదు
సౌందర్యా.
ఇదిగో
బయలుదేరుతున్నా” అన్నాడు.
అనుకోకుండా అక్కడకు
వచ్చిన
అనిల్
అడిగాడు...“నన్ను
వదిలేసి
ఎక్కడికిరా
నువ్వు
ఒక్కడివే
బయలుదేరుతున్నావు?”
వరున్ వలన
అంతకు
మించి
విషయాన్ని
దాచలేకపోయాడు.
“వద్దు వరున్.
కవిత
తో ఎంతగానో మాట్లాడి
చూశాను.
ఏమీ
ప్రయోజనమే
లేదు.
ఇప్పుడంతా
నా
పేరు
కనబడిన
వెంటనే
సెల్
ఫోన్
కట్
చేస్తోంది.
అనవసరంగా
నువ్వు
వెళ్ళి
అవమానపడి
రాబోతావు”
“పరవాలేదు. ఫోనులో
మాట్లాడటం
కంటే...నేరుగా
బోలేడు
విషయాలను
మాట్లాడి
సమాధాన
పరచవచ్చు.
నా
ప్రయత్నంలో
నేను
గెలుస్తాననే
నమ్మకం
నాకుంది”-- అనిల్ ను
సమాధానపరచి
బయలుదేరి
వెళ్ళాడు
వరున్.
‘కానీ, మంచి
వార్తతో
తిరిగి
రావాలే?’ అని
సౌందర్య
మనసు
టపటపా
కొట్టుకుంది.
మధ్యాహ్నం అతను
తిరిగి
వచ్చినప్పుడు
హడావిడిగా
స్వాగతించింది.
అనిల్
ఇష్టం
లేనట్టు
చూశాడు.
ఎందుకంటే
కవిత
అతన్ని
అంత
ఎక్కువగా
గాయపరిచింది.
వరున్
ను
అవమానపరచి
పంపుంటుందని
ఎదురు
చూశాడు.
వరున్ చెప్పాడు, “పరిస్థితి
మన
చేయి
దాటిపోయింది
సౌందర్యా.
పెద్దలు
చూసి
ఉంచిన అబ్బాయిని పెళ్ళి
చేసుకోవటానికి
ఆమె
అంగీకరించిందట.
ఈ
రోజు
నిశ్చయ
తాంబూళాలు.
నిన్ననే
బయలుదేరి
ఊరికి
వెళ్ళిపోయిందట.
ఆమె
రూమ్ మేట్
చెప్పింది”
‘అనిల్ మీద
పగ
తీర్చుకుంటున్నట్టు
భావించి
కవిత
తప్పైన
నిర్ణయం
తీసుకుందే!’ అంటూ
సౌందర్య
నొచ్చుకుంది.
తన
వలన
ఏర్పడుతున్న
బాధింపులు
చూసి
దుఃఖంతో
ఆమె
గొంతుక
అడ్డుపడింది.
కానీ, ఆ
వార్త
వలన
అనిల్
ఏ
బాధింపుకూ
గురి
అవలేదు.
ఎందుకంటే
అది
అతను
ఎదురు
చూసిందే.
‘ఇక
కవిత
మనసు
మార్చుకోదు’ అనేది
ఎప్పుడో
అర్ధం
చేసుకున్నాడు.
సౌందర్య ని ఆ
వార్త
చాలా
బాధ
పెట్టింది.
‘తనని
తరుముతున్న
విధి, తనకు
సహాయం
చేసే
వాళ్ళానూ
వదలకుండా
బధపెడుతోందే’ నని
నొచ్చుకుంది.
“బాధ పడకు
అనిల్.
మంచి
కాలం...
కవిత యొక్క పట్టుదల
గుణం, అర్ధం
చేసుకోకూడదు
అనుకునే
గుణం
గురించి
మనకి
ఇప్పుడు
తెలిసింది.
ఇది
తెలియకుండా
ఆమెను
నువ్వు
పెళ్ళి
చేసుకోనుంటే
నువ్వూ, నీ
తల్లి-తండ్రులు
ఖచ్చితంగా
కష్టాలు
పడేవారు.
ఇది
కూడా
మన
మంచికే.
నీ
కొసమే
కాచుకోనుంది
గౌరి.
