22, నవంబర్ 2021, సోమవారం

నిద్రలేని రాత్రులు...(సీరియల్)...PART-12

 

                                                                          నిద్రలేని రాత్రులు...(సీరియల్)                                                                                                                                                                PART-12

తల్లి-తండ్రులను చూసిన షాక్ నుండి సౌందర్య తేరుకుని, బయటపడేలోపు వాళ్ళను ఇంట్లోకి పిలుచుకు వచ్చి కూర్చోబెట్టాడు వరున్.

ఆమె పరిగెత్తుకు వచ్చి తండ్రి కాళ్ళ మీద పడి ఏడ్చింది.

ఆయన అభిమానంతో ఆమె తల నిమిరాడు.

ఏడవకమ్మా...ఏడవటం ఆపు అని సమాధానపరిచారు.

నేను మిమ్మల్ని ఎంతో అవమాన పరిచానే? ఊర్లో ఎంతో పెద్ద తలవంపు ఏర్పరిచానే? అలాంటి నన్ను చూడటానికి మీకెలా మనసొచ్చింది?” ఏడుస్తూ అడిగింది.

ఏం తప్పు చేసున్నా నువ్వు మా కూతురువమ్మా. నువ్వు పడ్డ కష్టాలు తమ్ముడు వరున్ పూర్తిగా వివరించాడు. రైలు కింద పడి చనిపోవాలనుకునే వరకు నిన్ను కష్టపెట్టారే. దాన్ని తలచుకుంటేనే మా మనసు గిలగిలా కొట్టుకుంటోంది. చేసిన తప్పుల కంటే ఎక్కువే శిక్ష అనుభవించావు. ఇక మీదట నీకు మేము తోడుగా ఉంటాము. నువ్వు ఏడవకూడదు అన్నారు.

ఆమె మౌనంగా ఉన్నది.

దీనికంతా కారణమైన వాడికి సరైన గుణపాఠం నేర్పబోతాను చూడు

అదంతా వద్దు నాన్నా. అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండా అవసరపడింది నేనే. అతన్ని పూర్తిగా మరిచిపోయి...ఇక మీదట మీ కూతురుగానే ఉండిపోతాను నాన్నా -- బ్రతిమిలాడింది.

ఇంటి పనిమనిషిగానూ...లేక ఆశ్రమానికో వెళ్దామనుకున్న నీకు -- మేము గుర్తుకు రాలేదా సనిగింది తల్లి.

సౌందర్య భారాన్నంతా దింపేసిన దానిలాగా కనబడింది. ఆమె మొహంలో కొత్తగా ఒక తేజస్సు.

స్వప్నాను  తీసుకోచ్చి తండ్రి దగ్గర ఇచ్చింది.

యువరాణిలాగా పుట్టాల్సిన దానివి. ఇంత లేత వయసులోనే ఇంత కష్టపడ్డావేమ్మాగొణుక్కుంటూ  ముద్దుల వర్షం కురిపించాడు.

ఏమీ తెలియని స్వప్నా బిక్క మొహం పెట్టింది.

నేను నీ తాతను రా...నేను నీ తాతను రా అని లాలిస్తూ కూర్చున్నారు.

మా అమ్మాయి ప్రాణాలు వదాలాలనే సమయంలో దేవుడే మిమ్మల్ని అక్కడికి పంపించాడు. మీరు చల్లగా ఉంటారు తమ్ముడూఆవేశపడ్డారు.

నేనేమీ పెద్దగా చెయ్యలేదు సార్. ఆపదలొ ఉన్నవారిని కాపాడవలసింది ప్రతి మనిషి యొక్క బాధ్యత కదా అన్నాడు అనిల్.

తరువాత వరున్ ను చూసి చెప్పారు. మీకు కూడా చాలా థ్యాంక్స్ తమ్ముడూ. కాపాడిన తరువాత వదిలేసి వెళ్ళకుండా...ఇన్ని రోజులు బాధ్యతగా, గౌరవంగా ఉంచి  చూసుకోవటానికి ఎంతో గొప్ప మనస్సు కావాలి

మాకు థ్యాంక్స్ చెప్పేదంతా చాలు. తరువాత ఏం చేయాలనే దాని గురించి ఆలొచిద్దాం అన్నాడు వరున్.