అమ్మా-నాన్నా
ఇష్టపడినట్లు
ఆమెనే
పెళ్ళి
చేసుకుని
కవిత
ఎదురుగా
హాయిగా
జీవించి
చూపాలి” అన్నాడు వరున్.
“కవిత ను మరిచిపోయి
చాలా
రోజులు
అయ్యింది.
మీరూ
ఆమెను
మరిచిపొండి.
దానికొసం
వెంటనే
గౌరిని
పెళ్ళి
చేసుకోవటం
కుదరదు.
కవిత
ను పూర్తిగా మర్చిపోవటానికి...కొంచం
సమయం
కావాలి.
ఈ
టైములో
నేను
అమెరికా
వెళ్లటం
కూడా
మంచిదే.
తిరిగి
వచ్చిన
తరువాత
పెళ్ళి
గురించి
ఆలొచిద్దాం” అన్నాడు.
షాక్ తో
కూర్చుండిపోయింది
సౌందర్య.
తన
వలన
అనిల్
పడుతున్న
కష్టాలనూ, అవమానాలనూ
చూసి
మనసారా
కృంగిపోయింది.
అప్పటి నుంచి
కవిత
గురించి
మాట్లాడటం
ముగ్గురూ
మానేశారు.
అనిల్
తన
అమెరికా
ప్రయాణానికి
కావలసిన
ఏర్పాట్లను
చేస్తున్నాడు.
ఇంటి
మేనేజ్మెంట్
అంతా
బాధ్యతగా
తీసుకుంది
సౌందర్య.
మద్యాహ్నం
తప్ప, ప్రొద్దుట
టిఫిను, రాత్రిపూట
డిన్నర్
ఇంట్లోనే
తినాలని
ఆర్డర్
వేసింది.
రాత్రి వాళ్ళిద్దరూ
ఎంత
ఆలశ్యంగా
వచ్చినా
అప్పటి
వరకు
కాచుకోనుండి
వాళ్ళకు
వడ్డన
చేస్తుంది.
వాళ్ళ
బట్టలను
ఉతికి
ఆరేస్తుంది.
“మీకెందుకీ అనవసరమైన
శ్రమ?” అన్నాడు
అనిల్.
“ఇందులో నాకేమీ
శ్రమ
లేదు.
మీరు
నామీద
చూపిస్తున్న
కనికరానికి, నా
వల్ల
చేయగలిగిందే
చేస్తున్నా.
ఇంటి
పనులు
చేస్తూ
నా
టైమును
గడుపుతున్నందువలన
-- మనసులోని బాధలను
మరిచిపోగలుగుతున్నాను.
అందువలన
నన్ను
అడ్డుకోకండి” అన్నది.
‘ఆమె ఇష్టం
వచ్చినట్టే
చేయని’ అనుకుంటూ
ఇద్దరూ
వదిలేసారు.
వాళ్ళిద్దరూ తనకొక
మంచి
చోటు
వెతుకుతున్నారు.
అది
దొరికిన
రోజే
ఆ
ఇంట్లో
ఆమెకు
చివరి
రోజు.
ప్రతి
రోజూ
ఆ
రోజు
కోసం
ఎదురు
చూస్తోంది
సౌందర్య.
దాని
గురించి
ఆలొచించినప్పుడల్లా
పెద్ద
నిట్టూర్పు
విడుస్తుంది.
వచ్చే శని, ఆదివారాలలో
కంపెనీ
పని
మీద
ముంబై
వెడుతున్నట్టు
చెప్పాడు
వరున్.
దానికొసం
శుక్రవారం
రాత్రి
ఏడు
గంటలకే
బయలుదేరాడు.
అనిల్, సౌందర్య
ఇంటి
దగ్గర
వాళ్ళ
వాళ్ళ
పనులలో
ఉన్నారు.
అప్పుడు
అనిల్
అడిగాడు, “ఇంటి
బయటకు
మీరు
వెళ్ళటం
లేదే...ఎందుకని?”
“భయంగా ఉంది”
“ఎవరికి భయపడుతున్నారు...ఎందుకు
భయపడుతున్నారు?”
“మోహన్ గానీ లేక
అతని
సహచరులో
నన్ను
చూసేస్తే...?”
“ఆలా చూసేస్తే
వాళ్ళే
మిమ్మల్ని
చూసి
భయపడి
తప్పుకుంటారు.
ఇప్పుడు
మీరు
మోహన్
తో
లేరు.
మీకు
చేసిన
ద్రోహం
వలన...మీ
నాన్న
ద్వారా
అతనికి
ఆపద
ఉందని
అతను
భయపడుతూ
ఉంటాడు”
“అతను, నన్ను
అతని
భార్యగా
అందరికీ
చెబితే?”
“దానికి, అతని
దగ్గర
ఏ
ఆధారమూ
లేదని
మీరే
చెప్పారు.
మీ
పెళ్ళిని
అతను
రిజిస్టర్
చేయలేదు.
అతను
కట్టిన
తాళిని
ఏప్పుడో
తెంచి
పారాశారు.
మీతో
కలిసి
ఒక్క
ఫోటో
కూడా
తీసుకోలేదని
చెప్పారు.
ఇక
ఏ
ఆధారంతో
మిమ్మల్ని
తన
భార్య
అనగలడు? నిరూపిస్తాడు”
“స్వప్నా అతని
కూతురే
కదా?”
“నిజమే. కానీ
దానికీ
బర్త
సర్టిఫికేట్
లేదే? స్వప్నాకు
డి.ఏన్.ఏ
టెస్ట్
చేస్తేనే, అది
తన
కూతురని
నిరూపించగలడు”
“అలా జరిగితే..?”
“జరగనే జరగదు”
“ఎందుకు జరగదు?”
“అంత శ్రమ
పడి
మిమ్మల్ని
తన
భార్యగా
నిరూపించి
నందువలన
అతనికి
ఎటువంటి
లాభమూ
లేదు.
వాడికి
ఒక
సౌందర్య
లేకపోతే
ఈ
పాటికి
ఇంకో
ఐశ్వర్య
దొరికుంటుంది.
అతని
కోరికలూ
తీరుంటాయి.
శ్రమపడి
మిమ్మల్ని
కనిపెట్టినందు
వలన
అతనికి
ఏ
లాభమూ
లేదు.
ఇక
అతన్ని
మీరు
భర్తగా
మాత్రమే
కాదు...ఒక
మనిషిగా
కూడా
గౌరవించరని
అతనికి
బాగానే
తెలుసు.
ఏ
కారణం
చేతా
మిమ్మల్ని
అతను
వెతికే
అవకాశమే
లేదు”
“అతని గురించి
అన్నీ
తెలుసుకున్నాను.
అందువలన
నన్ను
వెతికి
పట్టుకుని
చంపేయాలని
అనుకోవచ్చు
కదా?”
“మోహన్ నుండి
మీరు
విడిపోయిన
తరువాత
మీరు
మీ
ఇంటికి
వెళ్ళలేదు.
అలా
వెళ్ళుంటే
ఖచ్చితంగా
అతనికి
ఆపదే.
కానీ
అది
జరగలేదు.
అందువలన
అతను
మీ
గురించి
భయపడటాన్ని
ఈ
పాటికి
వదిలేసుంటాడు.
అంతే
కాదు...ఇంత
పెద్ద
నగరంలో
ఎక్కడో
ఒక
మూలలో
జీవిస్తున్న
అబల
ఆడపిల్లను
వెతికి
పట్టుకుని
హత్య
చేయటం
సినిమాలలో
మాత్రమే
జరుగుతుంది”
“నా కథ
సినిమా
కథలనే
మించిపోయిందే!” గబుక్కున
కన్నీరు
కార్చింది.
ఆమె మామూలు
పరిస్థితికి
వచ్చేంత
వరకు
మౌనంగా
ఉన్నాడు
అనిల్.
ఆ
తరువాత
చెప్పాడు
“వ్యాపారవేత్త
ఇంట్లో
పనిమనిషిగా
ఉంటున్నావనేది
పోలీసుల
ద్వారా
మోహన్
కు
తెలిసుండొచ్చు.
మీరు
మీ
తల్లి-తండ్రుల
దగ్గరకు
వెళ్ళ
లేదనేది
అతనికి
పెద్ద
రిలీఫ్.