అది సరేరా...ఎలా సౌందర్య వాళ్ళ ఊరిని, ఆమె తల్లి-తండ్రులను కనుక్కున్నావు?” -- ఆశ్చర్యంగా అడిగాడు స్నేహితుడు.

ఒకరోజు మనం మాట్లాడుకుంటున్నప్పుడు, సౌందర్య తన ఊరి పేరు చెప్పి...అక్కడ కలహాలు రాకూడదని చెప్పింది. అది నాకు సరిపోయింది 

సౌందర్య గబుక్కున తన తల ఎత్తి, ఆశ్చర్యంతోనూ, కృతజ్ఞతతోనూ అతన్ని చూసింది. ఆమెపై అతను ఉంచిన అభిమానం, అతని పదునైన తెలివితేటలను చూసి ఆశ్చర్యపడింది.

సౌందర్య యొక్క తండ్రి కంటిన్యూ చేశాడు. తమ్ముడు వచ్చి...నీ గురించి చెప్పిన విషయాలు మా కోపాన్నీ, బాధనీ పోగొట్టింది. వెంటనే నిన్ను చూడటానికి తమ్ముడితో బయలుదేరి వచ్చాము

నాతో ముందుగానే ఎందుకు చెప్పలేదు అన్నయ్యా?”--చిన్నగా కోపగించుకుంది సౌందర్య.

నీతో--చెప్పుంటే...నన్ను వెళ్లనిచ్చేదానివి కావు అని చెప్పి నవ్వాడు వరున్.

నా దగ్గరైనా చెప్పుండచ్చు కదా?” అన్నాడు అనిల్.

సౌందర్య యొక్క నాన్నా-అమ్మా ఎలా ఉన్నారో మనకు తెలియదు. అందువలన ఒంటరిగా వెళ్ళి వాళ్ళను కలిసి మాట్లాడటమే మంచిది. అంతా ఒక సస్పెన్స్గా ఉండనీ అని అనుకునే చెప్పకుండా వెళ్ళాను. అందువలనే రెండు మూడు రోజులు ఫోనే చేయలేదు. కన్న వాళ్లని హఠాత్తుగా చూసేటప్పటికి... సౌందర్య మొహంలో సంతోషాన్ని చూశావా అన్నాడు వరున్. 

నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదురా

ప్రశంశలంతా ఉండనీ. సౌందర్య యొక్క అన్ని సమస్యలకూ ఒక పరిష్కారం దొరికింది. అదే నాకు చాలా ప్రశాంతత నిచ్చింది -- వరున్ చెప్పగా

ఆమె పొంగిపోగా...

ఆమె సంతోషాన్నీ, ఉత్సాహాన్నీ చూసిన స్నేహితులు ఇది సౌందర్య నేనా?’ అని ఆశ్చర్యపడ్డారు.

ఉత్సాహం తగ్గకుండా రాత్రి వంటకు వంటగదికి వెళ్ళింది. తల్లి కూడా వెనుకే వచ్చింది.

సౌందర్య తండ్రిని చూసి అనిల్, “సౌందర్య కష్టాలన్నిటికీ మంచి ముగింపు వచ్చింది అని అనుకుంటున్నాను. ఇక ఆమె మీ బద్రతలో ఉంటుందిఅన్నాడు.

అవును తమ్ముడూ... సౌందర్య ను మా గ్రామానికి తీసుకు వెళ్ళి మాతో పాటూ ఉంచుకుంటాం. స్వప్నా మా ఒంటరి తనాన్ని పోగొడుతుంది అన్నాడు సౌందర్య తండ్రి.

వంటింట్లో నుండి వేగంగా వచ్చిన సౌందర్య నాన్నా, దయచేసి వద్దు. నా వల్ల ఇక మన గ్రామానికి రావటం కుదరదు అన్నది దృఢంగా.

ఏమ్మా...అక్కడ నీకేమ్మా కష్టం?”

అక్కడకొస్తే ఊర్లో ఎవరి మొహాన్ని చూడలేను. ఇంట్లోనే ముడుచుకు కూర్చోవాలి. గ్రామంలో ఉన్న వాళ్ళు అడిగే ప్రశ్నలకంతా మనం సమాధానం చెప్పాలి. ఇందులో చాలా కష్టాలు ఉన్నాయని మీకు తెలుసు. ఊర్లో పగను పెంచద్దు. అందువలన నేను గ్రామానికి రాను అన్నది.