అప్పుడే
మనశ్శాంతిగా
ఉంటాడు.
అతనికి
రోజు
రోజుకూ
వెయ్యి
సమస్యలు
ఉంటాయి.
అందువలన
ఈ
పాటికి
మిమ్మల్ని
పూర్తిగా
మర్చిపోయుంటాడు.
అందువలన
మీరు
ధైర్యంగా
బయటకు
వెళ్ళొచ్చు.
కావాలంటే
దుప్పటాను
తల
నిండా
కప్పుకుని
వెళ్లండి.
ఎక్కువ
జనం
లేని
చోట్లకు
వెళ్ళి
రండి.
మనసులో
ధైర్యమూ, ప్రశాంతత
వస్తుంది”
“ప్రయత్నిస్తాను” అన్నది. ఎందుకంటే
గుడికి
వెళ్ళటం, దేవుడ్ని
ప్రార్ధించటం
ఆమె
ఆపి
చాలా
రోజులయ్యింది.
“నేనూ చూస్తున్నాను.
ఈ
అపార్ట్మెంట్
లో
నివసిస్తున్న
వాళ్లను
చూసి
భయపడి
తప్పుకుంటున్నారు.
ఏ
తప్పూ
చేయని
మీరు
ఎందుకు
దాక్కోవాలి? మీరుగా
వెళ్ళి
మాట్లాడకపోయినా
పరవాలేదు....మీ
దగ్గరకు
వచ్చి
మాట్లాడే
వాళ్లతో
మాట్లాడండి.
లేకపోతే
వాళ్ళు
మనల్ని
అనుమానిస్తారు”
“సరే” అంటూ
తల
ఊపింది
సౌందర్య.
‘తనకు ఒక
చోటు
వెతకటం
ఇద్దరూ
మర్చిపోయారా
లేక
చోటు
ఇంకా
దొరకలేదా’ అని
అనుమానం
ఆమెలో
తలెత్తింది.
ఎందుకంటే
ఇక్కడి
జీవితం
కొంచం
కొంచం
ఆమెకు
నచ్చటం
మొదలు
పెట్టింది.
ఇలాగే జీవితమంతా
వీళ్ళకు
పనిమనిషిగా
ఉండిపోవాలని
మనసు
ఇష్టపడుతోంది.
స్వప్నా
పైన
ఇద్దరూ
చూపిస్తున్న
ప్రేమ
ఆమెను
కట్టిపడేస్తోంది.
దానికంటే
ఇక్కడి
కంటే
ఇంకెక్కడా
తనకు
మంచి
బద్రత
దొరకదనే
ఆలొచన
కూడా
ఆమె
మదిలో
బలంగా
ఏర్పడింది.
కానీ వెంటనే
ఆమె
మనశ్శాక్షి
మేలుకుంది.
తాను
రోజుల
తరబడి
ఇక్కడే
ఉంటే
అనిల్
కు, అతని
కుటుంబానికీ
అనవసరమైన
సమస్యలు
వస్తాయి.
కాబట్టి
త్వరగా
ఈ
ఇల్లు
వదిలి
బయటకు
వెళ్ళిపోవాలని
నిర్ణయం
తీసుకుంది.
ఆ రోజు
- ఆ ఇంటి
తలుపుదాకా
తానొచ్చింది
ఆమె
తెలుసుకోలేదు.
కాలింగ్ బెల్
మోగింది.
వరున్
వచ్చుంటాడని
అనుకుని
గబగబ
తలుపులు
తీసింది.
వరున్ నిలబడున్నాడు.
కానీ అతని
వెనుక
నిలబడ్డవారు?......‘సాక్షాత్’ ఆమె
తల్లి-తండ్రులు.
షాక్ తో
అలాగే
నిలబడిపోయింది
సౌందర్య.
Continued....PART-12
***********************************************************************************************
మీరు వ్రాసిన ఆర్టికల్ బాగుంది
రిప్లయితొలగించండిఒకసారి మా బ్లాగును కూడా చూడగలరు. మీకు చాలా ఉపయోగపడవచ్చు
Best niches for blogging
ధన్యవాదాలు. తప్పక మీ బ్లాగును విసిట్ చేస్తాను.
తొలగించండి