సౌందర్య తల్లి దాన్ని ఆమోదించింది.

తండ్రి అయోమయంలో పడ్డాడు. అలాగైతే మనం ఏం చేయాలి? ఇంకా ఎన్ని రోజులు వీళ్ళకు భారంగా ఉండబోతావు?”

నాన్నా, మన గ్రామానికి రానని మాత్రమే చెప్పాను. ఇంట్లోనే ఉంటానని చెప్పలేదే! అన్నది.

ఆమె అక్కడ ఉండటం అనిల్ కన్నవాళ్లకు ఇష్టం లేదని, తనవలన అనిల్ -- గౌరి వివాహానికి ఎటువంటి ఆటంకమూ రాకూడదనే విషయంలోనూ సౌందర్య చాలా క్లియర్ గా ఉన్నది. ఆమె ఇంకా ఏం చెప్పబోతోందో అని అందరూ ఎదురు చూశారు.

ఆమె మాట్లాడింది. మనం మన గ్రామం వదిలి ఇంకెక్కడైనా వెళ్ళి జీవిద్దాం. అది ఒక నగరమై ఉంటే స్వప్నా చదువుకు వసతిగా ఉంటుంది. వచ్చే సంవత్సరం దాన్ని స్కూల్లో చేర్పించాలి. హైదరాబాద్ లోనే ఇంకెక్కడైనా వేరే ఇల్లు తీసుకుని ఉందాం

కూతురు చెప్పింది అందరికీ సరి అనిపించింది.

పలుసార్లు, పలురకాలుగా ఆలొచించి ఒక నిర్ణయానికి వచ్చారు.

సౌందర్య తల్లి-తండ్రులు వెంటనే తమ గ్రామానికి వెళ్ళి...ఇల్లు, పొలాలు  చూసుకోవటానికి సరైన మనిషిని ఏర్పాటు చేయటం. తరువాత హైదరాబాద్ తిరిగిరావటం, ఇల్లు ఒకటి అద్దెకు తీసుకుని సౌందర్య తో జీవితాన్ని గడపటం, తండ్రి అప్పుడప్పుడు గ్రామానికి వెళ్ళి ఆస్తులను సరిచూసుకుంటూ రావటం అనేది నిర్ణయించుకున్నారు.

అందరికీ నిర్ణయం తృప్తినిచ్చింది.

సౌందర్య తల్లి-తండ్రులకు మాత్రం గ్రామాన్నీ, ఆస్తులనూ, రాజ భవనం లాంటి ఇంటిని వదిలి రావటానికి కొంచం బాధగానే ఉంది. కానీ, సౌందర్య, స్వప్నల కోసం తాము జీవించాలని ఆలొచించి మనసును దృఢపరుచుకున్నారు. 

సౌందర్య భారాన్ని ఆమె తల్లి-తండ్రుల దగ్గర అప్పగించాను అని తన తల్లి-తండ్రులకు అనిల్ తెలియపరచటంతో వాళ్ళూ ప్రశాంతత చెందారు. కొడుకు అమెరికా నుండి తిరిగి వచ్చిన వెంటనే వాడికీ, గౌరికి పెళ్ళి ఎంతో గొప్పగా చేయాలనేదాని గురించి ప్లాను వేసుకోవాడం ప్రారంభించారు.

సౌందర్య రెడీ చేసిన వంటను అందరూ ఒకటిగా కూర్చుని తిన్నారు. అప్పుడు అనిల్ కు ఫోను వచ్చింది. ఫోను మాట్లాడి ముగించగానే చెప్పాడు.....

నేను అమెరికా వెళ్ళటానికి వీసా దొరికింది. విమానం టికెట్టు వచ్చిన వెంటనే బయలుదేరాలి

రోజు రాత్రి....అందరికీ ప్రశాంతత, ఉత్సాహాం నిండిన రాత్రిగా మారటంతో రోజు కూడా ఒక నిద్రలేని రాత్రిగానే గడిచింది.

                                                                                                                 Continued...PART-13

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి